గీతా రాజు దంపతులు గుంటూరు నుంచి కొత్తగా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళ ఒక్కగానొక్క సంతానం అనురాగ్ రెండవ తరగతి చదువుతున్నాడు హైదరాబాద్ చేరగానే మంచి స్కూల్ కోసం వెతికారు ఒక పెద్ద పేరున్న స్కూల్లో చేర్పించారు భార్యాభర్తలు ఇరువురు కొత్త ఇల్లు ను సర్దుకోవడం లో మునిగిపోయారు. అనురాగ్ రోజు స్కూల్ కి వెళుతున్నాడు ఇక్కడే స్కూల్లో రోజు హోం వర్క్ ఎక్కువగా ఇస్తున్నారు. ఇంటికి వచ్చిన అనురాగం కు ఆ హోం వర్క్ చేయటమే సరిపోతుంది రోజు వాడికిష్టమైన కార్టూన్ చానల్స్ చూడటం కుదరడంలేదు ఇవన్నీ రాసే సరికి 9:00 అవుతుంది నిద్రపోతున్నాడు తెల్లారి లేవగానే తొందర ఎనిమిది గంటలకే బస్సు వస్తుంది కాబట్టి ఏడున్నరకి తయారయి టిఫిన్ బాక్స్ తో సహా రెడీగా ఉండాలి ఇలా నెల రోజులు గడిచేసరికి వాడికి నీరసం వచ్చింది స్కూలుకు కాక జైలుకు వెళుతున్నట్లుగా అనిపించసాగింది అనురాగ్ ఇదే విషయం అమ్మా నాన్న తో చెప్పాడు. వెంటనే అమ్మా నాన్న లైన గీత రాజులు అనురాగం వేరే స్కూల్లో వేశారు . ఇక్కడ హోం వర్క్ గురించి ముందుగానే ఆరా తీశారు హోం వర్క్ ఎక్కువగా ఇవ్వరని తెలిసింది పోనీలే అనురాగ్ కొద్దిసేపు టీవీ చూడొచ్చు అని సంబర పడ్డారు అనురాగ్ కొత్త స్కూల్ కి పోతున్నాడు ఇక్కడ హోం వర్క్ ఎక్కువ ఇవ్వటం లేదు కానీ చిన్నచిన్న అల్లర్లకు కూడా పిల్లల్ని బాదుతూ ఉంటారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా వెంటనే కొడుతూ ఉంటారు వారం రోజులకే అనురాగ్ వీపు కదు ములు కట్టేసింది. చేతులు వాతలు తేలిపోయాయి పిల్లాడి లో మునుపటి ఉత్సాహం సన్నగిల్లి పోయింది ఇది చూసిన అమ్మానాన్నలు అనురాగ్ అడగకముందే స్కూల్ మాన్ పెంచేశారు కొత్త స్కూలు వెతికి అందులో చేర్పించారు అనురాగ్ కొత్త స్కూలుకి ఉత్సాహంగా వెళుతున్నాడు వారం రోజులు తిరిగే సరికి అనురాగ్ నోటివెంట చెడ్డ మాటలు రావడం మొదలైంది గీతా రాజులు ఇదేమిటి అని స్కూల్లో కనుక్కుంటే స్నేహితులు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని తెలిసింది వాళ్ల మాటల్ని నేర్చుకున్నాడు ఇదేమిటి ఇలా అయ్యింది అని తల పట్టుకు కూర్చున్నా గీత రాజులు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకో స్కూల్ కోసం వెతకాలి అనే బాధ పడ్డారు అనురాగ్ స్కూలు ఒక సమస్యగా మారిపోయింది ప్రతిసారి ఊరు మారినప్పుడల్లా స్కూలు సమస్య అవుతున్నది. నోట్:: సమస్యలు ప్రతి చోట ఉంటాయి సమస్యల్ని పరిష్కరించాలి సమస్యను వదిలి పారిపోకూడదు.