గృహిణి - చంద్ర శేఖర్ కోవూరు

house wife

ఏమండి ఈ ఒక్క రోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా లేదు ఏమి? ఏమైనా పండగ? మన పెళ్లి రోజు అండి. ఓహో అలాగా అయిన నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్... సాయంత్రం 6 అయింది భర్త రాలేదు. 7 అయింది అయిన రాలేదు. ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మ్రోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది కాదు వాళ్ళ మమ్మీ. అమ్మ సంధ్య ఎలా ఉన్నావమ్మా. బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి . Thank you అమ్మ . అల్లుడు నువ్వు ఎక్కడున్నారు బయటకెళ్లారా. అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా మీ నాన్నా మాటాడతారంట. అయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి అల్లుడుగారు సెలవు పెట్ట లేదా .నువ్వు చెప్పలేదా. చెప్పానమ్మా అయిన లివ్ లేదని వెళ్లిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు ఎంత చెప్పినా". అంతేనమ్మా ఈమగాల్లాంతా ఇంతే అంటుూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్ అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు నేను మీ మావయ్యని బాగున్నావా. హా మావయ్య గారు బాగున్నాను. హ్యాపీ anniversary బాబు. Thank you మావయ్యా గారు. ఏమిటి నాయన పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా. మావయ్యగారు నేను బిజీగా ఉన్నాను మల్లి ఫోన్ చేస్తా. అని పెట్టెసాడు. ఏమే శ్యామల అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేసాడు. హా ఎందుకు పెట్టడు మా అల్లుడు మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా అసలు నేను ఆనాడే చెప్పాను. ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దండి సెలవులు ఉండవు జీతం తక్కువ అది ఇది అని. హాయిగా ఎ గవర్నమెంట్ టీచర్ కో, లెక్చరర్ కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా బోలెడన్ని సెలవలు ఎప్పుడు కావాలంటే అప్పుడు లివ్ లు ఉంటాయి. నా మాట విన్నారా మంచి సంబంధం మీ చెల్లెలి కొడుకు అని నానోరుమూయించి పెళ్లి చేసారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బాయిప్పుడు ఏమైయింది కారాలు మిరియాలు నూరుతున్నావు. వాళ్లిద్దరు బానే ఉన్నారు. హ అని మీరు నేను అనుకోవడం కాదు అమ్మాయి చేస్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మ చెప్పమ్మ. ఎమ్మా వచ్చాడా అల్లుడు. లేదమ్మా ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటి టైం 9.30 అవుతుంది ఇంకా రాకపోవటమేంటి. ఏమో అమ్మ ఈయన ఎప్పుడు ఇంతే. అది సరేగాని అబ్బాయి నిను బాగా చూసుకుంటున్నారంటే. హా బానే చూసుకుంటాడు అమ్మ . కాకపోతే ఎక్య వ టైం ఆఫీస్ ఆఫీస్ పని పని అని నాతో ఎక్కువ సేపు ఉండరు. పెళ్లి రోజుకి చీర ఏమన్నా కొనిచ్చాడా. లేదమ్మా అసలు ఆయనకి గురుతులేదు అంటా. ఏమిటో ఒక్కగానొక్క కూతురువి మహారాణిలా చూసుకున్నాం మేము ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇపుడేమో యిలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులేమ్మా నేను బానే ఉన్నాను. టింగ్ టింగ్ calling బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా ఆయనొచ్చినట్లున్నారు. చెంగు చెంగున వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. తీరా చుస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మ పొద్దున్నుండి లేము బయటకు వెళ్లి వచ్చాము హ్యాపీ మ్యారేజ్ డే. Thank యు ఆంటీ. అబ్బాయి ఉన్నాడా అమ్మా. ఇంకా రాలేదు ఆంటీ. వచ్చాక తనకి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వోచి సోఫాలో కూర్చుని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు ఆలా ఆలా నుదుటి మీద జుట్టు జాలువారినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్ నిక్ కి వెళ్లినరోజులు, అమ్మచేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్దమనిషి అయిన రోజులు, వోనీ వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించమని కుర్రాళ్ళు వెంటబడ్డ రోజులు, 20 ఏళ్లు వచ్చినా అమ్మ వడిలో పడుకున్నరోజులు, తన బర్త్ డే కి నాన్నా స్కూటి కొనిచ్చిన రోజులు, అన్ని ఒక్కసారి వోచి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిద్రమత్తులో పడబోయి ఉలిక్కిపడిలేచింది. ఎదురుగ చుస్తే తన భర్త అజయ్ కూర్చుని ఆమెనే చూస్తున్నాడు ఏమండి మీరెప్పుడు వోచారు అంటూ భర్త ని హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య డోర్ వేయకుండా పరధ్యానం గా ఉన్నావు. ఏమైంది. ఆబ్బె ఏమి లేదు అంది మీకోసమే ఎదురుచూస్తున్నాను. సారీ సంధ్య లేట్ అయింది అంటూ టైం చుస్తే 11 అయింది. ఆఫీస్ లో ఓవర్ టైం చేసాను. అందుకే లేట్ అయింది. అయ్యో సారీ ఎందుకండీ మీగురించి నాకు తెలియదా అని. అదేమిటి నామీద కోపం గా లేదా అన్నాడు. కోపమెందుకు అండి. ఇప్పటికైనా వోచారు కదా. అన్నం తిన్నావా. లేదండి మీరు వస్తే తిందామని అన్ని సిద్ధం చేసాను. సరే నీకు రెండు శుభవార్త లు చెప్తాను. అవునా ఏమిటి అవి చెప్పండి. రేపటినుండి 6 అయేసరికి నీ ముందు ఉంటాను. వావ్ నిజామా ఎంత మంచి మాట చెప్పారు మరి రెండోది ఏంటి. తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది. ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెస్. తాను ఆశ్చర్యపోయింది ఏమండి ఇది నేను నేను అంటుంటే. అవును సంధ్య సరిగా వన్ ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లస్. అప్పుడు నాకు స్తోమత లేక కొనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేసాను డబ్బులు దాచాను. ఈరోజు దాని కొనగలిగాను అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళలో ఆనందం ప్రేమ ఆశ్చర్యం బాధ అన్ని ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హాగ్ చేసుకుని గట్టిగ ఏడ్చేసింది. ఏమైంది సంధ్య అని అడిగాడు. నాకోసం మీరు ఇంత కష్టపడ్డారంటే నేనంటే మీకెంత ప్రేమండి. నేనే మిమ్మల్ని సరిగా అర్థ చేసుకోలేక అపుడప్పుడు బాధపడ్డాను నన్ను క్షమించండి. నో సంధ్య నేనే టైం స్పెండ్ చేయలేకపోయాను సారీ. నాకు ప్రమోషన్ కూడా వొచింది సంధ్య నా జీతం డబల్ అయింది ఇకనుండి మనకు అనీ మంచి రోజులే అనగానే . భార్య ఇంకా ఆనందపడింది.. ఇద్దరు కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికారు వెళ్లి ఆలా ఆలా చల్లగాలికి తిరిగి వోచి హ్యాపీ గ పడుకున్నారు. కదా గోతెలుగుకి మనం ఇంటికి... 🧕🌸☘🌸☘🌸☘🌸☘🌸🧕

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు