అనుభవం - భవ్య చారు

experience

సుధాకర్ గారి వయసు 45 సంవత్సరాలు , అతని భార్య వనజ వయసు 30 సంవత్సరాలు,ఇద్దరికి ఇద్దరూ పిల్లలు .బాబు ,పాప ఒకరు బీటెక్ చదువుతుంటే ,ఇంకొకరు డిప్లొమా చేస్తున్నారు. ఇద్దర్ని హాస్టల్ లో వేసేసి, వీరిద్దరూ చిలక గోరింకలా ఉండసాగాడు ఇంట్లో. సుధాకర్ గారు ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లో ఉన్నారు. రోజు భార్య కట్టిన బాక్స్ తీసుకుని ,ట్రైన్ లో ఉద్యోగానికి వెళ్లి వాస్తు ఉంటారు. వచ్చే ముందు భార్యకి ఇష్టమైన ఆహారం,పువ్వులు తప్పనిసరిగా తీసుకుని వెళ్తారు .


పిల్లలని హాస్టల్ లో వేసినప్పటి నుండి ఇద్దరికి ఎకాంతం బాగా కుదిరింది. దాంతో ఇన్ని రోజులు పిల్లల భాద్యతలు, కుటుంబ భాద్యతల వల్ల వృధా అయిన తమ కొరికాలని తీర్చుకోవడానికి మంచి సమయమని భావిస్తూ, రోజు కొత్తగా గడుపుతున్నారు.

రోజూ సుధాకర్ గారు వచ్చిన తర్వాత ఇద్దరూ కాసేపు ఆ రోజి ఆఫీస్ లో జరిగిన విషయాలు మాట్లాడుకుని,వంట ఏం చెసుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత భార్యకు వంటలో సహాయం చేస్తారు ,ఇద్దరూ ముచ్చట పెట్టుకుంటూ,కలసి వంట చేసుకున్న తర్వాత, ఇద్దరూ ఫ్రెష్ గా స్నానాలు చేసి, ఆ వంటoతా తీసుకుని డాబా పైనో,లేదా ఇంటిముందున్న సన్నజాజి పందిరి కిందో కూర్చుని ,వెన్నెలని చూస్తూ, ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ ,సరసాలు ఆడుకుంటూ తింటారు.

ఆ తర్వాత తిన్నవి అన్ని లోపల పెట్టేసి ,కాసేపు అలా వాకింగ్ కి వెళ్లి వస్తారు. అలా వెళ్తున్నప్పుడు కూడా ఎవరు ఏమనుకుంటున్నారో అని కాకుండా ఒకరి చేతిలో చేయి వేసుకుని, సరదాగా మాట్లాడుకుంటూ, జోక్స్ చేప్పుకుంటూ, వెళ్లి వస్తుంటారు. వారిని చూస్తున్న జనాలు ముక్కున వేలేసుకుంటూ, ఈ వయసులో ఇదేం చోద్యం అని గుసగుసలు పోతారు. కొoదరేమో ఆ పచ్చని జంట అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు...

ఇలా వారి జీవితంలో మంచి రోజులు వస్తూ, భాద్యతల వల్ల కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉండగా,ఒక రోజు ఒక వార్త వారిని కలిచివేసింది. వాళ్ళు టీవీ చూడడం చాలా తక్కువ , ఆ రోజు సుధాకర్ గారు ఆఫీసులో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విషయం ఏమిటి అని అడిగారు.


" అయ్యో మీకు తెలియదా సర్ , కరోన అని ఒక వ్యాధి వల్ల చైనా లో చాలా మంది చనిపోతున్నారు, అది మనవరకు వస్తుంది అని కూడా అంటున్నారు, అందువల్ల మన పిల్లలని,మనం కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ప్రభుత్వం"మా పిల్లలని అయితే మేము వెంటనే రమ్మణమని ఫోన్ లు చేసాము .అని అందరూ అనడం తో , సుధాకర్ గారు కూడా భయపడి వెంటనే పిల్లలకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు.
వాళ్ళు కూడా సరే అని వెంటనే బయలుదేరి వస్తామని అన్నారు.దాంతో సుధాకర్ గారు ఊపిరి పీల్చుకున్నారు.ఏం జరిగిన మన పిల్లలు మన కళ్ల ముందే ఉంటే ఆ తృప్తి వేరేగా ఉంటుంది ,తమకి ఏమీ జరిగినా వాళ్ళు చూసుకుంటారు.వారికి ఎం జరిగిన తాము చూస్తారు అందువల్ల కుటుంబం అంతా ఒకే దగ్గర ఉండటం మంచిదని అనుకున్నారు అందరూ
అలా పిల్లలు ఇంటికి వచ్చారు...

రమ్మని అయితే అన్నాడు కానీ ఆ రోజు సాయంత్రం ఎప్పటిలా అలవాటు ప్రకారం హల్వా,అలాగే మల్లెపువ్వులు కూడా తీసుకుని ఇంటికి వెళ్లారు సుధాకర్ ఇంట్లోకి వెళ్లడం ఆలస్యం హాయ్ డాడీ నా కోసం ఏం తెచ్చావ్ అని అనుకుంటూ చేతిలోంచి హల్వా తీసుకుని చూసి హే హల్వా నా కోసమే నా నాన్న,అరే పువ్వులు కూడా తెచ్చారు .అబ్బా ఎన్ని రోజులు అయ్యిందో పువ్వులు పెట్టుకుని అని ఆ పొట్లం విప్పి , గబగబా ఆ పువ్వులని కూతురు పెట్టుకుంటుంటే కళ్ళు విప్పార్చుకుని చూస్తూ నిలబడ్డాడు సుధాకర్.ఇంతలో భార్య వనజ వచ్చి , ప్రొద్దున పిల్లలని రమ్మని అన్నారట నాకు ఏమి చెప్పలేదు అంది.

అదా అదేదో వైరస్ వస్తుందని అందరూ ఆఫీసులో అంటూ ఉంటే నేను కూడా రమ్మని ఫోన్ చేసాను,అన్నాడు. హ ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని చూసే మీ పిల్లలకి, మీ ఫోన్ వెళ్ళగానే అలా అన్ని సర్దేసుకుని మధ్యాహ్నం వరకు వచ్చేసారు, మీకు చెప్పమని అంటే నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామంటూ నా ఫోన్ లాక్కున్నారు అంది కంప్లైంట్ ఇస్తున్నట్టు గా,హ సరే లే నేనే మర్చిపోయాను వాళ్ళను రమ్మని చెప్పి , అని అన్నాడు సుధాకర్, సరే మీరు వెళ్లి స్నానం చేసి రండి అని చెప్పింది వనజ, అతని చేతిలోని లంచ్ బాక్స్ ని అందుకుంటూ, సరేనని వెళ్ళాడు లోపలికి సుధాకర్.

ఇక ఆ రోజు నుండి మొదలయింది వారి ఇంట్లో సందడి అంతా , నీ పక్కన పడుకుంట అని కూతురు,కొడుకు గొడవ పడడం, వారిని కాదనలేక ఇద్దర్ని చెరో దిక్కు పడుకో బేట్టుకుని పడుకోవడం సుధాకర్ గారి వంతు అయ్యింది.వారిని అలా చూస్తున్నా వనజకు వారు చిన్నప్పుడు తండ్రితో అలా గడపలేదని గుర్తుకు వచ్చి,కళ్ళు చెమర్చాయి.తండ్రి వస్తాడని ఆశగా ఎదురుచూస్తూ,ఎంత రాత్రి అయినా ఎదురుచూసే వారు పిల్లలు.

కానీ ,సుధాకర్ మాత్రం ఓటిలు చేస్తూ, డ్యూటీ లో ఉండేవాడు.అలా పిల్లలు తమ చిన్నప్పుడు పొందలేని ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నారని తృప్తిగా అనిపించింది వనజకు.కానీ సుధాకర్ మాత్రం తన కోరికలకు కళ్లెం వేసుకోలేక, ఇన్ని రోజులుగా ఉన్న తమ ప్రైవసీ ని వాళ్ళు లాక్కుపోతునట్టు గా అనిపించింది సుధాకర్ కి, అదే విషయాన్ని భార్య తో అన్నాడు.

చ ఊరుకోండి,మనకు సరదాలు అన్ని అయిపోయాయి.మన పిల్లలు మనతో ఉండకుండా ఇంకెవరితో ఉంటారు.మీరు అలా మీ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళే అడ్డుగా ఉన్నారని అనుకుంటున్నారా? కానీ వారిని ఒక్కసారి చూడండి మీ ప్రేమ పొందలేక, ఎన్ని నిద్ర లేని రాత్రుళ్లు వారు గాడిపరో నాకు తెలుసు, మీరు వస్తారని , బొమ్మలు ,స్వీట్లు తెస్తారని వారికి ఎన్నో సార్లు వారిని మభ్య పెట్టి ,నిద్రపుచ్చిన నాకు తెలుసు వాళ్ళు మీ ప్రేమని అప్పుడు పొందలేక పోయారు.


ఇప్పుడు అదే ప్రేమ ని వాళ్ళు మీ దగ్గర నుండి కోరుకుంటున్నారు అంతే తప్ప మనకి అడ్డు గా ఉన్నారు అని అనుకోవడం మీకు మంచిది కాదు .ఆ ఆలోచన మీకు రావడం తప్పు, వారు పుట్టేంత వరకు మనం బాగానే ఉన్నాం, ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు కూడా మనం మన కోరికలు తీర్చుకుంటూ ఉన్నాము.

మహా అయితే ఒక్క పది రోజులు ఉంటారేమో, మళ్ళీ కాలేజీ తెరిస్తే వల్లే వెళ్లిపోతాము అని అంటారు. అందుకే మీకు ఇంతగా చెప్తున్నా ,మీరు కూడా వాళ్ల ప్రేమని సరిగ్గా అందుకోలేక పోయారు.మిరెన్నో సార్లు రాత్రుళ్లు లేట్ గా వచ్చి ,పడుకున్న వారిని ముద్దు పెట్టుకోవడం, వారి చిన్ని,చిన్ని మాటలు,చేతలు చూడలేకపోతున్నా అంటూ భాద పడ్డాం నాకు తెలుసు,ఆ ప్రేమని ఇప్పుడు వారు మీకు ఇస్తున్నారు, పొందాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులని గుర్తు తెచ్చుకోండి, ఆ పాత ప్రేమని ఇప్పుడు మీరు వారికి అందించండి అంది వనజ భర్త కి హితబోధ చేస్తున్నట్టుగా, సుధాకర్ గారికి పాత రోజులు గుర్తుకు వచ్చాయి.తాను వారి ప్రేమకోసం ఎంతగా తపించి పోయింది గుర్తుకు వచ్చి, కళ్ళలో కన్నీళ్ళుఉబికి వచ్చాయి. అవును తాను వారికి అప్పుడు ప్రేమని అందించలేక పోయాడు. ఇప్పుడు వారు తన ప్రేమ కోసం తపించిపోతున్నారు.

చీ నేను నా తుచ్ఛమైన కోరికల కోసం కన్న బిడ్డలని కదనుకున్నానా ? అవును వనజ చెప్పింది నిజం మా కోరికలు తీర్చుకోవడం పెద్ద కష్టం కాదు ,కానీ వారికి ఉద్యోగాలు ,పెళ్లిళ్లు అయితే తాను ఈ ప్రేమని వారికి అందించలేక పోవచ్చు,

ఏమో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఇలా ఆలోచించి సుధాకర్ గారు " నన్ను క్షమించు వనజ , ఏవో ఆలోచించి నిన్ను ,పిల్లలని భాద పెట్టిన , ఇక ఇప్పటి నుండి అలా ఎవర్నీ భాద పెట్టాను " అన్నాడు . అయ్యో మీరు మమ్మల్ని క్షమించమనడం ఏమిటండీ? మీరు బాగుంటే మేము బాగుంటము ,కాకపోతే కాస్త మీకు అన్ని తెలియాలని చెప్పాను అంతే కానీ మిమల్ని చిన్న చూపు చూడాలని కాదు. అంది వనజ ఆప్యాయంగా.

ఇక ఆ రోజు నుండి సుధాకర్ గారు ఆఫీసు కి సెలవు పెట్టి మరీ పిల్లలతో కలిసి కూర్చుని వారితో చిన్నప్పుడు అడలేని ఆటలు అన్ని ఆడి,పాడి పిల్లలు సంతోషంగా నవ్వుతూ,కేరింతలు కొడుతూ ఉంటే వారిని చూసి అతను కూడా ఆనందించాడు. తనకి వారి చిన్నప్పుడు వారితో అడుకోలేని లోటు ఇప్పుడు ఇలా తీర్చుకుంటూ వారి ఆటల్లో అరటి పండు గా అయ్యాడు.తాను ఓక చిన్నపిల్లాడు అయిపోయి మరి ఆడుకుంటూ ఉన్నాడు. వారిని అలా చూస్తున్న వనజ కళ్ళు చెమర్చాయి ఆనందంతో.......

ఒక్క నెల రోజులు గడిచాయి. పిల్లలకి మళ్ళీ కాలేజీ లు తెరుస్తునట్టు గా ఫోన్ లో మెసేజ్ లు వచ్చాయి. ఇక వారు వెళ్లిపోవాలని అనుకున్నారు. కరోన భయం అందరికి పోయింది.ఇక పిల్లలు వెళ్లిపోతున్నారు అంటేనే సుధాకర్ గారికి ఏడుపు వచ్చింది.వాళ్ళ కళ్ల బడకుండా ఉన్నారు సుధాకర్ గారు.పిల్లలు వెళ్లే రోజు వనజ ,సుధాకర్ గారు ఇద్దరూ బస్ స్టాండ్ కి వచ్చి ,వారిని బస్ ఎక్కించారు.

ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు టాటా చెప్తూ ,సంతోషంగా వెళ్ళిపోయారు.తమ తండ్రి తమతో ఇన్ని రోజులు ఆడుకున్నాడు, తమ కొరిక ఇలా తీరింది అనే సంతోషంలో ఆనందంగా వెళ్లిపోతున్న తమ బిడ్డలని కళ్ళారా చూసుకున్నారు సుధాకర్ దంపతులు వాళ్ళు వెళ్ళిపోయాక భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చారు.

ఇంటికి వచ్చాక వారికి పిల్లలు లేని ఆ ఇల్లు బోసిపోయినట్టు గా అనిపించింది. బాధగా సుధాకర్ గారు బయటే కూర్చున్నాడు.లోపలికి వెళ్లిన వనజ గట్టిగా ఏమండీ అంటూ పిలిచే సరికి ఏమైంది అంటూ గాభరాగా వెళ్లిన సుధాకర్ గారికి తమ బెడ్ రూమ్ మొత్తం పువ్వులతో అలంకరించి కనిపించింది. అదంతా పిల్లలే చేశారు అనే ఆలోచన వారి మనసు మాకు తెలుసు అన్నట్లుగా పిల్లలు చెప్తున్నట్టు అనిపించింది.

ఆ అలంకరణ చూడగానే సుధాకర్ గారికి మళ్ళీ పడుచుదనం వచ్చినట్టు వయసు ఉప్పొంగిపోయింది. ఇంతలో వనజ చూసారా నా పిల్లలు మంచివాళ్ళు అండీ, మనం వారి గురించి ఆలోచిస్తే, వారు మన గురించి ఆలోచించారు అంది సుధాకర్ గారిని ఉడికిస్తూ , ఆవునోయ్ వాళ్ళు నా పిల్లలు, నా వారసులు మరి అంటూ మీసం మెలి వేశారు. అబ్బో పెద్ద గొప్పే అంది వనజ. హ మరి వాళ్ళు చేసిన ఈ ఏర్పాట్లుని వెస్ట్ చేయడం ఎందుకు ?అంటూ కన్ను కొట్టాడు సుధాకర్.


అది చూసి వనజ సిగ్గు పడింది. వారిద్దరి ని చూస్తున్న చంద్రుడు ఇక చూడలేను అన్నట్టుగా మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు...

*****అయిపోయింది*****

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు