కరోన+ఓసీడీ= మాతృత్వం - భవ్య చారు

corona+ocd=fertility

ప్రశాంతి కి మనసంతా అదోలా ఉంది. తాను కోరుకున్నది ఏంటి ? జరిగేది ఏంటి అనే ఆలోచన తన మనసుని కదిలించివేస్తుంది.అయినా తాను చేసిన తప్పేంటి? ఎందుకు తనకే ఇలా జరగాలి ? ప్రశాంతి కి తన గతం గుర్తుకు రాసాగింది...గతం అంటే పెద్ద గతం కాదు ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళింది అంతే,

ఆ రోజు ప్రశాంతి పెళ్లి స్నేహితులు అంతా జోక్స్ వేస్తూ, తనని ఆట పట్టీస్తూ ప్రశాంతి ని రెడి చేస్తున్నారు.ఇంతలో ప్రశాంతి బెస్ట్ ఫ్రెండ్ అలేఖ్య హడావుడిగా వచ్చి హే ప్రసూ ఇది విన్నవా, నేను ఇప్పుడే చూసా " మీ ఆయన కు ఓసీడీ ఉన్నట్టు గా ఉందే పదే ,పదే చేతులు కడుగుతూనే ఉన్నాడు అంది గాభరాగా, దానికి ప్రశాంతి హాయిగా నవ్వింది..

ఏంటీ నేను ఇంతగా చెప్తుంటే నువ్వు నవ్వుతావేంటి అంది అలెఖ్య, ఒసే పిచ్చి మొద్దు .. అవన్నీ నాకు ముందే తెలుసు ఆయనకి ఓసీడీ ఉందని చెప్పారు కానీ ఆయన చాలా మంచి వ్యక్తి , అదొక్క లోపం తప్ప వేరే ఏ అలవాట్లు లేవు కాబట్టి నువ్వు ఏమి కంగారు పడకు అంది ప్రశాంతి. అది కాదు ప్రశాంతి ఇప్పుడు బాగానే ఉంటుంది.కానీ రాను రాను అది ఒక వ్యసనం లాగా మారిపోతుంది కాబట్టి నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిది అంది అలేఖ్య, సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకు నేను మెల్లిగా ఆయన తో అన్ని మానిపిస్తాను, ఆయన్ని మార్చుకుంటను అనే నమ్మకం నాకు ఉంది అంది ప్రశాంతి.

ఎమోనే కానీ ఈ ఓసీడీ ఉన్న వారి తో చాలా కష్టం, వేరే ఎవరి తోనైనా కలసి ఉండొచ్చు ,కానీ ఈ ఓసీడీ వాళ్ళతో చాలా కష్టం , అయినా ఇప్పుడు పెళ్లి సమయం దగ్గర పడుతుంది , నువు ఆయనతో ఎలా కాపురం చేస్తావో , ఎంటో, అని ధీర్ఘంగా నిట్టూర్చింది అలేఖ్య,

దాని మాటలకి హాయిగా నవ్వుకుంది ప్రశాంతి, నువ్వు లేనిపోనివి ఉహించుకుంటున్నావు , అలా ఏమి జరగదు, అంతా బాగుంటుంది అని అంటూ తండ్రి పిలుపు విని అలాగే ముహూర్తం కూడా దగ్గర పడడం తో మండపంలోకి తీసుకుని వెళ్లారు స్నేహితులు. తాళి మెడలో కట్టే టప్పుడు కూడా అతను చేతిలో ,ప్రశాంతి మెడ మీద కూడా సనీటిజెర్స్ వేసి మరి తాళి కట్టాడు. అది చూస్తున్న అలేఖ్య జాలి గా ప్రశాంతి ని చూసింది.

ఆ చూపులని కొట్టిపారేసింది ప్రశాంతి.అలా తన ఓసీడీ భర్త అయిన హరి తో తన కాపురం మొదలయ్యింది.భర్త ఆ ఒక్క విషయంలో తప్పితే మిగతా విషయాల్లో చాలా మంచివాడు, చాలా బాగా తనని చూసుకుంటాడు. ఏదీ అడిగినా క్షణాల్లో అమర్చి పెడతాడు.ఆయన కి ఎవరూ లేరు కష్టపడి పైకి వచ్చిన వాడు, ఆయనలో మంచితనం తనకి వరం లా అనిపించింది. ఆ ఒక్క లోపాన్ని మర్చిపోతే మాత్రం హరి చాలా మంచివాడు.

అలా వారి అన్యోన్యత కాపురానికి గుర్తుగా సంవత్సరం తిరగకుండానే ప్రశాంతి నెల తప్పింది. హరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ,మంచి ఆహారాన్ని అందిస్తూ ప్రేమగా చూసుకున్నాడు ఇక తొలి ప్రసవం కాబట్టి ప్రశాంతి ని పుట్టింటి వారు తీసుకుని వెళ్లారు.నెలలు నిండిన తర్వాత పండంటి బాబుకి జన్మనిచ్చింది ప్రశాంతి ఒక మూడునెలలు అయ్యాక అన్ని సంబరాలు తీరిన తర్వాత తిరిగి హరి దగ్గరికి వచ్చింది ప్రశాంతి..

బాబు పనులన్నీ కాస్త అలవాటు అయ్యేంత వరకు ఉన్న తల్లి కాస్త ప్రశాంతి లేచి తిరగడంతో ఆమె తన ఇంటికి తాను వెళ్లిపోయింది. తగిన జాగ్రత్తలు చెప్పి, హరి అత్తయ్య గారితో మీరేమి కంగారు పడకండి అన్ని నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. అల్లుడి మంచితననాన్ని చూసి ముచ్చట పడిపోయింది ప్రశాంతి తల్లి .నిచ్చిoతగా ప్రశాంతి ని వదిలి వెళ్ళిపోయింది ఆవిడ.ఇక ఆవిడ వెళ్ళాక హరి పిల్లాడి వస్తువులు, బట్టలు అన్ని ఉతికి బాగా ఆరిన తర్వాత మడత పెట్టి, చక్కగా సర్ది పెట్టాడు. అన్ని పనులు చేయసాగాడు. ఇలా ఒక రెండు నెలలు గడిచాయి. బాబుకు అయిదో నెల వచ్చింది. ఇంతలో లాక్ డౌన్ అని మోదీ ప్రకటన ప్రకారం అందరూ ఇంట్లోనే ఉండసాగారు.

అప్పటి నుండి మొదలైoది ప్రశాంతి కి నరకం అంటే ఎలా ఉంటుందో అనేది తెలిసి వచ్చింది.లాక్ డౌన్ పొడిగించిన తర్వాత కరోనా వైరస్ మన దేశానికి వచ్చింది అని కన్ఫర్మ్ అయ్యాక ,హరి ఓసీడీ ఇంకా ఎక్కువ అయ్యింది. కడిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ కడగడం, తుడిచిన దాన్ని తిరిగి తుడవడం ఇల్లంతా డేట్టాల్ వేసి తుడవడం చేసాడు. అక్కడి వరకు అయితే ఫరవాలేదు మన మంచికే అని సర్దుకుంది ప్రశాంతి.

కానీ తర్వాత అతను చేసిన పని చూసి నివ్వెర పోయింది. హరి తాను ఎవరినీ ముట్టుకోకుండా డిస్టెన్స్ పాటించమని ప్రశాంతి కి కూడా చెప్పాడు. చూడు ప్రశాంతి మనం ఒకర్ని ఒకరం తాకకూడదు, ముట్టుకోకూడదు. దూరం దూరంగా ఉండాలి అని చెప్పాడు, తాను సరే అని ఒప్పుకుంది.

ఇంతలో బాబు ఏడవడం తో పాలు పట్టడానికి బాబు ని చేతిలోకి తీసుకోబోయింది . హే ఆగు ఏం చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరిచాడు హరి , అతని అరుపుకు జడిసి ఒక్క అడుగు వెనక్కి వేసి, ఏంటండి , ఏమైంది ? ఎందుకు అలా అరిచారు అంటూ అడిగింది ప్రశాంతి. హరి కోపంగా ఏంటి నువ్వు చేసేది అని అడిగాడు ప్రశాంతి ని ఏంటి నేను చేసేది,బాబు ఎడుస్తున్నాడు అందుకే పాలు పట్టడానికి దగ్గరికి వెళ్తున్నా అని అంది.


నో ,నో వద్దు నువ్వు బాబుకి పాలు పట్టడానికి వీలు లేదు, నీకు ఏదయినా వైరస్ లాంటిది ఉంటే బాబుకి అంటుకుంటుంది వద్దు అని అన్నాడు. నివ్వెరపోవడం ప్రశాంతి వంతు అయ్యింది. హరిని చూస్తూ ఏంటండి మీరు మాట్లాడేది , మీకేమైనా పిచ్చా , ? బాబుకి పాలు పట్టకుండా ఎలా ?వాడు ఆకలితో ఏడుస్తూన్నాడు , అది చూస్తూ ఉరుకోవాలా ? వాడికి ఆకలి వేసి ,ఎడుస్తున్నాడు. ఏం చేయమంటారు మరి అని అడిగింది ప్రశాంతి, హరిని.

అవును నిజమే ఏడుస్తూ ఉన్నాడు కానీ నీకు ఏదైనా వైరస్ ఉంటే అది నీ పాల ద్వారా వాడికి అంటితే, లేదా సోకితే ఎలా ? అంత చిన్నవాడికి ఏమయినా అయితే నేను ,నువ్వు తట్టుకోగలమా ? ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. అతని మాటల్లో ఉన్న మమకారాన్ని గుర్తించిన ప్రశాంతి మనసు ఉప్పొంగిపోయింది.

కానీ అంతలోనే అది కోపంగా మారింది. ఏంటి మీరు మాట్లాడేది ఎదో ఉందని ఇప్పుడు వాడికి పాలు ఇవ్వకపోతే వాడు ఆకలితో ఏడుస్తూ, ఉంటాడు. వాడిని అలా ఏడిపిస్తూ ఉండడం మీకు బాగా అనిపిస్తుందా ?మీరు మీ ఓసీడీ మాటలు వద్దండి వాడికి పాలు పట్టనియండి అని అంది దీనంగా , వద్దు ప్రశాంతి ప్లీస్ దయచేసి నన్ను అర్థం చేసుకో , నేను చెప్పేది మన మంచికే , వాడికి ఏమి కావొద్దు అనే నా ఆలోచన ప్లీస్ అర్థం చేసుకో అని అంటూ చేతులు జోడించాడు.

అతని భాద ని అర్థం చేసుకుని ,సరే మరి వాడి ఆకలిని ఎలా తీరుస్తారో తీర్చండి అని అంది. వెంటనే హరి కిచెన్ లోకి వెళ్లి , పాల బాటిల్ ని బాగా కడిగి, పాలు వెచ్చబెట్టి, చల్లార్చి, అందులో పోసి , దూరం నుండి ఒక గంటే కి కట్టి వాడి నోటికి అందేలా పట్టాడు. అది చూసిన ప్రశాంతి ఎదో తెలియక అలా చేస్తున్నాడు అనుకుని నవ్వుతూ అతను చేసే పని చూస్తుంది.

కాసేపటికి వాడు నిద్ర పోయాడు సగం నిండిన కడుపుతో తల్లిగా అది చూసిన ప్రశాంతి గుండె తరుక్కు పోయింది.ఆమె అక్కడి నుండి వంట గది లోకి వెళ్లి తామిద్దరికి వంట చేసింది. ఇద్దరు తింటున్న సమయంలో బాబు మళ్ళీ లేచి,ఏడవడం మొదలు పెట్టాడు. టాయిలెట్ కి వెళ్లడేమో దానికి ఏడవడం మొదలు పెట్టాడు.గబగబా వెళ్ళింది ప్రశాంతి డైపర్ మార్చడానికి ,అది చూస్తున్న హరి వెనకే వచ్చి ఏ ఏం చేస్తున్నావ్ అని అన్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా డైపర్ మారుస్తూ చూడండి ఆకలి అంటే పాలు ఎలాగో పట్టారు.కానీ వాడికి డైపర్ ఎలా మారుస్తారు. వాడు మార్చుకోలేడు కదా అని అడిగింది.

సరే అదొక్కటే మార్చు కానీ పాలు మాత్రం ఇవ్వకు అని అంటూ తిరిగి వచ్చి తినసాగాడు. ప్రశాంతి బాబుకి డైపర్ మార్చి,వాడికి కడుపు నిండా పాలు పట్టసాగింది. ఇంకా ప్రశాంతి రాకపోవడంతో వచ్చి చూసిన హరి ప్రశాంతి ని చూసి, గట్టిగా అరిచి ఏంటి ప్రశాంతి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నేను చెప్తుంటే వినవు, అంటూ బాబుని ఒక్క లాగు లాగి పక్కన పడుకోబెట్టాడు. ప్రశాంతి ని మంచం మీద నుండి కిoదకి లాగేసాడు. అతను చేసిన ఆ పనికి ఆశ్చర్య పోయి, నిజంగానే అంటున్నాడు అని నిర్ధారించుకుంది ప్రశాంతి. కోపం ఒక్కసారిగా తన్నుకొచ్చింది.

హల్లో ఏంటి మీరు నిజంగానే అంటున్నారా ?నేనేదో తమాషా చేస్తున్నారు అనుకున్నా , అయినా బిడ్డకి పాలు ఇవ్వకుండా ఎలా ఉరుకోవాలి ?మీకేమయినా పిచ్చి పట్టిందా అంటూ తాను కూడా అరిచింది. హరికి కూడా కోపం వచ్చి తాను వద్దు అన్న పని చేస్తోంది అనే కోపం లో అక్కడే ఉన్న కర్ర ని తీసుకుని ప్రశాంతి ని కొడుతూ ,ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ?వాడికి నువ్వు పాలు పట్టకూడదు, వాడికి డైపర్ ఒక్కటే మార్చు, అంతే కానీ ఇంకోసారి పాలు ఇచ్చావో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఒక రెండు దెబ్బలు వేసి వెళ్లిపోయాడు అక్కడి నుండి.ప్రశాంతి బిత్తరపోయి అలాగే కూర్చుంది.ఆలోచనలో ఉన్న ప్రశాంతి బాబు ఏడుస్తూ ఉండడంతో ఆలోచన లోంచి బయటికి వచ్చింది..

బాబు ఏడుపుకి తెలివి వచ్చిన దానిలా బాబు వైపు చూసింది ప్రశాంతి. వాడు గుక్కపట్టి ఎడుస్తున్నాడు. హరి వాడికి పాల బాటిల్ అందివ్వడానికి నా నా తంటాలు పడుతున్నాడు. ప్రశాంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆమె గుండెలు బరువెక్కాయి.ఆమె తన గుండెల వంక చూసుకుంది. అవి పాలకుండ వలే నిండి పోయి ఉన్నాయి. ఆమెకి బరువుగా అనిపించాయి.వాటి బరువుని దించుకోవాలి అంటే అవి బాబు కడుపుని నింపే అమృత జలరులు, అమృత ధరాలు,కానీ ఇప్పుడు అవి ఎందుకు పనికి రాని వాటీలా అయ్యాయి. తాను చేసిన తప్పేంటి , బాబుకి పాలు ఇవ్వకుండా ఉండాలి అంటే ప్రాణాలు పోతున్నాయి..

బాబుకి పాలు పట్టిన హరి మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.కానీ ప్రశాంతి కి గుండె బరువు దించుకోవాలి అనిపించింది కానీ ఎలాగో అర్థం కాలేదు.బాబు కి పాలు ఇస్తేనే అవి బరువు తగ్గుతాయి.కానీ ఇప్పుడు ఇవ్వొద్దని అంటున్నాడు హరి. వెంటనే ఆ బరువు దింపుకోవలని గబగబా బాత్రూమ్ లోకి వెళ్ళింది ప్రశాంతి. ఆమె వెనకే వెళ్లిన హరికి అక్కడి దృశ్యం చూసి బాధ తో కళ్ళు ముసుకున్నాడు.


అక్కడ ప్రశాంతి తన గుండెల్ని పిండుతూ ,అమృత ధరలను , బిడ్డ ఆకలి తీర్చాల్సిన పాలని మురికి గుంటలో పోస్తుంది. తల్లి పాలు శ్రేష్ఠం ఇవ్వండి అని డాక్టర్లు చెప్తుంటే , పాలు లేక సన్నని కట్టే పుల్లల లాగా ఉండే పిల్లలని చూస్తూ ఉండే వారికి , ఉన్న ,వచ్చిన పాలని, దేవుడిచ్చిన అమృతాన్ని ఆమె అలా నేల పాలు చేయడం చూసిన హరికి కళ్లల్లో నీళ్ల తిరిగాయి.ఆమె బాధని అర్థం చేసుకున్న కూడా తాను చేయగలిగేది ఏమి లేదు. అలా రెండు రోజులు గడిచాయి.ఆ రెండు రోజుల్లో ఆమె పడిన భాద అంతా,ఇంతా కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అని ఫోన్ చేసిన తల్లిదండ్రులకు జరిగిన విషయం అంతా చెప్పింది ప్రశాంతి.

ఆ మాటలకు వాళ్ళు కూడా బిత్తరపోయి,ఇదేం చోద్యమే తల్లి ,ఇలా ఎక్కడైనా ఉంటుందా,? అని అయినా అతను కూడా చెప్పేది మంచికే కానీ మరి ఇలా తల్లి పాలు ఇవ్వడం కూడా తప్పే అని ఎవరూ చెప్పలేదు.ఏ డాక్టర్లు కూడా తల్లి పిల్లలకు పాలు ఇవ్వొద్దని చెప్పలేదు. ఇంకా తల్లి పాలు మంచివి అనే చెప్తారు అంది తల్లి , తల్లి మాట్లాడుతూ ఉంటే ప్రశాంతి కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తల్లి కి తర్వాత చేస్తాను అని చెప్పి, ఫోన్ పెట్టేసి, వెంటనే ఫోన్ చేసింది ఎవరికో...

హరి ముందు హల్లో కూర్చుని లాప్టాప్ లో వర్క్ ఫ్రొం హోమ్ చేసుకుంటున్నాడు.ఇంతలో బయట కాలింగ్ బెల్లు మోగింది.ఎవరో చూద్దామని వెళ్లి తలుపు తీసాడు హరి అక్కడ బయట ఇద్దరు లేడీ డాక్టర్లు కనిపించి,గాబరా పడి" మా ఇంట్లో అలాంటివేవి లేవండి అని గబగబా చెప్పాడు". "మాకు తెలుసు మిస్టర్ హరి ,మేము వచ్చింది మీకోసమే అని నవ్వుతూ అంటూ "లోపలికి వచ్చారు వారిద్దరూ" ఏంటి మీరు నా కోసమే వచ్చారా, నాకేమి తెలియదు "అన్నాడు. "అవును నిజమే నీకు ఏమి తెలియదు అందుకే తెలియ చేయడానికే మేము వచ్చాము" అని లోపలికి వచ్చి , కుర్చీలో కూర్చున్నారు.

""సరే చెప్పండి ఏంటో అన్నాడు బింకంగా హరి "". "" చూడు హరి ఈ కరోన అనేది మన దగ్గర పుట్టలేదు. ఎక్కడి నుండో వచ్చింది. ముఖ్యంగా ఇది విమానాల్లో ప్రయాణించి, విదేశాల నుండి వచ్చిన వారి వల్ల మనకి తగిలింది. విదేశాల నుండి వచ్చిన వారితో ఉన్నవారికి ,వారి కుటుంబ సభ్యులకు వారితో సన్నిహితంగా మెలిగిన వారికి వచ్చింది. ఆంతే తప్ప మనలాంటి వారికి అంటదు.

ఇంకా చెప్పాలి అంటే మనం వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనకి రాదు. ఇంతకీ మీ ఆఫీసులో కానీ ,లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ మధ్య విదేశాల నుండి వచ్చారా? మీరు వారితో కలసి ఉన్నారా ?అని అడిగారు వాళ్ళు. " లేదు మాకు తెలుసిన వారెవ్వరూ విదేశాలనుండి రాలేదు. మేము వారితో కలవ లేదు " అని అన్నాడు హరి. " సరే ఇంకొకటి ఈ మధ్య మీకు జ్వరం, దగ్గు లాంటివి ఏమైనా వచ్చాయా అని అడిగారు" . లేదు అని అన్నాడు హరి.

" దానితో వారు నవ్వుతూ చూడండి హరి , దేశంలో కొన్ని కోట్ల మందికి తల్లి పాలు దొరకక వారు ఎన్నో రోగాల బారిన పడి చనిపోతున్నారు. ఇంకొందరు తల్లి పాలు సరిపోక చనిపోతున్నారు. కానీ అన్ని బాగుండి, అన్ని విధాలా బాగున్న మీలాంటి చదువుకున్న వారు ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం బాగా లేదు. అని అంటుండగానే , ప్రశాంతి బయటకు వచ్చింది. ఆమెని చూసిన వారు చూడు హరి నీకు అంత అనుమానం ఉంటే ఇప్పుడే పరీక్ష చేసి చూద్దాం అని అంటూనే ప్రశాంతి కి ,బాబు ని, హరిని పరీక్షించారు.

ఓ గంట తర్వాత వారికి ఏమి లేదని తేల్చి చెప్పారు. చూడండి హరి మీలో ఎవ్వరికీ ఏమి లేదు.కాబట్టి మీరు ఏమి టెన్షన్ పడకండి, ఇక మీరు కూడా బాబుకి పాలు నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు, ఏమి తప్పు లేదు. అలా పాలు ఇచ్చిన తర్వాత మీరు శుభ్రంగా కడుక్కుoటే చాలు, అంతే తప్పా పాలు ఇవ్వడం వల్ల కరోన రాదు. ఇక ఏమి భయపడకండి అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు.


అప్పటి వరకు ఉగ్గ బట్టుకుని ఉన్న ఏడుపు తన్నుకు రాగా , ప్రశాంతి గట్టిగా ఏడుస్తూ ఓక మూల వెళ్లి కూర్చుంది. హరి ప్రశాంతి భాద ని అర్థం చేసుకున్నట్లు గా లోనికి వేళ్లి, చేతులు కడుక్కొని బాబుని తీసుకొచ్చి ,ప్రశాంతి ఒడిలో పెట్టాడు. అప్పటికె ఆకలి తో ఉన్న చిన్నారి బాబు తన ఆకలి తీర్చే అమృతం కోసం వెతుకుతున్నాడు. తల్లి మనసు ఉప్పొంగి పొగ ప్రశాంతి బంధాలను తప్పించి,అమృతాన్నీ అందించింది.

రెండు రోజులుగా బరువెక్కిన గుండెలు మెల్లిగా కరగసాగాయి. ఆకలితో లోతుకు పోయిన డొక్కలని చూసిన కన్న తల్లి మనసు నీరయ్యింది. వారిద్దరిని అలా చూస్తున్న హరి గుండె చేరువయ్యింది. కరుగుతున్న గుండె బరువును దించుకుంటున్న ప్రశాంతి తన్మయత్వం తో కళ్ళు మూసుకుంది.....

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు