స్కూల్లో వార్షికోత్సవాలు జరగబోతున్నాయి ఎప్పటిలాగే వార్షికోత్సవంలో పిల్లలు చేత పాటలు పాడించడం డాన్సులు చేయించడం చేయాలనుకున్నారు ఆ బాధ్యత అంతా శ్యామ్ మాస్టారికి అప్పగించారు పిల్లలు ఎవరెవరు ఏమేమి చేస్తారో ఒక లిస్టు తయారు చేయమని చెప్పారు ముందుగా నృత్యం గానం నాటకం అంటూ కొన్ని విభాగాల పేర్లు చెప్పారు ఆ లిస్టు తయారయ్యాక ఒక్కొక్క విభాగంలో ఎవరెవరు పాల్గొంటారు వారి పేర్లు రాసుకోవాలి అనుకున్నారు. శ్యామ్ మాస్టర్ ర్ మొదట ఐదవ తరగతి గదిలోకి వెళ్లారు కుర్చీలో కూర్చుని అరే పిల్లలు మీరంతా వార్షికోత్సవంలో పాల్గొనాలి ఎవరెవరు వీటిలో పాల్గొంటారో చెప్పండి అన్నారు మాస్టర్.
మహేష్ అశ్విన్ నరేష్ విశ్వాస్ ప్రత్యూష మీరంతా ఎప్పుడూ క్లాసులో మొదటి ర్యాంకు లోనే ఉంటారు కదా పాటలు పాడటం డాన్సులు చేయడం నాటకం వేయడంలో మీ పేర్లు రాస్తున్నాను మీరు ప్రిపేర్ కండి అన్నాడు మాస్టారు అంతలో అశ్విని లేచి నాకు డాన్స్ చేయడం రాదు అంటూ బిక్క మొహం పెట్టాడు. మీకు రాకపోవడం ఏమిట్రా ఎప్పుడు నువ్వేగా క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చేది నీకు డాన్స్ ఎంత సేపట్లో వస్తుంది ప్రయత్నం చెయ్యి దానంతట అదే వస్తుంది అన్నాడు మాస్టర్. అంతలో భయంగా లేచి నిలబడ్డాడు సిద్ధార్థ సార్ నేను డాన్స్ చేస్తాను అన్నాడు మాస్టారు ఏమంటాడో అని భయపడుతూ ఏంట్రా సిద్ధార్థ నువ్వు డాన్స్ చేస్తావా నీకేం వస్తుంది ఎప్పుడూ లాస్ట్ ర్యాంక్ లో ఉంటావు నీకు రాదులే అన్నాడు ఎగతాళిగా మాస్టర్.
సిద్ధార్థ్ బాధతో తలదించుకున్నాడు కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి మాస్టర్ మళ్లీ ఇలా అన్నాడు నువ్వు ఎప్పుడూ తలదించుకునే ఉంటావు నువ్వు దేనికీ పనికిరావు ఎప్పుడైనా 85 శాతం మార్కులు దాటాయా రా నీకు నిన్ను స్టేజి మీద ఎక్కిస్తే మధ్యలో మర్చిపోయి ఇస్తావ్ నీవల్ల స్కూల్ పరువు పోతుంది మాస్టర్ అప్పుడే లంచ్ బాక్స్ ఇవ్వడానికి వచ్చిన సిద్ధార్థ తల్లి ఈ మాటలన్నీ విన్నది సిద్ధార్థ మొహం చిన్న పోవటం చూసింది మాస్టారు ఒక మాట మీతో మాట్లాడాలి అన్నది మాస్టర్ క్లాస్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు ఏవిటన్నట్లుగా చూశాడు ఆమె వంక.
మాస్టారు మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ ఒక మాట చెప్తా వినండి చదువులో తక్కువ ర్యాంకు డాన్స్ కు ఏమిటి సంబంధం మా సిద్ధూ చాలా బాగా డాన్స్ చేస్తాడు ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్లను నెత్తిన పెట్టుకోండి ఎవరూ కాదనరు కానీ తక్కువ మార్కులు వచ్చిన వారిని గెలిచి చేయకండి క్లాసులో ఉన్న 20 మందిలో ఎవరో ఒకరు లాస్ట్ ర్యాంక్ రావాలి కదా అయినా 80 శాతం కన్నా ఎప్పుడైనా తక్కువ వచ్చాయా మా సిద్దూకి అవి కూడా తక్కువ మార్కులు అసలు నాకు తెలియక అడుగుతాను ఒక మాట చెప్పండి చదువులో తక్కువ ఉన్నంత మాత్రాన కలలో ముందు ఉండకూడదు అందరిని సమానంగా చూడాలని మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి కదా మరి మీరే ఇలా అసమంగా చూస్తే పిల్లలు ఏమి నేర్చుకుంటారు అన్నది సిద్ధార్థ తల్లి.
శ్యామ్ మాస్టర్ కు తన తప్పు తెలిసింది ఆమె చదువుకోకపోయినా ఎంత చక్కగా చెప్పింది అనుకున్నాడు ఫస్ట్ బ్యాంకు మోజులో పడి తన ఎంత తప్పు చేసాడో అర్థమైంది ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించకూడదు అనుకున్నాడు అప్పుడు సిద్ధార్థ తల్లి తో ఇలా అన్నాడు అమ్మ నా తప్పు ఏంటో అర్థమైంది సిద్ధార్థ చేత తప్పకుండా డాన్స్ చేయిస్తాం అన్నాడు చేతులు జోడిస్తూ. సిద్ధార్థ తల్లి ప్రతి నమస్కారం చేసి వెళ్ళిపోయింది.