ప్రొద్దునే నిద్రలేచి బ్రష్ చేసుకుందామని బాత్రూంకి వెళ్ళాను.అద్దంలో ముఖంచూసుకుని అబ్బ బాగానే ఉంటానిపించింది. చిన్నప్పుడు అద్దం లో చూసుకుంటే ఇలాగే అనిపించేది.కానీ వయసు పెరుగుతున్నకొద్ది ఎవరయినా నువ్వుబావుంటావు అంటే చెప్పలేని సంతోషంగా వుంటుంది కదా, కానీ నన్ను చూసి ప్రజలు పాపం కనుముక్కుతీరు చాలా బావుంటాయి అనేవారు.”పాపం” అని ఎందుకంటారురో తెలిసేటప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు వచ్చేసాయి.”పాపం” అంటే నలుపు, ఛామనఛాయ కొసమెరుపు.దీనితో నాకు ఒక కాంప్లెక్స్ మొదలయింది నాకు.’నేను నల్లగా ఉంటాను ,నాకు కొన్నిరంగులే నప్పుతాయి అని కొన్ని రంగుల బట్టలు తోసేసేదాన్ని.
ఏళ్ళు వచ్చేటప్పటికి సున్నిపిండి,నిమ్మకాయ గ్లిసరిన్ ,ఫెయిర్ అండ్ లవ్ల్ లిఎన్ని వాడినా అద్దం నిజం చెప్పేది నేను నలుపని కానీ బావున్నావని.
ఈి విషయం మీదే నాకు జీవితంలో మరిచిపోలేని అనుభవం ఒకటి జరిగింది మన కధ అంశం ఇప్పుడు మొదలు నాకు పెళ్ళవ్వటానికి నారంగు నాకు అడ్డం అవ్వలేదు.మా వారు కానీ మా అత్తవారింటకానీ నారంగు చెర్చలు చెయ్యలేదు. ఎదిగే వయసులో వయసులో పడిపొోయిన ముద్ర నామనస్సులో అలాగే ఉంది.మరచిపోదామన్నా జనాలు గుర్తుచేస్తునే వున్నారు. ఆ రోజు నేను మామూలుగా వెళ్ళే బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను.వాళ్ళ అదృష్టం బాగుండి నా ఖర్మ బాగుండక ఆపార్లర్ యజమాని నన్ను చూసి చాలా సంతోషంగా ఆహ్వనించింది.మీరు చాలా బాగుంటారు మేడమ్.మీరు ఏచీరలో అయినా చాలా బాగుంటారు ఏడ్రస్ ోఅయినా బాగుంటారూ అని తెగపొగిడింది.ఆపొగడ్త కి ఎరు సంతోషపడరు నేను కూడా ఐస్ అయిపోయాయి.ఆ బుట్టలో పడిపోయాను.కొద్దిగా బ్లెమిషస్,పిగ్మెంటేషన్ ఉంది,కొంచం ఫేషియల్ చేస్తే సరిఅవుతారు.మేకప్ తో కరెక్షన్స తో సరి చెయ్యవచ్చు అన్నారు.ఇంక నేను సంబరపడిపోయాను.
మరు వారం ఫేషియల్స తోబిజీ.మా ఫెండ్ పెళ్ళి రానే వచ్చింది.మాకుటుంబం అంతా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. నేను తిరిగి నాపార్లర్ ప్రయాణం మొదలు.అదే పార్లర్ కి రెట్టింపు ఉత్సాహంతో వెళ్లాను.నేను వెళ్లేటప్పటికి ఆ ఓనర్ లేదు ఆవిడ పార్టనర్ ఆహ్వానించంది.తను మేకప్ చేస్తానంది.సరే ఒక గంట సేపు మేకప్ చేసింది.అంతా అయ్యాక మేడమ్ యూలుక్ బ్యూటిఫల్ మేడమ్ అంది.ఆనందంతో కారెక్కాను.మావారిని పికప్ చేసుకోవాలి అని ఆఫీసుకు వెళ్లాను.కార్ ఆపి గార్డ్ కి చెప్పాను.మా వారు తన స్టాఫ్ ని పంపి పదినిముషాల్లో వస్తానని చెప్పారు ఆ అబ్బాయి కారు దగ్గరకు వచ్చి నన్ను చుూసి ఒక్కక్షణం నివ్వెరపోయాడు
కాసేపు వాడికి మాట రాలేదు.తేరుకుని తల దింపుకుని చెప్పాడు ఆ విషయం.నన్ను ఇలా ఎప్పుడూ చూడలేదుగా ఆశ్చర్యపోయాడు పాపం అనుకు న్నాను.ఇక మావారువచ్చారు,నా ముఖం చూసి ఛిఛీ అదేం మేకప్ ఏం బాగలేదు ఇంటికి వెళ్లాక కడిగేసెయ్యు అన్నారు.మేకప్ లేకుండా కూడా చక్కగా ఉంటావు అన్నారు.రెండువేలు పెట్టి మేకప్ చెయ్యుంచుకొంటే కడగ మంటరేమిటి అని విసుక్కున్నాను మనసులోనేలెండి.ఈయనకు ఫాషన్ తెలియదులే అని సరిపెట్టుకున్నాను.
ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ,పెద్దకూతురూ అదేమాటనేట్టప్పటికి వాళ్లమీద గయ్యుమన్నాను.మా అమ్మ్ మరీ నూ నీకనుముక్కుతీరు చక్కగా వుంటాయ్యి నీకు ఈపిచ్చి మేకప్పు లెందుకే అంది విననట్టు తయారవ్వటానికివెళ్లాను.చిన్నకూతురు మత్రం నువ్వు ఎలా వున్నా బావుంటావు మమ్మి అని విటమిన్ టాబ్లెట్ లాగా చెప్పింది.ఆ మందు పనిచేసింది.
ఇంక ఆరుగంటలకి మంచి చీర కట్టుకుని నేను మావారు,అమ్మ ,పిల్లలు మా అక్కకొడుకు బయలదేరాము.మా వారు మాఅక్కకొడుకుతో “మనం మాత్రం మీపిన్నితో నడవద్దు బాబూ ఆవిడ మేకప్ అస్సలు బాగాలేదు” అన్నారుట వాళ్లు ముందు గబగబా నడుచుకుంటూ వెళ్లారు మేము వెనక ఫాలోఅయ్యాము.అక్కడ పెళ్లిపెద్ద మాకు బాగా కావల్సిన ఆయన ఎదురువచ్చి ముందు నాముఖం చూసి ఢంగయ్యాడు ఇంతలో తేరుకుని పెళ్లికూతురున్న గదిలోకి తీసుకువెళ్లారు.పెళ్లికూతురుకి పసుపుకుంకాలు ఇద్దామని వంగాను.ఆమ్మాయ్ వెనక ఒక నిలువెత్తు అద్దం దాంట్లో నా ముఖం చూసి గుండెగుభేలుమంది బూడిద పూసినట్టు వైట్ ముఖం కంగారుగా డైనింగ్ హాలుకి వెళ్లి నాప్కిన్ తీసుకుని ముఖం తుడుచుకున్నా ఇక చూసుకోండి నాముఖం ఇంద్రధనుస్సు లాతయారయ్యింది.ఎలాగో బయటకివచ్చాము.
ఇప్పుడు నాకు అరవై ఏళ్లు ఆ సంఘటని తల్చుకుంటే నవ్వు వస్తుంది.ఇప్పుడు మళ్లీ అద్దం నిజమే చెప్తుంది నువ్వునీలాగే ఉంటేబావుంటావు మెరుగులు దిద్దద్దు అని. ఇప్పుడు ఆలోచిస్తే ఈకాంప్లెక్సరావటానికి కారణం కేవలం ఫెయ్యర్ అండ్ లవలీ కాదు మరేదీ కాదు నాకు జీవితంలో చదువుకానీ పెళ్లికి కానీ నారంగు అడ్డం రాలేదు. మనష్యుల మాటలు న్నన్ను చాలా బాధ పెట్టాయ్యి.మనిషికి రంగురూపు ,లావు సన్నం ,పొట్టి పొడుగు బాహ్యసౌందర్యానికి విలువ ఇచ్చినంత మరేదానికి ఇవ్వరు.ఆడదాన్ని విమర్శించే వాళ్లళ్లో ఆడవాళ్లే ఎక్కువ.వాళ్లవంకర మాటలు రకరకాలన్యూన్యతలకి దారితియ్యగలవు.
ప్రఖ్యాత రచయిత మార్గరెట్ వుల్ఫ్ చెప్పినట్టు “భేఉత్య్ లిఎస్ ఇన్ థె బెహొల్దెర్’స్ ఎయెస్” అని నమ్మకం పెట్టుకుని ఉత్సాహంగా ముందుకు నడవాలి .మన అద్దం లాంటి మనసు మనకి చెప్పినమాటలు ఎప్పుడూ నిజంగానే వుంటాయి.