ఉష అందగత్తె !పదహారేళ్ల ప్రాయం నించీ అందరి నోటివెంట స్నేహితుల నోటివెంట తన అందాన్ని పొగడడం వింటూనే వుంది . గర్వం గా తనుచూసుకునేది . అందానికి వయసు మరింత సోయగం ,సొగసు తెచ్చింది . తన అందాన్ని పొగిడే ఆరాధించే అరుణ గుర్తుకొచ్చింది .
'చారెడేసి కళ్లు ,సంపెంగ మొగ్గ లాంటి ముక్కు ,చిన్నినోరు ,సన్ననడుము ఉషా నీది మత్తెక్కించే ,మైమరిపించే అందం ! నీపక్కన మేమంతా దిష్టిబొమ్మలం " అనేది అరుణ .
ఒక్కోసారి ఉషకు తన అందమే తన్ను బందీ . అందానికి అన్నీ అగ్నిపరీక్షలే ! ముఖ్యం గా అన్నయ్య రఘు ఉషతో బయటకు వెళ్ళడు .
"అన్నయ్యా యెందుకు నన్ను నీతో రానివ్వవు ?"ఉష అడిగితె అతను చెప్పిన జవాబు విని ఉషకు ఏడుపొచ్చింది . "నిన్ను తీసుకుని బయటకి వెళ్తే అందరూ నిన్నే చూస్తుంటారు . ఏదోఒకటి అంటారు . నవ్వుతారు . మన వెనకాలే వస్తారు . నేను వాళ్లను ఏం అనాలి !!ఊరుకుంటే నవ్వుతారు . నాకివన్నీ చికాకేగా !!1వద్దు తల్లీ " అన్నాడు రఘు .
ఒకరోజు ఉష ,,,,,,,,,,,అమ్మ నాన్న తో అన్న మాటలు విన్నది .
" ఏమండీ దాని డిగ్రీ యీ సంవత్సరం అయిపోతోంది కదా ,పెళ్లి చేసి పంపిద్దాం !అందరి చూపులూ దాని మీదే !యేదైనా అనర్ధం జరిగితే తలెత్తుకోలేం "
కన్నవాళ్లకే తన అందం సమస్య అయ్యింది . అన్నయ్య అలా అన్నాడు . అమ్మా నాన్నా అనుమానాలూ !1
డిగ్రీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యింది . M . A ఇంగ్లీష్ చదవాలనుకుంది . యూనివర్సిటీ దూరం !హాస్టల్ లో వుండాలి .. అందరినీ ఒప్పించాలి . ముఖ్యం గా రఘు అన్నయ్యను . అతను అక్కడే చదువుతున్నాడు . ఉషకు బెంగ పట్టుకుంది .
"నాన్నా నేను M A చదువుతా "తండ్రిని అడిగింది .
"చూద్దాం లే తల్లీ యింకా టైముందిగా "ఆయన ముక్తసరిగా బదులిచ్చారు . ఉష బాధ పడింది .
ఉష లోపలికి వెళ్ళగానే రఘు వచ్చాడు .
"నాన్నా దాన్ని చదివించాలనుకుంటున్నారా ?"అంటూ ప్రశ్నించాడు .
"అవునురా !ఫస్టుక్లాసులో ప్యాసయ్యింది . చదువబ్బుతున్నది కదరా "అన్నారు ఆయన .
"నాన్నా యూనివర్సిటీ లో అది చేరడానికి వీల్లేదు . అది చేరితే నేను మానేస్తాను "అన్నాడు రఘు .
"అదేమిట్రా ఆ తిరకాసు " అంన్నారు ఆయన .
"మీకు అర్ధం కాదు నాన్నా !!నాకు తల తీసేసినట్టుగా వుంటుంది . నన్ను చూసి నవ్వుతారందరూ !!" అన్నాడు రఘు .
ఆయనకు నవ్వొచ్చింది . "నిన్ను చూసేందుకు నవ్వుతార్రా "అన్నారు .
""నాన్నా అది చేరితే నేను చదువు మానేస్తాను ,అంతే "అంటూ రఘు కోపంగా బయటకెళ్లిపోయాడు .
ఇంతలో ఉష అమ్మకూడా వచ్చి "చదువొద్దు ,చట్టుబండలోద్దు ఉష పెళ్లి చేసేద్ద్దాం "ఆవిడ మాటల్లో పట్టుదల గాంభీర్యం !!!!
ఉష చదువు డిగ్రీ తో ఆగింది . కన్న కలలన్నీ కన్నీటిలో జాలువారాయి . మానసిక వ్యధ ,నిరాసక్తత మిగిలాయి . కొన్ని నెలలలోనే పెళ్లిజరిగింది . ఇప్పుడు ఉష అతిసామాన్య మధ్యతరగతి గృహిణి .
కారణం ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉష వారం రోజుల్లో M A లో చేరాలి . సంతోషం గా వుంది . కానీ వూహించని సంఘటన ఆమె భవిష్యత్తునే మార్చింది .
ఉత్తరం చదువుతూ ఉష నాన్నగారు నిట్టూరుస్తూ మౌనం గా ఆలోచిస్తున్నారు .
అందులోని ప్రతి పదం ఆయన్ను చిత్రవధ చేస్తున్నది .
'ఉషా యెప్పుడు కలుస్తావు !నీ నవ్వు మెరుపు కావాలి నాకు !పెదవుల కెంపులు నాకేగా !!,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,' ఆయన చదవలేకపోయారు .
""ఉష "కొంచెం కఠినంగా ఆయన పిలుపు !!
ఉష పిలుపులోని గాంభీర్యానికి వులిక్కిపడుతూ భయం భయం గా వచ్చింది .
ఆయన ఉష చేతిలో ఆ లేఖ పెట్టి మౌనం వహించారు .
చదువుతున్న ఉషకు చేతులు వణికాయి . మొహం యెర్రబడింది . కళ్లల్లో భయం ! గుండెల్లో వేగం !!
"యేమిటిది ?అతనెవరు ? నిజం చెప్పు "ఆయన కఠినం గా ప్రశ్నించారు .
"ఇదంతా అబద్ధం నాన్నా !!అతనెవరో నాకు తెలియదు నన్ను నమ్మండి "కన్నీళ్లతో తండ్రిని చూసింది .
"ఛీఛీ !నిన్ను యింకా నమ్మాలా !!"అంటూ ఉషను కోపం గా చూసారు .
తండ్రి పెద్దగొంతు విని ఉష అమ్మ ,ఉష అన్నయ్య కంగారు కంగారు గా లోపలినించి వచ్చారు .
సంగతంతా విని తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉషను నానా చీవాట్లు పెట్టింది . అన్నయ్య రఘు బొమ్మలా నించుండిపోయాడు .
ఆ క్షణం లో ఉష దోషిగా నిలబడింది . అమ్మా ,నాన్నా ,అన్నయ్యా ముగ్గురూ తన్ను తప్పు పట్టారు . నమ్మేసా లేఖలోని అసత్యాన్ని నమ్మారు . మొత్తానికి వాళ్లు గెలిచారు . ఉష దోషిగా ఋజువు చేసారు .
చదువాగింది . ఉష పెళ్లయిపోయింది . చెయ్యని తప్పుకు శిక్షింపబడింది . తన ఆశలకు సంకెళ్లు పడ్డాయి . ఒక అనామకుడి లేఖను నమ్మారు కానీ ఉష మాటలను నమ్మలేదు .
నిజం యేనాటికయినా బయట పడుతుంది . ఒకరోజు అనుకోకుండా కొడుకు రఘు ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు విన్నారు .
"రాజా ఉష చేరకపోవడం నాకు చాలా సంతోషం గా వుంది . మా నాన్న వెంటనే నమ్మారు . అమ్మ దాన్ని తిట్టింది . మొత్తానికి నా ప్లాను గెలిచింది . ఆ లేఖను నేనే రాసానని యెవ్వరూ వూహించలేదు . "
రఘు తండ్రి అవాక్కయ్యారు . చిట్టితల్లి ఆశలమీద నీళ్లుజల్లారు . కనీసం నిజం కనుక్కోవడానికి ప్రయత్నించలేదు . ఇప్పుడు ఆలోచించినా ప్రయోజనం లేదు . అందుకని ఆయన భార్యకు చెప్పలేదు . మనిషిని మనిషి గౌరవించే స్థితి లేదు . ఆడపిల్ల అందం ఆమెకు తనవాళ్లతోనే అడ్డం కావడం దురదృష్టం .
సౌందర్యం కోసం అన్వేషించే మనిషి ,నిజంగా సౌందర్యం యెదురైతే ఆ కాంతిని తట్టుకోలేడు .