బోరు బావి కనకారావు ఆఫీస్ లో పని చేసుకుంటుంటే అతని బార్య కాంతం నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తిన కాంతారావుకి, ఫోన్ లో ఏడుపు తప్ప ఏమీ వినపడక పోవడంతో.
" ఏమైందే కాంతం,ఫోన్ చేసి మాట్లాడకుండా ఏడుస్తావు ఏంటే ? " అంటాడు అసలే పని వల్ల విసుగ్గా వుండి. అదీ.. అదీ..మన యమున లేదు. అది ఎంత పని చేసిందో తెలుసా! అండి, మూడు పూటలు చక్కగా సీరియల్స్ చుడాడానికి టీవీ కుడా లేని పాల వాడితో లేచి పోయింది అండి అంటూ ఏడుస్తుంది కాంతం.
" అసలు ఈ యమున ఎవరే " అంటాడు కనకారావు. " జీవితమే ఒక చదరంగం" సీరియల్ లో హీరోయిన్ అండి. ఇంట్లో చక్కని పెళ్లి సంబంధాలు చూస్తూంటే. ఆ మాయదారి పాలోడితో లేచిపోయింది అంటుంది ముక్కు చీదుకుని,పమిట కొంగుతో కల్లోత్తుకుంటూ. ఏడ్చినట్టు వుంది. నీ సీరియల్ పిచ్చి తగలేయ్యా!
అసలే నేను, ఆఫీస్ పనితో చచ్చిపోతుంటే మధ్యలో నీ సీరియల్ గొడవ ఒకటి అంటూ ఫోన్ కట్ చేస్తాడు కనాకారావు. మధ్యాహ్నం, కనాకారావు భార్యకి ఫోన్ చేసి " ఏంటే ఈ కూర ఇలా వుంది.
ఓ ఉప్పు లేదు,కారం లేదు. మనిషి అనే వాడు ఎలా తింటాడే " అంటాడు కోపంగా. మీరు మరీను " పెళ్ళాం - బెల్లం " అనే సీరియల్ లో భార్య ఇలానే భోజనం వండితే. ఆ భర్త ఎంత చక్కగా తిన్నాడో తెలుసా! భర్త అంటే వాడు. అసలు మీకు నా మీద ప్రేమే లేదు అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది కాంతం.
సాయత్రం కాంతం ఫోన్ చేసి ఏడుస్తూ వుంటే,ఈ సారి రావుకి కోపం నషాళానికి అంటుకుని. ఈ సారి ఏమైందే. " పందిరి మంచం - పాత మొగుడు " సీరియల్ లో పందిరి విరిగిపోయిందా ఏంటి? అంటాడు వెటకారంగా. " ఏమండీ,మన అబ్బాయి బిట్టూ! స్కూల్ పక్కన వుండే, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆడుకుంటూ వుంటే పక్కనే వున్న బోరు బావిలో పడిపోయాడు అంట. ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అంటూ బోరున ఏడుస్తూ, ఏ దిక్కుమాలిన మునిసిపాలిటీ హెడ్, వాడికి ఆ బావి పెర్మిషన్ ఇచ్చాడో! వాడి చేతులు పడిపోను అంటుంది కాంతం.
"ఆ దిక్కుమాలిన హెడ్ నేనే, ఇక ఆ శాపనార్థాలు ఆపి నువ్వెళ్లి అక్కడే వుండు. నే వస్తా” అంటాడు కనకారావు. అలాగే నండి అంటూ కాంతం బోరు బావి దగ్గరకి వెళ్లి, బిట్టు..బిట్టు..అని శోకాలు పెడుతూ వుంటాది. అక్కడికి వచ్చిన రావు " బావి దగ్గరకు నోరు పెట్టీ, బాబు బిట్టు! ఉన్నావా! అంటాడు”. నాన్నారు! నేను ఇక్కడే వున్నానండి. త్వరగా నన్ను బయటికి తీయండి. అంటూ బిట్టు గొంతు వినపడుతుంది.
"అలాగే నాన్న! జాగ్రత్తగా వుండు. నేను ప్రయత్నిస్తాను." అంటూ రావు తన ఫోన్ తీసి ఆఫీస్ కి ఫోన్ చేయబోతుంటే.
నాన్నారూ! నాకు ఆకలి వేస్తుంది. ఓ రెండు... కాదు, కాదు.. ఓ పది, బింగో పెకెట్స్! ఇందులో వేయండి.” అంటాడు బిట్టు. " నీ బింగో గోల! తగలెట్టా!వాటిని కొనడానికి కదరా! నా ఆస్తులన్నీ అయిపోతున్నాయి. ఆ బింగో పాకెట్ కనిపెట్టినోడూ నాకు దొరకాలి " అని రావు కోపంగా పళ్ళు నూరుతుంటే. " ముందు వాడి కోసం వెతకడం మాని,బిట్టునీ ఎలా బయటికి తీయాలో ఆలోచించండి
" అంటుంది కాంతం. అవును కదా! దాని గురించే మరచి పోయా సుమీ! అంటూ రావు, ఫోన్ తీసి మునిసిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి. బిట్టును బయటికి తీయడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో కాంతం ఫోన్ కి , వాళ్ళమ్మ సుబ్బలక్ష్మి ఫోన్ చేస్తుంది. కాంతం
"అమ్మా!అంటూ " ఒకటే ఏడుస్థూ వుంటే. "ఏమైందే కాంతం! కొంపదీసి పద్మాకర్ గాడి! పెళ్ళాం, లేచి పోయిందా! ఏమిటి అంటుంది..?
" సుబ్బలక్ష్మి గారు! అలియాస్ కాంతం అమ్మగారు. "లేదు అమ్మా,వాడి పెళ్ళాం బట్టలు సర్ధుతున్న సమయంలో ,రేపు చూడండి అని ఆపేశారు అమ్మా! సీరియల్ నీ " అంటుంది. "అయ్యో!ఎంత పని అయ్యిందే, మరయితే ఎందుకు ఏడుస్తున్నావే తల్లి! " అంటారు సుబ్బలక్ష్మి గారు.
" అదీ మన బిట్టు గాడు! బోరు బావిలో పడిపోయాడే అమ్మా! అంటుంది కాంతం. "అయ్యో! ఎంత కష్టం వచ్చిందే వాడికి. ' పందిరి మంచం - పాత మొగుడు ' సీరియల్ లో హీరోకి వచ్చినట్టు కష్టం వచ్చింది కదే! మన బిట్టుకి" అంటుంది ఆవిడ. అవునే అమ్మా!
" మరి ఆ సుభద్ర మొగుడికి ఏక్సిడెంట్ అయ్యింది కదా! కాలు బాగు అయ్యిందా? లేక, ఇంకా సుభద్ర చేత చాకిరీ చేయించు కుంటూన్నాడా?"అంటుంది కాంతం. ఎక్కడే! వాడు, ఆ కుంటి కాలు అడ్డం పెట్టుకొని. పాపం సుభద్రను ఇంకా ఏడిపిస్తున్నాడే అమ్మడు! అంటారు సుబ్బలక్ష్మి గారు.
ఏంటి మన సుభద్ర మొగుడికి ఏక్సిడెంట్ అయ్యిందా? మరి నాకు చెప్పలేదు? అంటాడు అమాయకంగా మొఖం పెట్టుకుని రావు. సుభద్ర అంటే మన సుభద్ర కాదండీ." భర్త వెర్సెస్ భార్య " అనే డైలీ సీరియల్ లోనీ హీరోయిన్ అండి, బిట్టు కోసం వచ్చేసా కదా! సీరియల్ మిస్స్ అయ్యాను.
అందుకే అమ్మని అడుగుతున్నా! అంటూ సంజాయిషీ ఇచ్చు కుంటుంది కాంతం. “ ఏడ్చినట్టూ వుంది. ఒక పక్క కొడుకు బావిలో పడి ఏడుస్తుంటే. ' భర్త వెర్సెస్ భార్య ' సీరియల్స్ అప్డేట్ కావాల్సి వచ్చిందా! నీకు అంటాడు రావు వెర్రి మొఖం వేసుకుని చేసేది లేక. అప్డేట్ అంటే గుర్తు వచ్చిందండోయి. “ అతడు..ఆమె.. ఆవకాయ” సీరియల్ వచ్చే టైమ్ అయ్యింది అండి అంటుంది బేలగా కాంతం. అదేమీ సీరియల్ కొత్తగా వుంది అంటాడు రావు. " అదా! ఆమె, ఆవకాయ ఊర పెట్టీ, భర్తకు పెడుతుంది. అది ఇష్టం లేని వాళ్ళ అత్త, అందులో ఒక సారి ఎక్కువగా ఉప్పు వేస్తుంది. పాపం! భర్త, దాన్ని తిని భార్యను తిట్టేసరికి. హీరోయిన్ మళ్లీ ఆవకాయ పెడుతుంది. ఈ సారి వాళ్ల అత్త, అందులో కారం ఎక్కువ వేస్తుంది. భర్త, మళ్లీ తిట్టే సరికి. హీరోయిన్,
ఈ సారి మళ్లీ,అన్ని సరిగ్గా వేసి ఆవకాయ పెడుతుంది. ఈ సారి అత్త , అందులో ఏమి కలుపుతుందా? అని ఆలోచిస్తున్నా! అంటుంది కాంతం. అసలే తిక్కలో వున్న రావు, ఈ సారి కొంచం ఎండ్రిన్ కలపమను. వాడు తిని చస్తాడు. ఇంక ఏ బాధ వుండదు అంటాడు విరక్తి వల్ల కలిగిన కోపంతో. అదేంటి అండి అలా అంటారు అంటుంది కాంతం కొంచం నొచ్చుకుంటూ. మరేమీ అనాలే అసలే వర్కర్స్ బాబుని లోపలి నుండి తీయడానికి రాకుండా ఇంత టైమ్ తీసుకుంటుంటే. నీకు సీరియల్ టైమ్ అవుతుంది అంటున్నావు అంటాడు చిర్రెత్తుకొచ్చి. ఈ లోపు బాబునీ, బయటికి తీయడానికి కావలసిన అన్ని సామాన్లుతో వర్కర్స్ వస్తారు. రావు, వచ్చారా!
ఇంక పని మొదలు పెట్టండి అంటాడు. ఇంతలో చుట్టూ మూగిన జనాల్లో ఒకడైన రాజ్ అనే వ్యక్తి ముందుకు వచ్చి. ఆగండి, మీరు ఈ పని చెయ్యడానికి నేను ఒప్పుకోను అంటాడు. ఏమయ్యా! ఏమైంది?ఎందుకు అడ్డు పడుతున్నావు?అంటాడు రావు. " మొన్న, మా బస్తీలో ఇలాగే మా వాళ్ళ పాప బోరు బావిలో పడిపోయింది అంటే మీ వర్కర్స్ అంతా రావడానికి ఎంత టైమ్ తీసుకున్నారో తెలుసా! వచ్చాక కూడా అది లేదు, ఇధి లేదు అని ఎంత హడా విడి చేశారు. పాపను తీయటానికి ఎంత ఏడిపించారు.
ఇప్పుడు మీ బాబు పడ్డాడు అనగానే నిముషాల్లో మీరు పనులు చేయిస్తున్నారు. మీవేనా ప్రాణాలు. మావి కాదా? మీకొక నాయం. మాకొక నాయాం అంతేనా" అంటాడు రాజ్ ఆవేశంగా. బాబు! వాడు పసివాడు. ముందు వాడ్ని బయటికి తీయనీ. తర్వాత ఏమైనా వుంటే మాట్లాడుకుందాం అంటుంది కాంతం. అసలు మీ ఆయన లాంటి వాళ్ళు సక్రమంగా పనులు చేస్తే, ఇలాంటి బోరు బావులు అవీ ఇలా, ఒపెన్ గా వుండవు కదా తల్లి! మీ ఆయన లాంటి వాళ్ళు, వాళ్ళ పనులు సక్రమంగా చేయక పోవడం వల్ల ఇలాంటి బోరు బావులులో ఎందరో చిన్నారులు పడి, సరైన సమయంలో సాయం అందక. వారి ప్రాణాలు పోగుట్టు కుంటున్నారు.
అయినా, మీకేమి తెలుసు బోరు బావిలో పడి పోయిన వారి, వారి తల్లి తండ్రుల బాధలు అంటాడు రాజ్ బాధ నిండిన గుండెలతో. నన్ను క్షమించు బాబు! ఇకనుండి నేను, నా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటా. ఇప్పటికైన మా అబ్బాయిని బయటికి తీయడానికి అడ్డు తప్పుకో అంటాడు వేడుకోలుగా రావు. మీ అబ్బాయికి ఏమి అవ్వలేదు సార్. మీకు ఈ బోరు బావుల్లో పడిన చిన్నారుల గురించి, వారి బాధలు గురించి చెప్పడానికే, మీ అబ్బాయి బోరు బావిలో పడిపోయాడు. అని నాటకం ఆడాం అంతే అంటాడు రాజ్. ఇంతలో పక్కన గోడ అవతల ఉన్న బిట్టు పరిగెత్తుకుంటూ వచ్చి. అమ్మా,నాన్నా అంటూ గట్టిగా హగ్ చేసుకుంటాడు.
నా తప్పు తెలుసుకునేలా చేశావు. ఇప్పటి నుండి నేను, నా పనినీ సక్రమంగా చేస్తా అని రాజ్ తో అని, పదండి ఇంటికి అంటాడు రావు భార్య,బిడ్డలతో. అవును పదండి. నాకు “అత్తను కొట్టు తాళాల గుత్తిని పట్టు” అనే సీరియల్ చూసే టైమ్ అయ్యింది అంటుంది కాంతం. అవును, అమ్మా! మనం బింగో, తింటూ! సీరియల్ చూద్దాం అంటాడు బిట్టు చేతిలో వున్న బింగో తింటూ. వీళ్ళు మారరు అనుకుంటాడు కనకా రావు, నెత్తి కొట్టుకుంటూ.