బ్రహ్మదేవుని వరం - అయ్యగారిసీతారత్నం

blessings from lord brahma

అమ్మని బ్రతిమలాడి ,బ్రతిమలాడి శ్రీకర్ సాయంత్రం ఐదు గంటలకి డాబా మీదికి వెళ్లాడు. ఒక్కసారి డాబా మీద ఆకాశం చూసి అక్కడ వేగంగా పరిగెడుతున్న మబ్బులు ని చూశాడు. ఎంత హాయిగా వెళ్తూన్నాయో! మా అమ్మా నాన్నలా, వాటిని ఎవరు ఎక్కడికి వెళ్లొద్దు అని అడ్డుకో రేమో!
అని అనుకుంటున్న శ్రీకర్,. కుహూ అంటున్న కోకిలమ్మ గొంతు తో పక్కనున్న మామిడిచెట్టు వైపు చూశాడు. కోకిలమ్మ పాటకి తను గొంతు కలిపాడు. కుహు కుహు అంటూ కోకిలమ్మ తో పాడుతూనే డాబా మీద నుండి కిందకి చూశాడు.
కింద లేగదూడ తెల్లగా ఉంది. చాల బుజ్జిగా ముద్దుగా ఉంది.
చెంగుచెంగున గెంతుతూ ఉంది. అప్పుడే జింకపిల్ల భయం లేకుండా హాయిగా వచ్చింది. లేగదూడని, చూసిన జింకపిల్ల "అబ్బ ఎంత బాగున్నావు. ఇంత తెల్లగా ఉన్నావు .ఎప్పుడు పుట్టావు "అంది.
"గంట అయ్యింది. "
"నువ్వు చాలా తెల్లగా ఉన్నావు "అంది మళ్ళీ జింకపిల్ల . ",అవును ,కానీ బయటికి వెళితే ఫ్యాక్టరీ నుంచి వాటి నుండి వచ్చిన నల్లబొగ్గుధూళితో నల్లగా అయిపోతావ్ ,"అని చెప్పింది మా అమ్మ.
"అలాగేమీ, అవ్వదు .
ఫ్యాక్టరీలు ఏమీ లేవు గా అన్ని మూసేసారు లాక్ డౌన్. మనుషులందరికీ కరోనా భయం. అది మన విజయం."అంటూ గబగబా వెళ్ళి పోయింది జింకపిల్ల.

. ఆ మాటలు విని అర్థం చేసుకొన్న శ్రీకర్ కోకిలమ్మని చూసి
"కోకిలమ్మ !లాక్ డౌన్కి మీ విజయం అంటుంది ఏంటి జింకపిల్ల.? 'అని అడిగాడు
ఆ పక్కనే ఉన్న చిలకమ్మ‌" నేను చెబుతాను"అంది.
"చెప్పు, త్వరగా"అన్నాడు శ్రీకర్.

ఒకరోజు మేమంతా విసిగి జంతువులు , పక్షులు, అన్ని కలిసి భూమాత దగ్గరికి వెళ్ళాం. అప్పటికే గంగాదేవి , చెట్లు,అక్కడ ఉన్నాయి.
అందరూ కలిసి మనుషులు వలన మేమంతా బ్రతక లేక పోతున్నామని చాలా దీనంగా చెప్పారు
గంగాదేవి తనని "ఎంతో కలుషితం చేశారు" అని చెప్పింది.
"మమ్మల్ని ఎక్కువగా కొట్టేస్తున్నారు . కొట్టేస్తున్నారు ,బ్రతకడం నివ్వటం లేదు ',అని చెట్లు కూడా చెప్పాయి. "చెట్లు లేక గాలి కలుషితం వలన,మేము బ్రతక లేక పోతున్నా"మని పక్షులన్నీ చెప్పాయి. జంతువులు కూడా "ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు ఎక్కడ ఉండటానికి కూడా వీలు కావడం లేదు "అని దీనంగా చెప్పాయి.
అప్పుడు భూమాత" మనుషులు , మీరు అందరూ కలిసి బతకాలి. మనిషి మిమ్మల్ని జయించేను, అనుకోకూడదు. మీతో కలిసి బతకాలని" బాధగా అందరం బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళదాం ఆయన ఏదో ఒకటి చెప్తారు. అని చెప్పి అందరిని తీసుకొని బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది.

‌బ్రహ్మదేవుడు ఏం పర్వాలేదు మానవుడు గర్వము త్వరలోనే తగ్గిపోతుంది. అంతరిక్షం నుండి ఒక చిన్న క్రీమి కరోనా వస్తుంది. మీరు అందరూ హాయిగా ఉంటారు. ఒక్క మనుషులే తమ తమ ఇళ్ళల్లో జైల్లో మాదిరి ఉంటారు.
గంగ కాలుష్యం పోతుంది చెట్లు హాయిగా చిగురిస్తాయి పక్షులు ఎగురుతాయి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి."అని చెప్పాడు బ్రహ్మదేవుడు.

ఆ మాటలు విన్న శ్రీకర్ ర్ ఇలా ఇంట్లోనే ఉండాలా? క్రికెట్ ఆడుకోమా, స్కూల్ కి వెళ్ళమా,,ఎక్కడికికీ వెళ్ళమా, బీచ్ కి వెళ్ళమా, అయ్యో ఎన్నాళ్ళిలా. ఇంట్లోనే ఉంటాను.. అని,చాలా బాధ పడుతూ…. చాలా సేపు ఆలోచించాడు. స్నేహితులందరికీ చెప్పాడుఫోనులో. అందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. మనము కూడా బ్రహ్మదేవుని కోసం తపస్సు చేద్దాం అని నిర్ణయించుకొన్నారు.
వాళ్ల గాఢమైన తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు మీకు కరువు నాని సంహరించే శక్తి నిస్తా
కానీ మీరు కొన్ని నేను చెప్పినట్లు చేయాలి. అన్నాడు బ్రహ్మ
తప్పకుండా చేస్తాము అని ప్రామిస్ చేశారు." మీ ఇల్లే కాదు ఎంత పరిశుభ్రంగా ఉంచాలి
మొక్కలు ఎక్కువ పెంచాలి. చెట్లు కొట్టకూడదు
గంగానదిని మిగిలిన నదులను కలుషితం చేయకూడదు
వాయు కాలుష్యం తగ్గించి పక్షులన్నీ బతికే టట్టు చూడాలి
జంతువుల పట్ల ప్రేమ పెంచుకోవాలి. ఏవి పడితే అవి తినేయకూడదు.
తప్పకుండా అలాగే చేస్తాం "అని శ్రీకర్ కొత్త తరానికి ప్రతినిధిగా మాట ఇచ్చాడు.
అప్పుడే శ్రీకర్ వాళ్ళ అమ్మ "శ్రీ లేరా, శ్రీ లేరా కలవరిస్తున్నాడు…" అంటూ తట్టిలేపింది.
"భయపడకు రా శ్రీ…"
"అమ్మా! కరోనా..
"అసలు భయం లేదు .ఇప్పుడే, చెప్పారు టీవీలో వ్యాక్సిన్ వచ్చేసిందని, అసలు భయపడకు."
"అవును .బ్రహ్మ దేవుడు వరం ఇచ్చాడు, మేము మాట ఇచ్చాము, భూమాతని పాడు చేయమని"అని చెప్పబోయి అమ్మ నమ్మదు లే , అనుకుని. నిశబ్దంగా ఊరుకున్నాడు…

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు