చెడ్డ అలవాటు - Dr. kandepi Raniprasad

Chedda alavatu

రుత్విక్ ఈరోజే కొత్త స్కూల్ కి వెళ్ళాడు అది బస్సులో వెళ్ళాడు చాలా కొత్త అనుభవం బాగుంది అనుకొన్నాడు పాత స్కూలు ఇంటి దగ్గరే ఉండేది అందుకని నడిచే వెళ్ళేవాడు అమ్మ కానీ నాన్న కానీ స్కూలు దాక తోడు వచ్చేవారు. ఇక ఇప్పుడు బస్సు ఎక్కాలి బస్సు లో అందరూ అదే స్కూల్లో చదివే పిల్లలు చాలా సరదాగా ఉంది రుత్విక్ కి . బస్సు వెళ్ళింది అంతసేపు అల్లరే అల్లరి అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ విశేషాలన్నీ అమ్మకు చెబుతాడు. కొత్త స్కూలుకు రుత్విక్ చాలా సంతోషంగా వెల్లడం గమనించింది రుత్విక్ వాళ్ళ అమ్మ రమ్య. అదే విషయాన్ని తను సంతోషంగా తన భర్త కిరీటి తో చెప్పింది అతను సంతోషించాడు ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక వారం రోజులు పోయాక రుత్విక్ ఒక విషయాన్ని కనిపెట్టాడు తన క్లాస్ లోని అరుణ్ వేరే వాళ్ల బాక్స్ నుంచి పెన్సిల్ రబ్బరు కొట్టేస్తున్నాడు కానీ ఈ విషయం ఎవరూ గమనించలేదు పెన్సిల్ రబ్బరు పోయినవాళ్లు కూడా ఫిర్యాదు చేయడం లేదు టీచర్లు ఎవరు అరుణ కోపం పడటం లేదు ఎవరు అరుణ్ ఈ దొంగ అనడం లేదు హాయిగా దొంగిలించిన పెన్సిల్ రబ్బరు తనదే అన్నట్లుగా వాడుకుంటున్నాడు ఈ విషయం రిత్విక్ ని ఆశ్చర్యపరిచింది. ఇలా వారం రోజులు గమనించాక రుత్విక్ కు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా అలా పెన్సిల్ రబ్బరు వాళ్లకు తెలియకుండా తీసుకుంటేనే అనుకొన్నాడు ఆచరణలో పెట్టాడు ఒక పెన్సిల్ దొంగిలించి దాచుకున్నాడు చాలా భయం వేసింది టీచర్ కొడుతుందేమో అని భయపడ్డాడు కానీ ఎవరు గుర్తించలేదు ఏమీ అనలేదు దీంతో మరునాడు కొ మరో పెన్సిల్ కొట్టేసాడు ఇలా రెండు మూడు రోజులు వరుసగా పెన్సిలు తీసేసుకున్నాడు ఎవరు చూడలేదు ఏమీ అడగలేదు. రమ్య రెండు రోజుల నుంచి గమనిస్తున్న ది రుత్విక్ బాక్స్ లో ఎక్స్ట్రా పెన్షన్లు కనిపిస్తున్నాయి అవి తను ఇచ్చినవి కావు తాను ఎప్పుడూ అప్సర పెన్సిలళనే కొంటుంది ఇవేమో నటరాజ్ పెన్సిల్ ఏదో అనుమానం పొడసూపింది. రుత్విక్ ను మెల్లగా అడిగింది ఎక్స్ట్రా పెన్సిలు ఎక్కడివి అని రుత్విక్ ఏమీ చెప్పలేకపోయాడు అబద్దం ఆడటం రాదు రమ్యకు అర్థమైంది ఇంకాస్త నిదానంగా ఇవి ఎక్కడివి కన్నా అని వాడి భుజం మీద అ చెయ్యేసి అడిగింది అప్పుడు చెప్పాడు రిత్విక్ ఈ రోజు అరుణ్ వేరే వాళ్ల బ్యాగుల్లో నుంచి ఎలా పెన్సిల్ తీస్తున్నాడు అది చూసి తను కూడా పక్కనోళ్ళ బ్యాగుల్లో నుంచి పెన్సిల్ తీసుకుంటున్నానని చెప్పాడు ఇంకా ఎవరు ఎవరు చూడలేదు మమ్మీ అని కూడా అన్నాడు. రమ్య వాడిని ఇంకా దగ్గరకు లాక్కుంది వాడి కళ్ళలోకి చూస్తూ ఇలా చెప్పసాగింది చూడు కన్నా ఎవరు చూసినా చూడకపోయినా దాన్ని దొంగతనం అంటారు పక్క వాళ్ళ ఇంట్లో నుంచి పెన్సిల్ రబ్బర్ తీసుకోవడం తప్పు ఈ తప్పును మొదట్లోనే మానేయాలి పెరిగి పెరిగి పెద్దయ్యాక అలవాటు మానుకోవడం కష్టంగా ఉంటుంది ఇలా చిన్ననాడు ఏర్పడ్డ చెడు అలవాటే పెద్దయ్యాక పెద్ద దొంగతనాలు మారతాయి వారికి శిక్షలు పడతాయి అటువంటి జీవితం మనకు వద్దు. మేము చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ నిన్ను చదివిస్తున్నారు నీవు మంచి దారిలో నడిస్తేనే మాకు మంచి పేరు వస్తుంది స్కూల్ లలో చిన్నపిల్లల కదా పెన్సిల్ ఏ కదా అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అది చాలా తప్పు అప్పుడే వారికి విషయం అర్థం అయ్యేలా చెబితే భవిష్యత్తులో దొంగలుగా మారకుండా ఉంటారు స్కూల్లో ఏమీ అనకపోయినా వస్తువులు పోయిన వాళ్ళు ఫిర్యాదు చేయకపోయినా ఒకరి వస్తువులు తీసుకోకూడదు. మనం మనం మంచి అలవాటు చేసుకుంటే ఎప్పటికైనా నా మనల్ని కాపాడుతుంది అంటూ రమ్య చక్కగా పిల్ల వాడికి అర్థమయ్యేలా చెప్పింది. వృత్తి కు కు విషయం అంతా అర్ధమయ్యి మొహం తేజస్సుతో వెలిగిపోతూ సాగింది ఇక నేనెప్పుడూ వేరే వారి వస్తువులు తీసుకో నామా అంటూ అమ్మను అల్లుకు పోయాడు రుత్విక్.

మరిన్ని కథలు

Aparichitudu
అపరిచితుడు
- మద్దూరి నరసింహమూర్తి
Shivude guruvainaa
శివుడే గురువైనా….
- గరిమెళ్ళ సురేష్
Vinta acharam
వింత ఆచారం
- తాత మోహనకృష్ణ
Nela paalu
నేల పాలు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Manavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Mutyalannam
ముత్యాలన్నం
- మద్దూరి నరసింహమూర్తి
Parishkaram
పరిష్కారం
- తాత మోహనకృష్ణ