అనగనగా ఒక అందమైన చిట్టడివి. అందులో ఒక ఆనందమైన కుందేలు🐇 ఉండేది. దాని పేరే మిని.
అది ఆ అడవిలో తన గుంపుతో గుంపులో హాయిగా ఉండేది. అయితే అప్పుడప్పుడు మిని ఒక కరవ అనే మగ కుందేలు 🐇 తో స్నేహంగా ఉండేది. కరవ మిని వెంటే ఉండేది, మిని ఎటు వెళితే కరవ కూడా అటే వెళ్తుండేది. ఆ రెండూ చాలా సార్లు జంటగా ఆ అడవిలో కనబడుతూ ఉండేవి.
ఇది ఇలా ఉండగా ఒక రోజు మిని తన గుంపుతో కలిసి గెంతుతూ గెంతుతూ తనకి తెలియకుండానే ఒక Farmhouse fencing లోనికి వచ్చేసింది. Suddenగా తనతో వచ్చిన మూక ఎటో మాయమైపోయింది. మినికి ఏమీ అర్థం కాలేదు. కొంచం లోపలికెళ్ళాక మినికి ఒక మగ కుందేలు 🐇 కనిపించింది దాని పేరు గోవి. మినికి అప్పుడర్థమైంది గోవికి తోడుగా ఉండటంకోసమే తన గుంపు 🐰🐰🐰🐰🐰🐰🐰🐰🐰🐰 తనని ఆ farm house దాకా తీసుకువచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని.
అయితే గోవి farm house bred కుందేలు కదా, అక్కడే ఆ restricted areaలో పుట్టి పెరిగినది కాబట్టి అడవిలో నుండి వచ్చిన మిని🐇 తనకెంతో నచ్చింది. గోవి కూడా ఎప్పుడూ మిని చుట్టూ తిరుగుతూ ఉండేది.
గోవికి మిని మీద ప్రేమతో పాటు మిని తన్ను వదిలి మళ్ళీ అడవిలోకి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయం విపరీతంగా కూడా పెరుగుతూ వచ్చింది. ఆ భయంతోనే farm house కంచెదాకా వచ్చిన ప్రతిసారీ మినినీ లోపలికి నెట్టే ప్రయత్నంలో తన గోళ్ళతో మినిని రక్కటం మొదలవుపెట్టింది.
మినిని ఆ గాయాలు చాలా బాధపెడుతుండేవి. గోవి మాత్రం మినికి కావలసినవన్నీ సమకూర్చుతూ ప్రతిది అమర్చి పెడుతుండేది. Farm house లో ఎలాగూ కూరగాయలు నీరు గడ్డీ అన్ని ఉండేవి.
మిని చాలా తెలివైంది. తను ఉన్న ఫార్మ్హౌజ్ లో తనకంటూ ఒక Eco system developచేసుకుని, గాయాలు బాధించినా సంతోషంగానే ఉండటం మోదలు పెట్టింది.
మినికి అప్పుడప్పుడు కంచెలోపలి నుండి బయట ఉన్న తన పాత స్నేహితుడైన కరవ అలా దూరంగా గెంతుతూ కనబడేవాడు.
మినిని కలవటానికి తన గుంపులోని బంధువులు ఎవరైనా వచ్చినా గోవి మినిని తీసుకెళ్ళిపోతారేమోనన్న భయంతో కంచె అవతలివరకూ కూడ ఎవరిని రానీయకుండా attacks చేస్తూ తరుముతుండేది.
మొదట్లో కరవ ఒంటరిగా కనిపించినా కొన్నాళ్ళకి కరవతో పాటు ఇంకో ఆడ కుందేలు🐇🐇 కనిపించేది.
మిని అలా చూస్తూ ఉండేది.
అడవిలో నుండి నుండి వచ్చింది కదా మిని అందుకే అడవంటే మినికి ఎప్పుడూ మక్కువే 💕💕
ఎప్పుడూ ఆ అడవిలోకి వెళ్ళి మళ్ళీ స్వేచ్ఛగా తిరగాలని ఆశ కలుగుతూ ఉండేది. 🎄🌲🌳🌴🌱🕊️🕊️🌵🎋🥀🌲🌳🌴🌱🎄
ఇది ఇలా ఉండగా మినికి ఒక రెండు బుజ్జి బుజ్జి కుందేళ్ళు పుట్టాయి. గోవికి ఆ రెండూ అంటే ఎంతో ఇష్టం. మినికి వాటితో ఆడుకోవటం వాటిని కూడా అడవిలోకి తీసుకెళ్ళి ఆడించాలని అనిపిస్తూ ఉండేది. కానీ అవి గోవి లాగా ఫామ్ లో పుట్టినవి కదా బయట ఇమడలేవు అనిపించేది.
గోవి మిని తన నుంచి ఆ చిన్ని కుందేళ్ళలని కూడా ఎక్కడ దూరం చేస్తుందోనని, మినిని కంచె దగ్గరకు రాకాపోయినాసరే తన గోళ్ళతో రక్కుతూ ఉండేది.
పోగాపోగా మినికి అది అలవాటైంది. కానీ దూరంగా అప్పుడప్పుడూ తగ్గి ఎప్పుడో ఓ సారి కనబడే కరవ ని మటుకు కంచెలోపలినుండే చూస్తూ ఉండేది.
అలా ఏళ్ళు గడిచాయి.
ఒకరోజు గోవి farm house అటువైపుకి యాదృచ్ఛికంగా వెళ్ళింది. ఆ అడవి తనకి ఎంతో నచ్చింది. చాలా సేపు ఒంటరిగా అక్కడ గెంతి దూకి ఆహ్లాదకరంగా ఉంది. మినిని తర్వాత ఆ బుజ్జి కుందేళ్ళని కూడా అడవిలోకి తీసుకురావాలని అనుకుంది.
వెంటనే వెనక్కి తిరిగి వస్తూ ఉండగా గోవికి దూరంగా farm house లోపలివైపు కంచెమీద వ్రేలాడుతూ పడిఉన్న మిని 🐇 కనిపించింది. అప్పుటికే గాయాలు ముదిరిన మిని కంచెమీదే ప్రాణం వదిలింది. దగ్గరగా రాగా మిని చనిపోయి ఉండటం చూసి గోవి బోరుమన్నది.😩😫😫😩😩
చాలా sad climax కదా!!! ఈ కథకి ఈ ముగింపే కరెక్ట్.
***The End *****
-----సంజు