“ఇక్కడ చెత్త వేయరాదు”.. అనే బోర్డు చూసి .. స్వచ్ఛ భారత్ లో ఈ ఊరి లో బాగా అమలు చేస్తున్నారు అనుకొన్నాను.
నేను ఆ ఊరి లో ఉద్యోగం కోసం వచ్చాను. అద్దె ఇల్లు కోసం ఒక ఇంటి యజమాని తో మాట్లాడాను.
నేను తీసుకునే రూమ్ రెండో అంతస్తు లో ఉంది. అయితే రోజు చెత్త బుట్ట ను తెచ్చి కింద వాళ్ళు చెప్పిన చోట పెట్టాలి. ఇదే షరతు. చాల సులువుగా భావించాను . కానీ ఇందులోనే చిక్కు అంతా ఉంది. ఇంటి యజమాని చెప్పిన చోటు ఎదురుగ ఇంకో కుటుంబం అద్దెకు ఉంటున్నారు. వాళ్ళు కూడా అక్కడే చెత్త బుట్ట పెడతారు.
మొదటి రోజు:
ఆ ఇంటింకి చేరిన మొదటి రోజే నాకు చేదు అనుభవం అయింది. నేను కొన్న చెత్త బుట్ట రంగు ఆ ఇంటి కింది వాటా వారి చెత్త బుట్ట రంగు ఒకటే. అందుచేత వేరే రంగు చెత్త బుట్ట కొనమని చెప్పారు. చేసేదేమి లేక ఇంకో రంగు చెత్త బుట్ట కొన్నాను.
రెండవ రోజు:
ఆ వీధిలో కుక్కల బెడద ఎక్కువ. రోజు రాత్రి వేళ అవి వచ్చి చెత్త బుట్టను దొర్లిoచేస్తాయి. వెంటనే ఇంటి యజమని మరియు కింది వాటా వాళ్ళు నాతో తగులాడారు. నేను పొద్దున్నే కిందికి వెళ్లి ఆ చెత్త అంత శుభ్రం చేశాను. నా పరువు పోయినట్లు అనిపించింది..
మూడవ రోజు:
కుక్కల బెడద . ఎలా తప్పించుకొవాలి ..అని ఆలోచించాను . కుక్కల బెడద లేకుండా చేయాలనీ మునిసిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను. దానికి వారు స్పందించి వెంటనే వీధి కుక్కలను తీసుకు పోయారు . కుక్కల వలన నేను కిందికి వెళ్లి చెత్త ఎత్తాలిసిన సమస్య పోయింది.
నాలుగవ రోజు:
అయితే రోజు తెల్లవారే సరికి ఎలుకలు చెత్తని ఆంతా బయటకు తెస్తున్నాయి.
వెంటనే ఇంటి యజమని మరియు కింది వాటా వాళ్ళు నాతో తగులాడారు.. నేను పొద్దున్నే కిందికి వెళ్లి ఆ చెత్త అంత శుభ్రం చేశాను. తిరిగి నా పరువు పోయినట్లు అనిపించింది.. ఎలుకల కోసం ఒక బోను తెచ్చాను.
కొద్దీ రోజులు బాగానే గడిచాయి .పది రోజుల తరువాత:
ఇంతలో కార్తీక మాసం వచ్చింది. కింది పోర్షన్ వాళ్ళు పూజల కోసం తులసి కోట దగ్గర దీపారాధన ను పెట్టారు.
నేను చెత్త బుట్ట తెచ్చి కింద పెట్టకూడదు అన్నారు . ఇంటి యజమాని కూడా పూజలని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు. మున్సిపాలిటీ వారు వచ్చినప్పుడు మాత్రమే చెత్త బుట్ట ను తేవాలి అన్నారు.
ఇక మీదట చెత్త బుట్ట ఇంట్లోనే ఉంచుకొని రోజు ఆ వీధిలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినపుడు ఇవ్వాలి. కానీ వాళ్లు రోజు నేను ఆఫిస్ కి వెళ్ళాక వస్తున్నారు. ఎలా ఈ ‘చెత్త ‘ సమస్య తీరాలి.?
ఇపుడు ఏమి చేయాలి ...?ఆ వీధి చివర మున్సిపాలిటీ వారు ఒక పెద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేశారు. అమ్మయ్య ..ఇంక రోజు సాయంత్రమే వెళ్లి అక్కడ చెత్త పారేసి రావొచ్చు అనుకొన్నాను . మరో రెండు రోజులు గడిచాయి .
అయితే ఆ డస్ట్ బిన్ ఉన్న చుట్టూ పక్కల వాళ్ళు మీ ఇంటి దగ్గర చెత్త తెచ్చి మా డస్ట్ బిన్ లో వేస్తున్నాను అని తగులాడారు. నేను చాల తేలికగా తీసుకున్న సమస్య .. చాల పెద్దది ఐయింది.
నా సమస్య తీరడం కోసం నేను మున్సిపాలిటీ వారికీ విన్నపం చేసుకొన్నాను.. దాని ఫలితం .. నేను అద్దె కు ఉండే ఇంటి దగ్గర ఇంకో డస్ట్ బిన్ వచింది. కొద్దీ రోజులు బాగానే గడిచాయి ..
మరో వారం తరువాత:
..ఒక పిడగు లాంటి వార్త .. స్వచ్ఛ భారత్ లో భాగంగా .. .... వీధుల్లో డస్ట్ బిన్ ఉండకూడదు అన్నారు . ఇంక మీదట డస్ట్ బిన్ తీసేస్తారంట.
నా సమస్య తిరిగి మొదటికి వచ్చింది .
ఒక పని మనిషి కి నెలకు జీతం ఇచ్చి చెత్త పారేయాలని ఏర్పాటు చేశాను . అయితే రోజు ఉదయం రూమ్ బయట చెత్త బుట్ట పెట్టి నేను ఆఫీస్ కు వెళ్తాను. సమస్య తీరిపోయింది అనుకొన్నా..
కానీ .. నేను ఇంట్లో లేనప్పుడు రోజు ఎవరో అమ్మాయి వస్తోంది .. చుట్టూ పక్కల వాళ్ళు ఎదో అంటున్నారు .. ఇలా అయితే ఇల్లు ఖాళీ చేయాలి అని ఇంటి యజమాని చెప్పారు . నేను కేవలం చెత్త పారేయడానికి పని మనిషి ని ఏర్పాటు చేశాను అని చెప్పిన కూడా వాళ్ళు ఒప్పుకోలేదు.కేవలం చెత్త పారేయడం కోసం ఇల్లు మారాలి అని ఎప్పడు అనుకోలేదు.
నేను అద్దె ఇల్లు వెతకటం ప్రారంభిచాను .. చెత్త బుట్ట సమస్య లేని ఇల్లు కోసం .
జై స్వచ్ఛ భారత్.