ఇంటర్మీడియట్ చదివే రోజులు. ఆ రోజు physics tution అయిపోయి సాయంత్రం 6.30 కి నేను అను 👭🏻 ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం, అను అన్నది మీన!! మీ ఇంట్లో పెద్ద ఇంకు బాటిల్ ఉందన్నావు కదే నాక్కొంచం ఇంకు తెచ్చిపెట్టవా అని. నేను సరే అన్నాను.
అను వాళ్ళింటిదాకా వచ్చిన తర్వాత అక్కడ స్టాండ్ వేసి పెట్టి ఉన్న నా సైకిల్ తీసి ఎక్కబోతూ అనుని అడిగా "ఇంకుపోసుకురావటానికి నా దగ్గర సీసా ఏమీ లేదే నువ్వేదైనా ఉంటే ఇవ్వు అని. అను లోపలికి వెళ్ళి కాసేపయ్యాక వచ్చి నవ్వుతూ ఇంట్లో చిన్న సీసాలేవి లేవే అంటూ ఓ ఖాళీ హార్లిక్స్🧂 బాటిల్ చూపించింది. ఏదో చిన్న టానిక్ బాటిల్ తెస్తుందనుకున్నా ఏకంగా హార్లిక్స్ సీసా చూసి భలే నవ్వొచ్చింది. అది చూసి పగలబడి నవ్వీ ఇందులో ఇంక్ ఎలాగే తేవటం అన్నాను. అను కూడా నవ్వుతూ ఇంట్లో ఇదే ఉందే అంది. సరేనంటూ ఆ బాటిల్ నాయనమ్మ చేత్తో కుట్టిచ్చిన పుస్తకాల సంచిలో పడేసా.
అది చిన్న చేతిసంచి ట్యూషన్కే కదా అని అందులో కేవలం రెండు నోట్బుక్స్ ఒక పెన్ ఉంచా. ఆ సంచిని సైకిల్ కి వెనకాల carrier కి పెట్టేసి నేను మా ఇంటికి బయలుదేరాను. అక్కడినుంచి ఒక పది నిమిషాలు పడుతుంది సైకిల్ మీద ఇల్లు చేరటానికి.
నేను మెల్లగా సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాను ఇంతలో ఎవరో నన్ను follow అవుతున్నట్లుగా అనిపించింది, చూసాను గత కొన్ని రోజులుగా ఆ మార్గాన అతను నన్ను follow అవుతున్నాడు 🚴♀️ ...... 🚴♂️ నేను గమనించినా ignore చేస్తూ ఉన్నాను.
ఆ రోజు అతను సడన్ గా వచ్చి నా సైకిల్ హాండిల్ని 🚲 పట్టుకోబోయాడు. 😳😳😣😣 భయంతో ఆగి సైకిల్ అక్కడ వదిలేసి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి గేటు తెరిచి దూరిపోయా🏃♀️ !! ఏంచేయాలో తోచక కాలింగ్ బెల్ 🚪నొక్కా. ఇంతలో ఆ ఇంట్లో ఇంచుమించుగా నా వయసులో ఉన్న అమ్మాయి ఒచ్చింది ఏవిటో అన్నట్టుగా ❓question mark face పెట్టింది, నేను ఏంచేప్పాలో తెలియక కొన్ని మంచినీళ్ళడిగా. ఆ దారిలో వేళ్ళడం నన్ను తరచుగా చూస్తుండటం చేత లోపలికి వెళ్ళి నీళ్ళు 🥛తెచ్చి ఇచ్చింది. ఆ గ్లాసు నీళ్ళు నేను ఒక అయిదు నిమిషాలు టైము తీసుకుని తాగి మెల్లగా వాళ్ళింటి గేటు బయటికొచ్చి అటూ ఇటూ చూసా. అతను వెళ్ళిపోయాడు, దూరంగా రోడ్డుకి ఓ పక్కన నా సైకిల్ 🚲 పడి ఉంది. హమ్మయ్య !! అనుకుంటూ దగ్గరగా వెళ్ళి చూసేసరికి నా పుస్తకాల సంచి కనబడలేదు దేవుడా!! అనుకుంటూ ఇంటికి బయలుదేరాను.
బయట సైకిల్ ఆపేసి అమ్మ సంచి ఏదీ అంటే ఏంచేప్పాలో అనుకుంటూ అడుగులేసా....🚶♀️....
అమ్వ వంటింట్లో వంట చేయటం గమనించి చప్పుడు లేకుండా ఇంట్లోకి వెళ్ళా.
మరునాడు ఇంకో బాగ్ తీసుకుని మళ్ళీ ట్యూషన్ కొసం అను వాళ్ళింటికెళ్ళా. దానికి జరిగిందంతా చెప్పా. అది ఒక్క క్షణం ఆగి పగలబడి నవ్వుతూనే ఉంది కింద కూలబడి మరీ నవ్వుతుంది. నాకర్ధం కాలే
అది అంది "మీనా!!!! నీ సంచిలో బాటిల్ చూసి వాడు ఏమనుకొనుంటాడూ??
అసలు బుక్స్ తో పాటు సీసా ఎందుకు ఉందో అర్థం కాక తలబాదుకునుంటాడు 🤦♂️ఈ పాటికి వాడి ఫ్రెండ్స్ అందరినీ అడుగుంటాడు. " అంతే ఇద్దరం నవ్వుతూ అలాగే కూర్చుండి పోయాం.
రెండు రోజులకి అతను 🧍🏻♂️ అదే రోడ్డు మీద నా సంచితో వచ్చాడు , ఏమీ మాట్లాడకుండా సంచి మాత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందులో సీసా మాత్రం కనపడలేదు.
కొన్నాళ్ళకి మేము ఊరుమారిపోయాం ఆ కథా ఙ్నాపకాల్లో మిగిలిపోయింది.