"రావు గారూ ..రెడీ నా?" విశ్వనాధం ఫోన్ చేసాడు.
"రెడీ నే.. వచ్చేయండి" చెప్పి మా సెక్షన్ ఆఫీసర్ గారి పర్మిషన్ తీసుకుని బయట కొచ్చి నిలబడ్డాను.
కొద్ది నిముషాల్లోనే విశ్వనాథం కార్ వచ్చింది, మరో ఇద్దరు మిత్రులు కూడా వున్నారందులో. నేను కూడా ఎక్కాక 'జలసౌధ' వైపు సర్రుమని దూసుకుపోతోంది.
ఈ రోజు మా స్నేహితుడు, జలసౌధ లో పని చేసే రఘునాథ్ రిటైర్మెంట్. మా కాలనీ లోని ఉద్యోగస్థులం అందరం వాకింగ్ ట్రాక్ లో కలిసినప్పుడు ఒక గ్రూప్ గా ఏర్పడ్డాం. ఏ కార్యక్రమాలైనా యువకులతో పాటు ఉత్సాహంగా ముందు ఉండి నడిపిస్తుంటాం. రిటైర్మెంట్ వేడుకులకు వెళ్లడం అనేది ఆ కార్యక్రమాలలో ఒకటి. మా గ్రూప్ లోని మిత్రులే కాక, వారి వారి ఆఫీసుల్లోని ఇతర స్నేహితుల రిటైర్మెంట్ వేడుకలకు హాజరవ్వటం అనేది మా హాబీ. చాలా ఏళ్ళు పని చేశాక, చివరి రోజు అందరితో కలిసి జ్ఞాపకాలను పంచుకుంటూ వీడ్కోలివ్వటం..అవ్వి వీక్షించటం మా సంప్రదాయంగా చేసుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యాను నేను. ఇప్పుడు వెళ్లే దారిలో మిత్రులం నలుగురం అన్నీ గుర్తు తెచ్చుకోవటం మొదలు పెట్టాం.
***
విశ్వనాథం ఆఫీస్ లో ఒక లిఫ్టు ఆపరేటర్ రిటైర్మెంట్ జరిగింది పోయిన సంవత్సరం. అందరూ లిఫ్టు ఎక్కీ, దిగీ, రోజుకు పదహారు సార్లు తిరుగుతారు తప్ప ఆ ఆపరేటర్ సంగతి అంతగా పట్టించుకోరు. మొదట్లో చేరినప్పుడు వాచ్ మాన్ అతను. ఆఫీస్ కి కొత్త బిల్డింగ్ కట్టాక అతన్ని లిఫ్టు ఆపరేటర్ గా వేశారు. చాలా జాగ్రత్తగా డ్యూటీ చేసేవాడు. పెద్ద ఆఫీసర్స్ మొదలు క్లర్క్ ల దాకా ఎవరు ఎక్కినా వినయంగా నమస్తే పెట్టేవాడు. ఆ రోజు కమీషనర్ గారి తో పాటు విశ్వనాధం బయటికి వెళ్తూ లిఫ్టు ఎక్కగానే, ఆ రోజే అతని పదవి విరమణ సంగతి గుర్తొచ్చి కమీషనర్ గారికి చెప్పాడు "సర్, ఇతను ఇవాళ్టితో రిటైర్ అవుతున్నాడు సర్" అని. కమీషనర్ గారు "అవునా..సాయంత్రం ఒకసారి నాకు గుర్తు చేయండి" అని చెప్పారట.
ఆఫీస్ అయ్యే టైం కి మా మాములు పద్ధతి లో మేం అందరం బొకే లు పట్టుకుని వెళ్ళాం. సెక్షన్ లో అందరూ సమావేశమై వున్నారు. కాస్సేపు అతని గురించి చెప్పి, బొకేలు ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. ఒక చిన్న సైజు ఫంక్షన్ అంతే. చివర్లో కమీషనర్ గారు సడన్ గా వచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేలోపు ఇవి వాడుకోండి అని ఒక కవర్ ఇచ్చి "రోజూ తిరుగుతూనే ఉంటాం కానీ పట్టించుకోము. మనం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా, ఎక్కువ వెయిట్ చేయించకుండా, జాగ్రత్త గా లిఫ్టు ఆపరేట్ చేసే ఇతని పనితనాన్ని అసలు గుర్తించలేదు. మనం మన డ్యూటీస్ బాగా చేస్తున్నాం అంటే ఇలాంటి వాళ్ళు వెనక ఉండి నడిపించబట్టే" అనేసరికి నాకు చాలా ఆనందం వేసింది అయన ఫ్రాంక్ నెస్ చూసి. తర్వాత తన కార్ లో అతన్ని ఇంట్లో దించమని చెప్పి ఛాంబర్ కి వెళ్ళిపోయారాయన. ఆ లిఫ్టు ఆపరేటర్ ఆనందానికి అంతు లేదు. ఈ అనుభూతి అతనికి చివరి వరకు మిగిలిపోతుంది.
అసలు ఇదివరకు ఇలాగే నాన్-ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ రిటైర్ అయితే మర్యాదగా ఆఫీస్ కార్ లో ఇంటి వరకు దించేవారు. తర్వాత ..తర్వాత.. కార్ అనేది మాములు వస్తువై పోయి అందరికి అందుబాటులోకి వచ్చాక ఈ పద్ధతి పోయింది. ఈ రిటైర్మెంట్ తాలూకు భావోద్వేగం చాలా రోజులు వదల్లేదు నన్ను.
చాలా సింపుల్ ఫంక్షన్ ఇదైతే..అట్టహాసమైనది మరొక రిటైర్మెంట్...
సేల్స్ టాక్స్ లో పని చేసే రవికుమార్ గారి రిటైర్మెంట్ కి వెళ్ళాం. సిటీ నడిబొడ్డున పెద్ద ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసారు. లోపలికి వెళ్ళేదాకా దారిపొడుగునా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు .. రవికుమార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు అంటూ.. ఆ రోజు పేపర్ సిటీ ఎడిషన్ లో కూడా బిజినెస్ డీలర్స్ అందరూ శుభాకాంక్షలు చెప్తూ ఫోటోలు వేయించారు. పదకొండు గంటలకు ఫంక్షన్ మొదలైంది. అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఉన్నట్టుండి హాల్ లో అలజడి. ఎమ్మెల్యే శారద గారు వచ్చారు. అందరం ఆశ్చర్యపోయాం. స్టేజి మీదకి వెళ్లి ఆమె మైక్ తీసుకుని "పిలవని పేరంటానికి వచ్చానని ఏమీ అనుకోకండి. ఇటు వెళ్తూ ఉంటే రోడ్ మీద ఫ్లెక్సీ కనపడింది. అది చూసి వస్తున్నాను. రవికుమార్ గారిని ఒకసారి మా బంధువుల బిజినెస్ టాక్స్ విషయమై కలిశాను. వాళ్ళు ప్రభుత్వానికి కట్టవలిసిన టాక్స్ గురించి అంతా నాకు విపులంగా చెప్పి వాళ్ళను ఒప్పించి మొత్తం టాక్స్ కట్టించారు. ఎమ్మెల్యేను అడిగాను కదా అని రూల్స్ ని కాదని ఫేవర్ చెయ్యలేదు. అదీ అయన గొప్ప. అప్పటినుంచి నేను కూడా ఇప్పటి వరకు ఇలాంటి విషయాల్లో తలదూర్చలేదు. అయన నుండి ఒక మంచి పాఠం నేర్చుకున్నాను. ఇది చెప్దామనే ఇలా వచ్చేశాను. క్షమించండి" అని వెళ్లిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్.. నలభై రకాలతో భోజన ఏర్పాట్లు. ఒక పెళ్ళికి ఏమాత్రం తగ్గకుండా జరిగింది ఆ ఫంక్షన్. చాలా రోజుల పాటు ఈ ఫంక్షన్ కూడా అందరి నోళ్ళలో నానింది.
ఇవ్వన్నీ ఒక రకమైతే.. మరొక సరదా-ఫన్నీ రిటైర్మెంట్ ఏంటంటే...
మా గ్రూప్ సభ్యుడు చక్రపాణి ఆఫీసులో హెడ్ క్లర్క్ రిటైర్మెంట్. ఫంక్షన్ ఖర్చు ఆఫీస్ లో అందరు షేర్ చేసుకుంటే భోజనాల ఖర్చు మాత్రం సదరు హెడ్ క్లర్క్ గారు పెట్టుకున్నారు. వాళ్ళ మేనేజర్ గారు జోనల్ మీటింగ్ కి వెళ్లి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. అందుకని ముందు భోజనాలు కానిచ్చి తర్వాత వీడ్కోలు సభ పెట్టారు. అసలే మేనేజర్ గారు భోజన ప్రియులు, బాగా భుక్తాయాసం గా వుంది.. స్టేజి మీద సభికులనుద్దేశించి మాట్లాడుతూ " హెడ్ క్లర్క్ గారు రిటైర్ అవుతున్నారు ఇవ్వాళ.. ఏం చేసారు ఈయన ఆఫీసుకి? నాకైతే ఏం చెయ్యలేదు. మీకేమైనా చేశారేమో నాకు తెలీదు. అయినా రిటైర్మెంట్ ఫంక్షన్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. సరే. ఇంక హ్యాపీ గా ఇంట్లో ఉండచ్చు" అనేసరికి ఆ హెడ్ క్లర్క్ గారి మొహం లో నెత్తురు చుక్క లేదు. ఆయనకి అంత వర్క్ రాని విషయం నిజమే, ఏదో వాళ్ళతోటి వీళ్ళతోటి చేయించి కాలం వెళ్లబుచ్చిన మాట కూడా నిజమే. అయితే మేనేజర్ గారు శుభ్రంగా భోంచేసి త్రేన్చుకుంటూ అందరిలో ఆలా మాట్లాడతారని ఊహించలేదు ఎవ్వరం. మేనేజర్ గారి చేష్టలకి అందరూ నవ్వుకోవటమే. పాపం..చివరి రోజు.. అదే చిన్నబుచ్చుకున్న మొహంతో వెళ్లిపోయాడా హెడ్ క్లర్క్.
ఏం పని చెయ్యక అవమానపడిన కథ పైదైతే ..ఏం చెయ్యకపోయినా ఘనసత్కారం పొందిన మరో కథ...
మరొక మిత్రుని వియ్యంకునిదీ కథ. కాస్త పాత మాట. అప్పట్లో బయోమెట్రిక్ లేదు ఆఫీసుల్లో. సదరు వియ్యంకుడు గారు ఆఫీస్ కి వెళ్ళింది తక్కువ, బయట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంది ఎక్కువ. అయినప్పటికీ అయన తన శక్తీ కొద్దీ ఫంక్షన్ బాగా గ్రాండ్ గా ఏర్పాటు చేయించుకున్నారు. పేరుకు ఆఫీస్ వాళ్ళు చేసారు అని చెప్పారు కానీ, ఖర్చంతా ఈయనే పెట్టుకున్నాడు. వియ్యంకుడు గారిని, వియ్యపురాలు గారిని ఎర్రని ఫంక్షన్ కుర్చీల్లో కూర్చోపెట్టి దుశ్శాలువలు, గజమాలలు కప్పారు. అయన తెలివితేటల్ని, చాకచక్యాన్ని వేనోళ్ళ కొనియాడారు. చుట్టాలు, పక్కాలు అందరూ కదిలి రాగా, మహా వైభోగంగా తరలి వెళ్లారు ఇంటికి.
***
ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్స్ చూశాం మా సర్వీస్ లో. ఒక్కక్కటి ఒక్కక్క రకం. మాట్లాడుకుంటుండగానే రఘునాథ్ ఆఫీస్ కు చేరుకున్నాం. ఇదివరలో రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫీస్ అయిపోయాక సాయంత్రాలు చేసేవారు. ఇప్పుడు పద్దతి మారిపోయింది. పొద్దుటినుంచే ఫంక్షన్ మొదలు. మధ్యాహ్నం అందరికి లంచ్. మూడింటి కల్లా అందరూ జంప్ ఫంక్షన్ లో అలసిపోయి. రఘునాథ్ మాత్రం ఆఫీస్ టైంలో వద్దు, సాయంత్రం పెట్టమన్నాడని తెల్సి అభినందించాను. లేడీస్ కి లేట్ అవుతుందేమో అనే సందేహంతో కాస్త ముందుగానే మొదలు పెడుతున్నారు ఆఫీస్ వాళ్ళు.
మేం టెర్రస్ పైకి వెళ్లేసరికి స్టేజి రెడీ చేసి వుంది. కొద్దిసేపట్లోనే సభ స్టార్ట్ చేశారు. ముందుగా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మాట్లాడారు. అందరూ రఘునాథ్ గురించి గొప్పగా చెప్పేవాళ్ళే. రఘునాథ్ సిన్సియర్ వర్కర్ అని మా అందరికీ తెల్సిన విషయమే అయినా అందరి నోటా వినేసరికి ఆనందం అనిపించింది. ఇంకాస్సేపటికల్లా మేం వూహించలేనంత జనం వచ్చారు. రఘునాథ్ అంతకుముందు పని చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫీసుల్లో వాళ్ళందరూ వచ్చారు. ఒక్కక్కరూ రఘునాథ్ ఎంత మంచి ఉద్యోగో చెప్తుంటే బిత్తరపోవటం మా వంతైంది.
సాధారణంగా అన్ని ఫంక్షన్స్ లోనూ రిటైర్ అయ్యే వ్యక్తిని పొగడటం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ కథ వేరుగా వుంది. వాళ్ళని ఎవరూ పిలవలేదు. స్వయంగా రఘునాథ్ మీద గౌరవంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సారాంశం ఏంటంటే.. ఏనాడూ ఎవరి బిల్లులు ఆపలేదు, పైపెచ్చు ఏమి తప్పులున్నా పిలిచి మరీ దిద్ది పంపేవాడు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఖచ్చితం గా టైం కి శాలరీ బిల్స్ వేసేవాడట. పరాయి సొమ్ము పైసా ఆశించలేదు. కష్టాల్లో ఉంటే ప్రతి ఒక్కరికి చేతనైనంత సహాయం చేసేవాడట. ఆయన్ని చూసి ఎంతో మంది మోటివేట్ అయ్యారట గవర్నమెంట్ సర్వీస్ అంటే ఇలా చెయ్యాలి అని. రఘునాథ్ అంటే ప్రతి ఆఫీసర్, ప్రతి ఇంజనీర్ గౌరవించేవాళ్లట... అజాతశత్రువట....స్వయానా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ క్యాడర్ మనిషి హాజరయ్యాడంటే అర్ధం చేసుకోవచ్చు. అటెండర్ నుంచి చీఫ్ ఇంజనీర్ దాకా అందరూ రఘునాథ్ రిటైర్ అవుతున్నందుకు బాధపడిన వాళ్లే. రఘునాథ్ సర్వీసెస్ ని కన్సాలిడేటెడ్ బేసిస్ మీద రెన్యువల్ చెయ్యమని గవర్నమెంట్ కు రాస్తానన్నారు చీఫ్ ఇంజనీర్ గారు. చివరికి .. చంటి పిల్లల తల్లులున్నారు ఆఫీసు స్టాఫ్ లో, వాళ్ళు కూడా స్వచ్ఛందం గా చివరి వరకూ కదల్లేదు.. రాత్రి ఎనిమిది అయినా ఎవరూ కిక్కురుమనట్లేదు. భోజనం ఖర్చు చీఫ్ ఇంజనీర్ గారు భరించారు.
మొత్తానికి మా మిత్రుడైన రఘునాథ్ చిన్న మచ్చ కూడా లేకుండా, చాలా గౌరవప్రదంగా గవర్నమెంట్ సర్వీస్ నుండి పదవీ విరమణ చేశాడు. ఈ కాలం వాళ్ళు రఘునాథ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది. నాకు మటుకు నేను కూడా సిన్సియర్ గానే వర్క్ చేస్తున్నప్పటికీ, కాస్త నోటి దురుసు వల్ల నా కింద స్టాఫ్ కొంత మందిని బాధ పెట్టిన సందర్భాలున్నాయి. అవి గుర్తొచ్చి ఇకపై నన్నునేను సంస్కరించుకోవాలని, అవసరమైతే మంచిగానే చెప్పి పని చేయించుకోవాలి అని నిర్ణయించుకుని కారు ఎక్కాను.