"సర్! మే ఐ కమిన్?” అన్నాడు పి.ఏ సుధాకర్. “ఎస్! కమిన్!” అన్నాడు ఆశ్రిత్ శర్మ. “టైమ్స్మమేగజైన్ వాళ్ళు వచ్చారు సర్! మీరు చేసిన లెన్స్మార్ట్ యాడ్ బాగా హిట్ అయినందుకు మీ ఇంటర్వ్యూ కోసం అడుగుతుఎన్నారు. లోపలకి రామంటారా సర్?”అన్నాడు సుధాకర్. “యహ్! లెట్ దెమ్ ఇన్!” అన్నాడు ఆశ్రిత్. “ఓకే సర్!” అన్నాడు సుధాకర్. టైమ్స్ మేగజైన్ జర్నలిస్ట్ డోర్ నాక్ చేస్తూ “గుడ్ మార్నింగ్ సర్!” దిస్ ఇజ్ అమీర్ ఫ్రమ్ టైమ్స్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్!” అన్నాడు. “నో నో! ఇట్స్ మై ప్లేజర్! బీ సీటెడ్" “ఐ డోంట్ టేక్ మోర్ టైమ్ సర్! ఐ విల్ వ్రయ్యప్ ఇట్ క్విక్లీ సర్!” అన్నాడు అమీర్ కుర్చీలో కూర్చుంటూ. “రికర్డర్ ఆన్ చేస్తున్నా సర్!” అన్నాడు అమీర్. ఇష్టాలు, అయిష్టాలు, రుచులు అబిరుచులు, కుటుంబం, చదువు, అన్నిటి మీద ప్రశ్నలు అడిగాక చివరగా "సర్! మీ మీద చాలా రుమర్స్ ఉన్నాయి. మీకు చదవుకునే వయసులో అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని మీ మీద కేసు పెట్టారు అని,ఆ కేసు వల్లే మీరు చదువు మానేసి ఇలా మోడలింగ్ కి వచ్చారు అని చాలా విన్నాం. వాటిలో ఎంతవరకు నిజం ఉంది సర్? మీరు ఏమి అనుకొకపోతే క్లారిటీ ఇస్తారా?” మొదటి ప్రశ్న సంధించాడు అమీర్. ఆ ప్రశ్నకి ఆశ్రిత్ కాసేపు మౌనం గా ఉండిపోయాడు. అది గమించిన అమీర్ "మీకు ఇష్టాం లేకపోతే లీవ్ ఇట్ సర్!సారీ ఫర్ ద క్వశ్చన్!” అన్నాడు. “లేదు. నేను చెప్తా కానీ దాని కన్నా ముందు నాకు ఒక మాట ఇవ్వాలి మీరు!” అన్నాడు ఆశ్రిత్. “షూర్! ఏంటో చెప్పండి!” అన్నాడు అమీర్ కుతూహలంగా. “నేను చెప్పబోయే విషయాలు లో ఒక్క అక్షరం కూడా మార్చకుండా, ఎలాంటి స్వంత కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా పబ్లి ష్ చేయాలి. అదర్ వైస్ ఐ విల్ షు యు!” అన్నాడు ఆశ్రిత్. “తప్పకుండా సర్! మీరు ఎలా చెప్తే అలాగే పబ్లి ష్ చేస్తాం" అన్నాడు అమీర్. “ఫర్ సేఫర్ సైడ్ ఐ యమ్ ఆల్సో రికార్డింగ్ మై వాయిస్.” అన్నాడు ఆశ్రిత్. “ఓకే సర్! స్టార్ట్ చేయండి!” “అది 2009...."ఆశ్రిత్ చెప్పడం మొదలు పెట్టాడు. *** కొత్త ఊరు, కొత్త స్కూల్, కొత్త జనం. ప్రిన్సిపల్ రూం బయట కంగారు పడుతూ ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఇంతలో ప్రిన్సిపల్ రూమ్ లోంచి మా నాన్న బయటకి వచ్చి "నీ అడ్మిషన్ కన్ఫర్మ్ రా నాన్న! బ్యాగ్ తీసుకో. సెకండ్ ఫ్లోర్ లో నీ క్లాస్ నైన్త్ బి. అడ్మిషన్ లెటర్ క్లాస్ టీచర్ కి చూపించు. నిన్ను క్లాస్ లోకి రాణిస్తారు. అల్ ది బెస్ట్ రా! బాగా చదువుకో సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్తా!” అని చెప్పి నాన్న వెళ్లిపోయారు.నాన్న వెళ్లిపోయేసరికి నాకు ఇంకా కంగారు పెరిగిపోయింది. అందరూ ఇంగ్షీషు లేదా హిందీ లో మాట్లాడుతున్నారు.పైగా నాకు ఇక్కడ ఎవరు తెలీదు. ఎక్కడ క్లాస్ డీటైల్స్ మర్చిపోతానో అని 'సెకండ్ ఫ్లోర్ నైన్త్ బి' అని మనసులో అనుకుంటూ ఒక్కొక మెట్టు ఎక్కుతున్నాను. నెమ్మదిగా సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాను. పక్కనే లైబ్రరి అని పెద్ద బోర్డు ఉంది .ఆ బోర్డు ఉన్న గదిలోంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తునారు. వాళ్ళని "నైన్త్ బి ఎక్కడ?” అని అడిగాను సిగ్గుపడుతూ. "క్యా? ఐ కుడ్ నాట్ గెట్ యు!? "అంది ఒక అమ్మాయి. నేను కంగారు దిగ మింగుకుని " ఐ మీన్ వేర్ ఇస్ నైన్త్ బి?” అన్నాను మళ్లీ. “ ఆర్ యు న్యూ టు దిస్ స్కూల్? నో వర్రీ ఐ విల్ టేక్ యు టు నైన్త్ బి. ఐ యమ్ ఫ్రమ్ నైన్త్ బి. బై ద వే దిస్ ఇస్ ఫాతిమా!” అంది మరో బురక వే సుకున అమ్మాయి. ఆ అమ్మయి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి.. ఆ కళ్ళు లో ఒక విచిత్రమైన మెరుపుంది..ఎంతటివారినైనా కట్టి పడేసే మాయ వుంది. ఏంటో ఆ అమ్మాయిని చూడగానే చూపు తిప్పుకోలేకపోయా. తన మొహం కనపడకపోయిన తన నీలి కళ్ళు నన్ను చూపు తీపుకొనివటంలేదు.అలా చూస్తూ ఉండిపోయా. చివరికి తన వేళ్ల చిటికకి నాలో కదలిక వచ్చింది. “హే! ఏంటి అలా ఉండిపోయావ్? ఏం అర్దమకావటంలేద? నాకు కొద్దిగా తెలుగు వొస్తుంది. యు కెన్ టాక్ టు మి ఇన్ తెలుగు! ఇంతకీ ని పేరు చెప్పలేదు?” అంది తను. “ఓహ్!సారీ!ఐ యమ్ ఆశ్రిత్! యక్చువల్లి మాది ఆంధ్ర లో కాకినాడ.మా ఫాదర్ కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఫస్ట్ టైమ్ వచ్చా హైదరాబాద్. సొ ..కొత్త కదా టైమ్ పడుతుంది హిందీ నేర్చుకోటానికి!” అన్నాను తడబడుతూ. ఇంతలో నడుచుకుంటూ నైన్త్ బి దాకా వొచ్చేశాం. టీచర్ కి అడ్మిషన్ లెటర్ చూపించాక క్లాస్ కి న ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక ప్లేస్ చూసుకుని వెళ్ళి కూర్చున్నాను. అప్పటివరకు చాలా కంగారుగా అనిపించిన నాకు ఫాతిమా ని కలిసాక ప్రశాంతం గా అనిపించింది. నాకు తెలియకుండానే న చూపు ఫాతిమా వైపు వెలిపోతోంది. కాసేపు అలా చూస్తూ ఉండిపోయా. చూస్తూ ఉండగా తను టక్కున వెనక్కి తిరిగి నన్ను చూసింది. నా గుండె వేగం పెరిగిపోయి చెమటలు పట్టేసాయి. ఆ తర్వాత పీరియడ్ లో వొచ్చిన టీచర్ నా దృష్టి క్లాస్ మీద లేకపోవడం గమనించి "హే! యు గెట్ అప్! వాట్ ఇస్ యువర్ నేమ్? నెవర్ సీన్ యు ఇన్ మై క్లాస్?” అంది గట్టిగా అరుస్తూ. నేను లేచి కంగారు లో "మై నేమ్ ఈజ్ సెకండ్ ఫ్లోర్ నైన్త్ బి!” అనేసరికి క్లాస్ అంతా గోళ్లుమని నవ్వేసారు.మొదట నాతప్పేమిటో తెలియలేదు..తెలిసే లోపులో టీచర్ చడామడ తిట్టేసి "గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్!” అంది. బిక్కుబిక్కుమంటూ క్లాస్ బయటకు వచ్చేసాను. అప్పుడే అర్దమయింది అమ్మాయిలు ఎంత డేంజరో. బయటకి వెళ్ళి నుంచున్నా ఎలాగోలా తొంగి తొంగి మరీ ఫాతిమా ని చూడటానికి ట్రై చేశా. ఫాతిమా కూడా తన్న కళ్ళతోనే నవ్వుతోంది. అదినన్ను చూసే అని నాకు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ లో ఒకడినే బాక్స్ ఓపెన్ చేసి నెమ్మదిగా తింటున్నాను. ఫాతిమా నన్నే చూస్తోంది. నేను తనని అస్సలు గమనించనట్టు నటిస్తున్నాను. చూసి చూసి తన ప్లేస్ నుండి లేచి నా వైపే నడుచుకుంటూ వచ్చింది. నాలో మళ్ళీ కంగారు.. వచ్చి నా పక్కనే కూర్చుని తన బాక్స్ కూడా ఓపెన్ చేసింది. ఇద్దరం కాసేపు సైలెంట్ గా ఉన్నాం ఏమి మాట్లాడుకోలేదు, ఏం మాట్లాడకపోతే బాగోదు అని నేను మాట్లాడబోయాను. అదే సమయం లో తను ఏదో మాట్లాడబోయింది. వెంటనే ఇద్దరు నవ్వుకున్నాం. "ఏంటి? వచ్చినపటినుంచి నన్నే చూస్తునావ్? సైట్ కొడుతున్నావ?” అని నేరుగా అడిగేసింది. నేను ఏంచెప్పాలో తెలియక చిన్నగా నవ్వుతూ " సైటా? నిన్నా? అంతా సీన్ లేదులే. ఐన ఎవరికి చెప్పకూ ఇది. నవ్వుతారు!” అనాాను నవ్వుతూ. తాను వెంటనే "ఏ? ఎందుకు నవ్వుతారు!” అంది కోపంగా. “నీ మొఖం కనప డాలి కదా!" అని నవ్వేసా. తనకి బాగా కోపం వచ్చిందని తన కళ్లే చెబుతున్నాయి . నేను వెంటనే "హే !సారీ.. ఐ యమ్ జస్ట్ కిడ్డింగ్"అనాాను నవ్వుతూ. తాను కోపం గా " ఖలాస్!” అని చెప్పి వె ళ్లిపోయింది తన ప్లేస్ కి. రెండో రోజు మామూలుగా క్లాస్ లోకి వచ్చాను.ఫాతిమా నాకేసి చూస్తోంది. నేను అటువైపు చూడకుండా నేరుగా నా ప్లేస్ లో వచ్చి కూర్చున్నాను. క్లాస్ మొదలుఅయింది. మేము మాట్లాడుకోకపోయిన మా కళ్ళు మాట్లాడుకుంటునాయి. నేను అసలు క్లాస్ శ్రద్ధ గా వినలేకపోతున్నను. ఇంక ఇలా కాదు అని లంచ్ బ్రేక్ లో తన దెగ్గరకు వెళ్ళి సారీ చెప్దామ్ అని మాట్లాడబోయాను. ఇంతలో తానే “ఆశ్రిత్! ఐ యమ్ సారీ.. నేనే అనవసరం గా కొప్పడ్డాను. ఏమనుకోకు లెట్స్ బి ఫ్రెండ్స్!" అంది షేక్ హ్యాండ్ ఇస్తూ. " హే! నేనే అలా అనకుండా ఉండాల్సింది నువు సారీ చెప్పకు. నేనే చెప్పాలి నీకు!” అన్నాను. అలా మేము మంచి స్నేహితులం అయ్యాము. కలుసుకోవడం, సరాదాగా జోకులు వేసు కోవటం, మాట్లాడుకోవటం, కొట్లాడుకోటం, బాధపడటం, మళ్ళీ కలుసుకోటం, అలా రోజులు నెలలు అయ్యాయి. నెలలు మూడు సంవత్సరాలు ఐపోయాయి. కానీ నేను ఫాతిమా కళ్ళు తప్ప మోహం ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు. నాకు మొహం అవసరం లేదు అనిపించింది ఒక మనిషి తో స్నేహం చేయటానికి మనిషి మనస్తత్వం నచ్చాలి కానీ మొహం ఆమె అందం కాదు. ఒక మనిషిని ఇష్టపడటానికి తన మాటతీరు మంచితనం చాలు కానీ తన ముఖాసౌదర్యం అక్కరులేదు అనుకున్నాను. ఒక రోజు తాను నా దగ్గరకు వచ్చి "నువ్వు స్కూలింగ్ అయిపోయాక మోడెలింగ్ చేస్తే బాగుంటావ్. నీ హ్యాండ్సం ఫేస్ కి హైట్ కి బాగుంటుంది" అంది. “ఉరుకో ఫతూ కామిడీ చేయకు!” అని పెద్ద గా సిరీస్ గా తీసుకోలేదు. "నేను కాదు. నువ్వు మోడెలింగ్ చేయాలి మన స్కూల్ లో నాతో సహ అందరికీ ని కళ్ళు అంటే ఇష్టం. నాకు మొదటి నుండి ని కళ్ళు అంటేనే చాలా ఇష్టం. నాకు ఎందుకు నీలాంటి కళ్ళు లేవా అని బాధ పడుతూ ఉంటా తెల్సా!” అన్నాను. "అంతా ఇష్టమా?ఇతే ఇచ్చేస్తా తేసేసుకో!” అంది ఫాతిమా నవ్వుతూ. ఆరోజు ట్వెల్త్ బోర్డు ఎగ్జామ్స్ ఐపోయాయి. ఇంక నేను ముంబై ఐ ఐ.టి లో ఎలాగైన సీట్ తెచ్చుకోవాలని పరీక్షలకి సిద్దం అవుతున్నాను. సాయంత్రం ఫాతిమా నుండి కాల్ వొచ్చింది. "అష్రు! నిను అర్జెంట్ గా కలవాలి రా! ఇప్పుడే!” కంగారు గా అంది ఫాతిమా. “సరే! ఏమయింది? కంగారూపడుతున్నావ్? చెప్పు. మీ ఇంటి వెనకాల ఎప్పుడు కలిసే గ్రౌండ్ కి రానా?” అన్నాను. " వద్దు .నేనే మీ ఇంటి దగ్గరికి వస్తా!” అంది ఫాతిమా. "సరే" అన్నాను. ఓపావుగంటలో కంగారుగా ఆయాసపడుతూ వచ్చింది ఫాతిమా. "అష్రు! నాకేం చేయాలో తెలియడం లేదు రా! నాకు చెప్పకుండా నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నాలుగు రోజుల్లో నా పెళ్లి అంట. నాకు ఇష్టాం లేదు. ఏదోకటి చేయి రా!”అని ఏడవటం స్టార్ట్ చేసింది. నాకేం చేయాలో ఎలా ఓదార్చాలో అర్దమకాలేదు. " నేను మి ఇంటికి వచ్చి మాట్లాడనా? నువ్వు చదువుకుంటవు అని చెప్పినా? మా పరెంటర్స్ ని కూడా తీసుకుని వస్తా.” అన్నాను. “లేదు రా! మా నాన్న అస్సలు వినరు. నేను నితో వచ్చేస్తా!” అంది. తన ఉద్దేశం నెమ్మది అర్దమయింది తాను నన్ను ప్రేమిస్తోంది. నాకు తాను అంటే ఇష్టం ఉన్నా ఏంచేయాలి? నా చదువు పూర్తికాలేదు. నాకే ఆధారం లేదు. ఏంచేయలేని పరిస్తితి. నాకేం చేప్పాలో అర్దoకాలేదు. కాసేపు మౌనం గా వున్నాను. "ఏమిటి ఆలోచిస్తున్నావు?నేను నిన్ను ప్రేమిస్తునా. నీతో వచ్చేస్తా . తీసుకు పో"అంది నన్ను గట్టిగా పట్టుకుని. "ఏమయింది? మాట్లాడవ్? నువు కూడా నన్ను ప్రేమిస్టునవ్ కదా! చెప్పు నోరు తెరిచి" అంది.నాకు ఏం చెప్పాలి తోచడం లేదు. "ఇప్పటిదాకా నా మొహం నీకు చూపించలేదు అనే కదా నాకు ఎస్ అని అనలేకపోతున్నావ్ ? ఇప్పుడు చూడు" అని తన మేలి ముసుగు తీయబోయింది నేను అడ్డుకుని "వద్దు. నాకు ను వ్వి లాగే ఇష్టాం యిలాగే కావాలి. రేపు నీ కళ్ళలో నేను నీలు చూస్తాను. అవి బాధ తో వొచ్చేవి కాదు. ఆనందం లో వచ్చేవి. నాకు నీ కళ్ళు అంటే అంతఇష్టాం.ఇప్పుడు నా మాట విను..ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను..నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ..నడు" అన్నాను స్కూటర్ స్టార్ట్ చేసి. అయిష్టం గానే స్కూటర్ ఎక్కింది .తనని ఇంటి దగ్గర దిగబెట్టి వెనక్కి వస్తున నన్ను కొంతమంది వ్యక్తులు నిర్మానుష్యంగా ఉన్నచోట ఆపారు. ఎవరో తెలీదు. నన్ను కిందకి లాగి " ఏరా ఫాతిమా కళ్ళు అంటే అంత ఇష్టమా? ఇప్పుడు ఏ కళ్ళ తో చూస్తావ్ రా!" అని న రెండు కళ్ళని గాజు పెంకులతో గుచ్చేసారు. నిస్సహాయ స్థితి లో నేను నా కళ్ళని కాపాడుకోలేకపోయాను ఫాతిమాని కాపాడుకోలేకపోయాను. కళ్ళు కోల్పోయిన నేను తన పెళ్లి ఆపలేకపోయాను. నాకు ఇలా జరిగిన విషయం తెలు సుకుని, ' నా కళ్ళను ఆశ్రిత్ కు పెట్టాలి నేను ఎక్కడ ఉన్నఆశ్రిత్ ను మాడెల్ గా చూడాలి. ఇదే నా ఆఖరి కోరిక ' అని లేఖ రాశి పెళ్లి జరిగిన రోజే ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు నేను మీకు ఇ స్థాయి లో ఉండి ఇంటర్వ్యూ ఇస్తునా అన్నా,నేను ప్రపంచాన్ని చూస్తునా అన్నా ఫాతిమా నే కారణం. తన లాంటి కళ్ళు నాకు లేవు అన్నపుడు ఇస్తా తీసేసకో అని సరదాగా అన్న విషయాని నిజం చేసింది." అన్నాడు ఆశ్రిత కళ్ళు తుడుచుకుంటూ.. అమీర్ కూడా కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ న్నాడు. “ఆరోజు మీ మీద ఎటాక్ జరగింది ఫాతిమా ఇంటి వెనకాల ఉన్న కాళీ గ్రౌండ్ దగ్గరే కదా? మీకు ఆపరేషన్ జరిగినది మేరీ హాస్పిటల్ లో కదా?” అన్నాడు అమీర్. “అవును మీకు ఎలా తెలుసు?” అన్నాడు ఆశ్రిత్. "మీరు నన్ను క్షమిస్తా అంటే ఒక నిజం చెబుతాను" అన్నాడు అమీర్. “ఏమిటది?” అన్నాడు ఆశ్రిత్. “ఆ రెండు చేయించింది నేనే! ఫాతిమా అన్నయ్య ను నేను!” అన్నాడు అమీర్. వెళ్ళిపోతూ అమీర్ "మీదగ్గర ఫాతిమా ఇచ్చిన ట్వెల్త్ స్టాండర్డ్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఇంకా ఉందా? అందులో మీకోసం ఫాతిమా ఒకటి దాచి పెట్టినట్టు తన ఆఖరి లేఖ లో రాసుంది ” అన్నాడు. “నా దగ్గర తాను ఇచ్చిన ప్రేతీ వస్తువు ఇంకా ఉన్నాయి. ఎందుకు అడుగుతునరు?” అన్నాడు ఆశ్రిత్. “ఐతే నేను చెప్పిన పుస్తకం లో 143 పేజీ తెరచి చూడండి, గూడ్ బై!” అని వెళ్ళిపోయాడు అమీర్ . అది విన్న ఆశ్రిత్ ఇంటికి పరుగుతీశాడు. తన గదిలోకి వెళ్ళి అమీర్ చెప్పిన పుస్తకం కోసం వెతికాడు. అమీర్ చెప్పిన పేజీ లో ఫాతిమా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఉంది.