పట్టువదలని విక్రమార్కుడు చెట్టుకు వేళ్ళాడు తున్న శవాన్ని ఆవహించిన బేతాళుని బంధించి భుజానవేసుకుని మౌనంగా బయలుదేరాడు.అప్పుడుశవంలోని బేతాళుడు'విక్రమార్కమహరాజా నన్నపట్టిబంధించ గలిగిన నీపరాక్రమం,ధైర్యసాహసం,మెచ్చదగినదే.మహీపాలా వీరాసనము,పద్మ,ఐణా,సిధ్ధా,శైలా,ఖడ్గ,వజ్ర,బుధ్ధ,గుప్తా,నాగ,అర్క,ధద్రా,ముక్తా,కర్ని,సింహా,దండా,కౌంచ,స్వస్తి,వరాహా,మత్స్య,హస్తికా,వ్యాఘ్ర,కుక్కుటా,ముద్గర,ముద్రిక,గోముఖ,అర్ధచంద్ర,మయూర,సర్వతోభద్రా ది త్రింశతి ఆసనాలు అభ్యసించిన నీకు,మనప్రయాణంలో అలసట తెలియకుండా నీకో కథ చెపుతాను సావధానంగా విని నాప్రశ్నకు సమాధానం చెప్పు,తెలిసి సమాధానంచెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు......పూర్వం అంగదేశంలో 'వృక్షకటకం' అనే నగరంలోని అగ్రాహారంలో'విష్ణుశర్మ'అనేపండితుడుఉన్నాడు,అతనికి'శివశంఖుడు''విష్ణుశంఖుడు' 'బ్రహ్మశంఖుడు'అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు వేరు వేరు రాజ్యాల గురుకులాలో తమవిద్యపూర్తిచేసుకుని వస్తూ వారుప్రయాణంచేసే మార్గం మద్యలోనికూడలి అయిన 'అమరావతి'రాజ్య సత్రంలో కలుసుకుని రాత్రి భోజన సమయంలో మాట్లిడుకుంటూ తమునేర్చిన విద్యలు ప్రస్తావిస్తూ తనే గొప్పవాడినని ముగ్గురు వాదు లాడుకోసాగారు.వారికి భోజనం వడ్డిస్తున్న అవ్వ 'నాయనలారా పొరుగు రాజ్యంరాజధాని అయిన'వేదాంగపురి'వెళ్ళి అక్కడి మహారాజు 'ప్రసేనజిత్తు'ను కలసి మీసమస్య ఆయనతీరుస్తాడు'అంది.అది తము స్వగ్రామం వెళ్ళేదారే కనుక మరు దినం ముగ్గురు అన్నదమ్ములు వేదాంగపురిచేరి ప్రసేనజిత్తుమహారాజును కలసి'మహారాజా మేము ముగ్గురం అన్నదమ్ములం,నాపేరు శివశంఖుడు నేను ఎటువంటి గొప్పభోజనంలో అయినా తప్పుపట్టగలను.ఇతను నాపెద్ద తమ్ముడు విష్ణుశంఖుడు ఎంతటి అందగత్తేలోనైనా లోపాన్ని చూపించగలడు.ఇతను నాచిన్నతమ్ముడు వీడు అత్యంత సుకుమారుడు, మాముగ్గురులో ఎవరు గొప్పవారో తమరు పరిక్షించి మాలో ఎవరు గొప్పవారో నిర్ణయించమని వేడుకున్నాడు. అందుకు సమ్మతించినరాజు ముగ్గురు అన్నదమ్ములను అతిథిలుగా ఉండమని వసంతమండపంలో విడిదిఏర్పాటు చేయించాడు.అన్నదమ్ములు ముగ్గురుకు విడివిడిగా గదులు ఏర్పాటుచేయించారు.రాత్రికి రాజుగాపరివారంతోపాటువీరికి ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేసారు.అందరికి పిండివంటలు,పండ్లు,పలురకాల కూరలు,పెరుగు వంటి ఎన్నోరకాలతో అందరికి వడ్డించిరు.అందరు రుచికరమైన ఆభోజనాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఆరగించసాగారు.ముగ్గురు అన్నదమ్ములలో పెద్దవాడైనశివశంఖుడుభోజనంముట్టకుండాముఖంచిట్లించుకునికూర్చున్నాడు.'ఏంనాయనా భోజనంముట్టలేదు రాజభోజనంలోను లోపంఉందా'అన్నాడు రాజు.'మన్నించండిమహారాజా పదార్ధాలలో ఎటువంటి లోపములేదు.కానీ అన్నం వండిన బియ్యం స్మశానంలో పండినవి అందుచేత ఈఅన్నం నాకు శవాలుకాలుతున్న వాసనవస్తుంది'అన్నాడు.అక్కడఉన్నవారంతా తాము భుజిస్తున్న అన్నాన్ని పిడికెడు తీసుకుని వాసనచూసినప్పటికిరాజు గారితో సహా ఎవ్వరికి ఎటువంటి వాసనా రాలేదు.పండ్లు,పిండివంటలతో తనభోజనంముగించాడు శివశంఖుడు.మరుదినం మహారాజు ఆధాన్యం ఎక్కడపండించారోవిచారించగాఆరైతు స్మశానభూమి కొంతకలుపుకుని ధాన్యం పండించాడు అని, శివశంఖుడు'నిజమేనని తెలిసింది.మరుదినం విష్ణుశంఖుని విధ్య పరిక్షింపదలచిఅందాలరాశి అయిన తనకుమార్తెనుచక్కగాముస్తాబుచేసిసుగంధపరిమళద్రవ్యాలుఆమెపైచిలకరించి,మధురఫలాలు బంగారు పళ్ళెంలో పెట్టుకుని దాసిజనంతో విష్ణుశంఖుని గదిలోనికి వెళ్ళింది.ఆమెచేరువగా రాగానే'వెళ్ళమనండి ఈమెనుండి వచ్చే దుర్వాసన భరింపలేకున్నాను'అన్నాడు.అక్కడకు వచ్చినరాజు 'నాయనా పన్నిటి లో స్నానం చేసి పునుగు,కస్తూరి వంటి పలు పరిమళ సుగంధాలు చిలకరించుకుని వచ్చిన నాకుమార్తె నుండి నీకు దుర్వాసన రావడం ఆశ్చర్యంకలిగిస్తుంది.ఎలాగో వివరించు అన్నాడు.మహారాజా మీఅమ్మయినుండి గొర్రెపాల వాసనవస్తుంది .అన్నాడు. ఆవిషయం విచారించగా రాకుమార్తె కు ఒకరోజు ఆవు పాలు అందు బాటు లో లేక గొర్రెపాలు తాపించినట్లు మహారాణి అంగీకరించారు.ఆదే రోజురాత్రి బ్రహ్మ శంఖుని పరిక్షింపదలచిన రాజుగారు ఓకమంచంపై ఆరు పరుపులు సుతి మెత్తనివి అమర్చి ఆమంచంపై నిద్రించమన్నాడు.ఆపరుపులపైపడుకున్నబ్రహ్నశంఖునికి నిద్ర పట్టక పరుపై పొర్లసాగాడు. చెలికత్తెలద్వారా విషయం తెలుసుకున్నరాజుగారు అక్కడకువచ్చి'ఏంనాయనా నిద్రపట్టడంలేదా'అన్నాడు.'ఈపరుపు కింద ఏదో బలమైనవస్తువువుందిఅదినావీపుకువత్తిడికావడంతోనాకునిద్రరావడంలేదు'అన్నాడు.భటులనుపిలిపించి ఆరుపరుపులు వెతికించగా,నాలుగోపరుపు కింద ఆడవారి తలవెంట్రుక ఒకటి కనిపించింది దాన్ని తొలిగించడంతో హాయిగా నిద్రపోయాడు బ్రహ్మశంఖుడు.నాలుగు పరుపుల కింద ఉన్న వెంట్రుక వత్తుకుని నిద్రపట్టక పోవడంచూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. 'విక్రమార్కమహారాజాఈముగ్గురులోఎవరుగొప్పవారు'అన్నాడుబేతాళుడు.'అందరిలో చిన్నవాడు బ్రహ్మశంఖుడే 'అన్నాడు విక్రమార్కుడు .మౌనభంగంకలగడంతో శవంతో సహారివ్వున ఎగిరిపోయాడు బేతాళుడు. పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికొరకు మరలా వెనుతిరిగాడు.