స్నేహం విలువ రామాపురం అనే గ్రామంలో కాకి మరియు పావురము నివసిస్తూ ఉండేవి స్నేహితులే, చాలా కాలం నుంచి వాటికి స్నేహం కొనసాగుతూనే ఉన్నది. అయితే పావురం పిల్లలను పెడుతూ ఉన్నప్పుడల్లా ఒక పిల్లి వచ్చి వారి ఇద్దరి మధ్యలో చిచ్చు పెడుతూ పావురం పిల్లలను తినడం ప్రారంభించింది. ఒకరోజు అనుకోకుండా కాకి పావురం రెండూ ఒకచోట దాక్కొని చూద్దాం కొనసాగించింది. అమ్మ ముసలి పిల్లి మా పిల్లలు తినడం సాగింది .మేము ఎలాగైనా బుద్ధి చెప్పాలి. స్నేహితుడా నువ్వే ఉపాయం చెప్పు అన్నది పావురం. నాకు పెద్ద ముక్కు ఉంది సూదిగా ఉంటది కాబట్టి నేను మీ పిల్లలను రక్షించడానికి నా ముక్కుతో పిల్లిని పొడవడం చేస్తాను, దాని కన్నులు చూడడం అవ్వదు ,హాయిగా ఉండవచ్చు అని ఉపాయం చెప్పింది. ఒక రోజు పావురము, కాకి రెండు పిల్లి వెళ్తున్న సమయం చూసి వెంటనే వచ్చి పిల్లి కన్నుల పొడవ సాగింది దీంతో పిల్లి గుడ్డిదైతే పోయి తినడానికి తిండి లేక చూడలేక గుడ్డి అయిపోయింది . ఇక కాకి పావురం సంతోషానికి అవధులు లేవు మిత్రమా ఆపదలో ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు కాబట్టి నువ్వు నన్ను కాపాడిన నిజమైన స్నేహితుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి వారికి ఎటువంటి సమస్యలు వచ్చును. ఐక్యమత్యమే మహాబలం . స్నేహమే మహా గుణం అని తెలుసుకొనవచ్చు. పావురం పిల్లలను వధించిన పిల్లికి పూర్తిగా కనులు పోయినవి అందుకే ఒకరిని బాధ పెడితే వేరొకరికి శిక్ష తప్పదు.