సింహగిరి రాజ్యాన్ని చారుకేతు పరిపాలిస్తున్నాడు. అతని మంత్రి పేరు నాగరాజు.మహారాజు ప్రతిరోజు ఒక గంట పాటు సభను ఏర్పాటు చేసి మిగతా సమయమంతా విందు వినోదాలలో తేలుతూ ప్రజల గురించి పట్టించుకునేవాడు కాదు. పరిపాలన విషయంలో మంత్రికి పూర్తిగా స్వేచ్చ ఇవ్వడంతో దీనిని ఆసరాగా చేసుకుని సామాన్యుల నుండి కూడా అధికంగా పన్నులు వసూలు చేస్తూ రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించి, సామాన్యునికి ఆహారం కూడా అందని పరిస్థితిని తీసుకొచ్చాడు. పన్నులతో పాటు అక్రమంగా దోచుకున్న సొమ్మును ఖజానాకు చేర్చకుండా సంచులలో మూట కట్టి ఒక పాడుబడ్డ ఇంట్లో దాచసాగాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆ రాజ్యంలోని రాయగిరి గ్రామంలో ఉండే మల్లన్న తను గజదొంగ అవతారం ఎత్తి, కొంతమందిని కూడగట్టుకుని మంత్రి దోచుక్కున్న సొమ్మును దోచుకొని బీదలకు పంచి పెట్టసాగాడు.విషయం తెలుసుకున్న మంత్రి సైన్యాధికారితో చర్చించి గజదొంగ ఆట కట్టించాలని అనుకున్నాడు.
మల్లన్న రాత్రిపూట దొంగతనాలకు వెళ్ళేముందు పొలిమెరలో ఉన్న పోలేరమ్మను దర్శించుకుని వెళతాడు. ఆ అమ్మవారి గుడికి తలుపులు ఉండవు. అమ్మవారికి ఆభరణాలు ఎన్నో ఉన్నా ఆ గుడిలో ఎప్పుడూ దొంగతనాలు జరగలేదు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన మలన్న, దీపం కొండెక్కబోతోందని నూనెను పోసి వత్తిని పెద్దదిచేస్తుండగా దూరం నుండీ ఎవరో నడిచి వస్తున్న అలికిడి విని మల్లన్న అమావారి విగ్రహం వెనుక దాక్కున్నాడు.
ఇద్దరు గుడిలోకి ప్రవేశించారు. “వద్దు మంత్రి గారు!... అమ్మవారి నగలు దొంగిలించడం మహాపాపం... ఇంతవరకు దొంగతనం చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు” అన్నాడు అది అమ్మవారిని కొలిచే పూజారి గొంతు.
“అమ్మవారి నగలు నువ్వు తీసి ఇవ్వక పోయావో నిన్ను పూజారి వృత్తిలోనుంచి తీసేస్తాను...పైగా అవి నువ్వే దొంగిలించావని మహారాజును నమ్మిస్తాను” అన్నాడు మంత్రి.
ఆ బెదిరింపులకు బయపడ్డ పూజారి “సరే మంత్రి గారు మీ మాటే కానీయ్యండి” అని పూజారి అమ్మవారిని సమీపిస్తుండగా...“ ఓరి దుష్ట మంత్రి!.. నన్ను నిత్యం కొలిచే పూజారి చెబుతున్నా నగలు దోచుకోవాలన్న ఉద్దేశం మానుకోలేదు...అందుకు నీ తల వేయి వ్రక్కలు చేస్తాను” అనే మాటలు వినబడ్డాయి.
మంత్రి,పూజారి ఒక్కసారిగా నిర్ఘాంతపోయి “అమ్మా! నన్ను క్షమించు... నీ మహిమ తెలియక తప్పు చేయబోయను” అన్నాడు మంత్రి.
“అమ్మా! నన్ను కూడా క్షమించు” అన్నాడు పూజారి.
“పూజారి నీ తప్పేమీ లేదు తప్పంతా మంత్రిదే...ఒరే మంత్రి రేపు నిండు సభలో నీవు చేసిన నేరాలను ఒప్పుకోవాలి...లేక పోతే నీ తల వేయి వ్రక్కలు చేస్తాను జాగ్రత!” అని మళ్లీ మాటలు వినిపించాయి.
“అలాగే మాత! నా తప్పులన్నీ ఒప్పుకుంటాను నన్ను క్షమించు!” అన్నాడు మంత్రి.
ఇక మీరు వెళ్ళండి అంది అమ్మవారు.
అమ్మవారి విగ్రహం వెనుకనుంచి అమ్మవారిలా మాట్లాడింది మల్లన్న. అమ్మవారే నిజంగా మాట్లాడిందని మంత్రి,పూజారి నమ్మారు.
సభ కొలువు తీరి ఉంది. మంత్రి,మహారాజు ప్రక్కన ఆసనం మీద కూర్చున్నాడు.
కొద్ది సేపటికి ఒక సాధువు ప్రవేశించాడు. మహారాజు స్వాగతం పలికి ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు.
“మహారాజా! నిన్న ఒక ఘోరం జరగబోయింది” అనగానే మంత్రి కంగారుపడ్డాడు.
“ఏంజరగబోయిందో చెప్పండి స్వామీ!” అన్నాడు రాజు.
“మహామంత్రి మీరు నిన్న ఏం చేయబోయారు...అమ్మవారికి మీరు ఏమని వాగ్దానం చేశారు..మీరు చెబుతారా! లేక నన్ను చెప్పమంటారా?” అన్నాడు సాధువు.
అమ్మవారే ఈ సాధువును పంపించింది అనుకుని, మంత్రి నిన్నటి విషయాలే కాక తాను చేసిన ప్రతి తప్పును ఒప్పుకుని “మహారాజా! నన్ను క్షమించండి” అని... “నా తప్పులు ఒప్పుకున్నాను నా ప్రాణాలు కాపాడండి” అని సాధువు కాళ్ల మీద పడబోయాడు.
మల్లన్న వెంటనే తన సాధువు వేషం తీసివేసి “మహారాజా! నేనొక గజదొంగను. ఈ మంత్రి అరాచకాలను అరికట్టడానికే నేను దొంగగా మారవలసి వచ్చింది....అతను దోచుకున్నవి పేదలకు అందేలా చేశాను...నిన్న అమ్మవారి నగలు దొచుకోవాలనుకున్నప్పుడు అమ్మవారి విగ్రహం వెనుక ఉండి అమ్మవారిలా మాట్లాడి బుద్ది వచ్చేలా చేశాను” అన్నాడు మల్లన్న.
వెంటనే మంత్రిని కారాగారంలో వేయించి “మల్లన్న నీవు పేదవారి కోసం మంచి పనులు చేస్తూ...తెలివిగా మంత్రి గుట్టు రట్టు చేశావు...ప్రజల సాదక బాదకాలు తెలిసిన నిన్ను ఈ క్షణం నుండీ మహామంత్రిగా ప్రకటిస్తున్నాను..ఇక నుండి నేను విందులు వినోదాలు మనుకుని,ప్రజలకు మంచి పాలనను అందిస్తాను” అని అన్నాడు మహారాజు.
సభ చప్పట్లతో మారుమ్రోగింది.
****
యు.విజయశేఖర రెడ్డి,9959736475
గజదొంగ