మిత్రుడు -ఒక బహుమతి - Bhaskar Kantekar

Friend -a gift

"క్రిష్ మీరు , మీ అకాడమిక్ ప్రొఫైల్ , మీరు చదివిన ఉన్నతమైన విథ్య ఇవన్నీ చాలా బాగున్నాయి.అయినప్పటికీ ఫైనల్ గా మేనేజ్మెంట్ చూసేది పెర్ఫార్మెన్స్ ని అంకెలలో" అంటూ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను చేతి కందించాడు హెచ్చార్ మేనేజర్.

అతని ఉద్దేశ్యాన్ని గ్రహించి, "యెస్ మిస్టర్, గాట్ ఇట్ " అంటూ చిరునవ్వుతో అతని దగ్గర నుండి ట్రాన్స్ఫర్ ఆర్డర్ హార్డ్ కాపీ తీసుకొని బయటకు వచ్చాను.

ఏదిఏమైనా,ఒకింతకి హైద్రాబాద్ బదిలీ అయినందుకు సంతోషంగా ఉంది.
####$##$$$ ########

కారు నీడలో పార్క్ చేసి , గేటు తీసుకొని లోపలికి వెళ్ళాను.అదొక చారిటీ హోమ్ .వేసవి సెలవులు కాబోలు,ఎవరు లేరు.ఆఫీస్ గది మాత్రం తెరిచే ఉంది.తలుపు తట్టాను. ఒక ముసలతను, డోర్ తెరిచాడు.తన కళ్ళజోడు సరి చేసుకుంటూ,'ఎవరు మీరు , ఏం కావాలి? " అని అడిగాడు.

" నా పేరు క్రిష్.మాది హైద్రాబాదు.ఇక్కడ మోహన్ ను కలవడానికి వచ్చాను" అన్నాను.

తన నుదురు ముడుచుకుంటు " ఇక్కడ మోహన్ అని ఎవరు లేరు.ఇంతకీ ఏ మోహన్." మళ్ళీ పెద్దాయన ఎదురు ప్రశ్న వేసాడు.

,"స్నేహ నిలయం, లయోల హౌస్ , సూర్య పెట్ , ఇదే అడ్రస్ ఇచ్చాడే, ఆశ్చర్యపడుతూ మళ్ళీ అడిగాను.

చూడు బాబు ఈ ఆఫీస్ లో నేను గత పదేళ్లనుండి పని చేస్తున్నాను.ఇక్కడ మోహన్ అనే వాళ్లేవరు లేరు.

ఆశ్చర్యం, ఒకింత అసహనం. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. దాహంతో గొంతు ఎండిపోతుంది."సార్ కొంచెం మంచి నీళ్ళు ఇప్పిస్తారా " అని అడిగాను.

లోపల ఎవరితోనో మాట్లాడి నీరు తీసుకొని రమ్మన్నాడు ఆ పెద్దమనిషి.

ఒకామె వాటర్ బాటల్ తీసుకొని బయటకు వచ్చింది. ఆ చారిటీ లో వంటమనిషి అనుకుంటాను.సుమారు నలబై ఐదేళ్ళుండొచ్చు.బాటల్ చేదికందిస్తూ ఎవరి కోసం వచ్చారు బాబు అని ఆరాతీసింది.

వాటర్ బాటిల్ తీసుకొంటూ ,'మోహన్ కోసం' అన్నాను.
బాటిల్ చాలా చల్లగా ఉంది.అప్పుడే ఫ్రీజ్ లోంచి తీసింది కాబోలు.

మోహన్ పెరు వింటూనే, "మోహన్ అంటే అదే ఉంగరాల జూట్టూ, కళ్లద్దాలబ్బాయి,అతనే న ?" అంది.

"అవును మీకు తెలుసా ?"ఆతృతగా అడిగాను.

ఆ పెద్ద మనిషి మళ్ళీ కలుగచేసుకొని "ఏ కళ్ళద్దాలు ,ఏ ఉంగరాల జుట్టు ,ఎవరీమోహన్ " అని అడిగాడు ఆవిడని, తన కళ్ళజోడు మరోసారి సరిచేసుకుంటూ.

ఆమె బాటిల్ ను నా చేతిలోంచి తీసుకొంటూ "నీకు తెలియదు సార్. ఇక్కడ మోహన్ అనే ఓ కుర్రాడు ఉండేవాడు.అతను సిటీ లో డిగ్రీ చదువుతుండేవాడు"

నేను మధ్యలో కల్పించుకొని" ఆ యెస్ కరెక్ట్ అతనే.అతను నేను కలిసి ఒకటే కాలేజిలో డిగ్రీ చదివేవాళ్ళం" అన్నాను.

మళ్ళీ ఆవిడే చెప్పడం మొదలు పెట్టింది,"మోహన్ పక్కన ఉన్న ఓ చిన్న పల్లెటూరిలో ఉండేవాడు. వాల్ల ఊరిలో , అప్పట్లో పోస్ట్ ఆఫీస్ కూడా ఉండేది కాదట.అందుకని తన అడ్రస్ గా మన ఆఫీస్ అడ్రస్ ఇచ్చేవాడు. ఇది ఇప్పటి మాటకాదు. కనీసం పదిహేను ఇరవై ఏళ్ల కిందటి విషయం. తన కాల్ లెటర్స్ కి పల్లె అడ్రస్ ఇస్తే, అవి రావని, ఒక వేళ వచ్చినా అవి సమయం గడచిన తరువాత వస్తాయని.అందుకని అప్పటి మన హోమ్ వార్డెన్ ను కలిసి తనని ఈ అడ్రస్ ను ఉపయోగించుకొంటానని అడిగాడు"

"ఈ హాస్టల్ తో అలా మొదలయిన అతని అనుబంధం,చాలా కాలం వరకు సాగింది. అప్పుడప్పుడు వస్తు ఉండేవాడు.
తరువాత ఎమయిందో , కనిపించడం మానేశాడు."

అవును ఆవిడ చెప్పింది కరెక్టే.

మళ్ళీ ఆవిడే కల్పించుకొని చెప్పింది. "మోహన్ చాలా మంచి వాడు. ఎక్కువగా మటాడేవాడు కాదు.కానీ సాయకారి. డిగ్రీ లో ఉన్నప్పుడే పెళ్లయింది.అయితే ఆ విషయాన్ని ఎవరితో చెప్పేవాడు కాదు.----, తన ఇంటి చిరునామా ఎవరికి ఇచ్చే వాడు కాదు.తనకు పెళ్ళైన విషయం , ఒక కూతురుకూడా ఉన్న విషయం రహస్యంగా ఉంచేవాడు.వీటన్నిటిని అప్పటి వార్డెన్ తో చర్చిస్తూ ఉండేవాడు. ఆర్థికంగా వెనుక బడిన కుటుంభం అయినప్పటికీ అతని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండేవి.. "

ఇంకేదో చెప్పుకుంటూ వెళ్తుంది.మొత్తంమ్మీద్ద, ఆమె అతను ఉండే ఊరు పెరు చెప్పింది.

సూర్యపేట కు పది మైళ్ళ దూరంలో ఒక చిన్న కు గ్రామము, మోహన్ ది. సూర్యపెట్ నుండి ఆ గ్రామానికై బయలుదేరాము.

మరి ఇంతకీ మోహన్ ఎక్కడా?

డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ మేమిద్దరం ఎప్పుడు కలుసుకోలేదు.లెటర్స్ ద్వారానే మటాడుకొనేవాల్లం.

ఇక్కడ మోహన్ గురించి ఒక రెండు మాటలు చెపుతాను.

మోహన్, డిగ్రీలో నా క్లాసుమేటు. క్లాస్మెటే కాదు నా రూమ్మేట్ కూడా. ఇద్దరిది ఒకటే హాస్టల్.

నాకు ఎంతో సాయం చేసేవాడు.డిగ్రీ చదువుతున్నప్పుడు మరియు డిగ్రీ తరువాత కూడా.

ఒకసారి పరీక్ష ఫీ కట్టాలంటే డబ్బులు లేకుంటే. ఫీ కూడా పెద్ద అమౌంట్ ఏమి కాదు. కానీ ఆ రోజుల్లో అదే మాకు చాలా పెద్ద రకం. ఆ విషయాన్ని లెట్టర్ ద్వారా మోహన్ కు తెలియచేసాను. ఆ రోజుల్లో వాట్సాప్ ,మెయిల్స్ లేవనే చెప్పాలి.ఉన్నా మాకు అందుబాటులో ఉండేవి కాదు.

అంతే, ఒక వారం తిరిగే లోపు మని ఆర్డర్ పంపించాడు.

ఒక మిత్రుడు తనకు డబ్బు అవసరం ఉందని లేఖ రాస్తే, స్పందించి నిజానిజాలను కూడా చూడకుండా అడిగినంత డబ్బును పంపిచ్చాడంటే ,అతడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చును. అది అతనికి నా మీద ఉన్న నమ్మకం.

ఇంకో విషయం ఏమిటంటే మళ్ళీ ఎప్పుడు తను ఆ డబ్బుల గురించి ప్రస్తావించలేదు. కాలగమనంలో , ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరిగాను.మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.చాలా గ్యాప్ వచ్చింది. కానీ నా మనసులో మాత్రం అతనికి ఇవ్వాలసిన డబ్బుల గూర్చి, ఓ తీరని బెంగ ఉండేది నాకు.

ఇరవై ఏళ్ళ తరువాత, నాకు హైద్రాబాదు బదిలీ అయ్యింది,ఉద్యోగా రీత్యా వివిధ ప్రదేశాలు తిరగాల్సి వచ్చేది. ఒకానొక సందర్భంలో ,ఈ పెలుసుబాటును మోహాన్ ని కలుసుకోటానికి ఉపయోగించుకున్నాను..

అదే అన్వేషణలో ముందుకు సాగుతోంది కారు.

కారు ఇరువైవుల పంట పొలాల మధ్య లోంచి దూసుకు పోతుంది.

మోహన్ ఇప్పుడెలా ఉన్నాడు.ఈ ఊళ్ళోనే ఉన్నాడా, లేక మరెక్కడికైనా పోయాడా.ఊళ్ళో లేకుంటే ,కనీసం నేను తనని కలుసుకోవడానికి చేసిన ప్రయత్నమైన అతని చెవిన పడితే చాలు.నేను ఋణవిముక్తున్నయినట్లే.

ఈ వూరు భౌగోళిక పరిస్థితి చూస్తే , ఎక్కడొ విసరిపారేసినట్టు సిటీ కి చాలా దూరంగా వుంది. ఇంత రిమోట్ ఏరియాలో నివసించే మనుషుల జీవన గతుల్లో పెద్ద ఎదుగుదల ఏముంటుంది?

మోహన్ , ఒక వేళ ఇదే ఊరిలో ఉన్నాడంటే, ఆతని ఆర్థిక పరిస్థితి కూడా ఆ మాత్రంగానే ఉందేమో.లేదంటే ఒక వేళ మంచి స్థితిలో ఉంటే తాను మాత్రం తన మకాంను సూర్యాపేట కైనా మార్చి ఉండేవాడు.

సూర్య పేట నుండి ఆ ఉరుకి దూరం సుమారు పది మైళ్ళు. పది మైళ్ళ ప్రయాణం సునాయాసంగా జరిగిందంటే , ఆ రోడ్డు యొక్క గొప్పతనమే. గ్రామంలోకి కూడా ఇంత చక్కటి రోడ్లు వేసి ఉన్నాయంటే, ఇది చిన్న విషయమేమీ కాదు.

మొత్తంమీద ఆ ఊరు పొలిమేర దాటి ఊరులోకి ప్రవేశించాము.ఊరులోని అన్ని వీధులు సిమెంటు రోడ్లే. ఎక్కడ చెత్త చెదారం లేదు. మురుగు నీటి కాలువలు. డ్రెస్ కోడ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికులు. తడి పొడి చెత్త లు వేరు వేరుగా వేసుకునేందుగా వీలుగా ప్రతి ఇంటిముందు చెత్త బుట్టలు. చెత్త బయట వేస్తే జరిమానా అన్న హెచ్చరిక బోర్డులు.ఇంకుడు గుంతలు....

అసలు ఇది 'ఒక పోస్ట్ ఆఫీస్ కూడా లేని 'ఊరు అంటే ఎవరునమ్మరు. ఒక చిన్నపాటి మున్సిపాలిటీ లాగా ఉంది.

ప్రతి ఇంటికి మంచి నీరు , వంట గ్యాస్ అన్ని ఉన్నట్లున్నాయి,ఊరులోకి వెళ్తున్నా కొద్దీ నాలో ఉత్సుకత పెరగ సాగింది.కొంచెం ముందుకి వెళ్లి, కారుని అపి దారిన పోయే ఒకతన్ని పిలిచి మోహన్ ఇల్లు గురించి అడిగాను.

ముందుకెళ్తే , ఓ పెద్ద వాటర్ ప్లాంట్ వస్తుంది, దాని పక్కనే ఒక పార్కు, దాన్ని దాటగానే రెండో ఇల్లు వాళ్లదే అని చెప్పాడు

కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాను . వాటర్ ప్లాంట్ దాటగానే అతను చెప్పినట్టు పార్కును సమీపించాను.అబ్బో ఏమీ మేంటినేన్సు, సిటీ లో ఉన్న పార్కులు దీనిముందు దిగదుడుపే.

ఇంతకీ మోహన్ ఇప్పుడెలా ఉన్నాడో..ఎప్పుడో డిగ్రీ చదువుకొనే రోజుల్లో చూసాను. మనిషిలో ,ముఖంలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి.ఇంతకీ మేము,ఒకరినొకరం గుర్తుపడతామా?!

నాలో ఎందుకో తెలియని వత్తిడి. ఉద్రేకం.ఉగ్వేదం.

### #### #### #####

ఇల్లు పెద్దదే ఈ మధ్యనే కట్టినట్లు ఉంది. గేటు తీసుకుని లోనికి వెళుతుంటే రెండు వైవులా పొడవాటి కొబ్బరి చెట్లు.

ఓ చిన్న పాటి బంగళా.

కారు అలా పార్క్ చేసి, డోర్ వేసి ,అక్కడ నిలబడి ఉన్న మోహన్ వైవుకు చూసాను.

తెల్లటి లుంగీ, క్క్రీమ్ కలర్ టీ షర్ట్, కొద్దిగా మెరిసిన గడ్డం. అచ్చం, కాలేజీ రోజుల్లో ఉన్నట్టే ఉన్నాడు. పెద్ద మార్పు ఏమీ లేదు.అదే వంగారాల జుట్టు, కళ్ళజోడు.

నన్నుచూసి నిశ్చేస్టుడై అలాగే నిలుచున్నాడు. కళ్ళల్లో ఆనందం.

రాలకుండా కళ్ళల్లోనే నిలిచిపోయిన ఆనంద బాష్పాలు.

గద్గద స్వరంతో " ఏమీరా క్రిష్ ఇదేనా రాక" అంటూ ఆత్మీయ ఆలింగనం.

"నాకు తెలుసురా, ఎప్పటికైనా నీవు వస్తావని. నా నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు.నా నమ్మకం గెలిచిందీ అంటూ నా చేయిపట్టుకుని హాలులోకి తీసుకెళ్లాడు.

పెద్ద హాలు, నీటుగా అమర్చిన సోఫా, ముందు పెద్ద టీవీ. అలంకారప్రాయంగా అమర్చిన వివిధ వస్తువులు.

నేను ఊహించినట్లు -ఆ ఊరు లేదు.మోహన్ పరిస్థితులు లేవు.కనిపించడానికి సామాన్యంగానే ఉన్నా కానీ,ఆ ఇల్లు , ఆ హాలు అవన్నీ చూస్తూ ఉంటే నాకంతా విచిత్రంగా ఉంది.

మోహన్ ను చూసిన తరువాత ఈ జన్మ కిది చాలు అనుకున్నంత తృప్తి.

శ్రీకృష్ణుడిలా ఉహించుకొంటు, కుచేలునీ దగ్గరకు వెళ్తున్నాను అనుకున్నాను కానీ నేనే కుచేలుడినన్న భావం నాలో కలగసాగింది.

నేను అతనికి వేల కొద్దీ కానుకలు ఇవ్వక్కర్లేదు.నేనేమి కృష్ణ పరమాత్ముని కావక్కర్లేదు.కుచేల పరీక్షలు మాకొద్దు.

ఇక పక్కనే ఉన్న వారందరికి నన్ను పరిచయంచేసాడు.

అతని జీవితంలో జరిగిన మలుపులు తెలుసుకోవాలని ఉంది.
తనది చిన్న పల్లటూరని, రవాణా సదుపాయం కూడా ఉండదని, చాలా వెనుకబడిన కుగ్రామమని చెప్పేవాడు.

మరి ఈ గ్రామాభివృద్ధి మరియు మోహన్ జీవిత విశేషాలు గురించి తెలుసుకోవాలని ఉత్సుకతగా ఉంది.

చాలా దూరం నుండి ఎండలో పడి వచ్చావు, ఎప్పడు భోంచేసావో ముందు ఫ్రెష్ అయ్యి భోజనానికి పదా,టవల్ చేతికి ఇచ్చి వాష్ రూమ్ చూపించాడు.

ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. వాల్లవిడ వడ్డిస్తుంది.

మేము వడ్డించుకుంటాములే , అని చెప్పి తన భార్య ను అక్కడినుండి పంపించాడు.


అంతరంగ మెరిగిన ఆవిడ అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది


ఎన్నో ఏళ్ల తరువాత కలుసుకున్న మిత్రులకు స్పేస్ కావాలి గదా.ఒకరి గురించి ఒకరు మటాడుకోవాలి, ఎన్నో కబుర్లు, ఇంకా ఏవేవో విషయాలు , విశేషాలు చర్ర్చిస్తేగాని మనసు కుదుట పడదు.

ప్లేటులో అన్నం వడ్డిస్తూ మొహన్ , "అన్ని మనం అనుకున్నట్లుగా జరగవు".

అదేంటీ మోహన్ నా ఒక్కడికే పెడుతున్నావు, నీ వు తినవా, అని అడిగాను.

బదులుగా 'లేదురా !నేనిప్పుడే తిన్నాను.ఈ మజ్జిగ తాగుతూ నీకు కంపనీ ఇస్తాలే ' అన్నాడు మోహన్.

మజ్జిగ తాగుతూ చెప్పడం మొదలు పెట్టాడు మోహన్ "లాగేంత వరకు లాగి , ఇంకా తెగెటటట్టుంది అనుకున్నప్పుడు వదిలివేయడమే ఉత్తమం".

మొదట మోహన్ దేని గురించి చెపుతున్నాడో అర్థం కాలేదు.

"చదువు చదివి అంటే లాగేంత వరకు లాగాను, అటు తరువాత నా కర్థమయ్యింది , నేను పొందాలనుకున్నది నాకున్న ఈ కొద్దీ పాటి జ్ఞానంతో సాధించలేను ,అందుకే ఒక నిర్ణయానికి వచ్చి , ఓ కొత్త ప్రయోగం చేయాలను కున్నాను.."

నాకు కొంచెం బోధపడింది.

"సరైన సమయంలో కాల్ లెటర్స్ అందక , అందినా అవి సమయం దాటిపోయినా తరువాత అందడటం. అప్పట్లో
మా వూరిలో పోస్ట్ ఆఫీస్ లేదు , ఆ గతుకుల రోడ్డు, ఓ రోజు హైద్రాబాద్ నుండి సూర్యాపేట కు చేరుకునే వరకు చాలా చీకటి పడింది. ఇంటికి రావడకనికి వీలు కాక లయోలా హౌస్ లోనే పడుకున్నాను. అలాంటి సంఘటన లెన్నో నన్ను డిఫరెంట్ గా ఆలోచింప చేసాయి"


మజ్జిగా మొత్తం తాగి, కాళీ గ్లాసును టేబుల్ పైపెడుతూ చెప్పసాగడు మోహన్ ," మా పల్లెటూరును మార్చాలంటే నేనేమి చేయాలి. రూట్ కాజ్ ఎనాలిసిస్ చేస్తే వీటన్నిటికీ మూల కారణం నిరక్ష్య రాస్యతే అన్నది నిజం.

మాకు కావలసినది కాళీ అక్షర జ్ఞానం కాదు, అవసరాల జ్ఞానం. ఏ అవసరానికి ఏ స్విచ్ నొక్కలో తెలియాలి"అంటూ తన చూపుడు వేలును కణత దగ్గర పెట్టుకుంటూ చెప్పాడు.


నా గ్లాసులో త్రాగే నీరు పోస్తూ, మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు మోహన్ "మా ఊరుకి ముందు కావాల్సింది గుర్తింపు. ఊరికి గుర్తింపు రవాలంటే రాష్ట్రం కాదు దేశం మొత్తం ఊరి వైపు చూడాలి. ఊరికి గుర్తింపు రావాలంటే ఊరిలో ఎవరో ఒకరు ఒక గుర్తింపు పొందాలి."

"దానికోసం ఒక గుర్తించ దగ్గ పని చేయాలి."

భోజనం పూర్తి చేసి, సింక్ లో చేయి కడుక్కుని పక్కనే ఉన్న టవల్ తో చేయి తుడుచుకుంటూ మోహన్ చెప్పేది శ్రద్ధగా వినసాగాను.

"దీని కోసమే ఒక చిన్న ప్రయోగం చేసాను.ఆ ప్రయోగం నా కూతురు మౌనిక మీద చేసాను".

"దీంట్లో నా వ్యక్తిగత స్వార్థం యాద్రుచ్చికమే!"

"ఇదిగో చూడు ఆ అలమారాల్లో పుస్తకాలు, అంటూ పక్కనేఉన్న పుస్తకాలను చూపించాడు. ఎన్నో బయో గ్రఫీలు, వివిధ రకాల సబ్జక్ట్స్ ,అదొక చిన్న పాటి లైబ్రరీ లా ఉంది.

ఒక లాంగ్ నోట్ బుక్ తీసి నా ముందు పెట్టాడు, దాంట్లో ఎన్నో పేపర్ క్లిప్పింగ్స్ అతికించబడి ఉన్నాయి. రిక్షావాడి అమ్మాయి , ఐఏఎస్ అయిందని , పల్లెటూరి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందని ,ఇంకా ఎన్నో సక్సెఫుల్ స్టోరీస్ కట్టింగ్స్ అతికించి ఉన్నాయి. ఎందరివో వివిధ రంగాలలో పేరొందిన ప్రముఖుల ఫోటోలు , వాటి కింద వారి గూర్చి వివరన ,కొన్ని అచ్చు వేసినవి అయితే మరి కొన్ని పెన్ను తో రాసినవి.


బాగా కలెక్ట్ చేసావే , గ్రేట్ అన్నాను .

ఇంకో ఫైల్ తీసి నా ముందు పెట్టాడు.దాంట్లో వేరువేరు న్యూస్ పేపర్లలో వచ్చే ఆర్టికల్స్, వ్యాసాలు నీటుగా ఫైల్ చేసి ఉన్నాయి. అక్కడక్కడ అండర్ లైన్ చేసి వున్నాయి, వాటి పక్కనే కామెంట్స్ కూడా వ్రాసి ఉన్నాయి.

ఇవన్నీ నేను మౌనిక కై సమకూర్చిన మెటీరియల్స్.
.
ఈ ఎంసెట్ ఐఐటీ ఇంజనీరంగులు బదులు నా కూతురిని హ్యుమానిటీస్ చదివించి , సివిల్స్ కొట్టేలా చేసాను.

సివిల్స్ టాపర్ గా అల్ ఇండియా ఫస్ట్ రాంక్ వచ్చినప్పుడు మా వూరు పేరు వార్తా పత్రికల పతాక శిర్షికల్లో వచ్చింది,ఊరి జనం కాదూ, జిల్లా మొత్తం మా ఊరును వెతుక్కుంటూ వచ్చింది.ఎందరో పత్రికల వాళ్ళు ,న్యూస్ చానెల్స్ వాళ్ళు మా వూరు రావడం మొదలు పెట్టారూ.

అప్పటి నుండి మా ఊరికి మహర్దశ పట్టింది.

ఆక్కడ గోడకు తగిలించిన ఫోటోలు చూస్తుంటే కొన్ని యిట్టె అర్థమవుతున్నాయి, మౌనిక.మోహన్ తో నవ్వుతూ దిగిన ఫోటో పెద్ద ఫ్రేములో చాలా బాగుంది. మౌనిక ప్రొబేషన్ లో ఉన్నప్పుడు తన సహచరులతో మస్సురి లో తీసిన ఫోటోలు, కొత్తగా ఛార్జ్ తీసుకున్నప్పటి ఫోటోలు కొన్ని ఫ్రేమ్ర్ కట్టి అందంగా అమర్చారు.చివరగా మోహన్ ఫోటో,నాతో కల్సి దిగినది , కాలేజి రోజుల్లో తీసుకున్నాము.

మోహన్ నా గుండెను తాకాడు.

తాను కుర్చీ లో కూర్చుంటూ, తనని కూడా కూర్చోమని సైగ చేస్తూ , "ఇప్పడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరో కాదు మా అమ్మాయి మౌనికే ".

కళ్ళలో సన్నటి జీరా.

"చదువు కోవాలని పట్టుదల ఆనాడు నీ కళ్ళలో కనపడేది.
నీ తరవాత , అదే ఆత్మ విశ్వాసం అదే పట్టుదల నేను నా మౌనిక లో చూసాను నీకు, నాకు తోచిన సాయం చేసి నిన్ను మహోన్నత వ్యక్తిగా చూడాలనుకున్న.

కానీ నా పరిస్థితులు అప్పట్లో అంతంటే. సారీ, నేను నిన్ను అపత్కాలంలో అన్ని విధాలా ఆదుకోలేక పోయా.

నీవు నన్ను వెతుకుంటూ వచ్చావు. సఫలుడవయ్యావు.

అదే నేను.... కానీ నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది, అది నీవు ఎప్పుడైనా నా కోసం , నన్ను వెతుక్కుంటూ వస్తావని.

నీ అన్వేషణలో నీ వ్యయ ప్రయాసల కంటే నా నమ్మకం గొప్పది.మౌనిక మీద ఉన్న నమ్మకమే నీ మీద ఉంది.నీవు వస్తావని తెలుసు.నీ టాలెంట్ ఎంటో నాకు తెలుసు.టాలెంట్ తో పాటు ఒక కృతజ్ఞతాజీవివి నువ్వు.

'కృతజ్ఞతా జీవి ' అంటే ఏంటి అన్నట్లు ఆశ్చర్యంగా మొహన్ వంక చూసాను.

నా దృష్టి లో కృతజ్ఞత జీవి అంటే తనకు సహాయం చేసిన వారిని ఎప్పటికి మరవకపోవడం.


ఎప్పుడో నే చేసిన చిన్న పాటి సాయానికి, ఇదిగో నన్ను ఇలా గుర్తుంచుకుని వెదుక్కుంటూ వచ్చావు చూడు, అదేరా నీవు కృతజ్ఞతా జీవివి అని చెప్పటానికి ప్రతీక.

ఇంతలో నా ద్రుష్టి , అక్కడున్న ప్రింటెడ్ పేపర్స్ పై పడింది. గూగుల్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్, పేస్ బుక్ లో ప్రొఫైల్ వెదికి ప్రింట్ చేసినట్లున్నాయి.

మోహన్ ఇవేంటి , అని ఆ పేపర్స్ చూస్తూ' అడిగాను. అన్నీ దాదాపు నా పేరు ఉన్న ప్రొఫైల్స్'

సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ ని వేడికి తీసిపెట్టుకున్న ప్రింట్స్ అవి. ఫేస్ బుక్, లింక్డ్ ఇన్ , ట్విట్టర్ అబ్బో చాలా సైట్స్ లో వెతికినట్లున్నారు.


"సరే నీవు నమ్మవు కానీ.నీకోసం నిన్ను కలవాలని ఎంతోప్రయత్నిస్తున్నాం.మౌనికకు కూడ నీ ఆరా తీయమని చెప్పాను " అన్నాడు మోహన్

'ఇవన్నీ నీ పేరున్న ప్రొఫైల్స్ . నీవు ఎక్కడైనా దొరకక పోతావా అని మా ఆశ. మా అన్వేషణ" ఆ పేపర్స్ ని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మోహన్.

మోహన్ ఇంకా మాటాడుతూ నే వున్నాడు , "కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు , ఆ పైవాడు నిన్ను ఇక్కడికి పంపించాడు."

ఆ పేపర్స్ జత చేరుస్తూ , మోహన్ అన్నాడు"ఈ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుండి కొన్ని గ్రామాలలోని విద్యార్థులను ఎంపిక చేసి, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించి , మంచి నాన్యమయిన విద్యను అందించే ప్రయత్నంలో ఒక సంస్థ ను స్థాపించబోతున్నది ఈ జిల్లా యంత్రాంగం. దానికి ముఖ్య సలహాదారునిగా నీ లాంటి వాడిని నియమిస్తే బాగుంటుందని చూచాయగా అన్నాను మౌనికతో".

అంతే మౌనిక నీ కోసమై అన్వేషించసాగింది. ఇవన్నీ దాని తాలూకు ప్రయత్నాలే అంటూ ఆ పేపర్లు చూపిస్తూ అన్నాడు మోహన్.

నా ప్రయోగంలో మౌనిక ఒకటే వెలుగు చూసింది. వెలుగు చూడని వారు ఇంకెందరో వుంటారు, అవి ఈ సంస్థ ద్వార సాధ్యపడాలి.

ఊరిలో జనాలందరినీ బాగు చేయాలనుకోవడం , కొంతవరకు సత్య దూరమే.అదే ఊరిని బాగు చేసే ఒక్కడిని తయారు చేయాలనుకుపోవడం, అంతగా అసాధ్యమనిపించదు. ఆ ఉద్దేశ్యంతోనే ఈ సంస్థ స్థాపించాలనుకుంటున్నారు. కాదనకురా అంటూ ప్రాధేయపడ్డట్టుగా అడిగాడు మోహన్ నా చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ.

స్నేహం లో పంచుకోవడాలు ,సర్ధుకొవడాలు మాములే. అది ఒక రకమైన సహాయం. దానిని ఋణంగా భావించి, ఆ రుణం నుండి విముక్తి పొందలనుకోవడం లో తప్పు లేదు. ఆ రుణం విలువ బేరీజు వేయడంలో తప్పుచేస్తుంటారు, అది కొన్ని సందర్భాలలో అవి వెల కట్టలేనివి. దానికి ఈ ద్రవ్యోల్భన లెక్కలు సరికావు.

సరే ఇక ఏది ఆలోచించకుండా,ఒకే అన్నాను, నిజానికి భగవంతుడు నా మిత్రుని రుణాన్ని ఈ విదంగా తీర్చుకొనే అవకాశం కలిపించాడు.

నా మిత్రునికి ఇంతకంటే పెద్ద బహుమతి నేనెమివ్వగలను?!!!

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.