నిర్విఘ్నం - సంతోష్ కుమార్ కంచర్ల

breakles

పదకొండు సంవత్సరా ల రమణ పుస్తకం తో చదువుతున్నాడు ....

ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివాసం వుంటారు అని ... అపాత్రా దానం చెయ్య రాదు ... !

అక్కడే వున్న అమ్మ సావిత్రి తో అన్నాడు రమణ, అమ్మా ! అపాత్రా దానం అంటే ఏమిటి అమ్మ అన్నాడు?

సావిత్రి దానికి ఏ దానం చేసినా అది సరైన మార్గం లో ఉపయోగ పడాలి ...దానం చెయ్యటం కన్నా అది సరైన వారి చేతిలో పెట్టాలి అని.

అది ఎలా తెలుస్తుంది అమ్మ అన్నాడు? దానికి సావిత్రి నవ్వి నువ్వు పెద్ద అయ్యాక నీ మనసు చెప్తుంది. నువ్వు దాని మాట వింటే చాలు అంది. ఎందుకో రమణకు బాగా నచ్చింది. అలాగే మొదటినుంచి తల్లి మీద వున్న అభిమానం తో ప్రతి స్త్రీ ని గౌరవం గా చూసే వాడు రమణ. పెరిగి పెద్ద అయ్యాక మంచి చదువు చదివి ఆడిటర్ అయ్యాడు. కంపెనీ లో పని చెయ్యటం కన్నా సొంతం గా ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆఫీస్ తీసుకుని అందులో కొంత మంది స్టాఫ్ తో ఆడిటింగ్ చేసేవాడు. చక్కటి చదువు, వినయం, తల్లి చెప్పిన మాటలతో చాలా ప్రయోజకుడు అయ్యాడు. చుట్టాల అమ్మాయి అయిన రమ ను చూసి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. రమ కూడా రమణ లో పేరు సగం మాత్రమే కాదు ప్రతి బాధ్యతను చక్కగా తీసుకుంది. కొంత కాలానికి ప్రియ పుట్టింది. ఒకే కూతురు ...అరచేతుల్లో పెట్టుకుని పెంచారు దంపతులు ఇద్దరు.

రమణకు గోవింద్ మంచి మిత్రుడు. కానీ డిగ్రీ వరకు చదివి కుటుంబ బాధ్యతల వల్ల ఒక కంపెనీ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చెయ్య సాగాడు. గోవింద్ కి కూడా పద్మ తో వివాహం అయ్యింది. గోవింద్, పద్మ దంపతులకి భారతి అని కూతురు. అయితే గోవింద్ రమణ సంపాదించినంత డబ్బు సంపాదించలేదు. గోవింద్ కి బాధ్యతలు ఎక్కువ. అక్కల పెళ్లి ళ్లు చేస్తూ వచ్చాడు.

ప్రియ, భారతి మంచి స్నేహితులు. కొన్ని స్కూళ్ళు కలిసే చదువుకున్నారు. రమణ ప్రియకు కష్టం కలిగించకూడదు అని కొంచం గారం గానే చూసే వాడు. సావిత్రి రమణను కొన్ని సార్లు మందలించేది. పిల్లలకు కష్టం తెలియాలి అని. కానీ ప్రియ మొహం చూసేసరికి అన్ని మర్చిపోయే వాడు రమణ. ఒక రోజు స్కూల్ లో ప్రియా, భారతి సైన్స్ ల్యాబ్ లో వున్నారు. సైన్సు మాష్టారు పాదరసం లో బంగారం పడితే ఏమి అవుతుందో చెప్తున్నారు. అంతకు ముందు వారం లో ప్రియ పుట్టిన రోజుకి ఒక బంగారు చైన్ ఇచ్చాడు రమణ. సైన్స్ మాష్టారు చెప్తున్నారు కానీ చూపించటం లేదు. సర్, నేను చూపిస్తా అంది ప్రియా. మాష్టారు కి అర్ధం కాలేదు, ఏమి చూపిస్తావు ప్రియా అన్నాడు?

టక్కున మెడలో వున్నా బంగారు చైన్ తీసి పాదరసం వున్న ట్యూబ్ లో వేసింది ప్రియా. మాష్టారు ఆశ్చర్య పోయారు. నీ చైన్ ఇంక రాదు అన్నారు. పర్వాలేదు సర్ అంది ప్రియా నవ్వుతు. కానీ తోటి విద్యార్థుల చూపులన్నీ ప్రియ మీదే. ఒక్క సరిగా పాపులర్ అయినందుకు సంతోషపడింది. భారతి కి భయం వేసింది. అంత విలువైన గొలుసు పోయింది అని. ఇద్దరు ఇంటికి వెళ్ళాక ప్రియ చేసిన పని భారతి గోవింద్ కి చెప్పింది. గోవింద్, రమణ ఎంత బిజీ గా వున్నా ప్రతి ఆదివారం కలిసి కాసేపు మాట్లాడుకోవటం అలవాటు. ఆ ఆదివారం గోవింద్ రమణ కి ప్రియ చేసిన పని చెప్పాడు. రమణ మొదట ఆశ్చర్య పోయినా తరువాత బాగా నవ్వు కున్నాడు. ప్రియ ను పిలిచాడు. ఏమ్మా ! నిజమేనా అని ? ప్రియా అవును నాన్న, మాష్టారు చెప్పింది నిజమో కాదో అని ఆలా చేశాను అంది. సర్లే అని నవ్వేసాడు రమణ. ప్రియ వెళ్ళిపోయాక గోవింద్ నొ చ్చు కున్నాడు, ఏంట్రా నువ్వు చేసిన పని ? పిలిచి తిడతావు అనుకుంటే సర్లే అని నవ్వుతావా అన్నాడు. దానికి రమణ, ఏంటోయ్ గోవింద్ ఇంత చిన్న విషయానికి పిల్లని మందలించాలా? ఎదో చిన్న పిల్ల , సైన్సు అంటే ప్రాక్టికల్ గా చూద్దాం అని చేసింది అన్నాడు. దానికి గోవింద్ , చూడు రమణ నీకు చాలా అది చిన్న అమౌంట్ ఆ గోల్డ్ చైన్ కానీ విలువ తెలియకుండా పిల్లలను పెంచటం సరికాదు అన్నాడు. చెప్పినా ప్రియ కి వయసు లేదు అని మాట దాటేశాడు రమణ. దూరం నుంచి చూసి ఇది అంత సావిత్రి , రమ మొహమొహాలు చూసుకున్నారు.

స్కూళ్లు అయ్యేక ఇంటర్ లో ప్రియ, భారతి వేరే వేరే కాలేజీ ల లో జాయిన్ అయ్యారు. ఇద్దరు మంచి స్నేహితులు అయినా ప్రియ కు దూకుడు ఎక్కువ, భారతి కొంచం స్లో గానే ఉండేది. ప్రియ కి ఇంటర్ అయ్యాక డిగ్రీ చేయించి తన లాగే ఆడిటర్ చెయ్యాలి అని రమణ కోరిక.

భారతి ఆదివారం వస్తే ద గ్గరలో వున్నా సేవాసంఘా నికి వెళ్ళేది. ప్రియా గేమ్స్ లో బిజీ గా ఉండేది. చాలా సార్లు భారతి ప్రియా ని కూడా రమ్మని అంది కానీ ప్రియ దానికి , నాకు ఇంటరెస్ట్ లేదు, వాళ్ళు మనకు సంబంధం లేని మనుషులు, నువ్వు మదర్ థెరిస్సా వి అని జోక్ చేసేది. ఒక సారి భారతి రమణ దగరకు వచ్చింది. అంకుల్, నాకు చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. ఏమి కావాలి అమ్మ అని అడిగాడు. దానికి భారతి. అంకుల్, నిర్విఘ్న అని ఒక సేవ సంఘా నికి నేను వాలంటీర్ గ వున్నాను అంది. అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లో నడుస్తుంది అయితే ఆ ప్రాపర్టీ కి సంబందించిన వాళ్ళు కోర్ట్ లో కేసు వేసి నెగ్గారు వాళ్ళకి ప్రతి నెల రెంట్ కట్టాలి. అమౌంట్ అంతా డొనేషన్స్ రూపం లో వచ్చింది కానీ ఒక పది వేలు తక్కువ అయ్యాయి. మీరు ఇస్తారు అని వచ్చాను అంది. రమణ ఆశ్చర్యపోయాడు.అప్పుడే అక్కడకు ప్రియ వచ్చింది. ఏమ్మా థెరీసా ? ఈ సారి డబ్బులు కూడా కావాలా? అంది.

తల దించుకుని వుంది భారతి. ప్రియా దానికి ఒసే పిచ్చి మొద్దు , నిన్ను అనుమానించటం న ఉద్దేశం కాదు, నువ్వు ఇచ్చే డబ్బులు వేరే కరెస్పాండంట్ కి ఇస్తున్నావు, వాడు ఏమి చేస్తున్నాడో నీకు ఎలా తెలుస్తుంది అంది ప్రియా. దానికి భారతి , నాకు అయన బాగా తెలుసు, గ్యారెంటీ గా వాళ్ళు మంచి పనే చేస్తారు అంది. సరే చెక్ బుక్ తెద్దామని లోపలికి వెళ్ళాడు రమణ. ప్రియా లోపలకి వెళ్లి అసలు డబ్బులు ఏమి ఇవ్వొద్దు అని చెప్పింది. మహా ఇవ్వాలని ఉంటే ఒక వంద ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పు అంది

రమణ ఆలోచిస్తున్నాడు. భారతి మార్కులు కొంచం తక్కువ అయినా చాలా లోకజ్ఞానం తెలిసిన అమ్మాయి. కానీ ప్రపంచంలో చాలా మంది నెమ్మదిగానే ఉండటానికి కారణం వాళ్ళ కు వున్న పరపతి, డబ్బు. ప్రియ విషయం లో కొరవ లేదు. అంత తెలివైన అమ్మాయి వచ్చి అడిగింది అంటే ! అంతరంగం సాయం చెయ్యమంది , కానీ ఏ దో అడ్డు వస్తుంది. తిరిగి ప్రియ తో అన్నాడు, చూడు ప్రియ ! గోవింద్ నాకు చిన్ననాటి స్నేహితుడు కనీసం ఆ వరుసన అయినా భారతి కి సాయం చెయ్యాలి అన్నాడు. ప్రియ కోపం గా, నాన్న! అసలు అక్కడకు వెళ్లి చూసావా ఎప్పుడైనా ? బ్రతకటానికి కొంచం ఎలిజిబిలిటీ ఉండాలి ! అవి కూడా లేవు నాన్న వాళ్ళకి. ఈవిడ సేవ ఏంటో అర్ధం కాదు. భారతి దూరం నుంచే చూసింది, వాళ్ళు మాట్లాడింది వినపడకపోయినా కనపడింది. తల వంచుకుని బాగ్ తీసుకుని వెళ్ళిపోయింది.

రమణ ఏదయినా సర్ధి చెపుదాం అని వెళ్లే సరికి భారతి లేదు. ప్రియ వచ్చి చూసి, పోన్లే ! వంద + టైం మిగిలింది అని వెటకారం గా నవ్వింది .

ఇంటికి వెళ్లి భారతి గోవింద్ దగ్గర జరిగింది చెప్పింది. గోవింద్ ఏమి మాట్లాడకుండా, పోన్లేమ్మ ట్రై చేసావు వాళ్ళు ఇవ్వ లేదు. బాధ పడకు అన్నాడు. మరి డబ్బులు ఎలా నాన్న అంది. గోవింద్ నా దగ్గర నీ పెళ్ళికి అని దాచిన కొంత అమౌంట్ వుంది. కానీ నాకు ఎవరు సాయం చెయ్యరు అమ్మా ఆ డబ్బులు మనం దానం చేస్తే అన్నాడు. భారతి వెంటనే , ఏంటి నాన్న ఎప్పుడు చెప్పనే లేదు అందులో ఒక పది వేలు చాలు, నేను డిగ్రీ తో పాటు పిల్లలకు ప్రైవేట్స్ చెప్పి ఆ అమౌంట్ ఇస్తాను అంది. గోవింద్ పిచ్చి పిల్లా ! నాకు ఏమి అక్కర్లేదు ,ఎలా జరిగేలా ఉంటే ఆలా జరుగుతుంది అని అమౌంట్ ఇచ్చాడు. తరువాత రమణ గురించి ఆలోచించాడు.

కొన్ని రోజులు గడిచాయి. భారతి మామూలుగానే ప్రియ ను కలుస్తుంది అంతా నార్మల్ గా వుంది. ఒక రోజు ఆడిట్ పని మీద బయటకు వెళ్ళాడు రమణ. వచ్చేస్తుంటే ఒక కాఫీ షాప్ లో ప్రియ ఇంకో వ్యక్తి తో కాఫీ తాగుతూ మాట్లాడుతుంది. ఈ టైం లో కాలేజీ కి వెళ్లకుండా ఏంటి ఇది అని ఆలోచించాడు. దూరం నుంచి ఫోన్ లో ఒక ఫోటో తీసాడు, సాయంత్రం ప్రియ ఇంటికి రాగానే రమణ అడిగాడు, పొద్దున్న కాలేజీ కి వచ్చాను లేవు ఏంటి అన్నాడు. ప్రియ కంగారుగా . లేదు నాన్న ! కాలేజీ లో వున్నాను. ఊహు ! ఈ ఫోటో చూడు అని ఫోన్ చూపించాడు. ప్రియ అలోచించి అది కాలేజీ లో ఒక ప్రాజెక్ట్ విషయం గురించి మా సీనియర్ తో మాట్లాడదామని కాఫీ షాప్ లో వున్నా నాన్న అంది. అంతకు మించి ఏమి లేదు అంది. సరే నమ్మ, కాలేజీ లో లేకుండా బయట ఉంటే డౌట్ తో అడిగాను అంతే అన్నాడు. ఉఫ్ ! గండం గడిచింది అని ప్రియ వెళ్ళిపోయింది. వెంటనే ఫోన్ చేసి, విజయ్! పొద్దున్న నాన్న మన ఇద్దరినీ కాఫీ షాప్ లో చూసాడు, ఆ ఏదో సర్ది చెప్పాను లే అంది ! ఈ సారి కొంచం జాగ్రత్తగా ఉండాలి అంది.

నడి రాత్రి రమణకు మెలుకువ వచ్చింది. ఏంటో ఆలోచనలు ?? బెడ్ రూమ్ పక్కన వున్నా బాల్కనీ ఓపెన్ చేసాడు, చల్లని గాలి మొహాన్ని తాకింది. ప్రియ చెప్పింది నిజం అనిపించలేదు, సొంత కూతుర్ని అనుమానిస్తున్నాడా? చ అనుకున్నాడు. మర్నాడు ఆదివారం ఉదయం ఫలహారం టైం కి గోవింద్ వచ్చాడు. రమణ ముభావంగా ఉండటం చూసి అడిగాడు ఏంటి ఆలా వున్నావు అని. జరిగింది చెప్పాడు. గోవింద్ నిట్టూర్చి సరే నేను, భారతి చూసుకుంటాము ఎక్కువగా ఆలోచించకు అన్నాడు. గోవింద్ ఇంటికి వెళ్లి భారతి కి జరిగింది చెప్పాడు. దానికి భారతి అవును నాన్న నాకు కూడా పోయిన వారం తెల్సింది , నీతో చెపుదాం అనుకున్న కానీ నువ్వు, అంకుల్ ని ఇంటికి పిలిచినప్పుడు చెపుదాం అనుకున్నా అంది. విజయ్ నాకు కూడా తెలుసు నాన్న, మా కన్నా 2 సంవత్సరాలు సీనియర్ కానీ విజయ్ కు లేని అలవాటు లేదు, మందు , సిగరెట్టు , కొన్ని సార్లు డ్రగ్స్ కూడా వాడాడు అంట. ఇంతకు ముందు ఇంకో 4 అమ్మాయిలతో సంబంధం ఉండేది. మరి ప్రియ కు చెప్ప లేదా అన్నాడు గోవింద్. భారతి, ప్రియ కు ఆల్రెడీ చెప్పాను నాన్న. కానీ నమ్మ లేదు.

గోవింద్ ఆశ్చర్యపోయాడు , సరే అని చెప్పి వెంటనే రమణ ఆఫీస్ కి వెళ్లి లేట్ చెయ్యకుండా ప్రియ తో మాట్లాడమని చెప్పాడు. తన కూతురు మీద చాలా నమ్మకం వుంది. సరిఅయిన నిర్ణయం తీసుకుంటుంది అని.

రాత్రి డిన్నర్ అయ్యాక బాల్కనీ కి రమ్మని చెప్పాడు ప్రియని. చూడు ప్రియ ! నేను చెప్పేది జాగ్రత్త గా విను, నువ్వు మొన్న చెప్పిన విషయం నమ్మ లేదు. విజయ్ ఎవరు? అని అడిగాడు. ప్రియ ఇంక ఆలస్యం ఎందుకు అని సరే నాన్న! చెప్తా విను. విజయ్ నేను ఒక రెండు సంవత్సరాలుగా ఒకరికి ఒకరం ఇష్టపడుతున్నాం. ఒక నెల ముందు తను నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. రిజెక్ట్ చెయ్యటానికి నాకు రీజన్ దొరక లేదు. విజయ్ ఫాదర్ రియల్ ఎస్టేట్ లో చాలా సంపాందించాడు. ఒక్కడే కొడుకు. అందం, ఆస్థి వున్నాయి. రమణ అడ్డుపడి అవి మాత్రం కాదు , చాలా వున్నాయి , పచ్చి తాగుబోతు, అమ్మాయిలు, సిగరెట్లు మాములే అన్నాడు. అవి ఒకప్పుడు! నాన్న తాను మారతాడు. నాకు నమ్మకం వుంది అంది. మారకపోతే ? మారుతాడు నాన్న అంది. అలా కాదు ప్రియ తెలిసి తెలిసి అటువంటి మనిషి ని ఎందుకు చేసుకోవటం? అన్నాడు అందుకు ప్రియా! పెళ్లి అయ్యాక అలవాటు అయితే ఏమి చేస్తావు ? రమణ సమాధానం ఇవ్వలేదు ! లేదు ఈ ప్రశ్నకు సమాధానం లేదు...! విజయ్ నాన్న వాళ్ళకి కూడా చాలా అప్పులు ఉన్నాయి అని తోటి ఆడిటర్ ద్వారా తెల్సింది అన్నాడు. అప్పులు లేని వ్యాపారమా? అంది ప్రియా! సో ఏమి చెప్పాలనుకుంటున్నావు? ఏది ఏమైనా విజయ్ తోనే జీవితం అంది. భవిష్యత్తులో జరగకూడనిది జరిగి తే ? సీరియస్ గా అన్నాడు రమణ. నీ సహాయం మాత్రం అడగను చాలా?? అని విసురుగా వెళ్ళిపోయింది. ఎవరో లాగి గూబ మీద కొట్టినట్లు వుంది రమణకు.

మర్నాడు ఉదయం నుంచి ప్రియ మాట్లాడటం మానేసింది. మొండి... జగ మొండి అంది సావిత్రి. ఈ సారి రమణ కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్య లేదు. అలా నాలుగు రోజులు గడిచాయి. ప్రియ అమ్మ రమ తో అంది. చూడు అమ్మ ! ఇక ఈ ఇంటిలో ఉండటం నా వల్ల కాదు. అప్పుడే రమణ ఇంటిలో కి వస్తున్నాడు. కూర్చుని చూస్తున్నాడు. రమ అంది... చూడు ప్రియ ! నువ్వు ఆడింది ఆట పాడింది పాట కానీ పెళ్లి విషయం లో ఆలోచించాలి అన్ని. నాన్న ఇంత సంపాందించింది నీ బాగు గురించే ! నాకు అలా అనిపించ లేదు అంది ప్రియ !ఒక్క సారిగా అరిచాడు రమణ! అయితే అన్ని వదులుకుని పో నువ్వు ఇంటిలో నుంచి అన్నాడు. ప్రియ కంట్లో నీరు ! పోతున్నా నాన్న! అని ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. రమణ సోఫా లో అలాగే కులపడిపోయాడు. రమ ఎందుకు అండీ ! అంత మాట అన్నారు ?

మనకు వున్నది ఒకే నలుసు, కాసేపటికి తేరుకుని చేతిలో వున్న పేపర్లు చూపించాడు. విజయ్ నాన్న లోన్లు, గొడవలు, కేసులు, కొన్ని విజయ్ పేరు మీద కూడా కొన్ని వున్నాయి. ఇవి అన్ని చూపించినా నమ్మే స్థితిలో నీ కూతురు లేదు. కర్మ ఫలం , ఎవ్వరు ఏమి చెయ్య లేరు అన్నాడు.

మరునాడు ఉదయం భారతి, గోవింద్ వచ్చారు. నేను తండ్రిగా ఓడిపోయాను రా అని ఏడ్చాడు రమణ. సావిత్రి, రమ కళ్లలో నీరు. దానికి గోవింద్ నీ కూతురు మేజర్, పోలీస్ కేసు దాకా వెళ్ళేది ఏమో ? ఇక్కడితో అయిపోయింది అన్నాడు. ఇంకా నువ్వే నా కూతురువి అని భారతి ని దగ్గ ర గా తీసుకున్నాడు రమణ . రమణకు ఇంతకు ముందు ఉన్న హుషారు లేదు, కేసు లు కూడా జూనియర్స్ తో చేయిస్తున్నాడు. అంతా శూన్యం గా అనిపించింది. భారతి ఆఫీస్ కి వచ్చింది, ఏంటి అంకుల్ ఇలా అయిపోయారు ? నాతో వస్తారా బయటకు అంది ? దేనికి అన్నాడు.

భారతి తాను వాలంటీర్ గా పని చేసిన "నిర్విఘ్నం" ద గ్గ ర ఆగారు. దిగండి అంకుల్ అని లోపలి తీసుకువెళ్ళింది. గుర్తుందా మీకు ఒక సరి పది వేలు కావాలి అని వచ్చాను. వీళ్ళ గురించి.

ఈయన పేరు మాధవ్, ఆర్మీ లో పని చేసారు. ఒక సారి ఎదురు కాల్పులలో మెదడులో బులెట్ వెళ్ళింది, ఆపరేషన్ చేసినా మెమరీ పవర్ పోయింది. రెండు సంవత్సరాల క్రితం మాధవ్ తల్లి, తండ్రి ఒక ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటినుంచి ఏమి మాట్లాడటం లేదు బట్ ప్రభుత్వం నుంచి వచ్చిన అమౌంట్ ఈ సొసైటీ లో వుంది తన తో పాటు కొంత మందికి తిండి పెడుతున్నాడు. జీవితం చిత్రం తాను చేసే మంచి పని తనకు కూడా తెలియదు.

ఇంకో అమ్మాయి పేరు కిరణ్మయి, అనాధ. చదువులో నెంబర్ వన్. ఐఏఎస్ చేసి కలెక్టర్ అవ్వాలి అని ఆశ. ఒక సంవత్సరం ముందు ఢిల్లీ వెళ్ళటానికి ట్రైన్ లో ఉంటే ఎవరో ఆమెను రేప్ చేసారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకో లేదు. కానీ మీరు ఏమి అడిగిన చెప్తుంది. బట్ ప్రతి పది నిమిషాలకి నన్ను వదలండి నన్ను వదలండి అంటుంది... చీకటి లో ఉండాలంటే భయం !

ఈయన పేరు వేణు, ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ కి సంబందించిన కంపెనీ లో సీనియర్ డిజైనర్. తన సొంత తెలివితో సాధారణ జనాలకు ఉపయోగ పడే బైక్ మార్కెట్ లో కి తేవాలి అని ప్రయత్నం చేసాడు. డిజైన్ తీసుకుని కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఆక్సిడెంట్ అని చెప్పి చేతులు తీసేసారు. వాళ్ళతో జరిగిన గొడవ వల్ల!

ఇలా ప్రతి జీవితం లో ఒక గాథ !

వీళ్ళకి జరిగిన అన్యాయానికి సాక్షాలు లేవు, పైన వున్న దేవుడు తప్ప. కానీ సాటి మనిషిగా మనం అందరిని ఆదు కోవచ్చు. ప్రియ చెప్పిన ఎలిజిబిలిటీ లేని జీవితాలు ఇవే అంకుల్. మీరు అలోచించి పది వేలు ఇవ్వకపోయినా నా ప్రయత్నం ఆగదు అంకుల్. మిమ్మల్ని కించపరచాలి అని ఇక్కడకు తీసుకు రాలేదు, నన్ను మీ కూతురు అన్నారు కాబట్టి కొంత బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. తప్పు గా మాట్లాడితే క్షమించండి అంకుల్ అంది. రమణ కంట్లో నీరు... ! నన్ను ఇంట్లో డ్రాప్ చెయ్యి అన్నాడు.

రాత్రి భోజనం అయ్యాక కూర్చుని లెక్క చూసాడు .... ఇంచు మించు ముప్పై కోట్ల ఆస్థి. ఏమి చేసుకుంటాడు ?

రమ ను పిలిచి ఇంకా ఇక్కడి నుంచి కొంత సమయం, కొంత డబ్బు అక్కడకు కేటాయించాలి అని తన నిర్ణయం చెప్పాడు. రమ చాలా సంతోషించింది. రమణకు హుషారు గా వుంది. ప్రతి ఆదివారం గోవింద్ తో కలిపి సేవ చేసి వస్తున్నాడు. అక్కడ రమణ వెళ్ళాక చాలా మార్పులు వచ్చాయి. మంచి లొకేషన్ లో బిల్డింగ్ కట్టించాడు , మంచి భోజనం, ఆదరణ , డొనేషన్స్ కూడా పెరిగాయి. వాలంటీర్స్, కూడా పెరిగారు.అందరిలో కలిసిపోయాడు. జీవితం ఆనందం గా గడిచిపోతుంది.

ఒక రోజు హోరున వర్షం, ఆఫీస్ అయి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు. సిగ్నల్ దగ్గర ఒక స్త్రీ ! కాటన్ చుడిదార్ లో వణుకుతూ చేతిలో బాగ్ తో ! ఒళ్ళంతా సన్నటి ఒణుకు ! ప్రియ ! మొహం నలిగి వుంది ! ఎవరినో అడ్రస్ అడుగుతుంది. కార్ దిగి ఒక్కసారి తనివితీరా దగ్గరకు తీసుకోవాలి అని ఆశ ! కానీ తనను కాదు అని వెళ్ళిపోతే తిరిగి తానే వెళ్తాడా? కార్ పార్క్ చేసి ప్రియ వెళ్లిన బిల్డింగ్ లో కి వెళ్ళాడు. ఒక చిన్న ఆఫీస్ లో జాబ్ గురించి ఇంటర్వ్యూ కి వచ్చింది. ఆఫీస్ నెంబర్, అడ్రస్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.

నోట్ చేసుకున్న నెంబర్ కి ఫోన్ చేసి తన ఫ్రెండ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నాయుడు చేత ఫోన్ చేయించాడు.

ప్రియ ఇంటర్వ్యూ లో ఎందుకు ఉద్యోగం లో జాయిన్ అవ్వుతుందో అడిగారా అని అడిగాడు. అందుకు ప్రియ రియల్ ఎస్టేట్ లో చాలా నష్టం వచ్చి భర్త, మామగారు ఇద్దరు డబ్బులు పోగుట్టు కున్నారు అని చెప్పింది. బయట కూడా అప్పులు ఇంచుమించు ఇరవై కోట్ల దాకా వుంది అని ప్రియ చెప్పింది అన్నాడు.ప్రియ రిసెప్షనిస్ట్ గా సెలెక్ట్ అయ్యింది. జీతం పదిహేను వేలు అని చెప్పాడు. రమణ చాలా బాద పడ్డాడు. తాను చెప్పినట్టు వింటే ఈ బాధలు వుండవు అని అనుకున్నాడు.

సూపర్ మార్కెట్ లో కి వెళ్ళాడు ఏవో కావాలి అని. వచ్చేస్తుంటే సడన్ గా ఒక ఆవిడా కళ్లు తిరిగి పడిపోయింది రమణ పక్కనే. రమణ లేపి పక్కనే వున్న టీ షాప్ లో టీ ఇప్పించాడు. ఆవిడ కృతజ్ఞత గా నేను చేసుకున్న పాపం సర్ అంది. రమణకు ఆవిడ గతం తెల్సుకోవాలి అనిపించింది. మీకు ఏమి ఆభ్యన్తరం లేక పోతే ఏమి జరిగిందో చెప్పండి ? నేను కూడా ఒక దురదృష్టవంతుడు నే అన్నాడు రమణ. ఆవిడ తన కద చెప్పింది. ఆవిడకు ఇరవై మూడు వయసులో పెళ్లి అయ్యింది. పెళ్లి జరిగిన సంవత్సరానికి కూతురు పుట్టింది అదే సంవత్సరం జరిగిన ఆక్సిడెంట్ లో భర్త చనిపోయాడు. అప్పటి నుంచి కూతురుని అల్లారు ముందుగా పెంచింది. పెళ్లి చేద్దాం అనుకున్న టైం లో ఎవరినో తీసుకువచ్చి పెళ్లి చేసేసుకున్నాను అంది. నాకు కోపం వచ్చి పొమ్మని చెప్పాను. వాళ్ళకి ఇద్దరికి ఉద్యోగం లేదు. అవి అన్ని ఆలోచించ లేదు. కోపం లో తీసుకున్న నిర్ణయం. కొంత కాలానికి వాళ్ళు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పటి నుంచి నాకు ఒంట్లో బాగుండటం లేదు అని చెప్పి ముగించింది. రమణ తన కద కూడా చెప్పాడు. ఇప్పుడే ప్రియచూ సిన సంగతి కూడా చెప్పాడు.

ఆవిడ ! మీరు చాలా అదృష్టవంతులు ! భగవంతుడు మీకు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అవకాశం ఇచ్చాడు అంది. అంటే అన్నాడు రమణ ! మీ అమ్మాయిని, అల్లుడిని మీ ఇంటికి తీసుకు వెళ్లి చూసుకోండి. మీలో మీకు అహం అడ్డు ఏంటి అంది.

రాత్రి ఇంటికి వెళ్లి డిన్నర్ అయ్యాకదా నిద్ర పోదామని ప్రయత్నం చేస్తున్నాడు, నిద్ర రావటం లేదు.

రమణ అంతర్మధనం లో పడ్డాడు. ఆవిడ చెప్పిన మాట నిజమే, తన తదనంతరం ఈ ఆస్థి ఏమి చెయ్యాలి? కూతురు కష్టం లో ఉన్నప్పడు కూడా ఆదుకోని రాయిలా మారిపోయా నా?అసలు కూతురు చేసిన తప్పు ఏంటి ? ప్రేమించింది అంతే కదా? పక్కనే పడుకున్న భార్యని నిద్ర లేపాడు. జరిగింది చెప్పాడు, తల్లి మనసు కరిగిపోయింది, కళ్ళ నిండా నీరు , ఎలా పెంచాం అండీ ? తన తల రాత మార్చే అవకాశం భగవంతుడు మనకు ఇచ్చాడు. ఇక్కడికే తీసుకురండి. ఇద్దరిని మనం చూసుకుందాం అంది. రమణకు భారం తీరిపోయింది. ఉదయం నిద్ర లేవగానే భారతి వచ్చింది, రమణ చాలా హుషారుగా వున్నాడు. అంతలోనే భారతి! రమణ కి ఒక విషయం అర్ధం కాలేదు. ప్రియ ఇల్లు విడిచిన దగర నుంచి భారతి ప్రియ లా దగర అవ్వాలి అని చూసింది కానీ ప్రియ గురించి ఎప్పుడు మాట్లాడ లేదు. అదే అడగాలి అనుకున్నాడు

అసలు నిన్ను నా కూతురి లా చూసుకున్నా ! కనీసం ఒక సారి అయినా ప్రియ ను నన్ను దగ్గ ర చేసే ప్రయత్నం చేసావా? అని అడిగాడు. భారతి తల దించుకుంది. ప్రియ ద గ్గ ర అవ్వదు అంకుల్ అంది. రమణ కు నిజం గా కో పం వచ్చింది. అసలు నీకు ప్రియ ఏమి చేస్తుందో తెలిస్తేనే కదా అన్నాడు. ప్రియ ను చూ సిన సంగతి, ఉద్యోగం సంగతి చెప్పాడు. భారతి, అంకుల్ మీరు చూసేది నిజం కాదు అంది.

రమణ ! చూడు భారతి ! నేను ఈ రోజు ఆ కంపెనీ కి వెళ్లి ప్రియ ను ఇంటికి తీసుకువస్తాను అన్నాడు. వద్దు అంకుల్ ! నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి మీకు నిజం చూపిస్తా అంది భారతి ! రమా, రమణ ఆశ్చర్యపోయారు ! ఏంటి భారతి, నీ స్నేహితురాలు ల కాకపోయినా, మా కూతురి గా ఇక్కడికి వచ్చే హక్కు లేదా అన్నారు? భారతి నేను వచ్చి చెప్పేదాకా మీరు ఏమి చెయ్యద్దు దయచేసి అని వెళ్ళిపోయింది.

మర్నాడు ఉదయం భారతి చేతిలో ఒక పెన్ డ్రైవ్ తో వచ్చింది. అంకుల్, అంటి ఇద్దరు రండి అని పెన్ డ్రైవ్ ని టీవీ కి కనెక్ట్ చేసి ప్లే చేసింది. అందులో విశాలమయిన భవంతి, ఒక సోఫా లో ప్రియ , విజయ్ మాట్లాడుకుంటున్నారు!

విజయ్ అంటున్నాడు, నువ్వు చెప్పేది బాగానే వుంది కానీ మీ నాన్న కు నీ మీద పీకల దాక కోపం వుంది ఆ దిక్కు మాలిన ఆశ్రమానికి కాకుండా మనకు ఎందుకు ఇస్తాడు ఆస్థి అన్నాడు? చూడు విజయ్ ! అది నా ఆస్థి ! చూస్తూ చూస్తూ ఆలా వేస్ట్ అవ్వటం భరించ లేను. అందుకు విజయ్ మరి ఏంటి ప్లాన్? నేను నాన్నకు కష్టాలలో ఉన్నట్టు ఒక డ్రామా చూపిస్తా, ఆస్థి ఇచ్చి ఆదు కొ మ్మని ఇంకో మనిషి తో చెప్పిస్తా. తప్పకుండా నాన్న ఆస్థి మనది అవుతుంది అంటుంది. ఇంకా ఏవో ఆస్థి తాలూకు విషయాలు మాట్లాడుకుంటున్నారు. వీడియో ఆపేసింది భారతి. చెప్పండి అంకుల్ ఇప్పుడు వెళ్తారా?

రమ , రమణ, సావిత్రి కళ్లల్లో నీరు! వెంటనే భారతి అంకుల్! నాకు ప్రియ చిన్నపాటి నుంచి తెలుసు. ఈ వీడియో తీసింది ఎవరో కాదు ఆ ఇంటిలో పనిచేస్తున్న నిర్మల అనే నా పనిమనిషి! తను మన నిర్విఘ్న లో బాగు పడి బయటకు వెళ్లి పని చేసునేది. ఒక రోజు ఎక్కడ చేస్తున్నావు అని అడిగితే బెంగళూరు లో ప్రియ ఇంటి అడ్రస్ చెప్పింది.కలుద్దాం అని వెళ్లి అక్కడ విజయ్, ప్రియ లను చూసాను. చాలా ఆనందించాను వాళ్ళు హ్యాపీ గా వున్నారు అని. వీలు చూసుకుని మాట్లాడుదాం అనుకునే టైం కి ఇక్కడ మీరు చేస్తున్న దాన ధర్మాలు ప్రియ కు ఎవరో చెప్తున్నారు. అవి తనకు ఇష్టం లేదు. చివరకు నా పుట్టిన రోజున మీరు ఆస్థి లో సగం నిర్విఘ్నం కి రాసి ఇస్తారని తెల్సుకుంది లాయర్ ద్వారా, అందుకే ప్లాన్ వేసి ఇలా చేసింది. మీరు కూతురి గా ఎలా అనుకున్నారో, నేను మిమ్మల్ని తల్లి, తండ్రి గానే భావింఛా! ఒకటి మాత్రం చెప్తాను అంకుల్, ప్రస్తుతం వాళ్ళ ఆస్థి మీ కన్నా ఎక్కువ ! అని వెళ్ళిపోయింది.

భారతి పుట్టిన రోజు ! అనుకున్న విధం గానే ఆస్థి లో సగం కాదు, ముప్పావు వంతు నిర్విఘ్నం కి రాసి ఇచ్చాడు. అంతే కాక తన తదనంతరం కూడా ఆస్థి నిర్విఘ్నం కి మాత్రమే చెందేలా రాయించాడు.

పక్కనే వున్నా ప్రభుత్వ పాఠశాలలో మాష్టారు నేర్పిస్తున్నారు.... అపాత్రా దానం చెయ్యరాదు ! తల్లి సావిత్రి వంక చూసాడు. తల్లి తృప్తి గా నవ్వింది ! నేర్పిన పాఠాన్ని చేతల్లో కొడుకు చేసాడు !

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE