బొమ్మలు చెప్పిన కమ్మని కథలు.(1)
భోజ మహారాజు మాటలు విన్న మొదటి సాల భంజకం వినోద వల్లి 'భోజరాజా నంద్యా పురంలో చంద్ర వర్ణుడు అనే పండితుడు తను నేర్చిన విద్యతో తృప్తి చెందక విద్యార్ధిగా మరింత చదవాలని దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గాన వెళుతూ ఓక సెల ఏరు వద్ద దాహం తీర్చుకుని ఆ పక్కనే ఉన్న రాగి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ముని చూసి "స్వామి నా పేరు చంద్ర వర్ణుడు మీ వంటి తపోధనుల వద్ద మానవజీవిత లక్ష్యం,సేవాభాగ్య విధానం ఉన్నత విద్యలు తెలుకోవాలని వచ్చాను.నాకు ఉన్నత విద్యలు ప్రసాదించండి"అనిచేతులు జోడించాడు. "నాయనా నేను శాపవశాన మానవుడిగా మారిన గంధర్వుడను. కారణజన్ముడివి అయిన నీరాకకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. నాకుతెలిసిన సకలవిద్యలు నీకు నేర్పితే నాకు శాప విమోచన కలుగుతుంది.నేటినుండి ఆరుమాసాలు నిద్ర,ఆహారం, దాహం, మాని నేను చెట్టు పైనుండి రాగి చెట్టు ఆకులపై రాసి కింద పడవేసే వాటిలో పలు శ్లోకాలు,విద్యలు రాసి క్రింద వేస్తుంటాను.వాటిని నీవు శ్రధ్ధగా చదువు"అన్నాడు ముని. "స్వామి ఆరు మాసాలు నిద్రహారాలు లేకుండా ఎలామనగలను"అన్నాడు చంద్రవర్ణుడు. "చింతించకు నాయనా శ్రమా,అలసట,ఆహారం,దాహం,నిద్ర ఎవి నీ దరిచేరకుండా, రాత్రులు చీకటిలోకూడా చదవగలిగే వరం నీకు తక్షణం వచ్చేలా వరం ప్రసాదిస్తున్నాను"అన్నాడు ముని. అలా ముని చెప్పిన విధంగా ఆరు మాసాలలో సకల విద్యలు నేర్చుకున్నాడు చంద్రవర్ణుడు. అనంతరం "నాయనా నేటితో నీవిద్యాభ్యాసం ముగిసింది.నీవు నీఊరు వెళ్లవచ్చు కానీ నీవు నేర్చిన ఈవిద్యలు ఫలించాలి అంటే ఒకే వేదికపై నలుగురు కన్యలను వివాహంచేసుకోవాలి.ఉత్తములై సంతతిపోంది యశశ్వివై వర్ధిల్లు "అనిదీవించినముని అదృశ్యమై పోయాడు. అడవిలోనుండి బయలు దేరిన చంద్రవర్ణుడు 'కన్యకాపురి' అనేగ్రామం రాత్రి వేళచేరి 'అలంకారవళ్లి'అనే రాజమందిర దాసి ఇంటి అరుగుపై నిద్రించసాగాడు. రాత్రి ఇల్లు చేరిన దాసి చంద్రవర్ణునిచూసి అతనికి రాజవైద్యునిచే వైద్యం చేయించింది.ఆరోగ్యంకుదుట పడిన చంద్రవర్ణుడు తనఊరికి బయలుదేర బోయాడు"అయ్య పరపురుషులైన తమరిని ఇంతకాలం నాఇంటిలో ఉండనిచ్చాను వివాహం కావలసిన కన్యను ఈవిషయం తెలిసిన నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు"అని తమదేశ రాజు గారికి చంద్రవర్ణుని పై ఫిర్యాదు చేసింది.విషయంఅంతా విన్న రాజు ఆమెను చంద్రవర్ణుడు వివాహం చేసుకోవాలని తీర్పు చెప్పాడు. "మహారాజా నాగురువు వద్ద నేర్చిన విద్యలన్ని సఫలం కావాలంటే ఒకే వేదికపై నలుగు కన్యకామణులను వివాహం చేసుకోవాలి"అన్నాడు చంద్రవర్ణుడు. అతను నేర్చిన విద్యలకు మెచ్చినరాజు తనకుమార్తె'చిత్రరేఖ'ను,మంత్రికుమార్తె 'కల్యాణి'ని,వ్యాపారవేత్త సోమశేఖరునికుమార్తె'కోమలాంగి'ని,రాజదాసి అయిన'అలంకారవళ్లి'ని ఇచ్చి ఓకే వేదికపై వివాహంజరిపించాడు. తనభార్యలతో ఊరు చేరిన చంద్రవర్ణునికి, తనకు సంతతిలేనందున ఆరాజ్యరాజు మహేంద్రవర్మ చంద్రవర్ణునికి పట్టాభిషేకంచేసి రాజ్యభారం అప్పగించాడు. అనంతరంతన నలుగురు భార్యలకు చిత్రరేఖకు 'విక్రమార్కుడు'కల్యాణికి'వరరుచి'కోమలాంగికి'భట్టి' అలంకారవళ్లికి'భత్తృహరి'అనేనలుగురు పుత్రులు జన్నించారు వృధ్ధుడైన చంద్రవర్ణుడు తనకుమారులను పిలిపించి"నాయనలారా నాతదనంతరం ఈరాజ్యాన్నిభర్తృహరికి పాలించే భాధ్యత అప్పగించాలని నాకోరిక అన్నాడు. కానిభర్తృహరి వివాహం చేసుకున్నా సంతతి పొందకూడదు అన్నాడు. రాజ్యన్ని,పలువురి భార్యలు ను చేపట్టిన భర్తృహరి 'అనంగసేన'అనే భార్యపై ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు. ఓకరోజు ఒక సాధువు రాజ్యసభలో ప్రవేసించి"రాజా ఈపండుతిన్నవాళ్లు నిత్య యవ్వన వంతులుగా,ఆరోగ్యంవంతులుగా ఉంటారు"అని దానిమ్మ పండు భర్తృహరి చేతికి అందించి ఆశీర్వదించి వెళ్లి పోయాడు.ఆపండు రాజు అనంగసేనకు ఇవ్వగా ఆమె తన ప్రియుడు గుర్రపు శాలలో పనివాడికి ఇచ్చింది.అతను తన మరోప్రియురాలు పిడకలు గంప నెత్తిన పెట్టుకు వెళుతున్న ఆమెకు ఇచ్చాడు.ఆమెతన పిడకల గంపలో పెట్టుకుని వెళుతుండగా అంతఃపురంనుండి పిడకల గంపలో పండు చూసినరాజు ఆమెను పిలిపించి విచారించగా!విషయంఅంతా తెలిసింది.విరక్తి తో తను వనవాసానికి వెళుతున్నాను అనగానే వరరుచి నేను వస్తాను అని వెళ్లాడు. విక్రమార్కుడు రాజుగా,భట్టి మంతిగా రాజ్యపాలన చేయసాగారు.రాజ్యవిస్ధిర్ణత,నూతన నగరాల నిర్మాణం చేయదలచిన విక్రమార్కుడు అందుకు అను వైన ప్రదేశాలను నిర్ణయించమని భట్టినిపంపించాడు.అలాబయలుదేరిన భట్టి 'వచనపురం'అనే గ్రామంచేరువలోని 'గుణవతి'నదిలో దాహం తీర్చుకుని అక్కడ ఉన్నవేపచెట్టు వద్ద విశ్రమించగా,కొద్దిదూరంలోఊడలుదిగిన పెద్ద మర్రిచెట్టు, నీటికొలను,కాళీమాత ఆలయం కనిపించాయి.దగ్గరకు భట్టి వెళ్లిచూడగా కొలను మధ్యభాగాన నిలబడి త్రిశూలంఉంది.ఆలయ ముఖద్వారంవద్ద ఉన్న శిలా శాసనంలో ఇలాఉంది.'ఈకొలనులో స్నానమాచరించి భక్తి శ్రధ్ధలతో కాళీమాతను స్మరిస్తూ ఈమర్రిచెట్టు ఏడు ఊడలు ఓక్కవేటున తెగవేస్తూ అవి నేల తాకేలోపు కొలనులోని శూలం పైకి దూకి ప్రాణత్యాగం చేసేవారికి కాళీమాత ప్రత్యక్షమై క