ఓ శుభ ముహూర్తాన తన పరివారంతో కలసి, పండీతులు వేద మంత్రాలతో ఆశీస్సులు పఠిస్తుండగా, రాజ సభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇరవై ఆరో మెట్టుపై కాలు మోప బోతుండగా ఆ మెట్టుపై ఉన్న సకల కళావళ్ళి అనే బంగారు ప్రతిమ 'ఆగు భోజ రాజా సకల కళా విశారదుడు అయిన విక్రమార్కుడు ఔషద, విద్య, అన్న, పంథా, ఘట, గృహ, ద్రవ్య, కన్య, జల, ఛాయా, దీప, వస్త్ర వంటి వేల ద్వాదశ దానాలతో పాటు, విద్యా బలం, కులీనతా బలము ,స్నేహ బలము, బుధ్ధి బలము,థన బలము, పరివార బలము, సత్య బలము, జ్ఞాన బలము, దైవ బలము వంటి దశ గుణ సంపన్నుడు, దయార్ధ హృదయుడు. అతని దాన నిరతి తెలిపే కథ చెపుతాను విను....
రాజ సభలో ప్రవేసించిన వేగు 'జయము జయము మహారాజా నేను తూర్పు దిశ నుండి వచ్చిన వేగును చిత్ర కూట పర్వత పంక్తులలో జీమూత త్రయము అనే మూడు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల నుండి జాలు వారే జలపాతం పారే ప్రాంతంలో నందనం అనే గొప్ప వనం ఉంది. అక్కడికి కూత వేటు దూరంలో శాంభవి ఆలయం ఉంది.ఆ ఆలయం కోనేటి ఒడ్డున చెట్టుక్రింద సత్య వ్రతుడు అనే బ్రాహ్మణుడు యాగం నిర్వహిస్తున్నాడు. అతని శిరోజాలు శరీరం అంతా కప్పి వేసాయి యాగ శాల నుండి తీయ బడిన బూడిద జీమూత పర్వతాలను మించి ఉంది ఇదే నేను చూసిన వింత' అన్నాడు. భట్టికి సింహాసనం అప్పగించి మాయ తివాచి పై నందనం చేరుకుని శాంభవి మాత పూజ చేసి సత్య వ్రతుని కలసి 'స్వామి తమరు ఎవరు? ఏమి ఆశించి ఈ యాగం చేస్తున్నారు' అన్నాడు విక్రమార్కుడు.
రాజా నేను అమరావతి నివాసిని. శాంభవీ మాత దర్శనం కోరి ఈ యాగం నేను మొదలు పెట్టినప్పుడు సప్తరుషి మండలంలో రేవతి నక్షత్రం మెదటి పాదంలో ఉంది.ఇప్పుడు అందులో అశ్వని నక్షత్రం ఉంది. దేవి దర్శనం అయ్యే వరకు ఈ యాగం కొనసాగిస్తాను ' అన్నాడు. అతని పట్టుదలకు ఆనందించీన విక్రమార్కుడు తను ఆలయ సమీపంలో ఆలయ కోనేటిలో స్నానం చేసి, ముగ్గులు వేసి, యాగ శాలను ఏర్పరిచి ఆ ప్రదేశాన్ని శుభ్ర పరచి, వివిధ సుగంధ పరిమళాల పుష్పాలతో యాగ శాల అలంకరించి. దీపము, ధూపము, అక్షింతలు, ఉప హారము, తాంబూలము, దేవికి సమర్పించి తులసి, బిల్వము,శమీ పత్రము, మాచి పత్రము, రుద్ర జడ, వంటి పంచ పత్రాలు. జాత వేదుడు, సప్త జీహ్వుడు, హవ్య వాహనుడు, అశ్వోద రోజుడు, వైశ్వా నరుడు, కౌమార తేజుడు, విశ్వముఖుడు, దేవ ముఖుడు వంటి అష్ట అగ్ని మూర్తులను యాగం చేస్తూ ఆహ్వనించి, రాగి, మేడి, జువ్వి, మర్రి, నువ్వులు, ఆవాలు, ఆవు నేతి పాయసం, నేయి, హోమ గుండానికి సమర్పించి. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుధ్ధాత్మ, జ్ఞానాత్మ, మహాదాత్మా, భూతాత్మల సాక్షిగా శాంభవీ మాత పూజ చేయగా, జే గంటలు మోగుతుండగా సూర్య కాంతులు వెదజల్లుతూ శాంభవీ మాత ప్రత్యక్షమై' విక్రమార్క నీవు కారణ జన్ముడవు నా కృపతో చాలా కాలం గొప్ప పరిపాల చేస్తావు. నీకు శుభం కలుగుతుంది. ఏం వరం కావాలో కోరుకో' అన్నది.' తల్లి నీ దర్శనం కోరి సత్య వ్రతుడు వ్రతం చేస్తున్నాడు అతన్ని అనుగ్రహించు' అన్నాడు విక్రమార్కుడు.'
'తధాస్తూ' సత్రవ్రతునికి దర్శనం ఇస్తాను. నాయనా ధృడ సంకల్పం, ఉత్తమ ఆశయం, చిత్త శుధ్ధి, సంకల్ప సిధ్ధి ఏకాగ్రత ఉంటె మానవులు దేన్నయినా సాధించవచ్చు. సత్య వ్రతుడు యాగ దీక్ష పై మనసు లగ్నం చేయ లేక పోయాడు. అని శాంభవి దేవి అదృశ్యమైనది. భోజ రాజా నువ్వు అంతటి వాడువు అయితే ముందుకువెళ్ళు' అన్నది ఆ ప్రతిమ. అప్పటికే ముహూర్త సమయం మించి పోవడంతో తన పరివార సమేతంగా వెను తిరిగాడు భోజ రాజు.