అనామకుడు - కనుమ ఎల్లారెడ్డి

Anonymous

పొలయ్య కు నా అన్నవారు ఎవరూ లేరు. ఎక్కడ పుట్టాడో తెలియదు. రోడ్లపైనే బాల్యమంతా గడిచింది.చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవాడు.ఓ రోజు రోడ్డుప్రక్కన చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఎవరో తిని పారేసిన బ్రెడ్ ముక్క తింటుండగా కారులో అటుగా పోతున్న రామలింగయ్య చూసి చలించి పోయాడు.కారు ఆపి అతని దగ్గరకు వెళ్ళాడు."ఇది తప్పు బాబు ,అపరిశుభ్రతతో నిండిన వాటిని తిన రాదు" అన్నాడు.దానికి పొలయ్య "నాకేదైనా పని ఇప్పించండి శుద్దిగా ఉంటాను" అన్నాడు.
రామలింగయ్య తన హోటల్లో సర్వర్ గా పని ఇప్పించాడు,హోటల్ ప్రక్కనే ఓ గది కూడా ఇప్పించాడు.అప్పటినుండి శుద్దిగా,పరిశుభ్రంగా ఉంటూ పని చేసుకుంటున్నాడు పొలయ్య.కాలక్రమంలో ఎంతో మంది హోటల్లో పని మానేసిన తను మాత్రం ఎక్కడికి వెళ్ళక రామలింగయ్య కు నమ్మకస్తుడిగా పని చేసుకుంటూ ఉన్నాడు. ఓ రోజు ఎంతసేపటికి పొలయ్య పనికి రాకపోవడంతో గది కి వెళ్ళి పిలిచాడు. పొలయ్య పలుకక పోవడంతో తలుపు బద్దలు కొట్టి వెళ్ళి చూశాడు. అచేతనవస్థ గా మంచం పై వున్నాడు." పొలయ్య,పొలయ్య" అని పిలిచాడు.ఆ పిలుపుకు స్పందన లేదు.చుట్టూ చూశాడు రామలింగయ్య. ఓ చోట హుండీ కనిపించింది.హుండీ పగులకొట్టాడు.ఓ చీటి ,అందులో కొంత డబ్బు ఉంది.చీటీ విప్పి చూశాడు.అందులో ఇలా రాసుంది.అది ఎవరితోనో రాయించుకున్నట్లు ఉంది. "బాబు గారికి నమస్కారం. ఈ అనామకుడికి పని ఇప్పించి ,జీతం ఇచ్చి నాకు ఓ మార్గం చూపారు.మీకు రుణపడి ఉంటాను.ఈ డబ్బుతో నా దహన క్రియలు జరిపించండి.ఈ మేలు ఎప్పటికి మరువను" అని రాసుంది.ఆ లేఖ చదివి కన్నీళ్లు పెట్టుకున్నాడు రామలింగయ్య. ఘనంగా అతని దహన క్రియలు జరిపించాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు