నిర్లక్ష్యం - పండుగాయల సుమలత

Nirlakshyam

పండుగాయలసుమలత ఒక అడవిలో రెండు కాకులు ఉండేవి. వాటిలో ఒక కాకికి రెక్కలు లేవు. మరో కాకికి కాళ్లు లేవు. వాటికి లోపం ఉన్నప్పటికీ రెండు బాగా స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఆ రెండు కాకులకు ఒక సందేహం కలిగింది.ఒక నక్క వద్దకు వెళ్లి. "మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ దూరం పోగలరు?" అని అడిగాయి. నక్క బాగా ఆలోచించి "రేపు రండి మీ సందేహం తీర్చుతాను. మీరు వచ్చేముందు ఓ రొట్టెను తీసుకురండి"అని చెప్పింది. నక్క చెప్పిన విధంగానే రొట్టెను తీసుకొచ్చాయి.అప్పుడు నక్క రెండు కాకులకు పందెం పెట్టింది. దూరంగా ఉన్న ఓ చెట్టుకింద రొట్టెను పెట్టి, ఆ రొట్టెను ఎవరు ముందు వెళ్లి తింటారో ఆ కాకిగెలిచినట్లు అంది నక్క. అప్పుడు రెక్కలు ఉన్న కాకి ' నేనేగెలిచేది, అది నా అంత వేగంగా పోలేదు.అది దారి పట్టిన తర్వాత వెళ్దాంలే' అనుకొని నిర్లక్ష్యంగా సోమరిగా కూర్చుంది. కాళ్లు వున్న కాకి ఏ మాత్రం నిరాశపడకుండా వేగంగా నడుస్తూ వెళ్తోంది.చెట్టు దగ్గరగా వచ్చే సరికి 'ఇక కొద్ది దూరమే కదా! ఆ కాకి ఇంకా రాలేదు కదా! వెళ్దాంలే' అని నిర్లక్ష్యంగా ఆగిపోయివెనుకకు చూస్తూనే ఉంది. అలా చూస్తూ ఉండగానే మధ్యలో మరో కాకి వచ్చి రొట్టె తీసుకెళ్లింది. అప్పుడు నక్క "చూసారా! మీ ఇద్దరూ ఎగిరే,నడిచే శక్తి ఉన్నా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీరు ఇద్దరూ గెలవలేదు. ప్రతిభ వుంటే సరిపోదు. అందుకు తగిన ప్రణాళిక, పట్టుదల, కృషి,నిరంతరం శ్రమ, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటేనే సాధించగలరు"అంది. మనలో ప్రతిభవున్నా నిర్లక్ష్య మనేది గెలుపును దూరం చేస్తుందని కాకులు గ్రహించాయి.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు