బొమ్మలు చెప్పిన కమ్మనికథలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

vrttasurudu(Fairy tales told by dolls)

ఓ శుభ ముహర్తాన పఃడితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలుకుతుండగా రాజసభలో ప్రవేసించి,విక్రమార్కుని సింహాసనాకికి నమస్కరించి దానికి ఉన్న మెట్లుఎక్కుతూ ఇరవై మూడో మెట్టుపై కాలు మోపబోయాడు భోజరాజు.

ఆ మెట్టుపై ఉన్నఅపరంజి వళ్ళి అనే బంగారు సాలభంజకం 'ఆగు మహారాజా అడుగు ముందుకు వేసే సాహసం చేయకు ఈ సింహాసనం శౌర్య ప్రతాపాలకు దాన గుణ సంపత్తికి మారు పేరైన విక్రమార్కునిది. అతని గురించి ఓ కథ చెపుతాను విను....దెశ సంచారం చేస్తు విక్రమార్కుడు శైవాలఘ్ షం అనే పర్వత శ్రేణిని దాటుకుని అరణ్యంలో ప్రయాణిస్తుండగా, ఎండ వేడికి తాళ లేక ఓ వృక్షం కింద విశ్రాంతి కొరకు విశ్రమించాడు.అదే చెట్టు పైన రెక్కలు రాని పక్షి పిల్లలు భయంతో కిచ కిచ లాడ సాగాయి.విక్రమార్కుడు పక్షుల గూడి కేసి చూడగా చెట్టు పైకి ఎగబాకుతున్న పాము కనిపించింది వెంటనే ఓర లోని కత్తిని తీసి పామును రెండు ముక్కలు చేసాడు.కొద్ది సేపటికి పెద్ద పక్షులు గూటికి వచ్చాయి తమకు జరిగిన ఆపద గురించి పిల్ల పక్షులు వాటికి చెప్పాయి. పెద్ద పక్షులు విక్రమార్కుని ముందు వాలి' బాటసారి మా బిడ్డల ప్రాణాలు కాపాడావు ధన్యవాదాలు, ఇక్కడకు ఆమడ దూరంలో బదరికా వనం ఉంది అక్కడ సుమిత్రుడు అనే తపస్వి కుటీరం నిర్మించుకుని లోక కల్యాణార్ధం పలు యాగాలు చేస్తుండే వాడు.ఇటీవల వృత్తాసురుడు అనే రాక్షసుడు సుమిత్రుని ప్రతి యాగాన్ని భంగ పరుస్తున్నాడు. నువ్వు ఉత్తర దిశగా ప్రయాణం చేయి నీకు సుమిత్రుని దర్శనం లభిస్తుంది' అని చెప్పి పక్షులు వెళ్ళి పోయాయి. అలా బదరికా వనం చేరి సుమిత్రుని దర్శంచి నమస్కరించాడు విక్రమార్కుడు.తన దివ్య దృష్టితో విక్రమార్కుని గుర్తించి 'రాజా దీన జన బాంధవుడిగా పేరు పొందిన నీవు మాయావి అయిన వృత్తాసురుని సంహరించి నేను చేసే యాగాలకు ఆటంకం లేకుండా చేయి, ఇదిగో నా మంత్ర శక్తిచే రెక్కల గుర్రం సృష్టిస్తున్నా ఇది నిన్ను ఆ రాక్షసుని దగ్గరకు తీసుకు వెళుతుంది. ఎట్టి పరిస్తితుల లోనూ నువ్వు ఈ గుర్రం దిగ కూడదు' అన్నాడు సుమిత్రుడు. రెక్కల గుర్రం ఎక్కి ఆకాశ మార్గాన వృత్తాసురుడు ఉండే గుహ వద్దకు చేరుకుని , రాతి గథతో తల పడిన నుదుటిపై ఒక కన్నుతో ఉన్న వాడి తో తల పడి భీకర పోరాటం అనందరం వృత్తాసురుని వధించాడు. భోజ రాజా నీవు అంతటి వాడవు అయితే ఈ సింహాసనం అధిష్టించు' అన్నది ప్రతిమ. అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో వెనుతిరిగాడు భోజ రాజు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు