అది అన్నవరం.రైల్వే స్టేషన్ అంతా రద్ధి గా ఉంది . అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని తిరిగి హైదరబాద్ కు బయలుదేరాలని రైల్వే స్టేషన్ చేరుకున్నాను.
జేబులు తడుముకున్న నాకు మా ఆవిడ ఇచ్చిన రెండు వేలు అలానే భద్రంగా చేయికీ తాకాయి.నేను అన్నవరం వచ్చేటప్పుడు ఆ వీర వెంకట సత్యన్నారాయణ స్వామీ హుండీ లో వేయమని ఇచ్చిన డబ్బులు.
వేయడానికి అవకాశం లేక మాత్రం కాదు.మతిమరుపు అసలే కాదు. మొత్తమ్మీద ఏదో కారణం చేత వేయలేకపోయాను అంతే.
**** ***** ******
అన్నవరం రైల్వే స్టేషన్ చిన్నదే అయిన బాగా ఉంది. స్టేషన్ మధ్యలో ఏర్పరచిన స్వామి వారి హుండీ చాలా హుందాగా ఉంది. కొండ పైన ఏదైనా కారణము చేత స్వాముల వారికి కానుకలు సమర్పించక పోతే , భక్తులకు కల్పించిన మరో అవకాశం.
********* ******** ********
అప్ప్పుడే ఏదో ట్రైన్ వచ్చి వెళ్లినట్లుంది.స్టేషన్ అంతా రద్దీ గా ఉంది.ఇంతలోనే ఆటువైపు నుండి మెట్లు దిగుతూ ఇద్దరు వయసుపైబడిన స్త్రీలు నా దృష్టిలో పడ్డారు.
వయోభారం చేత వారి చేతిలో ఉన్న బ్యాగులను మోస్తూ దిగలేక ఆయాస పడుతున్నారు.నా దగ్గర పెద్దగా సామాను ఏమి లేదు.ఒక బ్యాక్ టాప్ తప్ప. ఎందుకో వాళ్ళకి ఓ చేయి వేసి సాయం చేయలనిపించింది. వెంటనే వాళ్ళు దిగుతున్న మెట్ల వరుస దగ్గరికి వెళ్లి ఓ చేయి వేసి, వాళ్ల సామాను దించడంలో కొంత సాయపడ్డాను.
వాళ్ళు ఏంతో కృతజ్ఞతగా న వైపు చూసారు.
ఇంతలో ఓ పెద్దమ్మ " మా పెద్దోనికి యెప్పటినుంచో చెప్పుతున్నాను ఒక ట్రాలీ కనిపెట్టరా అని , కానీ వానికి తీరికెక్కడిది? ఇక చిన్నదంటావా అదేమో , సరేలే నాయనా నా కష్టాలు నీకెందుకులే." అంటూ నిట్టూర్చింది.
నాకు పాపం అనిపించింది.
రైల్వే స్టేషన్ లో పక్కాగా ఉన్న ఓ షాపులోకి వెళ్లి ఓ ట్రాలీ ధర అడిగాను. రెండు వేల ఐదు వందలు అన్నాడు.
ఎప్పుడు ఎయిర్ పోర్టుల్లో తిరిగి ,బ్రాండ్ ప్రొడక్ట్స్ కొనే నాకు అది చాలా చవక అనిపించింది. కొంచెం నెగోషియేట్ చేసి రెండు వేలకు కొని ఆ అమ్మగారికి గిఫ్ట్ గా ఇచ్చాను.
మొదట వద్దని వారించింది.అభిమానం అడ్డు వచ్చిన అవసరం ముందు తల వంచింది.
కృతాజ్ఞతా భావంతో ఆమె కళ్ళు కొంచెం తడిగా మరినట్లనిపించాయి.
ఇంతలో ఆమె ట్రైన్ రావడం , ఆమె ఆ రైల్లో ఎక్కి వెళ్లడం చకచకా జరిగి పోయాయి. ఆమె వెంట వొచ్చిన మరో ఆవిడ ఆమెకు చేయి ఉపుతూ సాగనంపింది.
ఇప్పుడు స్టేషన్ కొంచెం కాళీ అయ్యింది.నా ట్రైన్ రావడానికి ఇంకా అర గంట టైమ్ ఉంది.
ఆ రెండు పెద్దమ్మ అలాగే నా వైపు చూస్తూ ఉండడం గమనించాను. అమెదగ్గరికి వెళ్లి అలా పక్కన నిలబడ్డాను.
అమెయే కల్పించుకుని ఆ వెళ్లిన ఆవిడ మా అక్క అని. ఆమెకు ఇద్దరు పిల్లలని, ఒకరు బయటి దేశం లో వుంటారు. ఇక అమ్మాయిని ఇదే ఊరికి ఇచ్చారని, అప్పుడప్పుడు ఇలా వస్తూ వుంటుందనే చెపుతూనే
ఆమెకు డబ్బులకేం కొదవ లేదు. కావాల్సినంత ఉందని.అదృష్ట జాతకురాలని .... చెప్పుకుంటు పోతుంది.
ఇంకా ,నాయన ఏదిఏమైన నీవు చేసిన ఉపకారం మరువలేము.మీ రుణం మేము ఉంచుకొము. దయచేసి మీ అడ్రెస్ చెప్తే , మీ డబ్బులు మీకు చేరబడేలా చూస్తాను.
ఆ అమ్మ గారు ఇంకా ఏదో చెప్తారనుకొన్న .ఏదిఏమైనా
ఆమె మాటాడే తీరు, నే ఇచ్చిన గిఫ్ట్ ను ఓక ఋణంగా భావించడం, ఆమె తెలిపే కృతజ్ఞతాభావము అన్ని నన్ను కట్టిపడేశాయి. నేను ఒక చిరునవ్వు నవ్వి నే ఎక్కాల్సిన ట్రైన్ ప్లాట్ ఫారం వైపు కదిలాను...
******* ******* *****
దర్శనం బాగా అయ్యిందా అని ఆతృతగా అడిగింది మా ఆవిడ.
బ్రహ్మాండంగా జరిగింది అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాను.
స్వాముల వారి హుండీ లో వేయాల్సిన కానుకలు వేసి మొక్కు తీర్చుకున్నారా? లేదా మీకసలే మతిమరుపు.
లేదు.
హుండీ లో వేయడం మరచిపోయాను అన్నాను.
అవును మరి ఆ హుండీ లో వేయాల్సిన మొత్తాన్ని ఏంచేసారూ ౼ గొంతులో కొంచెం ఆశ్చర్యం మరి కొంత కోపంతో కూడిన వెటకారం.
ఒక పెద్దావిడకు ట్రాలీ కొని ఇచ్చాను , అని జరిగిందంతా పూస గుచినట్టు చెప్పాను.
పిల్లికి కూడా బిచ్ఛం వేయని నేను , ఇలా చేసానంటే ఆమెకు నమ్మకం కుదరడం లేదు.
బయట చూపించే ఆ కోపం, ఆశ్ఛర్యము, ఉక్రోషం అన్నీ పై పైవనే నాకు తెలుసు.తను ఏంటీ తాను ఎలా ప్రవర్తిస్తుంది, తన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అన్నది నాకు బాగా తెలుసు. అందుకే తన మనసులో ఎలాంటి ఆనంద మయూరి పురి విప్పి శివ తాండవం చేస్తుందో నేను బేరీజు వేసుకోగలను.
ఐతే నేను అన్నవరం వెళ్లేముందు జరిగిన సంఘటన ఒకటి చెప్పాలి.
***** ******* ******
నా వాలెట్లో ఐదు వందల రూపాయల నోటు ఒకటి ఉండాలి .అది కనిపించట్లేదు నీవేమియన తీసావ అని అడిగాను.
అవును అని సమాధాన ఇచ్చింది శ్రీమతి.
ఏంచేశావు అబడిగాను.
పక్క ఫ్లాట్ ఆంటీ అడిగితే ఇచ్ఛాను.
బీపీ సర్రున పైకి ఎగబాకింది.
మనమేమి అగర్బ శ్రీమంతులం కాము, ఇలా డబ్బులు పంచడానికి. వాళ్లకేం తక్కువని ఇంట్లో అందరూ చేతులరా శుబ్రన్గా సంపాదిస్తున్నారు
పైగా ఏ బరువు భాధ్యత లేనివారు.
మా ఆవిడలో నాకు నచ్చిన గుణం సహనం.
నేను అరుస్తున్నా సహనం కోల్పోకుండా నన్ను సోఫా లో కూర్చోబెట్టి గీతోపాదేశం లాంటిదే చేసింది.
"ఆకలి రుచేరగదు.నిద్ర సుఖఃమెరుగదు అన్నారు పెద్దలు. కానీ అవసరం అభిమానమెరుగదని నేనంటాను.
ఇంకా చెప్తూనే,దానం చేయాలంటే మనం గొప్ప ధనవంతులం కావాల్సిన అక్కరలేదు.కానీ దానం చేయాలన్న సంకల్పం ఉండాలి.ఎక్కడో పేపర్లో చదివాను, రోజు రిక్షా తొక్కి జీవితం గడిపే ఓ మనసున్న మంచి మనిషి ప్రతి రోజు ఓ అనాధ ఆశ్రమానికి ఫ్రీగా కూరగాయలు సమకూరుస్తాడాని.
నేనేంటి రిక్షా తొక్కేవాడిని అని తను అంకొనివునున్టే ఆ ఆశ్రమానికి కూరగాయలు సమకూర్చే ఆ మంచి కార్యాన్ని ఇలా వేనోటా వినగలిగేవాల్లమా?
దానం చేసేటప్పుడు దాన గ్రహితులేటువంటి వారో ఎప్పుడు ఆలిచించకు.అడిగే వాడు అనుంజుండైన, అగ్రజుడైన లేక అతిరథమహారధుడైన అతడు ఆ క్షణంలో , ఆ పరిస్థితిలో యచకుడే. అందుకై అవసరంలో 'ఉన్నవాడు ' చెయ్యిచాపి అడుగుతున్నపుడు అతని అవసరాన్ని అర్థం చేసుకోడానికి ప్రతాత్నించు కానీ అతని ఇతర స్థితి గతులగూర్చి వచ్చే తలపులకు తావివ్వకు.
నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నింటికి లెక్కలు రాస్తే కుదరదండి. ప్రతిఫలం అనేది కూడా ప్రభువుల వారి ఇచ్చానుసరమే జరుగుతుంది.
నిజానికి ఆ మాటల్లో అర్థం లేకపోలేదు. ఎప్పుడో చిన్నప్పుడు పదవ తరగతి లో చదువుకున్న బమ్మెర పోతన వారి పద్యం గుర్తుకొచ్చింది.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,బాదాబ్జంబులపైఁ