నందుడి తెలివి అనగనగా ఓ రాజు.అతని దగ్గర నందుడనే వాడున్నాడు.అతను చాలా తెలివైన వాడు.రాజు ఏలుబడిలో నడిచే చిన్న, చిన్న ప్రాంతాలనుండి పన్నులు వసూలు చేయడానికిరాజు నందుడిని పంపుతుంటాడు.నందుడు ఇద్దరు భటులను వెంట పెట్టుకొని పన్నులు వసూలు చేయడానికి వెళ్తుంటాడు. అలా ఓ రోజు వెళ్లి,రాత్రి వేళ తిరిగి వస్తున్నప్పుడు నందుడు, అతని అంగరక్షకులు ఓ అడవి గుండా వస్తుండగా అడవి మార్గంలో నలుగురు దొంగలు చెట్ల చాటునుండి తమ వెనుకాల రావటం వెన్నెల్లో అలికిడికి నందుడు గమనించాడు.నందుడు దొంగలకు వినిపించేలా గట్టిగా తన భటులతో "మనదగ్గరున్న నగలన్నింటిని ఓ మూటలో కట్టి ఉత్తరం దిక్కునున్న బావిలో దాచిపెట్టాంకదా!ఇప్పుడు మనచేతిలో ఉన్నవి నకిలీ నగలే కదా! దొంగలు వస్తే మన దగ్గరున్న నకిలీనగలు ఇద్దాం. తర్వాత ఉదయం వచ్చి మనం బావిలో ఉన్న వాటిని తీసుకుని వెళ్దాం" అన్నాడు నందుడు. వెనుక నుండి ఆ మాటలను విన్న దొంగలు, నందుడు తన భటులతో చెప్పింది నిజమే అని నమ్మి ,'ఇక వీరితో మనకు అవసరం లేదు, మనకు కావలసిన నగలు బావిలో ఉన్నాయి' అంటూ ఆచోటును వెదుకుతూ అక్కడ నుండి వెళ్లిపోయారు. నందుడు అంగరక్షకులు సురక్షితంగా వారి రాజ్యం చేరుకున్నారు.నిజానికి నందుడు బావిలో ఏమీ దాచిపెట్టలేదు.అలా దొంగల బారి నుండి సులువుగా తప్పించుకోవడానికి ఉపాయంతో ఓ నాటకం ఆడడం జరిగింది.