అమరావతినగర సమీపఅరణ్యంలోని అడవిలో నీరు లభించకపోవడంతో జంతువులుఅన్ని కృష్ణానదితీరఎగువప్రాంతానికి తరలి వెళ్ళసాగాయి. ప్రయాణంలో ఎండవేడికి అలసిన జంతువులన్నివిశ్రాంతికోసం పెద్ద మర్రిచెట్టు నీడన చేరాయి."ఏనుగుతాతా మాఅందరికి మంచి నీతికధ ఏదైనా ఒకటి చెప్పు" అన్నాడు గుర్రంబాబాయి. "సరేమీకు దానం విలువతెలిసేలా కథచెపు తాను . చతుర్విధ దానాలు అంటే మరణ భయంతోఉన్నవానికి అభయంయివ్వడం,వ్వాధిగ్రస్తునకు సరియైన చికిత్స చేయించడం,విద్యాదానం,అన్నదానం.ప్రత్యుపకారం ఆశించకుండా చేసేదానాన్నిసాత్విక దానంఅని,తిరిగిఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని రాజస దానంఅని,తృణీకారభావంతొ చేసేదానాన్ని తామస దానం అని అంటారు. దానంచేసేవారిని మూడు రకాలుగా విభజించవచ్చు. తనకుఉన్నదంతా దానంయిచ్చేవాడు దాత.తనవద్దఉన్నదంతాయిచ్చియింకా యివ్వలేక పోయానే అనిబాధపడేవారిని ఉదారుడు తనవద్ద లేకున్నాయితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని వదాన్యుడు అంటారు.శిబిచక్రవర్తి.బలిచక్రవర్తి.కర్ణుడు వంటి మహనీయులు మనచరిత్రలో దానమహిమతెలియజేసారు. మనఅమరావతి రాజ్యాన్నిచంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తూ అడిగినవారికి లేదనకుండా దానం చేస్తు దానం స్వీకరించేవారి పొగడ్తలకుపొంగి గర్విష్టిగామారాడు ఒకరోజు తనమంత్రి సుబుద్దితొ మంత్రివర్య నేడు నాలాదానం చేసేవారు ఈభూమండలంలో ఎవరైనా ఉన్నారాఅన్నాడు. ప్రభూ శ్రద్దయాదేయం దానం శ్రద్దతొయివ్వాలి.హ్రియాదేయం గర్వంతోకాక అణుకువతొ దానంయివ్వాలి.శ్రీయాదేయం ఈదానం వలన నేనేమి కోల్పోను అనుకొవాలి.అశ్రద్దయా దేయం అశ్రద్దతతో దానంచేయరాదు అని పెద్దలు చెపుతారు.ఈరోజు మీకు అటు వంటి దానంచేసేవారినిచూపిస్తానుఅని రాజుగారు తను మారువేషాలలో గుర్రాలపై బయలుదేరి చాలాదూరం ప్రయాణం చేసాక నాలుగు రహదారులు కలిసే చోట ఓపెద్ద చెట్టుకింద ఆకలి దాహంతో ఆగారు.అదేచెట్టుకింద కూర్చొనిఉన్నవృద్దుడు తనవద్ద గంపలోని గుగ్గిళ్ళు ఆకులో పెట్టి రాజు మంత్రికి యిస్తూ రెండు ముంతల చల్లటి మంచినీరు వారికి అందిచి ఆరగించండి బాటసారులు మీలాంటివారిఆకలి తీర్చడం కోసమే నేను ఈఉచిత సేవచేస్తున్నఅన్నాడు.ఆకలిదాహం తీరినరాజు తాతా నీవు పేదవాడిలాఉన్నావు యిలా దానంచేయడానికి నీకు ధనం ఎలా వస్తుంది అన్నాడు అయ్య మాఉరిలో వారంవారం సంతజరుగుతుంది అక్కడ యాచన చేయగావచ్చినధనాన్ని యిలా సద్వినియోగం చేసుకూంటాను అన్నాడు.ఆయాచకుని దానగుణం చూసిన రాజు గర్వంఅణగిపోయి అతనికి కొంతధనం యిచ్చి రాజధాని వస్తుండగా ఓభిక్షగాడు తను తింటున్న అన్నాని కొంత తనదగ్గరకు వచ్చిన కుక్కకు పెట్టడంచూసినరాజు మంత్రివర్యా మీరుచెప్పిందినిజమే కుడి చేతితో చేసేదానం ఎడమచేతికికూడా తెలియకూడదు ,దానం ఎప్పుడు మూడో వ్యక్తి తెలియకూడదు దానం డాంబికానికి కాదుధర్మన్ని కాపాడటానికి అని అనుభవపూర్వకంగాతెలుసుకున్నాఅన్నాడు.