ఓక శుభ ముహూర్తాన పండితులు వేద మంత్రాలు చదువుతుండగా తన పరివారంతో రాజ సభలో ప్రవేసించిన భోజ రాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ ఇరవై రెండో మెట్టుపై కాలు మోప బోతుండగా, ఆ మెట్టుపై ఉన్న' పంకజ వళ్ళి' అనే బంగారు సాలభంజకం 'ఆగు భోజ రాజా ఈ సింహాసనం అధిష్టించాలి అంటే అహింస, సత్యం, అస్తేయం, అసగం, హ్రీ, అసంచయం, ఆస్తీక్యం, బ్రహ్మచర్యం, మౌనం, స్ధైర్యం, క్షమ, అభయం, అనే యామాలు పాటిస్తూ ప్రజలను తన బిడ్డల్లా పాలించిన విక్రమార్క మహారాజు కథ చెపుతాను విను...... తన రాజ్యాన్ని భట్టికి అప్పగించి దేశ యాటనకు బయలు దేరాడు విక్రమార్కుడు.అమరావతి నగర సమీపంలోని అరణ్యంలో ఓ చిన్నపాటి నీటి మడుగులో చిక్కుకున్న ఆవు అతి దీనంగా అరవ సాగింది. దానికి కొద్ది దూరంలో ఎదురుగా ఉన్న సింహం ఆవును చంపడానికి సిధ్ధ పడింది. అ దృశ్యం చూసిన విక్రమార్కుడు ఒర లోని కత్తి లాగి సింహం ముందు నిలబడ్డాడు. 'సాహసీ నేను ఓక యక్షుడను శాప వశాత్తూ ఈ సింహ రూపంలో సంచరిస్తున్నాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్ప గలిగితే ఆవు ప్రాణాలతో పాటు, నాకు శాప విమోచన కలుగుతుంది. అన్నది మానవ భాషలో సింహం.''ఏమిటా ప్రశ్నలు'' అన్నాడు విక్రమార్కుడు. ''ప్రాణికి పది దశలు ఏవి?'' అన్నది సింహం. "గర్బవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగడం, కైశోరం, యవ్వనం, ప్రౌడత్స్యం, వార్ధక్యం, మృత్యువు" అన్నాడు విక్రమార్కుడు. "షోడశ చంద్రకళల పేర్లేమిటి" అన్నది సింహం. "శశి రేఖ, మానద, పూస తుష్టి, సృష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్య, శ్రీ,ప్రీతి, అంగద, పూర్ణ, అముృత, సినివాలి" అన్నాడు విక్రమార్కుడు. "వ్యాకరణ శాస్త్ర లక్షణాలు ఏమిటి" అన్నది సింహం "స్వర, వర్ణ, పద, ధాతువులు, కృత్తు, తధ్ధిత, కాకర, సమాస, సంధి, సంజ్ఞా లక్షణములు" అన్నాడు విక్రమార్కుడు. మరు నిమిషం సింహం యక్షుని రూపం లోనికి మారి పోయింది. "భళీ రాజా నాకు శాప విమోచనం అయింది. ఇదిగో ఈ అంగుళీయం ఉంచుకో, ఆపదలో నీకు వినియోగ పడుతుంది" అని అదృశ్యమైయ్యాడు సింహా రూపంలోని యక్షుడు. ఆవును కాపాడిన విక్రమార్కుడు మరలా దేశాటనకు బయలు దేరాడు. అలా ప్రయాణం చేస్తూ 'కాశీ' నగరం చేరుకుని విశ్వనాధుని దర్శించుకుని అక్కడి వింతలు విషేషాలు తెలుపమని ఓ మునిశ్వరుని కోరగా, ఇక్కడకు ఉత్తరాన ఇరవై ఆమడల దూరంలో 'నలందా' రాజ్య పొలిమేరలలో కాళీ మాత ఆలయ ప్రాంగణంలో గంగాళం నిండుగా నూనే కాగుతూ ఉంటుంది. ఆగంగాళం కింద ఎటువంటి నిప్పు,మంటా ఉండదు. ఆగంగాణంలో ఎవరైనా సాహసి దిగి గాయ పడకుండా వెలుపలకు ప్రాణాలతో వస్తే, గత ఆరు సంవత్సరాలుగా ఆ రాజ్యంలో వర్షాలు లేక ప్రజలు కరువుతో అల్లాడు తున్నారు. ఆ రాజ్యం అంతటా సకాలంలో వర్షలు కురిసి ప్రజలు సుఖః పడతారు. ఓక ముని శాప కారణంగా అలా జరిగింది' అన్నాడు ముని.అతని ఆశీర్వాదం పొందిన విక్రమార్కుడు నలంద రాజ్యం చేరి ఆ నూనె గంగాళంలో దిగుతున్న సమయంలో యక్షుడు ఇచ్చిన ఉంగరాన్ని నుదుట తాకించి వేడి నూనె గంగిళంలో ప్రజల హర్షధ్వానల మధ్య దిగాడు .కొద్ది సేపటి అనంతరం ఎటువంటి గాయాలు లేకుండా చిరునవ్వుతో గంగాళం వెలుపలకు వచ్చాడు విక్రమార్కుడు.' అయ్యా ముని శాపం వలన గత ఆరు సంవత్సరాలు వర్షలు లేక కరువు తో నరకం చూసాము. దేముడిలా వచ్చి నా దేశాని ఆదుకున్నారు' అన్నాడు ఆ దేశ రాజు. ఇంతలో క్షణాలలో కారు మేఘాలతో జడి వాన కురియ సాగింది. ఆ దేశ ప్రజలంతా విక్రమార్కునికి బ్రహ్మ రధం పట్టారు.' భోజ రాజా విక్రమార్కునిలా అంతటి సాహసివి, శాస్త్ర పరిజ్ఞాన కలిగిన వాడవు అయితే అడుగు ముందుకు వేయి' అన్నది ఆ సాల భంజికం. అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో వెను తిరిగాడు భోజ మహారాజు.