అమరావతి నగర సమీపంలోని కృష్ణానది తీర ప్రాంతమైన అడవిలోని జంతువులన్ని సమావేశం అయ్యాయి. "రాతిలోనూ,పుట్టలోనూ, చెట్టులోనూ దేవుడిని చూడగలిగిన మనిషి సాటి వారిపట్లగానీ,మనవంటి మూగజీవాలపట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తూన్నాడు.పైగా మన అడవులను వారి అవసరాలకు విచ్చలవిడిగా ధ్వంసంచేస్తూ, ఆక్రమించుకొని నగరాలు నిర్మించుకుంటున్నిడు.ఇలా అయితే మన మనుగడ మరింత జఠిలం అవుతుంది.ఈ విషయంలో మనం నిస్సహాయులుగా మిగిలి పోతున్నాం"అన్నాడు సింహారాజు. "సభ ముగించబోతున్నాం.ఈవిషయం పై మనందరంమరో మారు ఉమ్మడి ఆలోచన చేయవలసి ఉంది".అన్నాడు నక్కమంత్రి."అది సరేగాని మనిషి కి లేని తోక జంతువులకు ఎందుకు ఆదేవుడు ఇచ్చాడో అనవసరంగా,తోకవలన ఎటువంటి ప్రయోజనం లేదుకదా!"అన్నాడు కోతిబావ."నిజమే రోయ్యకు,జల్ల చేపకు లేదా బారెడు మీసం వృధాగా"అన్నది పిల్లరామచిలుక."అంతే అంతే"అని గెంతుతూ పక్కనే ఉన్నలోయలోనికి కాలు జారి పడిపోయింది కుందేలు మామ."బాబోయ్ రక్షించండి కాపాడండి మాయింటాయన లోయలో పడ్డాడు అని అరవసాగింది కుందేలు."అత్తా ప్రశాంతంగా ఉండు కుందేలు మామను కాపాడేందుకు సింహారాజు గారు ఏదైన మార్గం చెపుతారు"అన్నది తాబేలు. క్షణకాలం ఆలోచించిన సింహరాజు "మిత్రులారా ఇప్పుడు మనవద్ద తాళ్ళు,ఊడలు అందు బాటులో లేవు, ఈలోయ లోతు తక్కువగానే ఉంది కనుక ఏనుగన్నతోక కొండచిలువ,కొండచిలువ తోక తోడేలు,తోడేలు తమ్ముడి తోక నక్కమామ,నక్కతోక కోతిబావ ఇ లా ఒకరి తోక ఒకరు తమ నోటితో పట్టుకుని లోయలోనికి జారండి.చివరిగా కోతిబావ ఉండి కుందేలు మామను తన చెతులతో పట్టుకుంటాడు వీలు కాకుంటే తన తోకను కుందేలు మామకు నోటికి అందిస్తాడు.అనంతరం అలా ఒకరి తోక ఒకరు పట్టుకుని ఉంటారు కాబట్టి మీరంతా తేలిక బరువు కలిగిన వారు కనుక ఏనుగు అన్న మీ అందరిని పైకి లాగుతాడు"అన్నడు సింహరాజు.క్షణాలలో సింహరాజు ఆలోచన అమలు చేయబడింది.కుందేలు మామ సురక్షితంగా లోయలోనుండి వెలుపలకు వచ్చాడు.జంతువులన్ని ఆనందంతో కేరింతలు కొట్టాయి."ఇప్పుడు తెలిసిందా! తోకవిలువ"అన్నాడు మంత్రి నక్కమామ."బుద్ది వచ్చింది శరీరంలోని ప్రతి అవయవం విలువైనదే.ఏది తక్కువకాదు ఏది ఎక్కువ కాదు దేని విలువ దానిదే!"అన్నాడు కోతిబావ. "తమ్ముళ్ళు ఐకమత్యంగా మనందరం ఉండటం వలనే కుందేలు మామను కాపాడగలిగాము. కనుక ఐకమత్యమే మహాబలము అని తెలుసుకొండి". అన్నాడు ఏనుగు అన్న.ఆనందంగా జంతువులన్ని తమ నడక సాగించాయి.