కాకులు పెట్టిన సబ - భాస్కర్ కంటేకర్

Assembly of crows

ఒక కాకి ఉండేది . అది ఎప్పుడు కోకిల గురించే ఆలోచించేది. కోకిల స్వరం వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది.ఎన్నో ఏళ్ల నుండి కవులు ,రచయితలు కోకిల స్వరాన్ని పొగడుతూ వస్తున్నారు. కవి కోకిల ,గాన కోకిల లాంటి బిరుదులు సృష్టించి ఈ మనుషులు తమ కవులను సత్కరించుకొని కోకిల పేరుని , గళాన్ని మరింత ప్రసిద్ధం చేసారు..కోయిల పిలుపే కోనకు మెరుపు' అని ఓ కవి అంటే, 'కోటి రాగాల కోయిలమ్మకు నల్ల రంగుల లలిమినవాడి..' అని కోయిల నలుపు రంగు పై మహాశివున్నే నిలదీశాడు మరో కవి. ఇంతకీ ఈ కోకిల గొప్పతనం ఏంటి. ఎప్పుడు ఒకటే 'కూ', 'కూ' అంటుంది తప్ప వేరే పలుకు పలుకదు. ఒకటే రాగం , ఒకటే స్వరం దీనికే ఇంత హంగామా అవసరమా. మనుషులలో ఉండే గాయని గాయకులనే తీసుకో , ఎన్నో రాగాలను అవలీలగా పాడుతారు.లయబద్దంగా, జతులు, గతులు, శ్రుతులు ఇంకా సంగతులు , ఒక్క బాష కాదు, తమ మాతృ బాష మరియు కానీ బాష ,రాని బాష ఇలా ఎన్నో రకాలుగా పాడి మెప్పించగలరు. అలాంటిది ఎప్పుడు ఒకటే కూ కూ అంటూ కూని రాగాలు తీసే కోకీలను అనవసరంగా అందరూ పొగుడున్నారు. అది కూడా ఏడాదిపొడగున కూయలేదు.మధ్యలో చాలా రోజులు మాయమైపోతుంది. ఎక్కడకు వెళ్తుందో దేవుడికే తెలియాలి. ఆ రోజంతా కోకిల గూర్చే ఆలోచించిన కాకి కి ఏ కోణాన చూసిన దాన్ని మెచ్చుకోవాల్సిన గుణం కనిపించలేదు. అంతే కాదు, కోకిల తన గుడ్లను మా గూల్లో పెడుతుందని తెలిసినప్పుడు,దానిపై ఉన్న దురభిప్రాయం ఇంకాస్త బలపడింది. మేము అరుస్తే బందువులొస్తారని జనాలు నమ్ముతారు.. మనల్ని చూసి మనుషులు ఎన్నో విషయాలు నేర్చుకొన్నారు మనం కలిసి జీవిస్తాము.ఒక కాకి ప్రమాదంలో పడితే వంద కాకులం ప్రోగవుతాము. మనకు ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే చాలా గోల చేస్తాము.అందుకే కాకి గోల అన్న శబ్దం వాడుకలోకి వచ్చినట్లుంది. మనపైన ఎన్నో కథలు వ్యవహారంలోఉన్నాయి.కాకాసురుని కథ రామాయణం లో కూడా వినిపిస్తోంది.మనకి వొంటి కన్ను ఎందుకు వస్తుందో ,దాంట్లో వివరించబడింది.మన గొంతు అంత శ్రావ్యంగా ఉండకపోవచ్చు. అంతని, అంత కర్నకఠోరంగా కూడా ఏమి ఉండదు. ఎలాగైనా తాను కూడా సంగీతం నేర్చుకొని, తనంటే ఏంటో కాకుల లోకానికి తెలియచేయాల్సిందే అనుకుంది తనకు తెలిసిన వూరులన్నీ తిరుగింది.ప్రతి గాయకుని ఇంటి ముందు వెళ్లి వాళ్ళు పాడే పాటలను శ్రద్ధగా వినేది.రాగలన్నింటిని పదే పదే పాడి ప్రయత్నించేది. చివరకు ఎన్నో కష్టాలు పడి ,ఎన్నో రాగాలు నేర్చుకొంది. ఒక రోజూ,కాకులందరిని ఒక దగ్గరకు చేర్చి, తన పాటలను రాగ యుక్తంగా పాడి వినిపించింది. కాకులన్నీ తెల్ల ముఖం వేసుకొని చూసేవి.ఈ కాకి పాడిన పాటలు,ఆలపించిన రాగాలు ఆ మిగతా కాకులకు అర్థం అయ్యేవి కావు. ఈ కాకికి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఒక రోజు, ఆ కాకి అదే కోకిల దగ్గరికి వెళ్ళింది.తన సంగీత జ్ఞానాన్ని దానిముందు ఉంచింది.కోకిల బాగా ఇంప్రెస్స్ అయ్యింది.కాకిని బాగా మెచ్చుకొంది. ఒకప్పుడు కోకిలంటేనే అసహ్యించుకొనే ఆ కాకికి ,కోకిలంటే ఓ గౌరవ భావం ఏర్పడింది. అయితే తన ప్రతిభ కాకుల ప్రపంచం లో నిరూపించుకోడానికి ఏం చేయాలి అని ఒకటే ఆలోచించడం మొదలు పెట్టింది. తనకు ఒక ఐడియా తట్టింది. ఒక రోజు, మల్లీ తన సంగీత కచేరి పెట్టాలని నిర్ణయించుకొంది.ఈ సారి కోకీలను అతిథిగా ఆహ్వానించి, కచేరిలో కోకిలతో మెప్పించుకొని తద్వారా తనకు గుర్తింపు తెచ్చుకోవచ్చనీ భావించింది ఆ కాకి. ఆ రోజు రానే వచ్చింది.కాకి కచేరి స్టార్ట్ చేసింది. కాకి తన సంగీత ప్రతిభని రెట్టింపు ఉత్సాహంతో ప్రదర్శిస్తుంది. కానీ కాకుల సమూహానికి అర్థం కాలేదు. కోకిల కూడా కాకి ప్రతిభ ముందు చిన్నబోయింది. కాకుల సమూహం లోంచి ఒక కాకి లేచి, కోకిలని ఒక సారి పాడమంది.కానీ కోకిలకు ఒకటే కూ కూ అనే రాగం తప్ప మరోటి రాదు.ఆ విషయం అక్కడ సంగీత కాకికే తెలుసు. కోయిలకు ఎమి చేయాలో అర్థం కాలేదు. బయపడుతూనే మైకు దగ్గరకు వెళ్ళింది. తనకు పాడటం రాదు అని చెప్పలేదు.ఉన్న గొంతుకను విప్పకనూ ఉండ లేదు. మంచి గొంతు దాని సొంతం.అనంత రాగాల కలయికే తన గొంతు. పుట్టుకతో వొచ్చిన స్వరం.గానం తన జాతి గుర్తింపు.నర నరంలో జీర్ణించుకు పోయిన సంగీతం తన ఉనికి. కోకిల కూ కూ అని పాడటం మొదలుపెట్టింది.అంతే ,అక్కడున్న కాకుల్లో ఒక్కసారిగా ఎక్కడ లేని ఉత్సాహం వెల్లువలా వచ్చింది. కాకులన్ని ఆనందంగా వినసాగాయి.పరవశంలో మునిగి పోయాయి. కోకిలకు జేజేలు పలికాయి. కాకులు పెట్టిన సబలో కోకిలేమి పాడగలదని సినారె గారన్నారు. ఇక్కడ మాత్రం కాకి పాడింది.కాకులు పెట్టిన సబలో పాడి మెప్పించింది ఆ కోకిల. అంతే, కొన్ని జాతి గుణాలు టాయి. అవి పుట్టుకతోనే వస్తాయి. మనం పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టి, మనకు కొన్ని గుణ గణాలు అలవడుతాయి.వాటిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది.మనకిక వేరే మార్గం లేదు. '

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.