"ఒకటి ప్లస్ ఒకటి ఎంత ?",అని ఆడగాడు గుర్నాథమ్. "రెండు" అంది సుజాత. "కాదు" అన్నాడు గుర్నాథమ్ తలా అడ్డంగా ఊపుతూ. "మరీ", అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది సుజాత. "రెండు టీ లు" అని పక పక నవ్వాడు గుర్నాథమ్. "సరే మరో ప్రశ్న అడుగుతాను, సరైన సమాధానం చెప్పు", అన్నాడు గురునాథం. సరే అన్న సుజాత కు , రెండు ప్లస్ ఒకటి ఎంత అని ఎదురు ప్రశ్న వేశాడు గుర్నాథమ్. అమ్మో ఈసారి పప్పులో కాలు వేయోద్దని తెగ ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి, "నాకు సమాధానం తెలుసు కానీ అది ఒక షరతు మీద చెపుతాను "అంది సుజాత. "ఏంటో ఆ షరతు " నొసలు చిట్లిస్తూ అడిగాడు గుర్నాథమ్. "నేను ఒక సమదానం చెపుతాను.దానికి మీరు 'ప్రశ్న' చెప్పాలి. ఆ ప్రశ్న - జవాబు సరయినదైతే , నేను మీ ప్రశ్నకు సమాధానం చెపుతాను. ఓకేనా" అంది తన చూపుడు వేలును గుర్నాథమ్ వైపు చూపిస్తూ. ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టం.కానీ జవాబు చెప్పినప్పుడు ప్రశ్న అడగడం పెద్ద కష్టం కాదు.సమాధానాలు దొరక్క దేశద్రిమ్మరులైన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు మహానుభావులైన వారు కూడా ఉన్నారు. బాగా ఆలోచించి వప్పుకున్నట్లుగా " సరే "అన్నట్టు తల ఊపాడు గుర్నాథమ్. సుజాత తన పేరుతో మొదలుపెట్టింది. సుజాత "సుజాత "అంది. గుర్నాథమ్ జవాబుగా "నీ పేరేంటి? " అన్నాడు. సుజాత జవాబుగా,వెరీ గుడ్, కాన్సెప్టు మీకర్థమయ్యింది. ఇప్పుడు అసలు ప్రశ్న, "పెళ్లి" అంది సుజాత. గుర్నాథమ్ కి అర్థమయ్యింది,ఇది కొంచం జటిలమైన ప్రశ్నే!! జవాబుగ ,"ఇద్దరు మనుషులు మరియు మనసులు కలయిక దేనికి దారి తీస్తుంది?" అన్నాడు గుర్నాథమ్. సుజాత 'నో 'అంది. "ఇద్దరు మనుషులు అంటే వారూ అడా , మగా లేక ఇద్దరు స్వలింగులా ,అయిన వారి మనసులు కలిసినవి అంకుందాము, అంత మాత్రాన అది పెళ్లికి దారి తీస్తుందని చెప్పలేము.మరో విదంగా ప్రయత్నించండి. "ఇద్దరు ప్రేమికులు ఒకటై, జీవితాంతం ఒకటిగా జీవించాలనుకుని చేసుకొనే ఫంక్షన్ ఏమిటి ?" అన్నాడు గుర్నాథమ్. సుజాత మళ్ళీ లాయర్ పాయింట్ లేవనెత్తింది. "జీవితాంతం ఒకటిగా జీవించాలనుకోవడానికి , వారిద్దరూ ప్రేమికులే కా నవసరం లేదు , పెద్దలు లేక స్నేహితులు కలిపిన లేదా తామంతా తాము కలుసుకున్న జంటలు కావచ్చు. మన హిందూ సంప్రదాయంలో అరేంజ్డ్ మేరేజేసే చాలా వరకు సక్సెఫుల్ " అంది సుజాత. గుర్నాథమ్ కూడా చాలా వరకు ఏకీభవించాడు. తన డెఫనేషన్ ను ఇంకాస్త కుదురు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సారి ఓ రెండు క్షణాలు ఆలోంచించి " ఒక ఇద్దరూ, లేదా ఒక అడ మగా ఒకటిగా కలసి జీవించబోతున్నారని బాహాటంగా ప్రకటింప బడే కార్యక్రమము పేరేంటి? " అన్నాడు గుర్నాథమ్. సుజాత దీనికి కూడా ఒప్పుకోలేదు."ఈ మధ్య నాగరికం ముసుగులో నలుగురిని పిలిచి, మేమిద్దరం సహజీవనం చేయబోతున్నామని ఎంతమంది ప్రకటన చేయడం లేదు. అంత మాత్రాన అది 'పెళ్ళని' నేను భావించను", అంది సుజాత. "హంగులు ,ఆర్భాటాలు లేని ప్రైవేట్ ఫంక్షన్ అంటూ ఖరీదైన హోటల్లో పూలదండలు మార్చుకుని, సడి చప్పుడు లేకుండా చేసుకునే తంతుని కూడా పెళ్ళని పిలవడం కష్టమే" అంటూ తన అభిప్రాయాన్నీ వెలిబుచ్చింది సుజాత. ఆదేదో ఫన్నీ టాపిక్ కాస్త ,తమ తమ అభిప్రాయాలను ప్రకటించుకునే వరకు వెళ్ళిపోయింది. ఈ సారి ఏ లాగైన సుజాతను సమాధాన పరచాలిసిందే అని, శ్వాసను గట్టిగా లోనకి పీల్చుకుని, తన ఆఖరి ప్రయత్నంగా, "వరుడు ,సకల బంధుజన సమూహ కోలహలంలో,పచ్చని పందిరి కింద ,బాజా బంత్రి మంగళ వాయిద్యాల మధ్య,బ్రహ్మణ ఘన సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా , భగవంతుని ఆశీర్వాదంతో విందు భోజనాలతో అందరికి ఆమోదయోగ్యంగా మనసా వాచా కర్మా , వధువు ను ఆత్మ సాక్షిగా అర్థాంగిగా అంగీకరించడం అంటే ఏంటి?" అన్నాడు గుర్నాథమ్. సుజాత మనసు ఆ జవాబుని అంగీకరించింది. సుజాత మళ్ళీ కల్పించుకొని, మూడు ముళ్ళు అనే పదం ఎక్కడ రాలేదే అంది. అవును మూడు ముళ్ళకు అర్థం మనసా, వాచా, కర్మలకు అన్నట్లేగా అన్నాడు గుర్నాథమ్. "ఓహో , అవును మూడంటే ఆవేనా ?అని ఒకింత ఆశర్యన్నీ చూపిస్తూ అడిగింది సుజాత. "అయితే నీ ప్రశ్నకు కూడా సమాధానం దొరికిన్నట్లేగా" గుర్నాథమ్ వైవుకు కొంటెగా చూస్తూ అడిగింది సుజాత. పెళ్లిళ్లు పరిపక్వతతో జరగాలి.పెళ్లి అర్థం తెలియాలి. అంతర్లీనమై ఉన్న విలువలు, వింత పోకడలతో వికటించే బంధాలు తదుపరి పరిణామాలు,భావి తరాల మీద వాటి ప్రభావం, ఇవన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం నేటి యువత మీద ఉంది. ఒకటి ప్లస్ ఒకటి రెండు అయినప్పటికీ, రెండు టీ లు అని పెడర్థ ములతో సమర్ధించే వారు ఉన్నారు మరియు 'ఒకటి ప్లస్ ఒకటి ఒకటే 'నని నిగూడార్థాన్నీ విప్పి చెప్పేవారు కూడా ఉన్నారు. ఎవరిని అనుసరిచాలన్నది మనకే వదిలి వేయ బడ్డ నిర్ణయం.