తేలు కుట్టిన దొంగ - ambadipudi syamasundar rao

The scorpion thief

ఈ కద మా నాన్న గారు 70 వ దశకములో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తూ తన , తన సహద్యోగుల అనుభవాలను గురించి చెప్పినది ఈ కధ లో ఒక నిజాయితీ గల అధికారి చివరకు అవినీతి పరుడుగా మారి అక్రమ సంపాదనను కాపాడుకోలేని స్థితికి ఎలాచేరుకుంటాడో గమనించవచ్చు సాధారణముగా ప్రభుత్వ ఉద్యోగులలో చాలా మంది అవకాశము లేక నిజాయితీగాఉంటారు నిజాయితీగా ఎవరైనా ఉంటె వారిని అవినీతి పరులుగా మార్చేవరకు ఇతర సహచరులు నిద్రపోరు ఎన్నోరకాలుగా వారిని ఒప్పించి మెల్లిగా అవినీతి ఊబిలోకి దింపుతారు హమ్మయ్య మని పని అయిపొయింది అవినీతి పరుల సంఖ్యా పెరిగింది అని సాధించిన విజయముతో తృప్తి పడతారు అటువంటి కోవకు చెందినదే ఈ కధ .
ప్రకాశ రావు మంచి కష్టపడి చదివే విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు బలహీన వర్గాలకు చెందిన ప్రకాశరావు మారుమూల గ్రామములో అంటే ప్రాధమిక పాఠశాల తప్ప హైస్కూలు లేని ఊళ్ళో ప్రాధమిక విద్యను అభ్యసించి పక్కనే ఉన్న ఒక మోస్తరు బస్తీకి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్లి అక్కడ హైస్కూల్ విద్యను ,స్కాలరు షిప్పులతో ఇంటర్ మీడియట్ విద్యను పూర్తి చేశాడు మిత్రులు ఉపాధ్యాయుల ప్రోత్సహముతో ఎంసెట్ పరీక్ష వ్రాసి మంచి రాంక్ సంపాదించాడు అలాగే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించుకున్నాడు ఇతని ఆర్ధిక స్థితి గమనించిన ప్రొఫెసర్లు మంచి విద్యార్థి అని స్కాలర్ షిప్పుల విషయములో సహాయము చేసి అతని చదువుకు ఏ ఆటంకము లేకుండా చేశారు ప్రకాశరావు కూడా ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రొఫెసర్ల అంచనాలకు తగ్గట్టుగా చదువుతు వారి అభిమానాన్ని చూరగొని క్యాపస్ లో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకొని సివిల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు
చదువు అయినాక ఉద్యోగాల వేటలో పడ్డ ప్రకాశరావుకు గవర్నమెంట్ ఉద్యోగమూ ప్రయత్నిస్తే మంచిది అని తెలిసిన వాళ్ళు సన్నిహితులు సలహా ఇచ్చారు అందుచేత ఆ ప్రయత్నాలు మొదలు పెట్టి సర్వీస్ కమీషన్ పరీక్షలు వ్రాయటం మొదలు పెట్టి సెలెక్ట్ అయి ఇరిగేషన్ (నీటి పారుదల శాఖ)
డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజినీర్ గా చేరాడు ఏ విధమైన అండ దండలు రాజకీయ సపోర్ట్ లేకపోవటము వల్ల అతని సర్వీసు చాలా భాగము పనుల నిర్వహణలో కాకుండా ఆఫీసు వరకే పరిమితము అయింది ఫీల్డ్ లో ఉండే తన కొలీగ్స్ తెగ సంపాదిస్తుంటే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో అర్ధము అయ్యేది కాదు తనకు అర్ధము కానీ విషయాలతో బుర్ర పాడు చేసుకోవటం ఎందుకని పూర్తిగా జీతము డబ్బులతోనే సంసారము లాక్కొ స్తున్నాడు
ఎల్లకాలము రోజులు ఒకే రకముగా ఉండవు కదా?మన ప్రకాశ రావు సర్వీసులో జూనియర్ ఇంజినీర్ నుండి అసిస్టెంట్ ఇంజినీర్ ప్రమోషన్ ఆ తరువాత నెక్స్ట్ ప్రమోషన్ ఎక్స్యూక్యూటివ్ ఇంజినీర్ ప్రమోషన్ తీసుకున్నాడు కొత్త ప్రమోషన్ తో కొత్త చోటు అంటే వరల్డ్ బ్యాంక్ సహాయముతో పనులు ముమ్మరంగా సాగుతున్న ఒక డివిజన్ కు నియమింపబడ్డాడు అప్పటివరకు తెలియని విషయాలు అనుభవము లోకి రాని విషయాలు కొత్త పోస్ట్ లో తెలియవచ్చినాయి అడగకుండానే పని అయినాయిక కాంట్రాక్టర్లు వాటాల వారీగా క్రింద స్థాయి ఇంజనీర్లనుండి పై స్థాయి ఇంజనీర్ల వరకు డబ్బు అందజేస్తారని మొదటిసారిగా ప్రకాశ రావుకు తెలిసింది ఆవిధముగా డబ్బు వాళ్ళు ఇచ్చినది తీసుకోవటము ఏ,మాత్రము అన్యాయము కాదు అని తన క్రింది ఉద్యోగులు ఇతరులు నచ్చజెప్పి ప్రకాశ రావుకు డబ్బులు అలవాటు చేశారు నేను అడగకుండానే కాంట్రాక్టర్లు సంతోషముగా ఇస్తున్నారు వాళ్ళను పీడించి ఏమి తీసుకోవటం లేదుకదా అని తనకు తానూ సమాధానము చెప్పుకున్నాడు ప్రకాశ రావు
ఈ వచ్చిన డబ్బే సమస్యలను తెచ్చి పెట్టింది మొదటి సమస్య ఆ వచ్చిన డబ్బును దాచటం అప్పటి వరకు చాలా సామాన్య జీవితము గడుపు తున్న ప్రకాశ రావుకు ఇంట్లో ఏ విధమైన ఫర్నిచర్ లేదు ఇంకా చెప్పాలంటే డబ్బు దాచుకోవటానికి ఒక బీరువాకూడా లేదు కొందామంటే డబ్బులేక కాదు తీరిక లేక కానీ డబ్బు ఏమో ప్రవాహముల వస్తుంది కాంట్రాక్టర్ల బిల్లుల సీజన్ కదా వాళ్ళు యధావిధిగా ఇవ్వవలసిన వాటాలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు ఆ పరిస్థితిలో ప్రకాశరావుకు డబ్బు దాచుకోవటానికి ఒక అమోఘమైన ఆలోచన వచ్చింది అదే "టపాల్ బాక్స్ " ( ఆఫీసుల్లో ఫైల్స్ పెట్టుకొనే వాడే ఒక ట్రంక్ పెట్టె) వెంటనే ఆ ఆలోచన అమలు చేసాడు వచ్చిన డబ్బును లెక్కపెట్టకుండా ఆ బాక్స్ లో వేస్తూ దానికి తాళము వేస్తున్నాడు ఇదంతా ఇంట్లో పనిచేసే పనివాడు ఒకడు గమనిస్తున్నాడు
సమయము కోసము ఎదురుచూసిన ఆ పనివాడు ఒక రోజున ఆ పెట్టెతో సహా ఉడాయించాడు ఇంకేముంది ప్రకాశరావుకు డబ్బు పోయింది అన్న భాధ. ఇరుగు పొరుగువాళ్ళు దొంగతనము జరిగి డబ్బు పొతే ఊరుకుంటారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటే ప్రకాశరావు కూడా కంగారులో ఎక్కువ ఆలోచించకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ లు వచ్చి వివరాలు సేకరించటం మొదలు పెట్టారు మొదటి ప్రశ్న ఎంత డబ్బు పోయింది ఎవరి మీద అయినా అనుమానము ఉందా? ఇంకా బంగారము వెండి లాంటివి ఏమైనా పోయినాయా వగైరా రొటీన్ ప్రశ్నలు వేశారు ఎప్పుడైనా టపాలు బాక్స్ లోని డబ్బులు లెక్కపెడితేగా ఎంత పోయిందో తెలియటానికి ఏంతో కొంత చెప్పాలి కాబట్టి ఉజ్జాయింపుగా కొంత అమౌంట్ చెప్పాడు
పోలీసులు పనివాళ్ల గురించి ఆరాతీస్తే ఒక పనివాడు మిస్సింగ్ అని తెలిసింది ఇంకేముంది వాళ్లకు దొంగ దొరికినట్లే సాయంత్రానికి ఆ పనివాడిని డబ్బుతో సహా (టపాలు బాక్స్) పట్టుకున్నారు పోలీసులు వెళ్లిన సమయానికి పనివాడు వాడి భార్య బాక్స్ లోని డబ్బులను లెక్కపెడుతున్నారు ఆ పని మేము చేస్తాములే నీవు స్టేషన్ కు రా అని పోలీస్ మర్యాదలతో తీసుకు వెళ్లారు
ఇక్కడే కధలో ముఖ్యమైన మలుపు మొదలవుతుంది పోలీసులు డబ్బు లెక్కపెడితే ప్రకాశరావు కంప్లైంట్ లో చెప్పినదానికన్నా ఎక్కువ మొత్తము ఉంది అప్రెనే పోలీసులు ప్రకాశరావు ను అడిగితె ప్రకాశ రావు నీళ్లు నమిలాడు అయినా ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో అంత మొత్తము డబ్బు ఎందుకు ఉన్నది ఆ డబ్బుకు లెక్కలు వివరాలు కావాలని పోలీసులు ఆరాతీయటము మొదలుపెట్టారు పాపము ప్రకాశరావు డబ్బు ఎలావచ్చింది ఎవరు ఇచ్చారు అని ఎలాచెపుతాడు ఇంకేముంది పోలీసులు ఈ కేస్ చాలా క్లిష్టమైనది అవినీతి నిరోధక శాఖకు ఆదాయపు పన్ను వారికి తెలియజేయాలి అంటూ మొదలు పెట్టారు అవినీతిలో బాగా ఆరితేరిన క్రింది ఉద్యోగులు పోలీసులతో సఖ్యత ఉన్న వారు రంగము లోకి దిగి రాజి ప్రయత్నాలు మొదలుపెట్టారు టపాలు బాక్స్ లోనే ఇంత డబ్బు ఉంది ఇంకా ఎంత సంపాదించాడో అని పోలీసులు ప్రశ్నలు సంధించటం మొదలుపెట్టారు పాపము ప్రకాశరావు అనుకోని పరిస్థితికి ఉక్కిరి బిక్కిరి అయి ఎలాగో ఒకలాగా కేసులు గొడవలేకుండా డబ్బు ఎంత ఖర్చు అయినా ఒడ్డునపడితే ఉద్యోగమూ అన్న నిలుస్తుంది అని తల పండిన క్రింది ఉద్యోగులను బ్రతిమాలి పోలీసులతో రాజి చేయమని బ్రతిమాలాడు.
ఇంకేముంది రంగములోకి దిగిన శ్రేయోభిలాషులు అని చెప్పుకొనేవాళ్లకు చేతి నిండా పని కష్టపడి ప్రకాశరావు డబ్బుతో రాజకీయము జరిపి కేసును ఒక పెట్టి కేస్ గా కంప్లైంట్ మార్పించి ప్రకాశరావును బయటపడేశారు దీనికి ప్రకాశరావు సంపాదించిన టపాలు బాక్స్ డబ్బేకాకుండా సొంతఊర్లో ఉన్న పాత పెంకుటిల్లు కూడా అమ్మాల్సి వచ్చింది బ్రతుకు జీవుడా అనుకోని పై అధికారులను బ్రతిమాలుకొని ఫీల్డ్ ఉద్యోగమూ కాకుండా ఆఫీస్ లో పోస్టింగ్ ఇప్పించుకున్నాడు పాపము ప్రకాశరావు పై అధికారులు కూడా ఆ పోస్ట్ కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మంది ఉండబట్టి ప్రకాశరావును ఆఫీసుకు బదిలీ చేసి వాళ్లకు కావలసిన వాళ్ళను ఆ పోస్ట్ లో వేశారు ఇదండీ మన ప్రకాశరావు కధ
అంబడిపూడి శ్యామసుందర రావు

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు