ఓ నిఖార్సయిన 'ప్రభుత్వ ఉపాధ్యాయుడు' - మొరుమూరి శేషాచారి

O nikharsaina prabhutwa vupadhyayudu

"నాన్న మళ్ళీ ఎప్పుడొస్తావ్? " బిక్క మొహంతో చిట్టి తల్లి మోక్ష వేసిందో చిన్ని ప్రశ్న. "ఏమోనమ్మా! చెప్పలేను" అంటూ నిట్టూర్పు సమాధానం ఇచ్చాడు వెంట తీసుకెళ్లే సామాన్లు సర్దుకుంటూ తండ్రి మల్లేశం మాస్టారు.🛍️ ఒక వైపు కాలింగ్ బెల్..📞 మరోవైపు ఫోన్ రింగ్టోన్ బెల్లులు కూడా ఆయన్ని అదేపనిగా పలుకరిస్తున్నాయ్.☎️ ఎవరికి సమాధానం ఇవ్వాలో తెలియని అయోమయస్థితిలో అర్ధాంగి అడిగే ప్రశ్నలకు అతనిలో ఆవేశం చిర్రెత్తుకొచ్చింది.🥸 వెళ్లే పనిలో ఎన్ని ఇబ్బందులు పడతాడో.. ఏమో అని ఆ ఇల్లాలి మనసులో పొడసూపే ఆవేదనను అర్ధం చేసుకోలేకపోయాడు ఆ సగటు ఉద్యోగి.👩‍🦰 💊 "మందులు పెట్టుకున్నారా? తినడానికి ఏమన్నా తీసుకెళ్ళండి అక్కడ పెడతారో.. లేదో. అసలే మీకు ఏవీ ఒక పట్టాన నచ్చవు. మరి రెండు రోజులు ఎలా గడుపుతారో.. ఏమో!?" అంటూ నిట్టూర్పు వచనాలతో బ్యాగు చేతికందించింది శ్రీమతి.🛍️ 📱 అదే పనిగా మోగుతున్న సెల్ ఫోన్ తీసి కంగారుగా మాట్లాడాడు మల్లేశం మాస్టారు. ఎట్టకేలకు గమ్యస్థానానికి చేరుకున్న మాస్టారుకు అక్కడంతా అగమ్యగోచరం అనిపించింది.🚎 అధికారులు అప్పగించిన పెట్టె, అట్ట అందుకుని తన అసిస్టెంట్ల ఆరా పనిలో పడ్డాడు. ఇంతలో పిడుగులాంటి వార్త చెవికి చేరింది.😔 తనకు కేటాయించిన అసిస్టెంట్లు హాజరు కాలేదని, కారూ అని. 🍛 🍲 ఇంతలో.. ‘‘భోజన ఏర్పాట్లు ఏవీ లేవని’’ ఓ పెద్దమనిషి గావుకేక కర్ణభేరికి చేరి కన్నుల్లో కలతను నింపింది.👂 అప్పుడు అర్థమయ్యాయి అర్ధాంగి మాటలు. పక్కనున్న కుర్చీలో కూలబడి కూడు లేక.. తోడులేక దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. 🧒🏻 ఒక అధికారి చొరవ వల్ల సహాయకుల నియామకం జరిగి పోలింగ్ కేంద్రానికి పయనమయ్యాడు మాస్టారు. 🚌 ======================= 🚶‍♂️ దిగీ దిగుతూనే గుండె దిటువ చేసుకున్నాడు. 🛖 చూడబోతే అదేదో శిథిలావస్థకు చేరుకున్న పురాతన పాఠశాల భవనంలా ఉంది. మరుగుదొడ్ల జాడ లేదు.🛀 మంచినీళ్ళ ఏర్పాట్లు🚰 కనిపించలేదు. తన ముందున్న బాధ్యత ముందు అవి చాలా చిన్న సమస్యలని మనసుకు సమాధానం చెప్పాడు. 👍🚶‍♂️ సహాయకులతో సామాగ్రి చేత పుచ్చుకొని గదిలోకి అడుగుపెట్టాడు మాస్టారు.👬🏻 అధికారులు తనకందించిన పెట్టె, అట్ట బాగోగులు చూస్తూ కాగితాలు కుప్పగా పోసి కుస్తీలాట మొదలుపెట్టాడు. సహాయకులు తమ సహాయాన్ని పూర్తి చేసుకుని నిద్రకుపక్రమించారు.🥱 మాస్టారి శరీరం అక్కడ ఉన్నా.. మనసంతా చిట్టితల్లి మోక్ష పైనే.🙋🏻‍♀️ ‘‘తను లేకుండా ఏ మాత్రం నిద్రపోదే!?. ఇప్పుడెలా ఉందో?’అని తెలుసుకోవాలనే ఆత్రుత ఉన్నా.. ముందున్న కాగితాల కుప్పలోకి తన ఆత్రుత జారిపోయింది. 📞 కొత్త ప్రదేశం.. వసతులు అంతంత మాత్రమే. ఇక నిద్రకు చోటెక్కడ? పాపం మాస్టారు. తొలిజాములోనే ఉద్యోగ బాధ్యతలకు సంసిద్ధమై... కాగితాలతో కుస్తీ మొదలుపెట్టాడు మాస్టారు. నిద్ర సంగతి దేవుడెరుగు.. స్నాన, జపాదులు కూడా నోచుకోలేదు ఆ పొద్దు.🚿 ఓ వైపు.. సూరీడు నిక్కబొడుచుకొస్తున్నాడు. 🌞 బయట ఒకటే అరుపులూ, కేకలు. ‘‘పోలింగ్ ఇంకా మొదలు పెట్టలేదా?’’ అంటూ. ⌚ 5గంటలకల్లా మీ ముందుంటామన్న సహాయకుల ఊసే లేదు. మాస్టారి మనసులో ఒకటే ఆందోళన. ఇంతలో సహాయకులు అక్కడికి చేరుకుని తలో చేయి వేశారు. పోలింగ్ మొదలైంది.🧑‍🦯👨‍🦯👨‍🦯 💊మందుబిళ్ళ వేసుకుందామంటే ఏమైనా తినాలి. కానీ అక్కడ తిండి పెట్టేవాడు కనిపించలా.. పెట్టినా తినే పరిస్థితీ లేదు.🥣 గంటలు గడిచే కొద్దీ శరీరంలో వణుకు మొదలైంది. ఉన్న బిపికి ఈ మధ్యే షుగర్ జతయ్యింది. 🩺 విషయాన్ని కనిపెట్టిన ఓ మనసున్న పెద్ద మనిషి అందించిన ఫలహారం తిని బిళ్ళ వేసుకుంటే గాని మాస్టారి మనసు తేలికపడలేదు. 🥣 పోలింగ్ సమయంలో దేవుడి దయవల్ల అవాంతరాలేవీ అడ్డు పడలేదు. పోలింగ్ ముగిసింది. మాస్టారు సహాయకులతో సామాగ్రి సర్దుకుంటున్నారు. ‘‘అసలు మనం అన్నం తిన్నామా?’’ అంటూ పక్కనున్న సహాయకుల్ని అడిగాడు మాస్టారు. "అయ్యో.. మాస్టారు! అసలు మనకు అన్నం అందించిన నాథుడుంటే కదా! మీరీ మాట అడగడానికి" అంటూ సమాధానమిచ్చాడు సహాయకుడు. 🍛 అప్పుడు గుర్తొచ్చాయి తన ఇల్లాలు చెప్పిన మాటలు.. ‘‘అక్కడ తినడానికి ఏమైనా ఉంటాయో.. లేదో?’’ 🗣️ ======================= బాధ్యతలు బరువెత్తుకునేటప్పుడు చూపించిన మర్యాదలు అక్కడ మసకబారాయి. పట్టించుకునే నాధుడే లేడు. పెట్టె, బేడా నెత్తికెత్తుకున్న కూలీల జాడే లేదు. మంచినీళ్ళ గురించి ఊసే లేదు. 🚰 తిండి, నిద్ర మాని, ఇల్లు, పిల్లల్ని వదలి బాధ్యతను సమర్థవంతంగ పూర్తి చేసిన తన దీనస్థితిని తలచుకుని మనసులో కుమిలిపోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు మాస్టారికి. ఒక చేతిలో మూట, మరో చేతిలో పెట్టె పట్టుకుని భుజాన తను తెచ్చుకున్న సంచి తగిలించుకొని *ప్రజాస్వామ్య బాధ్యత* ను భుజానికెత్తుకున్నానన్న సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. అధికారులు ఆదేశించిన చోటుకు 🚙పయనమయ్యాడు మాస్టారు. 👨‍🦳 📢📣 ఓ వైపు ఈలలూ, గోలలు. మరోవైపు కౌంటింగ్. మధ్యలో మాస్టారు, అతని సహాయకులు. అంతా ముగిసింది. ‘బతుకు జీవుడా!’ అంటూ బయటపడదామని ఒక్కసారి సమయం చూసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాయి. తిండిలేక కాదు. కళ్ళ ముందున్న కాలాన్ని చూసి. ⌚ సరిగ్గా రాత్రి 12గంటల 30నిమిషాలు.🌚 ఆ సమయంలో ఎటు పోవాలి? ఎక్కడ ఉండాలి? దీనికి సమాధానం ఎవరి వద్దా దొరకలేదు.🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️ ఏం చేయాలో.. తెలియక ఒకవైపు చలి.. మరోవైపు దోమలు. భయంకరమైన నరకాన్ని అనుభవించి ఆ రాత్రి ఓ నిర్జన ప్రదేశంలో ఆసరాగా నిలిచిన ఓ అరుగుపై చిన్ని కునుకు తీసి తెలతెలవారకముందే మోగిన బస్సు హారన్కి మేల్కొని.. ఆ వైపుగా అడుగులు వేశాడు నీతి, నిజాయితీ మరియు బాధ్యతను నిలువెల్లా నింపుకున్న *ఓ నిఖార్సయిన 'ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

( 👉 _గమనిక: ఇలాంటి పరిస్థితి అన్ని చోట్లా.. అందరికీ ఉంటుందని నా ఉద్దేశం కాదు. చాలా చోట్ల చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని డ్యూటీ డబ్బులు కోసం కాకుండా తమకు అప్పగించిన బాధ్యతాయుతమైన పనికోసం ఎన్ని కష్టాలనైనా ఓర్చి సమర్థవంతంగా పని చేస్తారని చెప్పడమే నా అభిమతం._

🙏 *విన్నపం: జీతం తప్ప మరేతర ఆదాయం ఉండని పవిత్రమైన ఉపాధ్యాయులను ఎవ్వరూ చులకనభావంతో చూడవద్దని.. ప్రజాస్వామ్యం నిలబడటంలో ఉపాధ్యాయులూ తమవంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తారన్న సంగతి మహనీయులు గుర్తెరగాలని చెప్పడమే నా ఉద్దేశం.* )

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు