శాపమిమోచనం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Curse

ఒక శుభ ముహూర్తాన పండితులు వేద మంత్రాలు చదువుతుండగా, రాజ సభలో ప్రవేసించిన భోజ మహరాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ పదిహేనవ మెట్టు పై కాలు మోపబోయాడు.ఆమెట్టు పై ఉన్న 'అమృత సంజీవిని వళ్ళి'అనే సాలభంజకం 'ఆగు భోజరాజా త్రయోదశ గుణాలు అంటే రాగము, మోహము, ద్వేషము,కామము,క్రోధము,లోభము,మద మాత్సర్యాలు, ఈర్ష్యి, అసూయ, దర్పము, డంబము, అహంకారం లేని వాడయిన విక్రమార్కుని వీరోచిత గుణ గణాలు నీకు తెలిసేలా ఒక కథ చెపుతాను విను... భట్టిని ఆరు మాసాలు రాజుగా సింహాసనం పై అధిష్ఠింప జేసిన విక్రమార్కుడు కాశీ నగరం చేరుకుని విశ్వనాధుని, విశాలాక్షి, అన్నపూర్ణలను పూజించి దశ అశ్వమేథ ఘూట్ చేరుకుని మరో మారు గంగా నదిలో స్నానానికి దిగుతుండగా 'అయ్యో కాపాడండి నా భర్త కాలును ముసలి పట్టుకుంది సాహసులు ఎవరైనా నా భర్తను కాపాడండి' అని ఓ వృధ స్త్రీ గొంతుక వినిపించింది. వెంటనే చేతి లోని కత్తితో గంగా నదిలో దూకి ముసలిని గాయ పరచగా అది ఆవృధ్ధుని కాలు వదలి వెళ్ళి పోయింది. గాయ పడిన వృధ్ధుని ఓడ్డు చేర్చి కాలి గాయానికి ప్రాధమిక చికిత్స చేసాడు విక్రమార్కుడు. 'నాయనా నాకు ప్రాణ దానం చేసావు.నీ పరోపకార గుణం మోచ్చ దగినది. నీకు ఓ మంత్రం ఉపదేశిస్తాను దాన్ని మూడు సార్లు ఉఛ్చరిస్తే ఎటువంటి ఆపదైనా, శాపమైనా తొలగి పోతుంది విజయోస్తు' అని దీవించి ఆ వృధ్ధ జంట వెళ్ళి పోయారు. మరలా దేశాటనకు బయలు దేరిన విక్రమార్కుడు వింధ్యామల పర్వత శ్రేణి లోని అరణ్య మార్గాన వెళుతూ, అలసటతో దారిలో ఉన్న మర్రి చెట్టు నీడలో చదునుగా ఉన్న ప్రదేశంలో విశ్రమించాడు. అదే చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసుడు విక్రమార్కుని చూసి పెడ బొబ్బలు పెడుతూ చెట్టు కిందికి వచ్చిడు.తన కత్తితో రాక్షసుని తల తెగవేయబోగా 'అయ్యా శరణు శరణు శరణార్ధిని చంపడం ధర్మం కాదు నాకు ప్రాణ భిక్ష పెట్టండి అని మోకరిల్లాడు. 'భయం లేదు నీకు ప్రాణ హాని లేదు.ఎవరు నీవు? ఈ రాక్షస రూపం ఏమిటి' అన్నాడు విక్రమార్కుడు. 'అయ్యా నా పేరు మంత్ర సేనుడు.నేను గంధర్వుడిని, ఓ పూదోట లో నేను పెద్దగా గానం చేస్తుండగా, సమీపంలోని మునికి తపో భంగం కలగడంతో నన్ను రాక్షసుడిగా మారి పోమ్మని శపించాడు.తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని ఆ మునిని వేడుకున్నాను.అప్పుడు ఆ ముని ఉజ్జయిని రాజు విక్రమార్కుడు వచ్చి నాకు శాప విమోచన చేస్తాడని చెప్పాడు.నాటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తున్నా' అన్నాడు. ' మంత్ర సేనా భయ పడకు నీకు నేను ఓ మంత్రం ఉపదేశిస్తాను దాన్ని మూడు సార్లు ఉఛ్ఛరిస్తే నీ శాపం తొలగి పూర్వ రూపం వస్తుంది' అని రాక్షసునికి మంత్రోపదేశం చేసాడు విక్రమార్కుడు. మంత్రోపదేశంతో రాక్షస రూపం పోయిన మంత్రసేనుడు నమస్కరించి వెళ్ళి పోయాడు. 'భోజ రాజా ప్రార్ధించే పెదవుల కన్నా సహాయ పడే చెతులు మిన్న అని నిరూపించిన రాజు విక్రమార్కడు. అంతటి సాహసం, దయాగుణం, పాప భీతి, పరోపకారం నీలో ఉంటే తప్పక ఈ సింహాసనం అధిష్టించు. లేదా వెను తిరుగు అంది సాలభంజకం. అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో కలసి వెను తిరిగాడు భోజ రాజు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు