అమరావతి నగరంలొ తన పనులు ముగించుకొని తన ఊరి బస్సు రావడానికి ఇంకా సమయం ఉండటంతొ ఎదురుగా ఉన్న పార్కులొ ఒచెట్టు కింద సిమెంట్ బల్ల మీద చతికిల పడాడు చంద్రన్న. రేపటి తరం నాగరీకినికి మారు పేరులా భుజాల మీదకు దిగిన జులపాల జుట్టుతొ పొటి చొక్క చిరుగుల జీన్స్ ,ఏనుగు పాదాల బూట్లుతొ పిల్లి గడ్డ గీరుకుంటూ , సగం తెలుగు సగం ఇంగ్లిషు కలసిన భాష మాట్లాడుతూ ఒ యువకుడు చంద్రన్న చెంత చతికిల పడాడు . కొంత సమయం గడిచాక అ యువకుని చూస్తూ "బాబు సమయం ఎంత అయింది "అన్నాడు చంద్రన్న,
కాలిపైకి చిరుగుల జీన్స పైకి లాగి కాలికట్టినవాచ్చిచూసి5.30అన్నాడుఆయువకడు "ఏమిటి కాలికికూడా వాచ్చి కడతారా "అన్నాడుచంద్రన్న.
"ఏం ఎందుకు కట్టకూడదు మొదట తెల్లవాళ్ళు మెడలో హరంలా వేళ్ళాడదీసారు , అది చూసి కొందరు తమ కోటు జేబు లోనికి దించారు. అలా మా తాతల నాటికి బొడ్డు వద్దకు దించారు. ఈ తరం వారు ఇంకా కిందికు దించి కుడి ఎడమ చేతులకు వాచ్చి కట్టి తిరుగుతున్నారు ఇలా గొంతు వద్ద మొదలుకొని క్రమేపి దిగుతూ విచ్చిన నాగరీకాన్ని నేను మరింత కిందికి దించి అందరి కన్నాముందుగా కాలికి వాచ్చి కట్టాను, రేపటి ప్యాషన్ గురించి నీలాంటి పల్లెటూరి వారికి ఏం తెలుసు" .అని ఆ యువకుడు వెళ్ళాడు. పట్టణ వాసపు జీవితాలు, వారి వింత అలవాట్లు, విచిత్ర వేషాలు అర్దం కాని చంద్రన్నతల గీరుకుంటూ బస్టాండుకు వేళ్ళి పొయాడు.