రాజశేఖర్ పల్లెటూరి వాతావరణం లో పెరిగాడు ,ఆ వూళ్ళో హైస్కూల్ వరకే వుంది ,పై చదువులకి సిటీ కి వెళ్లాలి!అతను యెప్పుడూ ఊరుదాటలేదు!అవసరం కూడా పడలేదు !ఎందుకంటె నాన్న వైపు అమ్మ వైపు వాళ్లు. బంధువులూ,అందరూ అక్కడక్కడే వున్నారు !ప్రతి వీధి , ప్రతియిల్లు తనదిగానే వుండేది,పచ్చని పొలాలు చల్లని సెలయేటి గలగలలు దేవాలయం స్నేహితులు !!! అవినాభావం గా అతని జీవితం లో అల్లుకుపోయాయి !
పట్నానికి పైచదువులకి పోవాలంటే దుఃఖం ఆగడం లేదు ! సామాన్య సంసారం !కానీ యే లోటూ లేదు ! మితిమీరిన సంపాదన లేదు !అయినా వున్నదాంట్లో ఆనందం గా హాయిగా వున్నారు ! బంధువర్గం లో సంపాదన కన్నా మనిషి వ్యక్తిత్వానికి విలువ గుర్తింపు వుండేవి. అతనికి అరణ్యవాసానికి వెళ్తున్నట్టుగా వుంది ! అన్నయ్య రామచంద్రానికి ఇంటికి పెద్దకొడుకు అవడం వల్ల తండ్రికి చేదోడు వాదోడుగా తన చదువును మిడిల్ స్కూలు తో ఆపాడు ! అప్పటికి హైస్కూలు వూళ్ళో లేదు !
అందుకే తమ్ముణ్ణి బాగా చదివించి ఒక ఉద్యోగస్తుడిగా చూడాలనుకున్నాడు ! పల్లెటూరు కాబట్టి చిన్నతనం లో మేనత్త కూతురు సీత తో పెళ్లయ్యింది ! రాజశేఖర్ అన్నయ్యతో పట్నానికి బయలుదేరాడు !తండ్రి ఆశీస్సులు ,అమ్మ ముద్దులు ,స్నేహితుల దిగులు చూపులు !!మళ్లీ అందరినీ యెప్పుడు చూస్తానో అనుకుంటూ కన్నీళ్లతో బస్సెక్కాడు . రామచంద్రానికి కూడా కన్నీళ్లు తిరుగుతున్నాయి ,అయినా పైకి గంభీరం గా వున్నాడు .
రామచంద్రం తమ్ముణ్ణి కొంత డబ్బు అవసరానికి యిచ్చి జాగ్రత్తలుచెప్పితిరుగుముఖం పట్టాడు .
రాజశేఖర్ మొదట్లో తన జీవితం మీద తనకుఅధికారం లేనట్టుగా భావించేవాడు . క్రమం గా మారుతున్న తన జీవితపు మలుపులను అంగీకరించడం ప్రారంభించాడు . తన చదువు ,మంచి వుద్యోగం ,కష్టపడి చదివిస్తున్న అన్నయ్యకు సాయపడడం !అతనికి తన భవిష్యత్తు అర్ధమయ్యింది !
కానీ కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుంది . రాజశేఖర్ డిగ్రీ చదువుతున్న సమయం లోనే భయంకర తుఫాను !గాలివానకు వూళ్లో పంట నష్టం ! గిట్టుబాటు ధర రాలేదు . రాజశేఖర్ చదువు కోసం చేసిన అప్పు తీర్చడం కోసంపొలం అమ్మాల్సివచ్చింది . తండ్రికి చూపు తగ్గింది . శరీరం లో శక్తి తగ్గింది . ఇప్పుడు రామచంద్రం అవసరాలకోసం మరొకరి పొలం లో పనికి కుదిరాడు .
రామచంద్రం పిల్లలిద్దరూ అపర్ణ ,ఆదిత్యపెద్దవాళ్లవుతున్నారు . ఇంత క్లిష్ట సమయంలో కూడా రామచంద్రం డబ్బు పంపుతున్నాడు . మొత్తానికి రాజశేఖర్ డిగ్రీ చేతికి వచ్చింది .ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టాడు .
పుట్టిపెరిగిన వూళ్లోనే వుద్యోగం చెయ్యాలనుకున్నాడు . ఊరికి వచ్చాడు . కానీ యిప్పుడు వూళ్లో మునుపటి బంధాలు ,ఆప్యాయతలు కరువయ్యాయి . పంట నష్టం కోలుకోలేని దెబ్బ !అందరూ తమ తమ కుటుంబ పోషణకు దారులు వెతుక్కుంటున్నారు . తనవారి ఇళ్లే పరాయి యిళ్లయ్యాయి .
" ఒరేయ్ ఎందుకురా డిగ్రీ పుచ్చుకుని యీ వూరొచ్చావు ?ఇక్కద ఏం వుద్యోగం వస్తుంది !అన్నయ్యకు సాయం బదులు బరువవుతావు పట్టణం లో వుద్యోగం చేసి అన్నయ్య కు అండగా నిలబడు "వూళ్లోవాళ్లు సలహా యిచ్చారు .
వూళ్లో వుద్యోగం ప్రయత్నించాడు !లాభం లేకపోయింది !రామచంద్రం వూళ్లోని బంధువులమ్మాయి అంజలితో రాజశేఖర్ పెళ్ల్లి జరిపించాడు !
రాజశేఖర్ వైవాహిక జీవితం నిరుద్యోగం తో మొదలయ్యింది . బాధ్యత పెరిగింది . అన్నయ్య మీద భారం యెక్కువయ్యింది . అంజలి అన్నయ్య ద్వారా పట్నం లో ప్రైవేట్ బళ్లో వుద్యోగం రాజశేఖర్ కి వచ్చింది .
రాజశేఖర్ ఇంటివాడయ్యాడు ,ఉద్యోగస్తుడయ్యాడు . కొత్తకాపురం పట్నం లో రెండుగడుల యింట్లో మొదలయ్యింది కానీ జీతం సరిగా ఇచ్చేవాళ్లు కాదు . మొదట్లో కష్టం గా వుండేది . మెల్లగా భార్యాభర్తలిద్దరూ అలవాటు పడ్డారు ఇంటి అద్దె ,వెచ్చాలు ,కాస్త మంచి దుస్తులు కూరా నారా ,యివన్నీ ఖర్చు చూసుకునేటప్పటికి చివరకు యేమి మిగులు కనిపించేదికాదు . ఎంత ప్రయత్నించినా యింటికి పంపించడం కుదిరేది కాదు .
రామచంద్రం అన్నయ్య అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తున్నాడు . అతను ఫోన్ల వాడడు . అతనికి పాతతరం వాసనలు ,ఆప్యాయతలు ,అనుబంధాలు ,బంధుత్వాలు యింగువ కట్టిన గుడ్డ లాగా అంటుకునేవున్నాయి . తమ్ముడికి క్షేమసమాచారాలు అడుగుతూ ఉత్తరాలూ వ్రాసేవాడు . యెన్నడు తన ఆర్ధిక సమస్యలు ,డబ్బు పంపమని వ్రాసేవాడు కాదు పెద్దపిల్ల అపర్ణ ,పిల్లాడు ఆదిత్య బాగాచదువుకుంటున్నారని తెలిపేవాడు .
రాజశేఖర్ పట్నం వచ్చి ఐదుసంత్సరాలు అయ్యింది . అత్తవారింటికి రెండుసార్లు వెళ్లాడు కానీ అన్నయ్యను చూడడం కుదరలేదు .తండ్రి తనపెళ్లిఅయినతర్వాత చనిపోయాడు . మొదటిసారిగా తనపరిష్టితికి విరక్తిగా నవ్వుకున్నాడు .ఎన్నో వూహించుకుంటూ చదువుకున్నాడు ,వుద్యోగం లో చేరాడు .కానీ అన్నయ్యకు అండగా నిలవలేకపోతున్నాడు . మధ్యతరగతి జీవితాలు యింతేనేమో !!
చదువు ,వుద్యోగం ,పెళ్లి ,సంతానం !!ఒకచట్రం చట్రంలో చిక్కితే బంధాలు తగ్గుతాయా ,లేక తనే ఆలా మారిపోయాడా ? చిన్నప్పటి ఆప్యాయతలు ,అనురాగాలు యేమయ్యాయి !! అతనికి యాంత్రిక జీవనం మీద నిరాశక్తత !!!
ఎక్కడో యేదో గిల్టీ గా బాధగా గుండె తడితగిలింది రాజశేఖర్ కి .
రాజశేఖర్ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు . "అపర్ణ చదువైపోయింది . యింటిపట్టునే వదినకు చేదోడుగా వుంటున్నది . ఆదిత్య యీ సంవత్సరం హైస్కూలు అయిపోతుంది . కాలేజీ చదువు ఆలోచించాలి . అపర్ణకు మంచి సంబంధం వెదకాలి . వ్యవసాయం సరిగా లేదు .ఏదో చేతికి మూతికి సరిపోతున్నది . " అన్నాడు రామచంద్రం .
"అన్నయ్యా నీకు డబ్బవసరం వస్తే వుత్తరం వ్రాస్తే పంపుతాను కదా "అన్నాడు రాజశేఖర్ .
"ఒరేయ్ డబ్బవసరం యెప్పుడూ వుంటుంది ,ఏం వ్రాయనురా ? నీకు కుదిరినప్పుడు నువ్వు యిబ్బంది పడకుండా పంపు "అన్నాడు రామచంద్రం . .
అన్నయ్యకు పంపానన్నాడు రాజశేఖర్