ఏమోయ్ ఈరోజు ఏంటి కూర అని కొంటెగా అడిగాడు శివయ్య .ఆ గన్నేరు పప్పు అని కోపంగా చెప్పింది పార్వతి. అయినా నా పిచ్చి గానీ నీ చేతితో ఏం వండిన పాయసం లాగా ఉంటుంది అని చిలిపిగా బదులిచ్చాడు శివయ్య. ఉంటుంది ఉంటుంది అయినా నా కోపం కరివేపాకు లాంటిది మీకు ఊరకనే తీసి పారేస్తారు అని విసుగ్గా అంటుంది పార్వతి .నాకు తెలియదా పార్వతి నీ కోపం హిమాలయాలలో మంచు లాంటిది కొంచెం ఎండ తగిలితే కరిగిపోతుంది అని తనని దగ్గరగా తీసుకుని ముద్దుగా చెప్తాడు శివయ్య .అంతేలే నేను కన్నీరులా కరగడం తప్పా నా మాటలకి మీరెప్పుడూ కరుగుతారు ఓట్టి బండ రాయి మనిషి అని బదులిస్తుంది పార్వతి. అయినా ఇప్పుడు ఏమయింది నిన్న పొలం నుండి వస్తుంటే తన భార్య ప్రసవానికి టైం అయింది చేతిలో రూపాయి లేదయ్యా ఇప్పుడు మా ఇంటి దాన్ని ఎట్టా ఆసుపత్రికి తీసుకెళ్లాలి?? బయటికి వస్తాను అన్నా నా బిడ్డని ఈ భూమి మీదకి ఎట్టా తీసుకురావాలి ??అని అమాయకంగా అడిగిన నరసయ్య కు నా దగ్గర ఉన్న ఆ కవులు డబ్బులు 10000 ఇచ్చాను .సాయం చేయడం నేరం కాదు కదా అని జరిగింది చెప్పాడు శివయ్య. అయినా అడిగిన వారందరికీ దానం చేస్తూ పోతే రేపు మనకి తినడానికి దాన్యం ఎక్కడినుండి వస్తాయి అందరికీ సాయం సహాయం చేస్తూ పోతే రేపు నా కొడుక్కి ఎవరో ఒకరు చేయాలి సహాయం అని బాధగా తన మనసులో మాట చెబుతుంది పార్వతి. పిచ్చిదానా మనం తినడానికి తిండి ఉండటానికి ఇల్లు బతకడానికి పొలం ఉన్నాయి కదా భయమెందుకు అని అంటాడు శివయ్య.ఆ ఉన్నాయి నేను కాపురానికి వచ్చినప్పుడు ఇంట్లో నాలుగు కార్లు ఉండేవి ఐప్పుడు ఉన్నది ఒకటే కారు అప్పుడు 30 ఎకరాల పొలం ఉండేది ఇప్పుడు ఇరవై ఎకరాల పొలం ఉన్నది పిల్లలు పెరిగే కొద్దీ ఆస్తులను కూడా పెంచుకుంటారు కానీ మీల ఎవరు తగ్గించుకుంటూ పోరు అని కసురుకుంది పార్వతి . నేను వీడికి వారసత్వంగా ఇవ్వాళ అనుకుంటుంది మా తాతలు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు కాదు మంచితనాన్ని ,మానవత్వాన్ని ఒక మంచి వ్యక్తిత్వాన్ని అని అప్పుడే అటుగా వచ్చిన వారి అబ్బాయి వినయ్ నీ చూసి అంటాడు శివయ్య.ఓ ఇవ్వండి ఇవ్వండి మంచితనం ,మానవత్వం ఈ రోజుల్లో వీటిని మించిన హాస్యాస్పద మాటలు మరొకటి లేవు ఈరోజు సాయం పొంది మరసటి రోజు కి మర్చిపోయే రోజులు ఇవి . సమాజానికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు ఉన్నదంతా ఊడ్చి నా కొడుక్కి మాత్రం అన్యాయం చేయకండి .ఉండండి ఇద్దరికీ భోజనాలు రెడీ చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్లి పోతుంది పార్వతి .అసలు మానవత్వం అంటే ఏమిటి నాన్నగారు అని దీర్ఘంగా ఆలోచిస్తున్నా శివయ్య ని అడుగుతాడు కొడుకు వినయ్. తోటివారు కష్టాలలో ఉన్నప్పుడు సాయం చేయడం. లేనివారికి ,కష్టం అంటూ మన దగ్గరకు వచ్చిన వారికి సహాయం చేయడం .ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం. మానవత్వం అని చెబుతాడు శివయ్య. ఇవన్నీ దేవుడు చేస్తాడు అని చెప్పింది అమ్మ అసలు దేవుడు ఎవరు నాన్న అని అమాయకంగా అడుగుతాడు వినయ్ .దేవుడంటే మనం ఫోటోలో పూజించేవాడు ,విగ్రహాలలో అలంకరించే వాడు, కోట్లు పెట్టి కట్టిన నాలుగు గోడల మధ్య ఉండే వాడు కాదు .నీకు ఆకలిగా ఉన్నప్పుడు తిన్నావా అని అడిగేవాడు, నీ కష్టాన్ని పంచుకునే వాడు ,ఇష్టాన్ని గౌరవించేవాడు ,ఎల్లప్పుడూ న్యాయం వైపు ఉండే వాడు ,అందరికీ సహాయం చేసేవాడు దేవుడు అని వివరంగా చెబుతాడు శివయ్య .. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎవరో కథ అయిపోయింది ఇక పడుకో నాని అని అంటూ తన కథల పుస్తకాన్ని తీసుకెళ్తుంది గంగా.. అమ్మ ఇంతకీ కథ పేరు చెప్పలేదు అని అడుగుతాడు నాని కథ పేరు "దైవం మానస రూపాయే"అంటూ చెబుతుంది గంగా ఇక ఆనందంగా నిద్రపోతాడు నాని ... ఎప్పుడు న్యాయం వైపు ఉంటూ, ఎల్లప్పుడు తోటి వారికి సాయం, సహాయం చేసే ప్రతి మనిషి దేవుడు తో సమానమే.. అందుకే అన్నారు పెద్దలు దైవం మానస రూపెయే .ఇది తెలుసుకొని మనం పాటించిన రోజు మానవ వనం అవుతుంది నందన వనం..