సమయ స్ఫూర్తి - కందర్ప మూర్తి

Samaya sphoorthi

డాక్టర్ శ్రీ కాంత్ ,లాయర్ శ్రీ ధర్ బాల్యమిత్రులు. ఇద్దరు కలిసి చదువు కున్నారు. శ్రీకాంత్ మెడిసిన్ చదివి డాక్టరై ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే , శ్రీ ధర్ లా చదివి లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇద్దరి వృత్తులు వేరైనా వీకెండ్ ప్రోగ్రాములు, పండగ లపుడు వీలుచిక్కినప్పుడల్లా సినిమాలు హోటళ్లు టూర్ ప్రోగ్రాములకు ఇద్దరూ కుటుంబాలతో ఎంజాయ్ చేస్తూంటారు. శ్రీకాంత్ కు భార్య శిరీష , కూతురు శిరీష ఉండగా శ్రీ ధర్ కు భార్య లావణ్య , కొడుకు శ్రీ కర్ .ఇద్దరూ బాల్య మిత్రులైనా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఆదివారం సాహొ పిక్చర్ కి టికెట్లు రిజర్వ్ అయాయని సాయంకాలం ఫస్టు షో కి రెడీ అయి ప్రసాద్ మల్టీప్లెక్స్ కి రమ్మని శ్రీ కాంత్ కు ఫోన్ చేసాడు శ్రీ ధర్. ఇద్దరూ కుటుంబాలతో వారి వారి కార్లలో సినిమా థియేటర్ కి చేరుకున్నారు. స్నేక్స్ తీసుకుని కబుర్లు చెప్పుకుంటు వారి రిజర్వుడ్ సీట్లలో కూర్చున్నారు. యాడ్స్ అయిన తర్వాత పిక్చర్ మొదలైంది. అందరూ పిక్చర్ చూడటంలో లీనమయారు. ఇంతలో శ్రీ ధర్ భార్య లావణ్యకు సడన్ గా కడుపు నొప్పి మొదలైంది.బయటకు చెబితే డిస్ట్రబ్ అవుతుందని నొప్పిని ఓర్చుకుంటోంది. బాధ ఎక్కువై తట్టుకోలేక మెల్లగా భర్త చెవిలో చెప్పింది. ఇంకా ఇంటర్వెల్ కి పదిహేను నిమిషాలు టైముంది. పిల్లలు పిక్చర్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.మద్యలో లేచి వెల్తే డిసపాయింటుమెంటు అవుతుంది. శ్రీ ధర్ మెల్లగా ఆ విషయం డాక్టర్ శ్రీ కాంత్ కి చేరవేసాడు. శ్రీ కాంత్ కి ఏమి చెయ్యడానికి తోచడం లేదు. తను డాక్టరైనంత మాత్రాన ఎప్పుడూ మెడిసిన్స్ వెంటబెట్టుకుని తిరగలేనని అనుకుంటు, ఏదో ఒక ఆలోచన చేసి సమస్యని పరిష్కరించా లను కున్నాడు. ఒక ఐడియా తళుక్కుమంది.పిక్చర్ నడుస్తోంది. లోపల లైటింగ్ డిమ్ గా ఉంది. మెల్లగా తన షర్టు బటన్ ఒకటి ఊడ పీకి శ్రీ ధర్ కిచ్చి లావణ్యను నోట్లో ఉంచుకుని చప్పరించ మన్నాడు.కడుపులోకి మింగవద్దని చెప్పాడు.ఎమర్జెంసీకి అవుసరమౌతాయని మెడిసిన్ జేబులో ఉంచుకున్నానని సర్దిచెప్పాడు. కొద్ది సేపటికి లావణ్య కడుపు నొప్పి తగ్గిపోయింది. ఇంటర్వెల్ ఇచ్చారు.లైట్సు వెలిగాయి. డాక్టర్ అన్నయ్య ఇచ్చిన టేబ్లెట్ బాగా పని చేసిందని, ఆపద్భాంధవుడిలా ఆదుకున్నావని శ్రీ ధర్ పొగడ సాగేరు. " వెరీ గుడ్ ! నేనిచ్చిన ట్యాబ్లెట్ అంత బాగా పని చేసిందన్న మాట.ఏదీ చెల్లమ్మా , నోట్లో టేబ్లెట్ బయటకు తీసి చూపించమన్నాడు" డాక్టర్ శ్రీ కాంత్. లావణ్య నోట్లో ఉన్న టేబ్లెట్ పైకి తీసి చూసి అందరూ ఆశ్చర్య చకితులయారు.అది షర్టు ప్లాస్టిక్ బటన్ గా బయట పడింది. " సమయస్ఫూర్తితో డాక్టర్ గా నేనిచ్చిన ఈ షర్ట్ బటన్ నమ్మకంతో పనిచేసింది.డాక్టర్ ఐనంత మాత్రాన ఎప్పుడూ మెడిసిన్ వెంటబెట్టుకుని తిరగలేనుగా, ఏమైతేనేం మందు పని చేసింది. సమస్య తీరింది." అన్నాడు డాక్టరు. " పదండి ,కూల్ డ్రింకులు తాగుదాం" అని శ్రీ ధర్ అనగానే అందరూ నవ్వుకుంటూ కేంటీన్ వైపు నడిచారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు