ట్రింగ్, ట్రింగ్, ట్రింగ్, ట్రింగ్....... అని వరుసగా కాలింగ్ బెల్ మోగడంతో సడెన్ గా మెలకువవచ్చింది రాజేశ్వరికి. ఎవరో ఆపకుండా మోగిస్తూనే ఉన్నారు. టైం ఎంతైంది..... ఇంత అర్ధరాత్రిఎవరై ఉంటారు? అని టైం చుస్తే రాత్రి పన్నెండయింది.
ఏమండి! ఏమండీ! లేవండి..... కాలింగ్ బెల్ మోగుతోంది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరువచ్చివుంటారు? చూడండి అని లేపింది ఖంగారుగా.
శ్రీకాంత్ బద్దకంగా లేచి ఎవరై ఉంటారబ్బా? అని వెళ్ళి డోర్ మేజిక్ ఐ లోంచి చుస్తే బయట వాళ్ళఅమ్మాయి స్నిగ్ధ నిలబడి ఉంది. రాజేశ్వరికి పై ప్రాణం పైనే పోయినట్లైంది. కొత్తగా పెళ్ళైనఅమ్మాయి అర్ధరాత్రి ఒక్కతే వస్తే తల్లి తండ్రులకి అలాగే ఉంటుంది మరి.
ఏమైందమ్మా! ఇంత అర్ధరాత్రి వేళ వక్కతె వచ్చావు? మళ్ళీ అల్లుడితో గొడవ పడ్డావా? అంతదూరం ఒక్కదానివే డ్రైవ్ చేసుకు వచ్చావా? అని ప్రశ్నల పరంపర కురిపించింది రాజేశ్వరి.
స్నిగ్ధ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు సోఫాలో కూర్చుని మమ్మీ! “వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇవ్వుప్లీజ్” అని అడిగింది
మేము టెన్షన్తో చస్తుంటే తాపీగా కాఫీ ఇవ్వమని అడుగుతావేంటమ్మా! అని రాజేశ్వరి ఎంతోప్రేమగా అడుగుదామనుకున్నా అందులో గదమాయింపు కూడా మిళితమై పోయింది.
“ ఐ ఆమ్ సో టైర్డ్ మమ్మీ” కాఫీ ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. ఇప్పుడు నేనేమి మాట్లాడేపరిస్థితులలో లేను. ఇక్కడైనా ప్రశాతంగా ఉందామని వస్తే అదీ కనపడటం లేదు. జీవితంలోఎక్కడా ప్రశాంతత లేదు అని కోపంగా అనడంతో రాజేశ్వరికి బి. పీ డబల్ అయిపోయి ఏమండీ! అన్నీ నేను అడగటమేనా! మీరు మాట్లాడేది ఏమైనా ఉందా? అని ఉరుము ఉరిమి మంగళంమీద పడ్డట్టు శ్రీకాంత్ మీద మండిపడింది రాజేశ్వరి. ఇప్పుడు ఊరుకో, రేపు ఉదయంమాట్లాడదామన్నట్లు సైగ చేసాడు శ్రీకాంత్.
పడుకున్నామనే కానీ ఆ రాత్రంతా ఎవరికీ నిద్రే లేదు. మర్నాడు ఉదయం మేమిద్దరం స్నిగ్ధఎప్పుడు లేస్తుందా ఎలాంటి వార్త చెప్తుందో అనే ఆందోళనతో ఉన్నాము.
నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ సరిత వాళ్ళ అబ్బాయికే మా అమ్మాయిని ఇచ్చి చేసాము. తనకి ఏమైనావిషయం తెలుసేమోనని కాల్ చేశాను. విషయం తెలుసుకొని తను కూడా మాలానే ఖంగారుపడింది.
రాజేశ్వరి, శ్రీకాంత్ లకి పెళ్లి ఐన చాలా ఏళ్ళకి ఇంక పిల్లలు కలగరు అనుకున్న తరుణంలో కలిగినసంతానం స్నిగ్ధ. అపురూపంగా పెంచారు.
ఏది అడిగినా క్షణంలో అమర్చి పెట్టేసేవారు ఇద్దరూ. అతి గారాబం వలన స్నిగ్ధ మొండిఘటంలాతయారైంది.
రాజేశ్వరి, సరిత ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో కలుసుకున్నారు. అదే పెళ్ళిలో స్నిగ్ధ, శ్రీకర్లుఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడటంతో మాకు కూడా వాళ్ళ పెళ్ళి జరిపించడానికి ఎలాంటి అభ్యంతరంకనపడలేదు. మా అమ్మాయిని సరిత వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేయడంలో నా స్వార్ధం కూడా కొంతలేకపోలేదు.
మా అమ్మాయి ఏమైనా తప్పులు చేసినా పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటుంది సరిత అయితేఅని ...... అలాగే సరిత కూడా స్నిగ్ధని కోడలులా కాకుండా కూతురులా చూసుకుంటుంది.
శ్రీకర్ కూడా సరిత వాళ్ళకి ఒక్కడే అబ్బాయి కావడంతో గారాబంగా పెరిగాడు. అతను ఏది అంటేఅది జరిగి తీరాల్సిందే. ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు. ఇద్దరూ వాళ్ళ ఇళ్ళలో అతి గారాబంగాపెరగడం వలన వాళ్ళ మాటే నెగ్గాలనుకునే మనస్తత్వాలిద్దరివి.
ప్రతి చిన్న విషయానికి తగాదా పడటం, గొడవలు మా వరకు రావడం స్టార్ట్ అయింది. దానిపర్యవసానమే నిన్న అర్ధరాత్రి ఒక్కతే రావడం.
ఎనిమిది గంటలకి మమ్మీ! కాఫీ అంటూ వచ్చింది స్నిగ్ధ ఎంతో కాజువల్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ. బాగా ఏడవటం వలన మొహం ఉబ్బి పోయి, కళ్ళు ఎర్రగా వాచి పోయి ఉన్నాయి. స్నిగ్ధ మీద ఉన్న కోపం అంతా ఎగిరిపోయింది మా ఇద్దరికీ తనని అలా చుస్తే. కాఫీ తాగేంతవరకుఏం మాట్లాడలేదు. ఇద్దరం చెరో వైపు కూర్చుని తనకేసే చూస్తుండటంతో చెప్పక తప్ప లేదు.
“ఐ నీడ్ డివోర్స్ డాడీ” అని స్టార్ట్ చేసింది. అతనితో నాకు ఏ విషయంలోను సెట్ కాదు, ప్రతి చిన్నవిషయానికి గొడవే. తన మాటే నెగ్గాలంటాడు. ఫర్నిచర్ సెలక్షన్ దగ్గర నుండి ఇంట్లో ఏ పనిఎవరు చేయాలి, వంట అనేది కూడా ఆర్గుమెంట్స్.
తను ఆఫీస్ నుండి త్వరగా వచ్చిన కుకింగ్ చేయకుండా నేనొచ్చేంతవరకు వెయిట్ చేస్తాడు. నైట్ఎయిట్కి నేనొచ్చి వంట స్టార్ట్ చేస్తే ఎప్పుడు తింటాము . అది తనకి ఎందుకు అర్ధం కాదో నాకుతెలీదు. ఎప్పుడు తన మాటకే వాల్యూ ఇవ్వాలనుకుంటాడు. నేను కూడా ఎర్న్ చేస్తున్న కదా! డెసిషన్ తీసుకునే హక్కు నాక్కూడా ఉండాలి కదా! రోజూ ఈ నస భరించడం కన్నా విడిపోవడంబెటర్ డాడీ. డివోర్స్ తీసుకుంటే నాకొచ్చిన నష్టమేమి లేదు. నేను ఎవరి మీద డిపెండ్ అయిలేను. ప్రతిసారి లాగే నాకు ఏదో మాయ మాటలు చెప్పి నచ్చ చెప్పి పంపిద్దాం అనుకుంటేకుదరదు. ఈసారి డివోర్స్ తీసుకుందామని డిసైడ్ చేసుకునే వచ్చాను అని ముగించింది స్నిగ్ధ.
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండటమే కారణమా? అని ఆలోచిస్తోంది రాజేశ్వరి. పెళ్ళి అయిన ఈఆరు నెలల్లో ఇప్పటికి ఇది మూడోసారి ఇలా అర్ధాంతరంగా వచ్చేయడం, మళ్ళీ మేము నచ్చచెప్పిపంపడం జరుగుతోంది.
ఇంత చిన్న చిన్న విషయాలకే డైవోర్స్ వరకు వస్తే జాయింట్ ఫామిలీలో ఉండి ఎన్ని సమస్యలుఉన్నా సరే, ఓకసారి వివాహం అయ్యాక ఎలా అయినా దానికి కట్టుబడి ఉండాలని, ఒక తల్లికడుపున పుట్టిన పిల్లలకే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు రెండు వేర్వేరు కుటుంబాల నుండి వచ్చినవ్యక్తులు అర్ధం చేసుకొని కలిసి ఉండాలంటే కొంత సమయం పడుతుందని ఇప్పటి జెనరేషన్ఎందుకు రియలైజ్ అవ్వరు? కొంచెం ఓర్పుతో ఉంటే అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి . భార్యభర్తల మధ్య ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఉండదు. కొంచెం సమయమిస్తే ఒకరినొకరుఅర్ధం చేసుకొని ఎదుటి వారి అభిప్రాయాలని గౌరవించటం ప్రారంభిస్తారు. ఈలోపే విడాకులుతీసుకుంటే వివాహానికి అర్ధమే ఉండదు. ఇద్దరి జీవితాలు పాడవడం తప్పించి. సరిత ఫోన్కాల్ తో ఆలోచనల్లోంచి బయట పడింది రాజేశ్వరి. శ్రీకర్ వస్తున్నాడు, మీరు కూడా స్నిగ్ధనితీసుకురండి ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడవచ్చని చెప్పింది సరిత.
స్నిగ్ధకి అత్త మామలంటే చాలా అభిమానం. వాళ్ళు కూడా మా అమ్మాయంటే ఇష్టంగానేఉంటారు.
శ్రీకర్ వస్తున్న విషయం చెప్పకుండా తనని బయలుదేరాతీశాము.
మేము దోవలో ఉండగానే సరిత చాలా ఖంగారుగా శ్రీకర్ కి యాక్సిడెంట్ అయిందని, మమ్మల్నిడైరెక్టుగా హాస్పిటల్ కి వచ్చేయమని చెప్పింది. అప్పటి నుండి స్నిగ్ధ పరిస్థితి చెప్పనలవి కాదు. ఏడుస్తూనే ఉంది, తనని ఊరుకోపెట్టడం మా వల్ల కాలేదు.
హాస్పిటల్లో శ్రీకర్ ని చూడగానే వెక్కి వెక్కి ఏడ్చింది. అతని షోల్డర్ ఫ్రాక్చర్ అవడంతో పెద్ద కట్టుకట్టారు. ఫేస్ మీద కూడా చిన్న చిన్న గాయాలు అయినాయి.
డ్రైవెర్ని తీసుకువెళ్లకుండా నువ్వే ఎందుకు డ్రైవ్ చేశావు?? నీకు లైసెన్స్ వచ్చింది కానీ నేను ప్రక్కనలేకపోతే డ్రైవ్ చేయవద్దు అని చెప్పా కదా!! అన్నీ టెన్సన్ పెట్టే పనులే చేస్తావు అని అతని మీదమండిపడింది. తర్వాత ఇదంతా నా వల్లే అయింది “నేను గొడవ పడి వచ్చేయకపోతే ఈయాక్సిడెంటే అయ్యేది కాదు కదా” అని తనని తానే నిందించుకుంది.
వారం రోజుల తర్వాత ఇంటికి పంపారు. తనే దగ్గరుండి రాత్రి పగలు చూసుకుంది. వాళ్ళఅత్తగారింట్లో అయితే అతనికి కన్వీనియెంట్ గా ఉంటుందని అక్కడికే వెళ్తామని చెప్పింది స్నిగ్ధ.
నిన్న డివోర్స్ కావాలని పట్టుపట్టింది ఈ పిల్లేనా అని ఆశ్చర్యపోయారు రాజేశ్వరి, శ్రీకాంత్దంపతులు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు.
మూడు నెలలు పట్టింది అతనికి కోలుకొని తిరిగి ఆఫీస్ కి వెళ్ళడానికి. లీవ్ పెట్టుకొని అతన్ని కంటికికనురెప్పలా చూసుకుంది స్నిగ్ధ.
వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు.
సరిత, రాజేశ్వరి వాళ్ళ ఇద్దరినే గమనిస్తున్నారు. స్నిగ్ధ, శ్రీకర్ వీళ్ళ వద్దకి వచ్చి కూర్చున్నారు ఏదోచెప్పాలన్నట్లు.
సారీ మమ్మీ! అర్ధం పర్ధం లేని ఇగోలకి పోయి మా లైఫ్ స్పాయిల్ చేసుకునేవాళ్ళము. మిమ్మల్నికూడా ఎప్పుడు టెంషన్ లో పెట్టాము. ఎప్పటికప్పుడు నువ్వు, సరిత ఆంటీ మా ఇద్దరికి నచ్చచెప్పి, పెళ్ళంటే నూరేళ్ళ పంట అని, భార్య భర్తల మధ్య పంతాలు పట్టింపులు కావని, ప్రేమాభిమానాలు, పరస్పరం గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో తెలియచేసారు. మీరు చెప్పినవి మేము ఎప్పటికి గుర్తు పెట్టుకుంటాము అని చెప్పింది స్నిగ్ధ.
నువ్వు ఎందుకు ఎడ్జెస్ట్ అవ్వాలి, నీ మాటే నెగ్గాలి అని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉన్న ఈ రోజుల్లోవివాహ బంధం యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని తెలియచేసి మా ఇద్దరికి మార్గదర్శకంఅయినందుకు మీ ఇద్దరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అని మనస్పూర్తిగా కృతఙ్ఞతలుతెలిపాడు శ్రీకర్.
ఈ యాక్సిడెంట్ మా ఇద్దరి మధ్య అవగాహన, ప్రేమ పెరగడానికి కారణమైనందుకు ఎప్పటికితీపిగుర్తుగా ఉండిపోతుందని, స్నిగ్ధ ఇంత ప్రేమగా చూసుకుంటుందని తెలిస్తే పెళ్ళైన వెంటనే కావాలని యాక్సిడెంట్ చేసుకుని ఉండేవాడిని కదా అని శ్రీకర్ అంటుంటే అతని నోటి మీద చెయ్యిపెట్టి వారిస్తూ మెత్తగా మందలించింది స్నిగ్ధ. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ముచ్చటగాఅనిపించింది ఇద్దరి తల్లితండ్రులకి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు.
చూడ ముచ్చటైన ఈ జంట ఇద్దరి తల్లితండ్రుల వద్ద దీవెనలు తీసుకుని వారి సరికొత్త జీవితానికినాంది పలకడానికి పయనమయ్యారు.