ఓ శుభ మహుర్తన తన రివారంతొ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలుకుతుండగా, రాజ సభలో ప్రవేసించిన భోజ మహ రాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి పద్దెనిమిది మెట్లుఎక్కి పందొనిమిదొ మెట్టుపై కాలు మోపబోతుండగా ఆ మెట్టుపై ఉన్నబంగారు సాల భంజకం సద్గుణ వళ్ళి 'ఆగు భోజరాజా నువ్వు అధిష్టించ దలిచే ఈ సింహాసనం ఏలిక గురించి కథ చెపుతానువిను....పూర్వం ఉజ్జయిని నగరంలో శంకర శాస్త్రీ అనే వేద పండితుడు తన కుటుంబంతొ ఉండే వాడు. అతని పుత్రుడు 'వసు మిత్రుడు' అనే వాడు అమరావతి రాజ్యం లోని గురు కులంలో విద్య పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ధర్మపురి అనే రాజ్యం చేరాడు. అక్కడి లక్ష్మినారాయణ ఆలయం వద్ద ఉన్న శిలా శాసనం చదివి ఆశ్చర్య పోయాడు.
ఆ శాసనంలో ఇందు మూలంగా తెలియ జేయడమేమనగా ఈ ఆలయం వెనుక భాగాన జువ్వి చెట్టుకింద ఏర్పరిచిన గంగాణంలో నేయి మరుగుతున్న సమయంలో ఎవరైతే దానిలో గొంతు భాగంవరకు మునిగి క్షేమంగా వెలుపలకు వస్తారో వారికి నా కుమార్తే వీర లక్ష్మిని ఇచ్చి వివాహం చేసి, నా రాజ్యానికి రాజును చేస్తాను ఇట్లు రాజా రంగ రాజ వర్మ అని ఉంది. దైవ దర్శనం ముగించుకుని వస్తుండగా రాజ కుమారి వీర లక్ష్మి ఆ లయం లోనికి వెళుతూ కనిపించింది.ఇతటి సుందరిని భార్యగా పొంద లేని తన జన్మ వృధా అనుకుని ఉజ్జయిని చేరి విక్రమార్కుని దర్శించి ధర్మపురి లక్ష్మి నారాయణ ఆలయ శాసనం గురించి, రాకుమారి వీరలక్ష్మిని తను వివాం చేసుకొ దలచానని తెలియ జేసాడు. తన రాజ్యాన్ని భట్టికి అప్పగించి వసు మిత్రుని తో కలసి ధర్మ పురి చేరి రాజు గారికి తెలియ జేసి అక్కడి సమస్త ప్రజానీకం చూస్తుండగా! సల సలా కాగుతున్న నేతి గంగాణంలో 'జై భవాని' అంటూ ప్రవేసించిన విక్రమార్కుడు కొద్ది సేపటి అనతరం నవ్వుతూ శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండా గంగాణం నుండి వెలుపలకు వచ్చాడు.
అక్కడ ఉన్న ప్రజలు హర్ష ద్వానాలు చేసారు. రాజు, అతని కుమార్తె వీర లక్ష్మి చేతిలో వర మాలతో విక్రమార్కుని వద్దకు వచ్చాడు.' మహారాజా మీ అమ్మయిని సకల విద్య వినయ సంపన్నుడు నా దేశ వాసి అయిన వసు మిత్రుడు ప్రేమిస్తున్నాడు మనం ప్రేమించే వారి కంటే, మనల్ని ప్రేమించే వారితో జీవితం పంచుకొవడం ఆనంద కరంగా ఉంటుంది కనుక వీర లక్ష్శిని వసు మిత్రునికి ఇచ్చి వివాహం జరిపించి ఈ దేశానికి అతడినే రాజును చేయవలసిందిగా నావిన్నపం'అన్నాడు విక్రమార్కుడు ధర్మపురి రాజు విక్రమార్కుని కొరిక తీర్చాడు.'భోజరాజా నువ్వు ఏనాడైనా ఇటువంటి త్యాగం చేసి ఉంటే ముందుకు కదులు'అన్నది సాలభంజకం.అప్పటికే ముహుర్తసమయం మించి పోవడంతో తన పరివారంతో వెనుతిరిగాడు భోజరాజు.