ఓక శుభ ముహుర్తాన పండితులు వేద మంత్రాలు చదువుతుండగా తన పరివారంతో రాజ సభలో ప్రవేసించిన భోజ రాజు, విక్రామార్కుని బంగారు సింహాసనానికి నమస్కరించి, దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ ఇరవై ఎనిదో మెట్టుపై ఉన్న మనునీతి వళ్ళి అనే బంగారు సాల భంజకం 'ఆగు భోజ రాజా సకల విద్యావంతుడు అయిన విక్రమార్కుని గుణ గణాలు తెలిపే కథ చెపుతాను విను. ఉజ్జయిని రాజ్య పొలి మేరల లోని అరణ్యం లోని కాళీ మాత ఆలయ పూజారి రామ శర్మ. ఇతనికి కాళీ మాత వరాన దేవ దత్తుడు అనే పుత్రుడు జన్మించాడు.
అతను సకల విద్యలు నేర్చి గురుకులం నుండి ఇంటికి వచ్చాక, సతీ సమేతంగా తీర్ధ యాత్రలకు బయలు దేరుతూ రామశర్మ తన కుమారుని చేర పిలిచి' నాయనా ఎప్పుడూ వివాదాలకు వెళ్ళ వద్దు. నిజాయితీగా జీవించు. పెద్దలను గౌరవించు' అని పలు హితాలు చెప్పి తీర్ధ యాత్రలకు వెళ్ళి పోయారు. ఓక రోజు వేటకు వచ్చి నీ విక్రమార్కుడు అడవిలో దారి తప్పి ఆకలి, దాహంతో దేవ దత్తుని కుటీరం చేరాడు. విక్రమార్కుని అతిథి మర్యాదలు వినయ పూర్వకంగా చేసాడు. మెచ్చిన విక్రమార్కుడు,దేవ దత్తుని తనతో తీసుకు వెళ్ళి అతని పాండిత్యానికి మెచ్చి, తన కుమారునికి గురువుగా నియమించాడు. కొద్దీ రోజుల అనంతరం రాజ కుమారుడు కనిపించ లేదు.
అదే సమయంలో దేవ దత్తుడు ఓక రత్నాల హారం నగల దుకాణంలో అమ్మ బోతూ రాజ భటులకు దొరికి పోయాడు. 'దేవ దత్తా పురోహితుడు అంటే పురానికి హితం చేసే వాడు. నా ఏడేళ్ళ కుమారుని నీవు చంపకుండా ఉండ వలసింది. నువ్వు అడగకుండా మంచి హాదా కలిగించాను నువ్వు కోరి ఉంటే మణులు, మాణిక్యాలు, అగ్రహారాలు ఇచ్చే వాడిని ధనం కోసమేగా నువ్వు ఈ కార్యానికి పాల్పడింది.సరే నీకు ఎంత ధనం కావాలి' అన్నాడు విక్రమార్కుడు.' మన్నించండి ధనం పై మోహంతో ఈ తప్పు చెసాను. నా తప్పుకు తగిన శిక్ష విధించండి' అన్నాడు దేవ దత్తుడు.క్షణ కాలం ఆలోచించిన విక్రమార్కుడు కోశాధికారిని పిలిపించి 'ఈ దేవ దత్తునికి తను మోయ గలిగిన బంగారం ఇచ్చి అతను కోరుకున్న ప్రదేశంలో సురక్షితంగా వదలి రండి' అన్నాడు. సభ లోని వారంతా నివ్వెర పోయారు.
'మహా రాజా మరణ శిక్ష విధించ వలసిన నాన్ను రక్షించి ఇంతటి ధనాన్ని ఇచ్చి పంపుతున్నారంటే! ఈ భూమండలంలో మీ అంతటి దయా గుణ సంపన్నులు మరోకరు లేరు.మీ క్షమా, దాన గుణం లోకానికి తెలియ జేయడానికే నేను ఇలా ప్రవర్తించాను. మీ కుమారుడు నా తల్లి తండ్రి వద్ద మా ఇంట క్షేమంగా ఉన్నాడు.
అపకారికి ఉపకారం చేసే దయా గుణం కలగిన తమ కీర్తి అజరామరం' అన్నాడు దెవదత్తుడు.'భోజ రాజా నీవూ అంతటి దయార్ఢ, క్షమా గుణ సంపన్నుడివైతే ముందుకు కదులు' అన్నది సాల భంజికం. అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో, తని పరివారంతో వెను తిరిగాడు భోజరాజు.