పుణ్య దంపతులు - రాము కోలా.దెందుకూరు

Virtuous couple

"ఒరేయ్! మాధవా! నిద్ర లేవరా!" "ఇప్పటికే మీ నాన్నగారు నిప్పు తొక్కిన కోతిలా చిందులేస్తున్నారు," అంటున్న అన్నపూర్ణమ్మగారి మాటలకు "ఏంటమ్మా!"పోద్దున్నే సరిగా నిద్రపోనీయవు కదా" అంటూ కన్నులు నులుముకుంటూ బెడ్ రూమ్ నుండి బయటకు వస్తున్న మాధవుడి నెత్తిపై గట్టిగా ఓ మొట్టికాయ వేసింది అన్నపూర్ణమ్మ గారు.

"ఈ రోజు సాయంత్రం రమణి పెళ్ళి" "మనం కుటుంబ సమేతంగా వస్తున్నామని,తన బాల్యమితృడు కుచేలరావుకు మీ నాన్నగారు మాట ఇచ్చేసారట" "ఆరు నూరైనా!నూరు ఆరైనా!వెళ్ళి తీరవలసిందే" అంటూ."ఆర్డర్ మరీ వేసి బయటకు వెళ్ళారు, మీ నాన్నగారు." "వచ్చేలోగా రెఢీ ఆవ్వండీ" "లేదంటే ఇక ఇల్లు కిష్కింధలా మారుతుంది" అంటూనే అన్నపూర్ణమ్మ గారు వంటగదిలోకి రాకెట్ లా దూసుకు పోయారు.

*****

"ఆరు పదుల వయసులో కూడా ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలరు మీరు?" అంటూ అప్పుడప్పుడు పక్కింటి వారు అడిగే ప్రశ్నలకు "ఇంట్లో సొట్ట పడిన వంట సామాన్లు చాలా ఉన్నాయమ్మా!" "వాటిని అడిగి మరోసారి మీ అనుమానం నివృత్తి చేస్తాను సరేనా!" అంటూ చిలిపిగా సమాధానం చెప్పే అన్నపూర్ణమ్మ గారంటే, ఆ కాలనీలో అందరికి చెప్పలేనంత గౌరవం. ******

"అమ్మా!నన్ను మాత్రం నిద్ర లేపావు సరే!" "మరి నీ గారాల కూతురు ఎక్కడా కనిపించదేం, ఇంత పుత్రిక ప్రేమ పనికి రాదు, దీనిని మేము నిరసిస్తున్నాం" అంటున్న మాధవుని మాటలు వింటూనే " ఏమండోయ్ వచ్చేసారా!" "ఇక మీదే ఆలస్యం,"అంటున్న అన్నపూర్ణమ్మ గారి మాటలకు. "బాబోయ్ నాన్నగారు వచ్చేసారా! అంటూ బాత్రూం వైపు పరుగు తీస్తున్న మాధవున్ని చూసి ముసి ముసిగా నవ్వుకుంది అన్నపూర్ణమ్మ గారు." ఏమోయ్! శ్రీమతి.. నీ ముస్తాబు పూర్తి అయ్యే సరికి, అక్కడ ఉంది చూసావు, గడుసు పిల్ల రమణి," "ఓ పిల్లనో పిల్లాడినో సంకనేసుకు వచ్చేస్తుంది తనని దీవించమంటూ" "కాస్త ఈ పుట్టు నీ ముస్తాబు తగ్గించి త్వరగా తెమలవచ్చుకదా" "ఆ తెచ్చిన మేకప్ కిట్ అయిపోవడం, నా జేబులో డబ్బులు ఖర్చు కావడం తప్ప నీ అందంలో ఏ మాత్రం మార్పు రాదని నీకు తెలుసుకదా" "అందుకే నీతో ప్రయాణమంటే మీ నాన్న గారు, అదే మా మావగారు ఓ నవ్వు నవ్వేసి" "ఎం అల్లుడు గారు, ఓ రెండు రోజులు ముందు ప్రయాణం అయితే, సమయానికి వచ్చేవారు కదా!" "అంటూ ఎన్ని సార్లు దెప్పిపొడుపుగా అన్నాడో నేనింకా మర్చి పోలేదు తెలుసా" అంటున్న గోపాలకృష్ణయ్య గారిని కరకరా నమిలేసేలా చూసింది అన్నపూర్ణమ్మ గారు. "చాల్లేండి ! ఏదో సరదాగా ఒక్కసారి అన్న మాటకు, ఎన్ని వందల సార్లు అన్నారో మీరు తెలుసా!" కాస్త బుంగ మూతి పెడుతూ అందుకుంది అన్నపూర్ణమ్మ గారు చిన్నబుచ్చుకుంటు "చాల్లేవోయ్! పుట్టింటి వారినంటే చాలు, వెంటనే గంగా దేవిని భువికి దించేస్తావ్"

"నీ పుణ్యామంటూ పెరటిలో మొక్కలకు నీటి కోరత లేదు కదా" అంటూనే ముసి ముసిగా నవ్వేసాడు గోపాలరావు గారు. "పేరుకే గోపాలుడు, మనిషి శ్రీ రామచంద్రుడు" అనుకుంది మనసులో అన్నపూర్ణమ్మ గారు. పట్టు పంచే, భుజాన కండువా, నుదుట నిలుపుగా పెట్టిన నామాలతో, గోపాలుడే అనేలా ఉన్నాడు, గోపాలకృష్ణయ్య గారు అన్నపూర్ణమ్మ గారు కూడా తనకు సరి జోడు ఈమే కదా ! అనేలా,పట్టు చీరలో మెరిసి పోతున్నారు. పుణ్య దంపతులు ఏ జన్మ సుకృతమో వీరి బంధం అనేలా ఉన్నారు ఇరువురు..

*****

"ఇంటి ముందు ఆగిన కారును చూస్తూ, పరుగు లాంటి నడకతో ఎదురు వచ్చేసాడు కుచేలరావు గారు... "ఎరా ! పెళ్ళికి ఓ రెండు రోజుల ముందు రారా అంటే, వీలు కాదనేసి, ఏకంగా పది రోజులు ముందే వచ్చేసావా!" "ఇంకా నీ అల్లరి తగ్గలేదురా గోపాలా!" అంటూ ఒకరిని ఒకరు కౌగలించుకుని, ముందుకు సాగుతున్న గోపాల కుచేలరావులను చూస్తూ, అంటే! పదహారవ తారీఖును కాస్త మావారు తన మతిమరుపుతో ఆరో తారీఖు చేసేసారా!" "హతవిధీ"అనుకుంది అన్నపూర్ణమ్మగారు "రమణి! నీ పెళ్ళి వలన ఇన్ని సమస్యలు" అనుకోవడం మీ నాన్ను వంతు అవునో కాదో కానీ. మవారి లోని మతిమరుపు సమస్య బయట పడింది కదా!" అనుకుంది అన్నపూర్ణమ్మ గారు.

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు