ఒక అడవిలో జంతువుల దేవతలకు ఒక గుడి వుండేది, ఆ గుడిలో మహాబలి అనే ఒక సింహం కోబలి అనే ఒక సివంగిల విగ్రహాలు ఉండేవి,గతంలో ఆ ఆడవి మృగరాజు మహాబలి వేటగాళ్ళ నుండి అడవి మృగాలను పక్షులను ఇతర జీవరాశిని రక్షించడానికి నేరుగా వెటగాళ్ళతో పోరాడి విజయం సాధించేదని, ఒకసారి వేటగాళ్ళు ఎక్కవమంది వచ్చి దొంగ దెబ్బ తీయడంతో మృగరాజు మహాబలి వేటగాళ్ళ ఉచ్చులో చిక్కుకొని చనిపోయిందని,అప్పుడు అడవిలో ప్రకృతి ప్రకోపించగా అడవంతా కారుచిచ్చు రగులుకొని అడవంతా దావనంలా వ్యాపించిందని,ప్రాణ సమానమైన మృగరాజు మరణించడాన్ని తట్టుకోలేక మృగరాజు ప్రేయసి సివంగి కోబలి కూడా ఆ అగ్ని కీలల్లో దూకి చనిపోయిందని అప్పటి అడవి జీవరాశి మహాబలి,సివంగి జంట మేలి మృగాల త్యాగానికి గుర్తుగా ఆ అడవిలో ఏకైక చింపాంజీ అప్పాజీ ని రప్పించి ఆ చింపాంజీ చేత మహాబలి,సివంగీల విగ్రహాలను చెక్కించి ఇక్కడ ప్రతిష్టించి గుడి కట్టాయని,విగ్రహాల ప్రతిష్ట అనంతరమే చింపాంజీ ఆకాల మరణం చెందింది,అప్పటినుండి ఈ అడవిలో చింపాంజీలు ఉండవని,ఆ చింపాంజీ త్యాగానికి గుర్తుగా మహాబలి గుడికి పూజార్లుగా తరతరాలు నుండి ఇరుగు పొరుగు అడవుల నుండి చింపాంజీలను తెప్పించి నియమిస్తామని ఆ అడవిలో మరొక ప్రచారం వుంది. తరతరాలు నుండి అక్కడ ఒక సాంప్రదాయంగా ఏడాదికి మూడుసార్లు సంభరాలు జరుపుకుంటూ... మొక్కులు చెల్లించుకుంటాయి అక్కడ జంతువులు,అయితే మహాబలి ,సివంగి క్రూర జంతువులు కాబట్టి వాటికీ సాదు జంతువులను బలి ఇచ్చే దుష్ట సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టాయి కొన్ని స్వార్ధపూరిత మిడిమిడి జ్ఞాన మూడభక్తి జంతువులు, మహాబలి జాతరను చూడటానికి వచ్చే సాదుజంతువులను పక్షులను ఇతర చిన్నా చితకా జీవులను పట్టుకొని మహాబలి, సివంగీ విగ్రహాలకు బలి ఇస్తుండేవి అక్కడ క్రూర జంతువులు, ఒకవేళ సాదుజంతువులు,పక్షులు,ఇతర జీవులు జాతరరోజు ఆ గుడి వద్దకు రాకపోతే క్రూర జంతువులే అడవంతా గాలించి విచక్షణ లేకుండా చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా ముసలి, పసికూన జంతువులు అన్న కనికరమే లేకుండా వేటాడి మహాబలికి మూడురోజుల పండగ జరపాలని కొన్ని సాడిస్ట్ క్రూర జంతువులు నియమాలు పెట్టాయి,జాతరకు వెళ్ళకుండా కుటుంబాలను పోగొట్టుకునే కంటే,” జాతరలో త్యాగానికి సిద్దమైన జీవులను మాత్రమే బలి ఇవ్వాలి “అన్న ఒప్పందం చేసుకున్నాయి, క్రూర జంతువులతో సాదుజంతువుల,పక్షుల, ఇతర జీవుల పెద్దలు, “అయితే ఒక సంబరానికి కనీసం వెయ్యి తలకాయలు తెగాలి “అన్న నిబందన పెట్టాయి క్రూరజంతువులు, విధిలేక ఒప్పుకున్నాయి సాదుజంతువులు పక్షులు ఇతర జీవులు, “ఇదేమి ఆచారము ఇది అన్యాయం” అని ఒకసారి బలి భాదిత జీవులన్నీ ఆందోళనకు దిగితే “ఇది ఆచారం, కావాలంటే పూజారి చింపాజీనే అడగండి, గతంలో ఒకసారి పూజారి మీద మహాబలి, సివంగి ఆత్మలు వాలి ఈ బలి కోరిక కోరి సాంప్రదాయంగా పాటించమన్నాయి” అని క్రూర జంతువులు నమ్మబలికాయి, పూజారి చింపాంజీ కూడా “క్రూర జంతువుల ఆదేశాలు కాదంటే తనకి ప్రాణాపాయం”అని తలంచి,” క్రూర జంతువులు చెప్పింది అక్షరాలా నిజం”అని అబద్దమాడింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ సంబరాలు మొదలయ్యాయి సంబరాలు ముందురోజే ‘రోబో’ అనే ఒక కోతి పిల్ల మహాబలి గుడి పూజారి చింపాంజీని రహస్యంగా కలిసింది “అయ్యా మహాబలి , కోబలి, సాదు జీవులను, అమాయక ప్రాణులను బలి కోరడం అబద్దమని మీకూ తెలుసు మాకూ తెలుసు, మీరు మాకూ మా భావితరాలకు అన్యాయం జరగకుండా మమ్మల్ని కాపాడండి, రేపు జాతరలో మీ మీద మహాబలి, సివంగీల ఆత్మలు వాలినట్లు, నాటకం ఆడి “ఇప్పటివరకూ సాదు జీవుల చప్పటి మాంసాలు తిని నోటికీ రుచి తగలడంలేదు, ఇకపై మాకు మంచి బలమైన క్రూర జంతువులు బలి కావాలి, ఇస్తే ఇకపై క్రూర జంతువుల బలి ఇవ్వండి లేదంటే మా గుడిని కూల్చేసి మా విగ్రహాలను నదిలో కలిపేయండి అంతటితో మాకు ఈ భూత ప్రేత జన్మల జంజాటం వదులిపోతుంది” అని జాతర భక్తులకు నమ్మబలకమంది, “కోతిపిల్ల చెప్పింది సబబే “అనిపించింది పూజారి చింపాంజీకి, ఎందుకంటే ప్రాణంలేని బొమ్మలకు పూజ చేస్తూ నచ్చిన తిండీ తిప్పలూ లేకుండా ఈ అడివిలో పడి వుండే కన్నా,ఒక్క అబద్దం ఆడి ఇక్కడ నుండి పారిపోయే మార్గం చూసుకోవడమే మంచిది అనిపించింది చింపాంజీకి, “అయితే రేపు క్రూర జంతువులు నాపై దాడి చేస్తాయేమో” అన్న అనుమానాన్ని వ్యక్తపరిచింది కోతిపిల్ల ముందు “అలాంటిది జరగదు రేపు సుమారు పదివేలు సాదు జంతువులు వస్తున్నాయి, వాటికి మరికొన్ని పక్షులు, చిన్నా చితక జీవులు తోడూ వుంటాయి, మహా అయితే ఈ అడివిలో ఒక వెయ్యికన్నా ఎక్కువ క్రూర జంతువులు వుండవు, సాదుజంతువుల్లో , గుర్రాలు, ఏనుగులు, గాడిదలు, అడవి దున్నలు ఎక్కువ వున్నాయి, రాబందులు, గ్రద్దలు, పాములూ, ముళ్ళ పందులూ ఎలాగూ ఎక్కువే వుంటాయి, వాటిని చూసి క్రూర జంతువులు భయపడతాయి, ఇక నీవు మహాబలి, సివంగీ ఆత్మలలాగా నాటకం ఆడతావు కాబట్టి, మూడ భక్తులు ఎక్కువ వున్న ఈ రోజుల్లో నీ మాటే వేదం, నిన్ను ముట్టు కోవడం కూడా ప్రమాదమే అని అనుకుంటాయి చాలా జంతువులు” అని దైర్యం చెప్పింది కోతిపిల్ల. రెండోరోజు జాతర మొదలయ్యింది బలి కార్యక్రమాలకు ముందుగానే పూజారి చింపాంజీ మహాబలి, సివంగీల ఆత్మలు తనలో ప్రవేశించినట్లు నటించి” మాకు క్రూర జంతువుల బలి కావాలి” అని వీరంగం సృష్టించింది, అచ్చం కోతి పిల్ల చెప్పినట్లే చెప్పింది,” క్రూర జంతువులు బలి” అనేసరికి క్రూర జంతువులకు భయం పట్టుకుంది, ఒకవేళ సాదు జంతువుల మీద తిరగబడితే తమ తమ ప్రాణాలు పోతాయని తెలుసుకొని, “అయితే ఇకపై బలి సాంప్రదాయం వద్దు మహాబలి, సివంగీ మాతల కోరిక ప్రకారం ఈ విగ్రహాలను నదిలో విడిచిపెట్టి ఇకపై ఈ అడవిలో జాతర చేయడం మానేద్దాం, అంతేకాదు ఇకపై ఆకలి అయితే తప్ప వేటని నిషేదిస్తున్నాం, అన్ని రకాల జీవుల మనుగడ ఈ అడవికి అవసరం అందరమూ కలిసి మెలిసి ఉందాం” అని తోకలు ముడిసాయి క్రూర జంతువులు, మహాబలి కోబలి గుడి కూలింది, విగ్రహాలు నదిలో కలిసి పోయాయి, చింపాంజీ పొరుగు అడవిలో వున్న తన తోటి జాతి చింపాజీల వద్దకు పారిపోయి స్వేచ్చగా జీవించడానికి సిద్దపడింది, కోతిపిల్ల సాయం, చాకచక్యం, వ్యూహం తెలుసి అడివిలోని సాదు జీవులు సంతోసించాయి, క్రూర జంతువులు కిమ్మన కుండా అక్కడనుండి జారుకున్నాయి, కథ సుఖాంతమైయ్యింది