అందరూ మంచివాళ్లే - మీగడ.వీరభద్రస్వామి

all are good

లాక్ డౌన్ సమయంలో నా అలవాట్లు కాస్తా మారిపోయాయి.స్కూల్ కి వెళ్లే పనిలేదు,వాకింగ్ కోసం రోడ్డు మీదకు వేకుమజామునే వెళ్లిపోయే సమయమూ కాదు.అందుకే రాత్రి కాస్తా లేటుగా నిద్ర పోవడం ఉదయం కాస్తా ఆలస్యంగా నిద్రనుండి లేవడం జరుగుతుంది.

కాలింగ్ బెల్ మోగేసరికి మెలుకువ వచ్చింది, గడియారం చూస్తే ఉదయం 6గం.ల45 నిముషాలు."ఇంత ఉదయాన్నే ఎవరొచ్చారబ్బా" అనుకుంటూ వెళ్లి తలుపుతీసాను.ఎదురుగా మా అపార్టుమెంట్ కమిటీ కార్యదర్శి రాజారావ్."ఓహో... మీరా! ఏంటి ఇలా వచ్చారు ఉదయాన్నే"అని కాస్తా ఖంగారుగా అడిగాను. "ఏంటి సార్!ఇదో వింతలా ఉంది మీరు ఇంత లేటుగా లేవడం నేనెప్పుడూ చూడలేదు,వాచ్ మన్ నిద్రనుండి లేవకముందే గేట్ తీసి వాకింగ్ కి వెళ్లిపోయేవారు మీరు ఇప్పుడేటి ఇలా! బడిలేక పోవడంతో కాస్తా ధీమా వచ్చినట్టు ఉంది"అని అన్నాడు నవ్వుతూ..."అవునండి స్కూల్ ఉంటే ఈ టైంకి బస్సులో ఉండేవాడిని,మేము ఉదయం 4గం.ల 30 నిముషాలకే నిద్రలేచి పోయి వుండేవారిమి కదా! ఇక వాకింగ్ కి అంటారా రోడ్డు మీదకు వెళ్లడం లేదు,ఎవరికి వారు" నేనొక్కడినే కదా వాకింగ్ కి వెళ్తున్నాను,సోషల్ డిస్టెన్స్ కి ఇబ్బంది ఉండదు"అని ఆ వాకింగ్ ట్రాక్ మీదకి వెళ్తుండటం వల్ల మళ్ళా మామ్మోలే.. మొమ్మోలు రోజులు కన్నా ఈ లాక్ డౌన్ టైంలోనే రద్దీ ఎక్కువైపోయింది ట్రాక్, అందుకే వాకింగ్ కి అటువైపు పోకుండా మన మేడ మీదే చేస్తున్నాను, కాకపోతే కాస్తా లేటుగా మొదలు పెడుతున్నాను. పనులు ఏమీ లేవు కదా"అని నేనూ అనేసాను నవ్వుతూ...

"సరే సార్ చిన్న విషయం చెబుదామని వచ్చాను. ఫోన్లోనే చెబుదాం అనుకున్నాను, కానీ మీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లో ఉంది"అని అన్నాడు రాజారావ్."పర్వాలేదండీ! విషయమేంటో చెప్పండి!"అని అన్నాను."సార్ ఈ లాక్ డౌన్ టైంలో సంచార జాతుల వారికి, భిక్షాటన చేసుకునే వారికి, కూటికి గతిలేని అనాధులకు భోజనాలు అందివ్వాలని అనుకుంటున్నాం,మనవాళ్ళు అంచనా ప్రకారం మన ఊర్లో అలాంటి వాళ్ళు సుమారుగా ఐదు వందల మంది ఉంటున్నారు,అయితే ఊర్లో మరికొన్ని సంస్థలు కూడా మనలాగే మనం గుర్తించిన వారికే ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు,అందుకే దాతలు అందరమూ కలిసి సమాలోచన చేసుకున్నాం, మన అపార్టుమెంట్ తరుపునుండి రోజుకి యాభై భోజనాలు ఇవ్వాలి, అందుకే మీ అభిప్రాయం, ఆర్ధిక సాయం కోరుదామని వచ్చాను"అని అన్నాడు రాజారావ్.

"ప్రాథమికంగా ఒక్కొక్క ఇంటినినుండి ఎంత డబ్బులు సేకరిస్తున్నారు"అని నేను అడిగాను."రెండు వేలు సార్...ఎందుకంటే మనవి 25 ఫ్లాట్స్ ఆ విధంగా ఒక 50000 వస్తుంది కదా"అని అన్నాడు రాజారావ్. "మంచిది" అంటూ ఇంట్లోకి వచ్చి 2000 రూపాయల పట్టుకెళ్లి అతనికి ఇచ్చాను,"ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి పర్వాలేదు... ఇది మంచి పనే కదా... ఆ వంటా వార్పు నాకు చేతకాదు,అవి మాత్రం మీరే చూసుకోండి"అని అన్నాను నేను "వంటావార్పు మన అపార్ట్మెంట్ మహిళలే చూసుకుంటారు, క్రింద షెళ్లారులోనే వంట ఏర్పాట్లు చేస్తున్నాం... జస్ట్ మీరు అప్పుడప్పుడొచ్చి సమీక్ష చేస్తే చాలు"అని నవ్వేసాడు అతడు." ఒకే సార్ "అని నేను అనగానే" వస్తాన్ సార్ థాంక్స్ సార్" అంటూ అతను వెళ్ళిపోయాడు.

ఇంట్లోకి వచ్చి ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూసాను. హైదరాబాద్ హాస్టల్ లో సింగల్ గా ఉంటున్న మా అబ్బాయి నుండి మీస్డ్ కాల్ ఉంది.వెంటనే వాడికి ఫోన్ చేసి"ఏమిటీ నాన్నా విషయాలు"అని అడిగాను."ఏమీ లేదూ... లాక్ డౌన్ కారణంగా మా హాస్టల్ వర్కర్స్ సరిగ్గా రాలేక భోజనాలు సరిగ్గా ఉండటం లేదని అనుకున్నాం కదా..!ఉదయాన్నే మా హాస్టల్ కేర్ టేకర్ ఫోన్ చేసి నాకు చెప్పాడు,లాక్ డౌన్ వున్నంత వరకూ ఒక కార్పోరేట్ సంస్థ మాలాంటి హోస్టెలెర్స్ కి ఉచితంగా భోజనాలు, టిఫెన్స్ ఏర్పాట్లు చేస్తుందట,నా భోజనం నేరుగా నా డోర్ స్టెప్ కే వచ్చేస్తుందట, ఇక భోజనం బెంగలేదు, రూమ్ ఉంది, వర్క్ ప్రం హోమ్ ఉంది"అని నవ్వుతూ అన్నాడు."మంచి శుభవార్త నాన్నా,హాస్టల్ సరిగ్గా పనిచెయ్యక, బయట హోటల్స్ లేక నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో" అని రాత్రంతా మీ అమ్మా ఒకటే దిగులు పడిపోయింది, పోనీలే ప్రాబ్లెమ్ సాళ్వుడ్ కదా... గుడ్ టెక్ కేర్"అంటూ ఫోన్ పెట్టేసి,ఉదయం నుండి జరిగిన ఎపిసోడ్ని నా వైఫ్ కి చెప్పడం మొదలు పెట్టాను.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు