కార్తీక్ చురుకైన పిల్లవాడు .తల్లిదండ్రుల పోషణలో అన్ని విధాలుగా ఆరోగ్యంగా పెరుగుతున్నాడు. మంచి ఆహారం తో పాటు ,కాలంతో పాటు దొరికే పళ్లు పుష్కలంగా తింటాడు .అందుకే పుష్టిగా ఉండి అందరిలోనూ అందగాడిగా కనిపిస్తాడు .ఉదయం సాయంత్రం తండ్రితోపాటు గ్రౌండ్ కు వెళ్లి ఇష్టమయిన ఆటలన్నీ ఆడతాడు.ప్రతి అదివారం స్విమ్మింగ్ పూల్ లో గంటసేపు ఈతకొడతాడు .అంతా క్రమ శిక్షణ తో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు ,ఇంతకీ కార్తీక్ వయసు తొమ్మిది _పది సంవత్సరాల మద్య వయసు గల పిల్లవాడు .అందరూ అతని పట్ల ఆకర్షితులు కావడానికి అసలు విశయం ,చదువులో అతనెప్పుడూ క్లాసు ఫస్ట్ .క్లాస్ టీచరు దగ్గరనుంచి హెడ్మాస్టారు వరకూ అందరూ అతనిని ప్రశంసించే వాళ్లే .అలా అని కార్తీక్ ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించేవాడు కాదు . అలా అని కార్తిక్ పెద్ద కాన్వెంట్ స్కూలు లో చదువుతున్నవాడు కాదు .తన ఉరి పోలి మేర్ల లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. శెలవు రోజులు తప్ప ,ఎప్పుడూ బడి మానేసిన సంఘటనలు లేవు . ఎ ప్పుడూ ,ఉత్సాహంగా ,ఉల్లసంగా ,నవ్వు ముఖంతో ఉండే కార్తిక్ ,ఈ మధ్య అంత హుశారుగా ఉండడం లేదు .అందరితోటీ కలిసి ఉత్సాహంగా తిరగటం లేదు .ఏదో కోల్పోయిన వాడిలా బెంగ గ ఉంటున్నాడు .ఈ విశయం అటు బడిలోనూ ,ఇటు ఇంట్లోనూ అర్థం కాకుండా పొయింది.ఏదయినా అడిగితే విసుక్కుంటున్నాడు ,నిర్లక్ష్యం గా ఉంటున్నాడు ఇది ఇంట్లో తల్లిదండ్రులకి ఆందోళన కలిగించటం మొదలు పెట్టింది . ఇది ఇలావుండగా ఒకరోజు బడికి పోనని మొండికేసాడు .ఇంట్లొనే ఎవరితో మాట్లాడకుండా మౌని అయిపోయాడు.ఇంట్లో వాళ్లు ఏమి అడిగినా పెదవి ఇప్పడం లేదు .ఎంతో బుజ్జగించి బ్రతిమాలిన తరువాత ,సైకిలు కొనిస్తానని తండ్రి ప్రామిస్ చేసిన తరువాత కార్తిక్ పెదవి కదిపాడు . " ఏంటి నాన్న ..ఎందుకలా ఉన్నావ్ ?" " బడికి వెళ్లబుద్ధి కావడం లేదు " " అదే ..ఎందుకని ?" " అందరూ ..నన్ను అసహ్యంగా చూస్తున్నాను . దూరంగ వుంటున్నారు ,తప్పించుకు తిరుగు తున్నారు " అన్నాడు ఏడుపు ముఖం పెట్టిన కార్తిక్ . " అరె ..అలా ఎందుకని ?"అత్రంగా ప్రశ్నించాడు కార్తిక్ తండ్రి వినోద్. " నా ..నో రు వాసన వస్తుందట..నన్ను భరించలేక పోతున్నారట " అన్నాడు కార్తీక్ బిక్కమొహం వేసి " మరి ఇన్నాళ్లూ మాకు ఎందుకు చెప్పలేదు " " మీరు కూడా అసహించు కుంటారని .." అన్నాడు కార్తిక్ . " తప్పు నాన్నా ..అలా అనుకోకూడదు.అది నీకే కాదు ...ఎవరికయినా రావచ్చు.కారణం తెలుసు కుంటే ..అది ఇట్టే తగ్గిపోతుంది .సాయంత్రం డాక్టర్ని కలుద్దాం.ఇది పెద్ద సమస్య కాదు !" అన్నాడు తండ్రి వినోద్ . అనుకున్న ట్లుగానే ,తండ్రి కొడుకులు సాయంత్రం పూట పీడో _డెంటిస్టు (పిల్లల దంతవైద్యుడు )ను కలిసి విశయం అంతా పూసగుచ్చినట్టు చెప్పారు . వాళ్ళు చెప్పిన దానికి డాక్టరు ఒక పొడినవ్వు నవ్వి విశయం వివరించి ,అరగంటలో చికిత్స చేసి పంపించాడు .కార్తిక్ ఎంతో తృప్తిగా నవ్వుతూ క్లినిక్ నుండి బయటి కి వచ్చాడు.అతని నో రు ఇప్పుడు ఎంతో ఫ్రెష్ గ ,హాయిగ వుంది .అదేవిశ యం ,తండ్రికి చెప్పా డు కార్తిక్. ఇంతకీ జరిగింది ఏమిటంటే ,కార్తిక్ దౌడలలో రెండువరసల పళ్లు ఉన్నాయి .ఊడవలసిన పాల పళ్లు ఊడిపోకుండా ,రావలసిన స్థిరమైన దంతాలు వచ్చేసి మిశ్రమ దంతాలు ,రెండు వరుసల్లో ఉండి ఆహర పదార్దాలు వాటిమద్య చిక్కుకు పొవడం వల్ల నాటినుండి దుర్వాసన రావటం మొదలయింది. దానికి అవసరమయిన చికిత్స నొప్పిలేకుండా చేశారు ,డాక్టరు గారు . ఇప్పుడు కార్తిక్ ఎప్పటి కార్తిక్ మాదిరిగానే సంతోషంగా స్కూలు కి వెళ్లడం మొదలు పెట్టాడు . తల్లిదండ్రులు హాయిగా ఉపిరి పీల్చు కున్నారు .