సహచరి - బి.రాజ్యలక్ష్మి

Companion

కిటికిలొనించి రంగులు మారుతున్న ఆకాశం వెనుక కొండల అందాన్ని చూస్తున్నది గౌరి .కొండల మీది సంజరంగుల నీడలు కింద సముద్రపు నీళ్ళల్లో ప్రతిబింబించి మనోహర తరంగాలు తళుక్కుమంటున్నాయి .సంధ్య వాలింది ,రవి కనుమరుగయ్యాడు ! గౌరికి రెండునెలలనించి యీ దృశ్యాలు చూడడం అలవాటు అయ్యింది !తన జీవితం కూడా సంజరంగుల కాంతులనుంచి కేవలం నల్లరంగుగా మారుతున్నదేమో! ఏదో నిరాశ !నిస్పృహ ! శివరాం ఏదీ ఆర్ధికం గా ఆశించకుండా తనల్ని పెళ్లి చేసుకుంటాడు అని తెలిసినప్పుడు గౌరి యెంతసంతోషించింది .

చదువూ,రూపమూ అతిసామాన్యం తనది .ఎందుకూ పనికిరాని వాడుకూడా బోలెడన్ని కోరికలు కోరే యీ రోజుల్లో అందమైన శివరాం యే షరతులు పెట్టకుండా తనల్ని చేసుకున్నందుకు యెంతో పరవశించింది ! మధురమైన తొలిరాత్రి అతని అందమైన చూపులు ,తీయని కబుర్లు భావి జీవితం యెంతో మధురం గా సజీవ సప్తవర్ణ చిత్రం. గా వూహించుకుంది .పుట్టింటినించి భర్త దగ్గరకు వస్తున్నప్పుడు నిత్యదరిద్రమైన , కష్టాల కడలిలోనించి స్వర్గానికి వస్తున్నట్టుగా భావించింది . మధురమైన భవిష్యత్తుకు యేదో. మసక !!!

ఒకరోజు సిటీ చూడడానికి బస్సు లో బయలుదేరారు .శివరాం గౌరి తో బస్సు లో కబుర్లు చెప్తూ టికెట్ అడిగిన కండక్టర్ మాట కూడా వినిపించుకోకుండా కనీసం అటువైపు కూడా చూడలేదు . స్టాప్ వచ్చింది .ఇద్దరూ దిగేసారు . గౌరి “ఎందుకు మీరు బస్సు టికెట్ తీసుకోలేదు ?” వుండబట్టలేక అడిగేడింది .శివరాం నవ్వేసి “గౌరి. ఇంకాకొంచెం డబ్బులు పెడితే సిగరెట్టు డబ్బాకొనుక్కోవచ్చు ,అయినా మనం టికెట్. తీసుకోనంత మాత్రాన కొంపలేమి మునగవులే “ చాల సహజం గా చెప్పాడు ! గౌరి మనసు కలుక్కుమంది !

————————————————-

వారం రోజుల తర్వాత శివరాం ఒక మంచి అందమైన దంతం దువ్వెన తెచ్చాడు . “గౌరీ నీకోసం ఏం తెచ్చానో చూడు “అంటూ దువ్వెన చేతిలో పెట్టాడు . గౌరికి దువ్వెన నచ్చింది .

“ చాలా బాగుంది ,ఎంతఖరీదు?”ప్రశ్నించింది . శివరాం నవ్వుతూ నిర్ల్యక్షం గా “దాని మీద వుంది చూడు “అన్నాడు . 200 రూపాయలు అని చూసి ఆశర్యపోయింది గౌరి .
" దువ్వెనకు యింత అవసరమా !! కష్టపడి సంపాదించిన డబ్బు యిలా ఖర్చుచేసుకోకుండా పొదుపు చేసుకుందామండీ "అన్నది గౌరి .
శివరాం నవ్వుతూ " గౌరీ !! నేనంత వెర్రివాడినా కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చుపెట్టడానికి "అన్నాడు .
"అయితే మీరు పనిచేసే షాపు అతను తగ్గించి యిచ్చాడా "అడిగింది .
గౌరి బుగ్గమీద చిటికేసి నవ్వుతూ "లేదు రాణీగారు వచ్చారనీ వుచితం యిచ్చారు "అన్నాడు .
గౌరి "హాస్యాలు ఆపండి !నిజం చెప్పండి "సీరియస్ గా ప్రశ్నించింది .
శివరాం ముఖం యెర్రబడింది . "తమాషా అయినా కాసేపే బాగుంటుంది . బుర్రలో తెలివితేటలు చేతిలో నేర్పు వుండాలేగానీ యిలాంటివాటికి డబ్బు ఖర్చు పెట్టే దద్దమ్మ యెవరు ?"అసహనం గా అన్నాడు .
గౌరికి తల మీద యెవరో సుత్తికొట్టినట్టుగా ఫీల్ అయ్యింది . పంచరంగుల తన కల నల్లరంగుగా మసిబారినట్టుగా మనసు విలవిలలాడింది . వెన్నెలలో శివరాం యెంతో అందం గా కనపడుతున్నాడు ! కానీ గారికి అతని నుదిటిమీది నీలినీడలే కనిపిస్తున్నాయి !మూసి వున్న అతనికళ్ళు పసిపాప ముఖం లాగా ప్రశాంతం గా అమాయకం గా వున్నది ! అతనిలోని నీచ మనస్తత్వం గుర్తుకు రాగానే గౌరికి కన్నీళ్లు వచ్చాయి !

పుట్టింటివాళ్లు బీదవాళ్లే కానీ యిలాంటి మనస్తత్వం లేదు !i ఈ భర్త తో జీవితాంతం కాపురం చెయ్యాలి .పిల్లలు పుడితే వాళ్లకూ యీ అలవాట్లే వస్తే! ఒక రోజు వుదయం భర్తకు కాఫీ యిస్తూ “ ఏమండీ నాకు వుద్యోగం చెయ్యాలనుంది . ప్రయత్నిస్తాను .”అన్నది శివరాం “ గౌరీ హాయిగా నీ యింటికి రాణి గా వుండు , నీ కోమల శరీరం అలసిపోతే నేను చూడలేను ! కానీ నీ కోరికను కూడా కాదనలేను ! మా పక్క షాపు లో గుమస్తా వుద్యోగం వుంది నేను చెప్తే తప్పకుండా నీకు యిస్తారు “అన్నాడు నవ్వుతూ! పది రోజుల తర్వాత గౌరి వుద్యోగం లో జాయిన్ అయ్యింది , ఇద్దరూ ఒకే సారి బయలుదేరేవారు .

గౌరి తప్పనిసరిగా యిద్దరికీ బస్సు టికెట్ తీసుకునేది . మొదట్లో శివరాం వారించేవాడు, కానీ గౌరి వినేది కాదు. ఒక రోజు గౌరీ షాపులో ఒక వ్యక్తి గోడగడియారం కొనడానికి వచ్చాడు . గౌరి ఓపికగా అన్నీ చూపించింది , అతని నచ్చింది కొనుక్కున్నాడు , బిల్ చెల్లించాడు కానీ వస్తువు తీసికెళ్ళడం మర్చిపోయాడు . గౌరీ మరో వ్యక్తి కొనుక్కోవడానికి వస్తే బిజీ గా వున్నది . షాపు మూసే సమయానికి శివరాం వచ్చాడు , అతని దృష్టి గోడ గడియారం మీద పడింది .వెంటనే గౌరి కంట పడకుండా తన షాపులో పెట్టేసి వచ్చాడు .ఇద్దరూ ఇంటికి వచ్చేసారు , “గౌరీ యెలా వుంది నీ వుద్యోగం?” నవ్వుతూ అడిగాడు శివరాం ! “నాకు నచ్చిందండీ, కాకపోతే ఓపికగా వాళ్లకు చూపించాలి ,యివాళ ఒకతను తన తండ్రి పుట్టిన రోజున గోడ గడియారం అందమైనది సెలెక్ట్ చేసుకున్నాడు చాలాబాగుంది ! మనం కూడా కొనుక్కుందామండీ అలాంటిది “ అన్నది గౌరి . “రాణి గారు అడిగితె యీ దాసుడు కాదంటాడా !” నవ్వుతూ బుగ్గ మీద చిటికె వేసాడు! మర్నాడు షాపు కి గడియారం కొన్న వ్యక్తి వచ్చాడు ! “నమస్తే అండీ ! మీకు యే వస్తువు కావాలి ?” అంటూ నమస్కరించి గౌరీ అతనిని ప్రశ్నించింది ! “నిన్న నేను హడావిడిలో గడియారం మర్చి పోయాను , అది తీసుకు వెళదామని వచ్చాను “అన్నాడు !

గౌరి “సారీ అండీ నేను గమనించ లేదు ! మీ వస్తువు యెక్కడికి పోదు “అంటూ వెతికింది ! దొరక లేదు ! షాపు యజమాని గౌరిని “ఏమ్మా కొనుక్కున్నవాళ్లు వస్తువు. తీసుకున్నారా లేదా చూడాలి కదా ! మన దగ్గర మరో అదే మోడెల్ వుంటే యిచ్చి పంపు, అందరూ మనల్నే చూస్తున్నారు “ సున్నితం గా మందలించారు !

ఇంకోటి లేదు ! గౌరికి తల కొట్టేసినంత పనయింది ! అవమానం తో తల దించుకుంది ! ఆ వ్యక్తి “ఇలాంటి వాళ్లను పనిలో పెట్టుకుంటే వస్తువులన్నీ వాళ్లింటికి చేరుతాయి ! నాకు డబ్బులు యిచ్చెయ్యండి “అంటూ కోపంగా అరిచాడు .యజమాని డబ్బు యిచ్చి పంపేశాడు !
“ నీ జీతం లో కట్టింగ్ వుంటుంది! ఇంకో సారి యిలా జరిగితే నీ అవసరం లేదు !” సీరియస్ గా కోప్పడ్డాడు ! శివరాం. కోసం ఆగకుండా యింటికి వచ్చేసింది ! ఆపుకున్న కన్నీళ్లు జల జలా రాలాయి ! పుట్టి బుద్దెరిగినప్పటి నుంచి యెవ్వరితో ఒక్క మాట పడ లేదు ! ఇంతకీ గడియారం యేమయివుంటుంది!! ఆలోచనలు తొలుస్తున్నాయి ! గౌరికి శివరాం గుర్తుకొచ్చాడు ! అవును కదా షాపుకు వచ్చిన సంగతి గుర్తుకొచ్చింది ! అనుమానం భర్త మీద కలిగింది !
శివరాం ఉషారుగా లోపలికి వస్తూనే “ హాయ్ బంగారూ చూడు ఏంతెచ్చానో “ అంటూ గౌరి కళ్లు మూసి ఒళ్లో ఒక పాకెట్ పెట్టాడు .

గౌరి వూహ నిజమయ్యింది ! గోడ గడియారం తన షాపులోది ! ఏం మాట్లాడాలో తెలియడం లేదు ! ఇతని అలవాటు యెలా మార్చాలి ?? ఒక నిర్ణయానికి వచ్చింది ! ఏమి తెలియనట్టుగా అమాయకం గా “ చాలా బాగుందండీ ! యెక్కడ కొన్నారు ? అచ్చు మా షాపులో గడియారంలాగా వుంది ! మీరెంత మంచి వారండీ” అంటూ భర్తను పొగిడింది ! “ఇవాళ మా షాపు యజమాని తొందరగా రమ్మన్నారండీ వంట చేసేసాను మీరు తినేసి వెళ్ళండి ! మర్చి పోయాను మిమ్మల్ని మా యజమాని ఒక సారి కలవమన్నారు ! లంచ్ బ్రేక్ లో తప్పకుండ రండి “ అంటూ మరొక మాటకు అవకాశం యివ్వకుండా గౌరి గడియారం తీసుకుని వెళ్లి పోయింది. శివరాం బద్ధకం గా లేచి పనులన్నీ ముగించుకుని షాపుకు వెళ్లాడు! “శివరాం యివాళ కొత్త స్టాక్ డెకొరేటీవ్ పీసెస్ వచ్చాయి ! లెక్క చూసి అన్ని అందం గా సద్దాలి “ యజమాని. చెప్పాడు ! శివరాం “అలాగేనండి “ అంటూ వాటిని చూస్తున్నాడు ! ఇంతలో గౌరి అక్కడికి వచ్చింది ! యజమాని దగ్గరకు వెళ్లి “ మీరు. ఒకసారి శివరాం. గారిని మా షాపుకు. పంపిస్తారా !” అని అడిగింది ! రెండు షాపులు. పక్క పక్కన కాబట్టి అయన శివరాం. ని పంపారు , కానీ యెందుకో యేదో అనుమానం శివరాం కి వచ్చింది ! “రండి శివరాం. గారూ మీకు చాలా చాలా కృతజ్ఞలు ! మా గడియారం మీకు దొరికిందిట కదా ! గౌరి గారు చెప్పారు “అంటూ గడియారం చూపించాడు యజమాని ! శివరాం ముఖం లో. కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు ! ఏం చెప్పాలో అర్ధం కాలేదు ! గౌరి. వైపు చూసాడు ! గౌరి చాలా ముభావం గా యెక్కడో చూస్తున్నది !” శివరాం. గౌరి. నాకు అంతా చెప్పారు ! జీవితం లో. నిలబడాలంటే నిజాయితీ చాలా ముఖ్యం ! చిన్ని చిన్ని దురలవాట్ల వల్ల మనం సంఘం లో. విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం ! నమ్మకాన్ని పోగొట్టుకుంటే మీకు. యెక్కడా వుద్యోగం దొరకదు ! గౌరి. గారి మంచితనం , ఆ అమ్మాయి బాధ అర్ధం. అయ్యింది ! మిమ్మల్ని మార్చడానికి ప్రయ్సత్నించమని అడిగింది ! ఇకపైన ఇలాంటి పనులు చెయ్యకండి ! గౌరి. గారు నాకు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని. వదిలేస్తున్నాను “అంటూ యజమాని హెచ్చరించారు ! శివరాం. మౌనం గా షాపుకు. వచ్చేసాడు . సాయం కాలం యిద్దరూ యింటికి చేరారు “ఏమండీ రేపు ఆదివారం కదా యెక్కడికయినా వెళ్దామా?” మురిపెం గా భర్త కు కాఫీ యిస్తూ నవ్వుతూ అడిగింది గౌరి ! శివరాం. భార్య కేసి చూస్తూ !!! మనసులో ‘గౌరి యెంత అందం గా. తనల్ని. మార్చింది ! నొప్పి లేని దెబ్బ కానీ హాయిగా వుంది ! ఇక పై తాను కొత్త. శివరాం ‘ “అలాగే తప్పకుండా అంటూ గౌరి ని దగ్గర తీసుకున్నాడు ! ఇప్పుడామె అతని నిజమైన సహచరి ! ప్రపంచం లోని సౌందర్యమంతా వారి కళ్ళల్లో వెలిగింది!

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు