ఎవరు గొప్ప? . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Evaru goppa?

అమరావతి నగర సమీపంలోని అడవిలో జంతువులన్ని నీటికొరకు ఎగువ ప్రాంతానికి నడవసాగాయి. కొంతదూరం ప్రయాణం చేసిన అనంతరం 'ఏనుగుతాతా మాఅందరిలో నువ్వు పెద్దవాడి అనుభవశాలివి. ప్రయాణంలో అలసట తెలియకుండా ఏదైనా నీతికథ చెప్పు' అన్నాడు గుర్రంమామ.

జంతువులు అన్నింటిని మర్రిచెట్టుకింద సమావేశపరచి 'మీఅందరికి ఈరోజు సామెతలతో కూడిన కథ చెపుతున్నాను వినండి. ఒక వనంలో వర్షం కురవడంతో అక్కడి మోక్కలు, చెట్లు, అన్ని ఆనందంతొ పరవశిస్తు మాట్లాడిసాగాయి. "ఇల్లుఅలకగానే పండగ అవుతుందా!" నేను లేకుండా వంటఅవుతుందా!' అంది కరివేపాకు చెట్టు. 'అలాగా "ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్లు'' కూర వడ్డించగానే నిన్ను ఏరి పక్కనపెడతారు. ''గాలిలో మేడలుకట్టినట్లు'' గోప్పలు చెప్పక. నేను లేనిదే భోజనమే చేయలేరు' అన్నది అరటి ఆకు. 'అందుకే భోజనం చేసిన వెంటనే నిన్ను కుప్పలో వేస్తారు. "కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది" భోజనం తరువాత "శంఖంలో పోస్తేగాని తీర్థంకాదు" అని నన్ను తింటే గాని పంక్తి భోజంనం పూర్తికాదు' అంది తమలపాకు.

'అందుకే నిన్ను కసామిసా నమిలి తుపుక్కున ఉమ్ముతారు. "పిల్లకాకి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ అని" నా విలువ మీకు తెలియదు తోరణంగా నేను లేనిదే ఏశుభకార్యం జరగదు తెలుసా?' అంది మామిడి ఆకు. "తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కాదిగా సరిపోయిందంట" అలా ఉన్నాయి మీ మాటలు. "పురుషులందు పుణ్యపురుషులు వేరయా!" అన్నట్టు చెట్లలో నా స్ధానం ప్రత్యేకమైనది మండే ఎండల్లోనూ, ఆయుర్వేదంలోనూ నాకు నేనే సాటి' అంది వేపచెట్టు. నీలాంటి వాడే "కిందపడినా నాదే పైచేయి" అన్నాడట. కాకులు గూడుకట్టుకోవడానికే నువ్వు పనికి వస్తావు. "మంత్రాలకు చింతకాయలు రాల్తాయా!" అయినా నాకంటే ఆరోగ్యప్రదాయని ఎవరున్నారు' అంది ద్రాక్షగుత్తి.

సరేలే "అందని ద్రాక్షపుల్లన" అనే సామెత ఊరికే రాలేదు. "అలానే పూవ్వుల వాసన దారానికి అబ్బినట్లు "జగమంతా నా పరిమళం మెచ్చుతారు పూజలో ప్రధమ స్ధానం నాదే అంది మల్లెమోక్క. 'తెల్లవారకముందే తీసి వీధిలోకి విసురుతారు. నీదేంగొప్ప" చాదస్తపోడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు"లా "మబ్బుల్లో నీళ్ళుచూసి ముంత ఒలక పోసుకున్నట్లు"లా ఉంది నీ కథ. మానవాళి నేనే అమృతాన్ని'అంది మామిడిపండు. తమ్ముళ్ళు"పెద్దల మాట చద్ది మూట" అని గమనించండి. "కలసి ఉంటే కలదు సుఖం" అని మనందరం గొప్పవాళ్ళమే మానవాళి శ్రేయస్సుకే జన్మించాము.

మన విలువ గుర్తించని మనిషి మనల్ని కొట్టివేస్తూ పర్యావరణం సమతుల్యతను దెబ్బ తీస్తున్నాడు. "తాతీసిన గోతిలో తనే పడతాడు" మనఅందరి లో పూజలు అందుకునే "తులసి మొక్కచాలా గొప్పది. "గోరంతదీపం కొండంతవెలుగు" అని అందుకే అంటారు' అన్నాడు మర్రిచెట్టు. "కాళ్ళులేవు కథకు చెవులు లేవు ముంతకు "పదండి' అంది పిల్ల రామచిలుకలు."కథకు కాళ్ళులేవు ముంతకు చెవులు లేవు" అని మాబిడ్డచెప్పింది' అంది తల్లిరామచిలుక. జంతువులు అన్ని తమ ప్రయాణం సాగించాయి.

మరిన్ని కథలు

Aakali
ఆకలి
- వేముల శ్రీమాన్
Veedani todu
వీడని తోడు
- Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Banglaw kukka
బంగ్లా కుక్క
- -పెద్దాడ సత్యప్రసాద్
Ekaaki
ఏకాకి
- ప్రభావతి పూసపాటి
Kalpita betala kathalu.3
కల్పిత బేతాళకథలు - 3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.2
కల్పిత బేతాళకథలు - 2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.1
కల్పిత బేతాళకథలు - 1
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Manam
మనం
- మణి