బొమ్మలుచెప్పిన కమ్మని కథలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

rakrudu(Delicious stories told by dolls.)

ఓ శుభముహుర్తన వేదమంత్రాలతో పండితులు ఆశీర్వచనాలు పలుకుతుండగా తన పరివారంతో సభా మండపంలో ప్రవేసించిన భోజ మహా రాజు విక్రమార్కుని బంగారు సింహాసనానికి నమస్కరించి ఒక్కొ మెట్టు ఎక్కుతూ ఇరవై అయిదవ మెట్టు పై కాలు మోప బోయాడు. ఆ మెట్టు పైన ఉన్న బంగారు సాల భంజికం 'ఆగు రాజా సాహాసింపక విక్రమార్కుని దైర్య సాహసాలు తెలిపే కథ చెపుతాను విను. నువ్వు అంతటి వాడవైతే ముందుకు కదులు. బట్టి, విక్రమార్కులు దేశాటన చేస్తున్న సమయంలో వారి మంత్రి గోవిందుడు రాజ్య భారం వహించే వాడు. వారి సేనాపతి చంద్రుడు, రాజ పురోహితుడుగా త్రివిక్రముడు అనే వారు ఉండే వారు.త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతను కాశ్మీరి రాజ్యం లోని చంద్రమౌళి ఆశ్రమంలో సకల విద్యలు నేర్చి ఉజ్జయిని తిరిగి వస్తూ మార్గంలో కంచి అనే రాజ్యం చేరాడు. ఆ రాజ్యాన్నిఅనంగ సేనుడు అనే రాజు పరి పాలిస్తున్నాడు. అదే నగరంలో నవ మోహినీ అనే అపురూప లావణ్య వతి అయిన నృత్య కారాణి దేవాలయానికి వచ్చింది, అదే ఆలయం నుండి వెలుపలకు వస్తూ ఆమెను చూసాడు కమలాకరుడు. ఆమె తొలి చూపు లోనే కమలాకరుని ప్రేమించింది. ఆమెను వివాహం చేసుకొమ్మని విధ్యాధర పర్వత ప్రాంతం నుండి రకృడు అనే రాక్షసుడు ప్రతి పున్నమి రాత్రి వచ్చి తనను వివాహం చేసుకొమ్మని నవ మోహినిని వత్తిడి తెచ్చేవాడు. తను కన్యక వ్రతం చెస్తూన్నానని అది పూర్తి అయ్యే వరకు ఆగాలని నవమోహిని కాలం సాగ దీస్తుంది. అంతటి మాయల రాక్షసుడిని ఎదిరించ లేక, ఉజ్జయిని చేరి విక్రమార్కుని ఎదుట తను నేర్చిన పాండిత్యం ప్రదర్శించి మెప్పు పోందాడు. 'విప్రోత్తమా! తండ్రికి తగిన తనయులు అనిపించుకున్నారు మీకు ఏం కావాలో కోరు కొండి' అన్నాడు విక్రమార్కుడు. జరిగిన విషయం వివరిస్తూ నవ మోహిని తనూ పరస్పరం ప్రేమించుకున్నామని రకృని వధించమని కోరుకున్నాడు కమలాకరుడు. తన రత్న కంబళిపై కమలాకరుని ఎక్కించుకుని కంచి రాజ్యం చేరి నవ మోహిని యింట బస చేసారు. ఆ రోజు పున్నమి కావడంతో రాత్రి వచ్చిన రకృని తో తల పడ్డాడు విక్రమార్కుడు. రాతి గధతో వచ్చిన రకృరుని వధించి, నవ మోహినీ, కమలాకరులను ఉజ్జయినీ తీసుకు వచ్చి వారి వివాహం జరిపించాడు. భోజ రాజా నువ్వు అంతటి సాహసివా అడుగు ముందుకు వేయి' అన్నది బంగారు సాల భంజకం. అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో భోజ రాజు తన పరివారంతో వెను తిరిగాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు