అనిత కి బాగా ఆకలిగా ఉంది.గబగబా ఇల్లంతా వెతికింది అయినా ఏమి దొరకలేదు.గత నెల రోజులుగా పని దొరకలేదు.ఈ నెల రోజులు అడగని వారిని అడగనట్టుగా అడిగింది అప్పు ,ఇచ్చిన వారు ఇచ్చారు.కొందరు దగ్గరికి రకు అని చాలా మంది వెలివేసారు.తాను ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఊరికి దూరంగా ఉంది.అందుకోసమే తాను ఊరికి దూరంగా కట్టుకోవడం వల్ల తన దగ్గరికి ఇప్పుడు ఎవరు రారు.తాను కూడా వెళ్ళలేదు.తనకి కూడా చావు భయం ఉంది.అందుకే భయం తో బయటకు వెళ్లడం లేదు.
అయినా కొన్ని రోజులు లారీ వాళ్ళు ,అది తనని అభిమానించే వారు అప్పు ఇచ్చారు అడిగిన వెంటనే, కానీ ఎన్ని రోజులు అని అప్పు ఇస్తారు .వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, అందుకనే మళ్ళీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్పారు ఇక తమకి ఫోన్ చేయవద్దని, అయినా వారు చేసిందే అప్పటివరకు గొప్ప , ఇక తాను కూడా వారికి ఫోన్ చేయడం మానేసింది.అయినా ఊర్లో ఉన్న వారు కూడా అప్పుడప్పుడు సరుకులు తెచ్చి ఇచ్చారు ఇప్పటి వరకు కానీ ఎప్పుడైతే దూరంగా ఉండమని బయటకు కూడా రానివ్వరు అని తెలుసి ఎవరూ బయటకు రావడం లేదు. దానయ్య కూడా సరుకులు రాక తన దుకాణం మూసేసి ,ఇంట్లో కూర్చున్నాడు.
అప్పటి నుండే మొదలయింది తన ఆకలి భాద ఉన్న సరుకులు రెండూ నెలలు ఎలాగో నెట్టుకొచ్చింది.ఇక సరుకులు అన్ని అయిపోవడం మొదలు అయ్యాక ,తనకి ఆకలి భాద తెలిసి వచ్చింది.బియ్యం నిన్నటి నుండి నిండుకున్నాయి. ఉన్న రవ్వ తో నిన్న ,మొన్న జావా కాచుకుని తాగింది.అయినా తన ఒక్క ప్రాణానికి ఎన్నో సరుకులు అవసరం లేదు ,కొన్ని అయినా పంపమని దానయ్య ని చాలా చాలా వేడుకుంటూ ఫోన్ చేసింది చివరి సారి, అయినా తన ఇంట్లోనే సరుకులు నిండుకున్నాయి అని, తనకే ఏం చేయాలో తెలియడం లేదనే సమాధానం అక్కడి నుండి వచ్చింది.
అనిత నిస్సత్తువగా అక్కడే ఉన్న నులక మంచం మీద వాలిపోయింది. తన కళ్ళలో ఆకలి,భాద, కోపం, నిస్సత్తువ, ఉక్రోషం, తన మీద తనకే కలిగిన విరక్తి ఇవ్వన్నీ ఒక్కసారిగా ఆమెని చుట్టూ ముట్టాయి.తాను ఈ ఉబిలోకి ఎలా వచ్చిందో, ఎలా బతికేది ఇప్పుడు ఇలా అయ్యిందో, ఏ ఆకలి వల్ల తాని ఉబిలోకి వచ్చిందో, అదే ఆకలి వల్ల ఈ రోజు ఇలా పది ఉండాల్సి వస్తుందని అనుకోలేదు ఎప్పుడూ కూడా......
అసలు తన కలల్ని నిజం చేసుకోవడానికి తన కుటుంబాన్ని , తల్లిదండ్రులని , స్నేహితులని అందరూ ఎంత చెప్తున్న వినకుండా, ఒక సినీతార అవ్వాలని బయటకు వచ్చింది.అక్కడే పరిచయం అయ్యాడు అరవింద్, తనని పెద్ద తారని చేస్తానని ఎన్నో మంచి మాటలు చెప్తూ,తనని పొగుడుతూ ఉంటే పొంగిపోయింది.ఒకనాడు అదే అరవింద్ ఒక పెద్ద డైరెక్టర్ వద్దకు తీసుకుని వెళ్తానని తనని ఒక పెద్దమనిషికి అమ్మేశాడు, అది తెలుసుకునే సరికి తన బతుకు తెల్లారి పోయింది.తనని కొన్నవాడు కొట్టి,కొట్టి,కొట్టి తన మాట వినకుంటే వాతలు పెట్టి మరి తనని తార్చడు.ఇక తన లాభాలు వచ్చేదాకా తనని ఎంతోమందికి తార్చి,తార్చి తన శరీరాన్ని నాశనం చేసాడు.
అది గమనించిన తాను ఒక పెద్ద భూస్వామి ని లొంగదీసుకుని, ఇక్కడ కి వచ్చి పడింది.అతను కట్టించిందే ఈ ఇల్లు తన పేరు తో రాయించుకుంది.అతను ఉన్నంత వరకు తానొక రాణి లా వెలుగు వెలిగింది.అతను చనిపోయిన తర్వాత అతని కొడుకులు తనని ఇల్లు కాళీ చేయమని అన్నారు.కానీ అతని భార్య వారిని వారించి,ఇక ముందు తనని ఊర్లోకి రానివ్వద్దు అని అందరితోనూ చెప్పింది.అప్పటి నుండి తనకు తనలాగే మోసపోయిన వారు తారసపడితే తీసుకొచ్చి, ఇదే ఇంట్లో వాళ్ళతో వ్యాపారం చేయించింది తాను.కొందరు చేయమని అంటున్నా ,ఇక ఒకసారి అందులో దిగిన తర్వాత వేరే ఏ వృత్తిలో ఉండనివ్వరని సాకు చెప్తూ, వారితో బలవంతంగా అయినా ఇదే వ్యాపారం చేయించింది.
అప్పుడు వాళ్ళు తనని తిట్టుకుంటూ, ఇష్టం లేకపోయినా చేయమని అనడం తో తనని ఎన్ని శాపనార్థాలు పెట్టుకున్నారో, అవన్నీ ఇప్పుడు తనకి తిండి లేకుండా చేసాయి. కరోన రాగానే ఇక తమకి పని దొరకడం కష్టం అని భావించిన కొందరు వారి ,వారి సొంతూరుకు వెళ్లిపోయారు.ఇంకా కొందరు వేరే వ్యాపారం పెట్టుకుంటామని వేరే చోటికి వలసలు పోయారు.ఇక రాష్ట్రం సరిహద్దులు దాటిన వారు వందల్లోనే ఉన్నారు. అందరూ వెళ్లి పోయాక ఒకే ఒక అవ్వ తనకోసం వండి పెట్టేది ఉండేది.
ఆ అవ్వ కూడా ఈ మధ్యనే వయస్సు అయిపోవడం ,కొన్ని రోజులుగా తానే డాక్టర్ల కి చూపించడం తో ఇన్ని రోజులు బతికి ,పది రోజుల క్రితమే చనిపోవడం తో,తనొక్కతి అయిపోయింది....
ఇప్పుడా ఇంట్లో హడావుడి లేదు.మల్లెల గుబాయింపులు ,గాజుల గలగలలు లేవు. ఆ ఇంట్లో ఒక స్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది.అలాగే పడుకుని ఆలోచిస్తూ ఆ ఆలోచనలతో తన ఆకలి ని కూడా మర్చిపోయింది అనిత,ఇంతలో ఎదో హడావుడి ,డప్పుల మోత వినిపించింది.
అదేంటో చూద్దామని లేచి, బయటకు అలాగే నిస్సత్తువ గా వచ్చి చూసిన అనిత ని గమనించిన ఆ ఊరి సర్పంచ్ ,ఆమె దగ్గరగా వచ్చి "" అనితమ్మా మనకు వచ్చిన గడ్డు కాలం పోయింది.ఇక మనకి ఏ భయం లేదు.మనమంతా ఎప్పటిలా ఉండొచ్చు, రెండు నెలలుగా ఉన్న భయం అంతా ఒక్క రోజుల్లోనే తీరిపోయింది, అని ప్రభుత్వం ఇప్పుడే టీవీ లో చెప్పిందమ్మా , ఇక మన దేశం లో ఏ మహమ్మారి రాలేదమ్మ, రాదు కూడా , ఇక మనమంతా స్వేచ్ఛగా తిరగొచ్చు, తినొచ్చు, ఆకలి భాద కూడా ఉండదు , అవును నువ్వు వారం రోజులుగా ఫోన్ చేయకపోతివి అని అంటూ ఇదిగో తిను అని అంటూ సంతోషంగా తన చేతి లోని స్వీటు డబ్బాలో నుండి కొంచం స్వీటు తీసి ఆమె నోట్లో కుక్కి, అరెయి అనితమ్మా కు ఆ బిర్యానీ ప్యాకెట్టు ఇయ్యండి రా అని అంటూ తన అనుచరులకు చెప్పాడు.
"" అప్పుడు గుర్తుకు వచ్చింది అనితకు,తనకి ఏం కావాలన్నా ఫోన్ చేయమని వారం క్రితం నెంబర్ ఇచ్చి, సరుకులు ఇచ్చిన ఆ సర్పంచ్ కి తాను ఫోన్ చేస్తే ,ఈ వారం రోజులు కూడా ఇలా అర్ధాకలి తో ఉండే అవసరం కాదని , ఇప్పుడు ఇక ఏ మహమ్మారి తమ వద్ద లేదని తెలిసాక , ఆమె కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు రాలాయి.ఇక నుండి కష్ట పడి బతకాలని నిర్ణయించుకుంది అనిత..
అనుచరులు ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్టు తీసుకున్న అనిత పెన్నిధి ఎదో దొరికినట్టుగా ఆతృతగా అందుకుని ,ఇంట్లోకి వెళ్లి ,గబగబా విప్పి ,నోట్లో కుక్కుకుంది ఆ బిర్యానీ ని , ఇంతలో ఆమె ఆతృతకి పొలమరినట్టు అయ్యింది. ఆమె అవస్థ చూసిన ఒక చిన్న వాడు ,తన చేతిలోని వాటర్ ప్యాకెట్టు తో ఆమె నోట్లో నీళ్లు పోసాడు.అవి ఆనందంగా తాగుతూ, వాడిని దగ్గరకు తీసుకుంది నలబై ఏళ్ల అనితమ్మ....